TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
చిలిపి ప్రశ్నలు - సమాధానాలు
- కండ్లకుంట శరత్ చంద్ర
1. జంతువులను మనం ఎందుకు ప్రేమించాలి ?
అవి భలే రుచిగా ఉంటాయి కాబట్టి.
2. 30 ఏళ్ళ వయసు ఎవరికి ఉంటుంది?
44 ఏళ్ళ వయసున్న స్త్రీలకు.
3. 'పోలీసుల జులుం నశించాలి ' అని ధర్నా చేస్తే ఏమయ్యింది?
పోలీసులు వచ్చి,లాఠీలతో కుళ్ళ బొడిచి,ఆ గుంపును చెదరగొట్టారు.
4 ఒకటవ అంతస్తు నుండి కింద పడే వాడికి, 10 వ అంతస్తు
నుండి కింద పడే వాడికి మద్య తేడా?
మొదటి వాడు...ఫాట్ మన్న శబ్దం వచ్చాక ఆఆఆఆఆఆఆ...అంటాడు,
రెండో వాడు..ఆఆఆఆఆఆఆ అనేసాక....ఫట్ మని శబ్దం వస్తుంది.
|