Hitchcock Comedy Story

 

This story is a courtesy of Padma Bhushan Varaprasad Reddy.

 Hitchcock Comedy Story

 

 హిచ్ కాక్ హాస్య ప్రియత్వం

గుండెలవిసిపోయేలా సినిమాలు తీయగల హిచ్ కాక్, చూడటానికి కూడా చాలా గంభీరంగా ఉంటాడు.ఆయనకు ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇష్టమని,నిజ జీవితంలో కూడా ఉత్కంఠ బయా పోషించగలడనీ చాలా మందికి తెలియదు.

ఒకసారి ఓ పెద్ద బిల్డింగ్ లిప్టులొంచి కిందికి వస్తూ పక్కనున్న తన ఫ్రెండ్ తో పాత సంభాషణ కొనసాగిస్తున్నట్లు హఠాత్తుగా చెప్పసాగాడు.

ఆ మహాతల్లి గురించి చెప్పాను కదూ...ఏకంగా నలుగురిని పెళ్లాడేసింది.ఒకరి తరువాత ఒకరనుకో.

ఒక్కోడికి ఒక్కోణ్ని కంది.నాలుగోవాడికి కూడా విడాకులు ఇచ్చేశాక ఆ నలుగురు పిల్లల్ని వెంటేసుకుని ఓ ఊరెళితే అక్కడ ఆ నలుగురు మొగుళ్ళూ ఒకేసారి కలిశారు. ఆ పళంగా వాళ్ళేమన్నారో తెలుసా...”అని.

తన సినిమాలలో లాగానే హిచ్ కాక్ అద్భుతమైన టైమింగ్ తో,సరిగ్గా ఆ పాటికి లిప్టు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేట్లా ఈ మాటలు చెప్పాడు.

లిప్టు తలుపు తెరుచుకోవడంతో అందరూ బయటికి నడవకతప్పలేదు.ఆ లిప్టులో ప్రయాణించిన ఎక్కిన అపరిచితులు ఆ నలుగురు భర్తలు ఏమనుకుని ఉంటారో రకరకాలుగా ఊహించి అవస్థ పడివుంటారు.అలా అవస్థ పెట్టడమే హిచ్ కాక్ వృత్తితో బాటు సరదాకూడా.

ఇంకోసారి మళ్ళీ లిప్టులో ఇంకా దారుణమైన కథ మొదలుపెట్టాడు.

అప్పుడు ఆ లిప్టులో అతని ఫ్రెండ్ తో బాటు ఇంకో ఇద్దరు ముసలి ఆడవాళ్ళూ కూడా ఉన్నారు.ఏదో సంజాయిషీ చెబుతున్నట్టు "ఏం చెయ్యను చెప్పు.ఆవేశంలో ఒళ్ళు పై తెలిసింది కాదు.గబగబ నాలుగు సార్లు పేల్చాను..కాలిమీదే అనుకో..గదంతా రక్తపు మడుగయిపోయింది.ప్రాణాలు పోయుండవులే.ఎట్నుంచి ఎటొచ్చినా నువ్వే కాస్త ఆదుకోవాలి.లిప్టు ఆగగానే నేను పెరటివేపు నుంచి వస్తాను.నువ్వు ఇటేళ్ళిటాక్సీ తీసుకునిరా "అని చెప్పుకొచ్చాడు.

లిప్ట్ ఆగీ ఆగడంతో,అప్పటిదాకా బిక్కచచ్చి వింటున్న ఆ మహిళలిద్దరూ ఒక్క గంతులో బయటికురికి,రెండో గంతులో వీధినపడి పరులేత్తారు.

అంతే తప్ప ఖూనీ చేసి వచ్చిన ఒక మనిషి పారిపోతున్నాడని అందరికీ తెలిసేలా కనీసం ఒక్కగావుకేక పెట్టాలని కూడా వాళ్లకి తోచలేదు.

అదీ హిచ్ కాక్ ప్రాక్టికల్ జోక్ మహిమ!

(హాసం సౌజన్యంతో)