అబ్బి గాడు... సుబ్బి గాడు....

అబ్బి గాడు... సుబ్బి గాడు....

 

అబ్బి గాడు: ఈ రోడ్డు మీద బంగారం దొరికితే బాగుండు!!

సుబ్బి గాడు: ఎవరిని కొరుకుంటున్నావ్? దేవుడినేన!!

అబ్బి గాడు: అవును రా!! దొరికితే చాలా బాగుండు!

సుబ్బి గాడు: దొరికితే ఎం చేస్తావ్?

అబ్బి గాడు: అమ్మితే డబ్బులు వస్తాయ్, హాయిగ ఖర్చు పెట్టుకోవచ్చు.

సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ డబ్బులే దొరకాలి అని కొరుకోవచ్చు కద..

అబ్బి గాడు: అవును రా.. నువ్వు చెప్పిందే కరెక్ట్, ఇప్పుడు బంగారం దొరికి దాన్ని అమ్మడం..! ఇదంత టైం వేస్ట్... నాకు డబ్బు దొరకాలి.

సుబ్బి గాడు: ఎంత?

అబ్బి గాడు: ఒక 100 కొట్లు.

సుబ్బి గాడు: ఎలాగు దేవుడినే కదా కొరుకునేది..అదేదొ లక్ష కోట్లు కొరుకోవచ్చు కద..

అబ్బి గాడు: అవును లె...ఎలాగు దేవుడే కదా.. సరే లక్ష కొట్లు.

సుబ్బి గాడు: ఎం చెస్తావేంటి, లక్ష కోట్లతొ?

అబ్బి గాడు: బిల్డింగులు, కార్లు కొంటాను!

సుబ్బి గాడు: పిచ్చోడ! డైరెక్ట్ గా అవే కోరుకోవచ్చు కద! సరే అవన్ని కొంటే???

అబ్బి గాడు: ఇంకేముంది హాప్పీ గా ఉండొచ్చు

సుబ్బి గాడు: వెధవ! అదేదొ డైరెక్ట్ గా హాప్పీ గా ఉండాలని కోరుకోవచ్చు కదా..??

అబ్బి గాడు: అరెయ్! నాకు ఏమి వద్దు రా ...నీకు.. దండం రా బాబు

Courtesy..
Mana Prema Kathalu