TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
విల్లు చెల్లదు ...
"ఎందుకోయ్ విచారంగా వున్నావ్?'' అడిగాడు సోము, రాముని.
రాము "మా అత్తగారు చనిపోయారు ...'' భావురుమన్నాడు.
"ఎందుకా ఏడుపు ... మొన్నటివరకూ ఆవిడ ఎప్పుడు చనిపోతుండా అని ఎదురుచూసే వాడివి కదా ... '' అనడిగాడు సోము.
రాము "అది నిజమే కానీ, ఈ మధ్యన ఒక తెలివితక్కువ పని చేశాను. ఆవిడ చాదస్తం భరించలేక ఆవిడకి పిచ్చెక్కిందని మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చేశా. ఇప్పుడు ఆమె చనిపోతూ తన యావదాస్థికి నన్ను వారసుడుగా రాసి చనిపోయింది...'' మళ్ళీ ఏడుపు లంఖించుకున్నాడు రాము.
సోము ..."మరేంటి సంతోషించక అలా ఏడుస్తావెందుకు ...'' అని చిరాగ్గా అన్నాడు సోము.
రాము "ఏడుపు కాక మరింకేంటి ... ఇప్పుడామెకు పిచ్చిలేదని ఋజువు చేయాలి లేకపోతే ఆ విల్లు చెల్లదు కదా ...''
|