Icchata Pellikodukulu Ammabadunu

ఇచ్చట పెళ్ళికొడుకులు అమ్మబడును

హైదరాబాదులో ఈ మధ్య ఒక కొత్త mall తెరిచారు.

మా మాల్ ప్రత్యేకతేంటంటే " ఇక్కడ పెళ్ళి కొడుకుల్నికూడా అమ్ముతాం" అని కూడా

ప్రకటనలు ఇచ్చారు (పెళ్ళైన కొత్తలో సినిమాలో లా). కాకపోతే కొన్ని షరతులు పెట్టారు.

* అమ్మాయిలు మా mallకి రావడానికి ఒక్కసారి మాత్రమే అనుమతి.

* పెళ్ళి కొడుకులు వారి వారి హోదా, ఇష్టాలకు, అభిరుచులకు తగ్గట్లు వివిధ

అంతస్తుల్లో ఉంటారు.

* ఏ అంతస్తులో ఉన్న పెళ్ళికొడుకునైనా మీరు ఎన్నుకోవచ్చు. ఆ అంతస్థులో

నచ్చకపోతే మీరు మరో అంతస్తుకి వెళ్లొచ్చు. కాకపోతే మీరు వెనక్కి తిరిగి

రావటానికి వీల్లేదు. చివరి అంతస్థు నుంచి బయటకు పోవడం తప్ప.

ఇదేదో బావుందే చూద్దామని ఒక అమ్మాయి mallకి వెళ్ళింది. అక్కడ

అంతస్తులవారీగా సూచనలున్నాయ్.

* మెదటి అంతస్తు : ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలున్నాయ్. భార్యను బాగా

చూసుకుంటారు.

* రెండవ అంతస్తు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలున్నాయ్. భార్యను చాలా బాగా

చూసుకుంటారు , పిల్లల్ని ప్రేమిస్తారు.

* మూడవ అంతస్తు: ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలున్నాయి. భార్యను చాలా బాగా

చూసుకుంటారు , పిల్లల్ని ప్రేమిస్తారు. వీళ్ళు చాలా అందగాళ్ళు.

మూడంతస్తులు చూసే సరికి ఆ అమ్మాయికి చాలా అద్భుతమనిపించి ఇంకా

పైకెళ్లి చూద్దామనుకుంది.

* నాలుగవ అంతస్తు : ఈ పెళ్ళి కొడుకులకు ఉద్యోగాలున్నాయ్. భార్యను చాలా బాగా

చూసుకుంటారు , పిల్లల్ని ప్రేమిస్తారు. చాలా అందగాళ్ళు, ఇంటి పని, వంట పనిలో కూడా

సాయం చేస్తారు.

"ఆహా !! ఈ mall చాలా బావుందే. ఈ అంతస్థులో నాకు కావాల్సిన వరుడు

దొరుకుతాడు" అనుకుందా అమ్మాయ్. ఇంకా పైకెళ్తే ఇంకా మంచోళ్లు

దొరుకుతారేమో అని ఆశపుట్టిందాపిల్లకి. సరే చూద్దాం.. అనుకుంటూ మరో

అంతస్తు ఎక్కేసింది.

అక్కడున్న బోర్డ్ ని చూసి ఆ అమ్మాయికి చుక్కలు కనిపించాయ్. "మీతో కలిపి

అంతస్థుకి చేరుకున్నవారి సంఖ్య : 61,397. ఈ అంతస్థులో పెళ్ళికొడుకుల్లేరు.

ఆడవాళ్ళని మెప్పించడం అసాధ్యం." అని ఆ బోర్డ్ మీద రాసుంది.

" ఆ..." అంటూ ఆ అమ్మాయి ఆశ్చర్యపోయి కళ్లు తిరిగి ఢమాల్ మని

కిందపడిపోయింది. మాల్ స్టాఫ్ లిఫ్ట్ లో కిందికి తీసుకెళ్లి ఓ క్యాబ్ బుక్ చేసి ఆ

అమాయకపు పిల్లని ఇంటికి పంపించేశారు.