Funny Love Jokes in Telugu

Funny Love Jokes in Telugu

ఎలాగైనా ఆరోజు మాధవికి తన మనసులోని మాటని చెప్పాలనుకున్నాడు కృష్ణ. అందుకే

రోజుకంటే ఆరోజు మరింత అందంగా తయారై ఎప్పటిలాగే బస్టాండ్ కు చేరుకున్నాడు.

ఏ విధంగా చెబితే బాగుంటుందోనని తనలో తనే ప్రాక్టీసు చేసుకుంటూ మాధవి కోసం

ఎదురుచూస్తూ ఉన్నాడు. పదినిమిషాల తరువాత మాధవి బస్టాండ్ దగ్గరికి వచ్చి

నిలబడింది.

చిలిపిగా నవ్వుతూ, సిగ్గుపడుతూ నెమ్మదిగా మాధవి దగ్గరికి వెళ్లాడు కృష్ణ.

" మాధవి......" సిగ్గుపడుతూ పిలిచాడు కృష్ణ.

" ఏమిటి కృష్ణ ఈ రోజు కొత్తగా సిగ్గుపడుతున్నావు " కొంటెగా చూస్తూ అడిగింది మాధవి.

" నిన్ను నేను ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నాను తెలుసా " అని చెప్పి మరింతగా సిగ్గు

పడ్డాడు కృష్ణ.

" అలాగా కృష్ణ...అయితే నువ్వు తప్పకుండా నా పెళ్ళికి వచ్చి తీరాలి " అని చెప్పి ముసి

ముసిగా నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది మాధవి.

" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కృష్ణ.

****************

" మోహన్...." అని ప్రేమగా పిలిచింది అనిత.

" ఏమిటో చెప్పు అనిత ?" అని అంతే ప్రేమగా అన్నాడు మోహన్.

" నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు ?" అడిగింది అనిత.

" చెప్పాను కదా అనిత నాకు ఉద్యోగం రాగానే అని " అని చెప్పాడు మోహన్.

" మరి నీకు ఉద్యోగం ఎప్పుడు వస్తుంది ?" అని అడిగింది అనిత.

" ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికినప్పుడు " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు

మోహన్.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది అనిత.

*********

పార్కులో కూర్చుని మాట్లాడుకుంటున్నారు విజయ్, రాధిక.

" రాధిక...అస్తమానం ఈ పార్కులో ఏం కూర్చుంటాం చెప్పు. అలా సరదాగా మంచి

సినిమాకి వెళ్దాం " అని అన్నాడు విజయ్ చిలిపిగా నవ్వుతూ.

" అబ్బ....ఆశ... అవన్నీ పెళ్ళయ్యాకే " అని రాధిక కాస్త సిగ్గుపడుతూ.

" కానీ...పెళ్ళయ్యాక నాతో సినిమాకి పంపడానికి మీ ఆయన ఒప్పుకోడేమో రాధ " అని

గబుక్కున నాలిక్కరుచుకున్నాడు విజయ్.

" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది రాధిక.

******************

" గీతా...సరదాగా బయటికి వెళ్లి ఎంజాయ్ చేసి వద్దామా ?" అని అడిగాడు కిశోర్.

" అలాగే వెళ్దాం...నేను నా ప్రెండ్ కావేరితో కలిసి వెళ్తాను. నువ్వు నీ ప్రెండ్ అరవింద్ తో

కలిసి వెళ్తావా మరి " అని అన్నది గీత.

ఏమి చెప్పాలో చెయ్యాలో అర్థంకాక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు కిశోర్.