TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
తాతా ధిత్తై తరిగిణతోం 60
జీడిగుంట రామచంద్రమూర్తి
"మీ కట్నం బాకీ ఆయన తీర్చకపోతే నేను నాలుగిళ్ళల్లో పాచి పనిచేసి సంపాదించుకొచ్చి తీరుస్తాను సరేనా?" మండిపడింది గీత.
రాజేంద్ర తప్పుచేసినవాడిలా తలవంచుకున్నాడు.
"ఖర్మ! ఎప్పుడు నాకు తెలిసి, ఆయన తలనొప్పి కూడా ఎరగరు అలాంటి మనిషి ఇవాళ ఇలా మతితప్పి మాట్లాడుతున్నాడేమిటి భగవంతుడా అని మేం తలలు బాదుకుని ఏడుస్తుంటే మీకు అసలు కట్నం ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు ముందు, ఆయన మామూలు మనిషై మన ప్రపంచంలోకి వచ్చేలా చూడండి." అంటూ మొత్తుకుందామె.
ఆ మర్నాడు సాయంత్రం అందరూ కలిసి వీరభద్రాన్ని నగరంలో వున్న ప్రముఖ మానసిక వైద్య నిపుణుడి దగ్గరకు తీసుకెళ్లారు.
వీరభద్రం, హాస్పిటల్,లో చేరిన మూడోనాటికి విషయం తెలుసుకున్న చిదంబరం అతన్ని చూట్టానికి విజయవాడ నుంచి ఖంగారు పడుతూ వచ్చాడు 'రూం లో ఎవరూ లేకుండా చూసి అసలు విషయం అతనికి చెప్పాడు వీరభద్రం.
"అందరూ అనుకుంటున్నట్టు నాకు పిచ్చీపట్టలేదు 'దశమగ్రహము' పట్టినది. ఉన్నపాటున తన కట్నం బాకీ తీర్చనిచో 'గీత' ను వదిలేస్తానని బెదిరించాడు అల్లుడు అందుకే కట్నం కోసం అల్లుడు మరీ అల్లరీ పెడితే గతాన్ని మర్చిపోయిన వాడిలా నటించమని చెప్పిన నీ సలహా పాటించవలసి వచ్చినది."
"ఓర్నీ! ఏదో మాట వరసకు సలహా ఇచ్చానని ఇప్పుడిలా అందరి మీదకు తెస్తావా? సరేలే? నేనే ఏదో ఆలోచన చేసి కథ కంచికీ మీరు మళ్లీ రాజుపాలేనికీ వెళ్లేలా చూస్తాను దిగులుపడకు." అభయమిచ్చాడు చిదంబరం.
* * *
"ఆ టైముకి హైదరాబాదులో ఇన్స్పెక్టర్ సదాశివం వచ్చి శ్రీరామ్ ను కొట్టడానికి వచ్చిన రౌడీల వివరాలు అందిస్తున్నాడు నిలబడివున్నాడు.
"తీగలాగితే డొంకంతా కదిలింది. మీ అల్లుణ్ణి బెదిరించిన రౌడీలగురించీ, వాళ్ళ ముఠా నాయకుడు 'బాషా' ను కష్టడీలోకి తీసుకుని విచారిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 'గోపాల్' అనే వ్యక్తి తనకు ఫోన్ చేసి లక్షరూపాయలు ఇస్తాను. 'శ్రీరామ్' ని ఫినిష్' చెయ్యమన్నాట్ట అంతకుముందు సికింద్రాబాద్ జైయిల్లో బాషా వున్నప్పుడు వున్నప్పుడు అక్కడే గోపాల్ పరిచయం అయ్యాట్ట."
"ఇంతకీ ఆ గోపాల్ ఎవరు?" అడిగాడు విష్ణుమూర్తి.
"ఒకప్పుడు ఆ గోపాలూ, అతని తండ్రీ కలిసి అమెరికాలో ఏదో బిజినెస్ చేసేవారంట మూడేళ్ళ క్రితం వరల్డ్ ట్రేడ్ సెంటర్' మీద తీవ్రవాదుల దాడి జరిగినప్పుడు వీళ్ళ వ్యాపారం దేబ్బతిందట అందుకని ఇండియా వచ్చేశారు హైదరాబాద్ కి వచ్చి అమెరికాలో ఉద్యోగాలు ఇప్పిస్తా మంటూ పేపరు ప్రకటన ఇచ్చి యువకులను మోసగించారు పాతిక లక్షలవసూలయ్యాక వీళ్లు తమ 'కంపెనీ' బోర్డు తిప్పేసారు డబ్బుకట్టిన కుర్రాళ్ళంతా పోలీసు కంప్లయింట్ ఇవ్వడంతో చివరకు పట్టుబడ్డారు. పది నెలలు జైలు శిక్ష పడింది. ఆ జైల్లోనే వీళ్లకు బాషాతో పరిచయం ఏర్పడింది."
"మరి ఆ గోపాల్ ఎవరో, అతన్ని కలుసుకుని మా అల్లుడిమీద అతనికి కక్ష ఎందుకో ఎంక్వయిరీ చేశారా?" అడిగాడు విష్ణుమూర్తి.
"కుదర్లేదు. ఆ గోపాలూ, అతని ఫాదరూ జైలునించి ఆర్నెల్లక్రితమే ఎప్పుడో విడుదలై వెళ్ళిపోయారట వాళ్ళ వేరెబౌట్స్' తెలియదన్నాడు గోపాల్, ఆనాడు తనతో 'ఫోన్' లో మాత్రమే మాట్లాడినట్టు చెప్పాడు."
"పోనీ ఆ గోపాల్ తండ్రి పేరేమిటో తెలుసున్నాకురా? అడిగాడు విష్ణుమూర్తి.
"యస్! ఆ క్రిమినల్ పేరు హనుమంతు." చెప్పాడు ఇన్స్పెక్టర్.
విష్ణుమూర్తి షాకయ్యాడు.
* * *
బంగళాముందు కారు దిగిన విష్ణుమూర్తి, దభీమని, డోరువేసి విసురుగా లోపలకు దూసుకొచ్చాడు.
తమగదిలో అప్పుడే విస్కీ బాటిలు 'ఓపెన్' చేసి ఓ పెగ్గు గొంతులోకి దింపుకున్న తండ్రీ కొడుకులిద్దరూ ఆ పొలికేకలు విని గాభరాగా గదిలోంచి బయటకు వచ్చారు.
"మన ఫ్యాష్ బ్యాక్' మీ మావయ్యకి తెలిసిపోయిందేమోరా" అన్నాడు హనుమంతు కొడుకు చెవిలో రహస్యంగా.
"మరేం భయంలేదు డాడీ కథ అడ్డం తిరిగితే మనం కూడా ధైర్యం చెప్పి భుజం తట్టాడు గోపాలం.
కాస్సేపటికే తమ కథంతా విష్ణుమూర్తికి పూర్తిగా తెలుసునని అర్థమైపోయింది తండ్రీకొడుకులకి.
'పోలీసుల్ని పిలుస్తావా?" అంటూ గోపాలం టెలిఫోన్ కి వున్న కనెక్షన్ వైరుని తెంపేశాడు. విష్ణుమూర్తి వెంటనే తన కోటు జేబులోవున్న సెల్ ఫోన్ తీసి దాంట్లో నంబర్లు నొక్కబోయాడు గోపాలం దాన్ని కూడా లాక్కుని పక్కకు విసిరేశాడు. వంటింట్లోంచి అప్పటికే హాల్లోకి వచ్చి ఈ వ్యవహారమంతా గమనించిన మంగమ్మ ఎవరూ చూడకుండా వెళ్లి కార్పెట్ మీద పడివున్న 'సెల్ ఫోన్ తీసుకుని పెరటివైపు పారిపోయింది.
* * * *
|