Telugu Funny News In 2040

 

Telugu Funny News In 2040

 

 

2040 వ సంవత్సరానికి వివిధ దిన పత్రికల్లో హెడ్డింగులు ఇలా ఉండొచ్చేమో !

 * 1280 మంది బాయ్ ఫ్రెండ్స్ ని మోసం చేస్తూ పట్టుబడ్డ యువతి...

అమ్మాయిలను నమ్మవద్దని, మోసానికి మారుపేరని డిజిపి హెచ్చరించారు..

2020 లో ప్రవేశపెట్టిన '' అమ్మాయిలను నమ్మద్దు '' అనే పథకం సరిగ్గా అమలు

అయ్యేలా కృషి చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

 

 * హైదరాబాదులోని '' లిటిల్ కాలీప్లవర్ కాన్వెంట్ '' లో తెలుగులో మాట్లాడుతూ

  పట్టుబడిన విద్యార్ధి.

 

 * బాలకృష్ణ హీరోగా కొత్తచిత్రం ప్రారంభం. కాలేజి స్టూడెంట్ గా విన్నూత వేషం..ఈ

  చిత్రానికి పనిచేస్తున్న విదేశీ మేకప్ మన్లు. హీరోయిన్ గా ఇలియానా కూతురు.

 

  * మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని హెలీకాప్టర్ల లోన్లను సరళతరం చేసిన ఎస్. బి. ఐ.

 

 * లకడీకాపూలులో భారీగా ట్రాఫిక్ జామ్....రెండు రోజుల్లో క్లియర్ చేయొచ్చని
డిజిపి ఆశాభావం....ట్రాఫిక్ లో ఊపిరిరాడక ఆరుగురు మృతి, పలువురు వాహన
చోదకుల పరిస్థితి విషమం.

 

  * తండ్రి, తాతల పాత్రల్లో ఆద్భుతంగా రాణిస్తున్న చిరంజీవి....ఇరవై ఏళ్ళ క్రితం తన పార్టీ కాంగ్రెస్ లో విలీనం చారిత్రిక ఘోర తప్పిదమేనని ఒప్పుకున్నారు.

 

 2030 News Headlines - Funny Future News Headlines

 

 

* అనంతరం జిల్లా కొత్తపల్లిలో అరుదైన పక్షి '' నాటు కోడి '' ప్రత్యక్షం. చూడటానికి బారులు తీసిన జనం.

  * పార్లమెంటులో మళ్ళీ వీగిపోయిన మహిళా బిల్లు.

  * అయోధ్యలో రామమందిరం నిర్మించి తీరతాం అని బిజెపి స్పష్టీకరణ.

 * క్లీన్ అండ్ గ్రీన్ అనే పథకం కింద సిటీలోని చెట్లన్నీ నరికేశామని ఇకపై

రోడ్లపక్కన చెట్లు నాటితే తీవ్ర పరిణామాలు ఉంటాయని జి.హెచ్.ఎమ్.సి.

హెచ్చరిక.