మై డియర్ రోమియో - 59

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 59

స్వప్న కంఠంనేని

విక్రమ్ గ్యాంగ్ మెంబర్లంతా తలా ఒక చోట కాపుకసారు. విక్రమ్ అక్కడికి కొంచం దూరంలోనే లైబ్రరీ బయటపొంచి వున్నాడు. ధనుంజయ ఆలోచించసాగాడు.
హనిత, వైభవ్ లకు పట్టుకునే అదృష్టం  తనకే దొరికింది. తనే వాళ్ళను కనిపెట్టాడు. ఇక్కడ నుంచి ఒక్క అరుపు అరిస్తే విక్రమ్ కి వినిపిస్తుంది. వెంటనే వచ్చి వాళ్ళను పట్టుకుంటాడు.కానీ ఎలా అరవొద్దన్నాడు కదా ! తొందరగా పరుగెత్తుకుంటూ వెళ్లి చెబితే సరిపోతుంది. అప్పుడే తల తిప్పి వెనక్కి చూసిన విక్రమ్ కి  ధనుంజయ  పరుగెత్తుకుంటూ రావడం కనిపించింది.

ఏదైనా అపాయం జరగబోతుందేమో! ఎందుకైనా మంచది అని తను కూడా పరుగెత్తసాగాడు.

ధనుంజయ్ ఎంత స్పీడ్ గా పరుగెత్తినా విక్రమ్ ని పట్టుకోలేకపోయాడు. ఈ లోగాహనిత, వైభవ్ అక్కడే కనిపించిన  ఒక బస్ ఎక్కి కూర్చున్నాడు. బస్ స్టార్ట్ అయింది.

బస్ మీద బోధన్ అనే బోర్డ్ వుంది. బస్  బోధన్  వైపు వెళుతుంది.
అప్పుడు గమనించింది హనిత తమని  ఫాలో అవుతున్నది జీప్ ని.

"వైభవ్ ! హనిత!! చూడు .. మళ్ళీ మనని జీప్ ఫాలో అవుతోంది" ఆందోళనగా అంది హనిత.

వెనక్కి తిరిగి చూసి తలబాదుకుంటూ అన్నాడు వైభవ్

" నీ మొహం! అసలే టెన్షన్ తో చస్తుంటే నువ్వు  లేనిపోనివి క్రియేట్ చేయకు, అది జీప్ కాదు లారీ సరిగ్గా చూడు"

" హమ్మయ్య" హాయిగా నిట్టూర్చింది హనిత.

సన్నగా వర్షం పడటం మొదలయింది.
అప్పుడప్పుడు వర్షపు జల్లు విసురుగా వచ్చి బస్ లో కూర్చున్నవాళ్ళను తడిపి వెళ్తుంది.

ఒక పక్క వర్షం, మరో పక్క హనిత, వైభవ్ రొమాంటిక్ గా ప్రవర్తించదలచుకున్నాడు. హనిత భుజం మీద చెయ్యి వేసి ఆమె చెవిలో చెప్పాడు

" ఐ లవ్ యూ డియర్ "

సరే కాని ముందు ఆ చెయ్యి తీయ్యి లేకపోతే ఆ పళ్ళు రాలగొడతాను." సీరియస్ గా చూస్తూ అంది హనిత.

అదిరిపడ్డాడు వైభవ్.

" యూ ఆర్ ఇంపోసిబుల్ " గోణుకున్నాడు...

కాసేపటికి సర్దుకుని అడిగాడు " హాని! ఈ వాతావరణం చూస్తుంటే నీకేమనిపిస్తుంది.??

" హాయిగా ఇంట్లో నీ పక్కన కుర్చుని వేడి వేడి పకోడీలు తింటూ మీ అమ్మని పిచ్చి తిట్లు తిట్టాలనిపిస్తుంది."

తాపీగా చెప్పింది హనిత

వైభవ్ కి సర్రు నా కోపం దూసుకోచ్చింది. 

" అమ్మని ఏమైనా అంటే నిన్ను చంపేస్తాను.  చిన్నపిల్లాడిలా అన్నాడు.

" సరదాగా అన్నాను. టేకి టీజ్ యార్! తల్లిని ప్రేమించే వాడు. భార్యను కూడా ప్రేమిస్తాడట. చిన్నప్పుడైతే మీ

అమ్మంటే నీకు ప్రాణం అని నాకు తెల్సు. ఇప్పుడు కూడా ఇంతేనా, కాదా అని టెస్ట్ చేశా....'  నసిగింది హనిత.

" నిజంగా చెప్తున్నావా ? అనుమానంగా అడిగాడు వైభవ్.
మరే! పచ్చి నిజం " వ్యంగంగా అంది హనిత.

వైభవ్ కి ఇంకా అనుమానంగానే ఉన్నప్పటికీ చేసేది లేక ఊరుకున్నాడు...