Gabbar Singh Mandu Babulam Parody Song

Gabbar Singh Mandu Babulam Parody Song


బస్సు బాబులం మేము బస్సు బాబులం

ఏ పిల్లా అట్టా చిరాగ్గా చూసి బండి పైన వెళ్ళిపోకే బాబు....

బస్సు బాబులం మేము బస్సు బాబులం

బస్సు ఎక్కితే మాకు మేమే మహా రాజులం

కాలుపైన కాలేస్తాం, చేయి పైన చేయి వేస్తాం

స్టాపు వచ్చేదాక చెమటల్తో తడిసిపోతాం.

 

టికెట్ అడిగితే పాస్ అంటాం

పాస్ అడిగితే టికెట్ అంటాం

చెకింగ్ అయ్యేదాకా చక్కర్లే కొడుతుంటాం

మేమంటే మీకు ఎందుకు అంతా చులకనా

దిగేదాక దారెంటో మాకు తెలియదు గనకనా !!

 

మా బలమేమిటో మీకు ఎరుకనా...

ఒక గంటైనా వేలాడగలం తెలుసునా !!

లోకంలో ఉంది ఈ అమ్మాయే కాదన్నా

అందగత్తెలు ముందలున్నారని మనం

మరువునా మరువునా...

బస్సు బాబులం మేము బస్సు బాబులం

బస్సు ఎక్కితే మాకు మేమే మహా రాజులం.