మై డియర్ రోమియో - 53

Listen Audio File :

 

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 53

స్వప్న కంఠంనేని


ఊరంతా పచ్చటి పంటపొలాలతో ఆకర్షనీయంగా వుంది. పూరిళ్ళతో పాటు డాబా ఇల్లు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి.
ఈలోగా డ్రైవర్ నిద్రలేచి ఒళ్ళు విరుచుకుంటూ కిందికి దిగాడు.
"అబ్బా! మంచిగా నిద్ర పట్టేసింది'' అన్నాడు.
"ఎందుకు పట్టదూ? నడపడం రాక ఆక్సిడెంట్ చేశావు. ఏదో లక్కీగా బతికిపోయాము'' కోపంగా అన్నాడు వైభవ్,?
"ఏందీ సార్ అట్టంటారు. నా సర్వీస్ ల ఇప్పటికి మూడువందల ఇరవై ఆక్సిడెంట్స్ చేసినా ఒక్కసారైనా ఎవ్వడైనా సచ్చిండనుకున్నావా? చావలే. ఒక్కడు కూడా చావలే తెల్సా?''
"నువ్వింతకీ సర్వీస్ ల జేరి ఎన్రోజులయిందన్నా?'' హనిత ఆప్యాయంగా అడిగింది డ్రైవర్ ని.
"ఒక సంవత్సరం''
"మరి మిగతా నలభై అయిదు రాజులేమి పాపం చేసుకున్నాయి?'' వ్యంగ్యంగా అడిగింది డ్రైవర్ ని.
"ఆ నలభై అయిదు దినాలు డ్యూటీలో లేను'' తృప్తిగా చెప్పాడు డ్రైవర్.
"ఖర్మ'' తల బాదుకున్నాడు వైభవ్.
"ఆటోగ్రాఫ్ ఇస్తారా సార్?'' అడిగింది హనిత.
"ఇప్పుడే ఇయ్యను అన్నట్లు ఇంకా నూటెనభై ఆక్సిడెంట్లు చేస్తే మొత్తం కలిపి ఐదొందలు అవుతయికద. అప్పుడిస్తా'' చెప్పాడు డ్రైవర్.
"ఎంత చక్కటి ఆశయమో'' వ్యంగ్యంగా అంది హనిత.
ఈలోగా మిగిలిన ప్రయాణికులంతా ఏదో ఒక బస్ పట్టుకుని నిజామాబాద్ కి వెళ్ళిపోసాగారు. వైభవ్, హనితలు ఆ ఊళ్లోనే ఆగిపోదల్చుకున్నారు.
ప్రసాద్ తన ఫియాన్సీతో పాటు బస్ ఎక్కుతూ వైభవ్, హనితలతో "బై ఫ్రెండ్స్! ఆల్ ద బెస్ట్'' అని చెప్పాడు.
వైభవ్ వాళ్ళ అడ్రెస్ తీసుకున్నాడు.
వైభవ్, హనిత ఊళ్లోకి నడిచారు.
ధర్మారం అన్న బోర్డు కనబడుతోంది.
దుమ్ము కొట్టుకుపోయి వున్న వైభవ్, హనితల్ని ఊళ్ళో వాళ్ళు వింతగా చూడసాగారు.
"ఇక్కడ హోటల్ ఏదైనా వుందా?'' వైభవ్ షాప్ అతన్ని అడిగాడు.
"అలాంటిదేమీ ఈ ఊళ్ళో వుండవండీ'' చెప్పాడు షాప్ ఓనర్,
"మరిప్పుడేం చేద్దాం? ఎక్కడ వుందాం?'' తమలో తామే అనుకున్నారు వైభవ్, హనిత,
"ఈ ఊళ్ళో దిగినవాళ్ళకి ఏ ఇబ్బందీ పడనవసరం లేదండీ. ఇక్కడే దాక్షాయణి అని ఒకావిడ వుంటుంది. వాళ్ళింటికి వెళ్ళండి. మీకన్నీ సదుపాయాలూ కల్పిస్తుందావిడ'' చెప్పాడతను.
తర్వాత తనే వెంట వుండి మరీ తీసుకెళ్ళి ఇల్లు చూపించాడు.
వైభవ్, హనిత ఇంటి తలుపు తట్టారు.
తలుపు తీసిందొకావిడ.
"లోపలికి రండి బాబూ'' ఆప్యాయంగా పిలిచింది.
"మనం ఈవిడకి ముందే తెలుసా?'' వైభవ్ ని అడిగింది హనిత.
"షటప్ రాస్కెల్'' ముద్దుగా తిట్టాడు వైభవ్.
"ఎప్పుడు భోంజేసారో ఏమో. పదండి స్నానం చేసి రండి. ఈలోగా మీకు వంట చేస్తాను'' అందావిడ.
"ఇక్కడ దాక్షాయణిగారనీ ...'' వైభవ్ మాటల్ని సగంలోనే కట్ చేస్తూ చెప్పిందావిడ.
"నేనే బాబూ, మీరు ముందు తొందరగా స్నానాలు చేయండి. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం''
"ఓ! నాకర్థమైంది. ఈవిడ పేదరాశి పెద్దమ్మ అనుకుంటా'' హనిత వైభవ్ తో అంది.
స్నానాలు చేసి వచ్చేసరికి ఆవిడ వంటలు రెడీచేసి వాళ్ళకు భోజనాలు వడ్డించింది.
తునేతప్పుడు ఆవిడ అక్కడే కూర్చుని కబుర్లు చెప్పసాగింది.
మాటల సందర్భంలోనే ఆవిడకి దైవభక్తి ఎక్కువనీ, మానవసేవే మాధవసేవ అనే సూక్తిని నమ్ముతూ మనుషులకి కూడా వీలైనంత సహాయం చేయాలనే తత్త్వం కలదనీ వైభవ్, హనితలకి అర్థమైంది.
రెండురోజులు తమకి ఆశ్రయం కల్పించమని కోరారావిడని. ఆవిడ వెంటనే అందుకు ఒప్పుకుంది.
తునగానే వాళ్లకి నిద్ర ముంచుకువచ్చింది.
ఆవిడ చూపించిన గదిలోకి వెళ్ళి పడుకున్నారు.
ప్రయాణం బడలికతో వుండడంతో వాళ్ళకు వెంటనే నిద్ర పట్టేసింది.