మై డియర్ రోమియో - 51

Listen Audio File :

Get latest telugu Audio comedy serials My Dear Romeo, telugu serial comics and latest jokes online

 

మై డియర్ రోమియో - 51

 

స్వప్న కంఠంనేని

 

సికింద్రాబాద్ విలేజ్ మీదుగా బస్ సిటీ దాటి వెళ్ళసాగింది.
వైభవ్, హనితలకు ఆ బస్ లో వాతావరణం వింతగా అనిపించింది.
తెలంగాణా మాటలు, బీడీ, చుట్టల వాసనలు వాళ్ళకు చాలా తమాషాగా అనిపించాయి.
ఇద్దరూ రిలాక్స్ డ్ గా వెనక్కి వాలారు.
"హమ్మయ్య! ఎవరూ చూడకుండా సిటీ దాటేశాము దాదాపు బస్సులో అందరూ వినేలా సంబరంగా అంది హనిత.
"ష్! నెమ్మదిగా మాట్లాడు'' వైభవ్ అన్నాడు.
"అవునూ! నువ్విందాక మీనాకి ఏమి రాసిచ్చావు?'' అనుమానంగా చూస్తూ అడిగింది హనిత.
"లవ్ లెటర్!' 'హనితని ఉడికించడానికి చెప్పాడు వైభవ్.
"చాల్లే ఊరుకో. నువ్వంట రొమాంటిక్ అయితే ఇక లేనిదేముందిగానీ నీ సంగతి నాకు తెలీదా?'' చాలా తేలిగ్గా కొట్టిపారేసిందతని మాటల్ని.
బుంగమూతి పెట్టాడు వైభవ్.
ఈలోగా హనిత పక్క సీట్స్ లో వాళ్ళని మాట్లాడించడం మొదలుపెట్టింది.
వైభవ్ డ్రైవర్నే గమనించసాగాడు.
ఆ డ్రైవర్ బస్ నీ మలుపులు తిప్పాల్సి వచ్చినప్పుడు దేవుడికి దణ్ణం పెట్టుకుంటున్నాడు. ఎదురుగా మిలట్రీ ట్రక్స్, లారీలు వచ్చినప్పుడు స్టీరింగ్ వదిలేసి గబగబా సీటు కింద దాక్కుంటున్నాడు.
ఆర్టీసీ బస్సులన్నింటిలాగే ఆ బస్సు కూడా దైవాదీనం సర్వీసులాగా నడుస్తోంది.
వైభవ్ హనితతో అన్నాడు.
"హనీ! పోయి పోయి ఈ బస్ ఎక్కాము, అనవసరంగా చస్తామేమో?''
"ఇఫ్ ఎ టెన్ టెన్ ట్రక్ కిల్ద్ బొత్ ఆఫ్ అస్   
  టు డై బై యువర్ సైడ్ వెల్, ద ప్లెజర్, ద ప్రివిలేజ్ ఈజ్ మైన్'' వైభవ్ కళ్ళలోకి చూస్తూ అంది హనిత.
వైభవ్ మనసంతా తీయగా అయిపొయింది. ఎంత చక్కగా తన ప్రేమను ఎక్స్ ప్రెస్ చేసిందో అనుకున్నాడు.
పైకి మాత్రం ఆమె తలమీద్ చిన్నగా తడుతూ విసుక్కున్నాడు.
"నీకేదొచ్చినా పట్టలేము. మంచైనా అంతే, చెడైనా అంతే''
మనని ఎవరూ కనుక్కోలేరిక. ఎంత చక్కగా అందరికీ టోకరా ఇచ్చామో? కానీ మననెవరూ ఫాలో చేయకపోవడమే వింతగా వుందికదూ'' అడిగింది హనిత.
సరిగ్గా అప్పుడే వైభవ్, హనిత తల పట్టుకుని కిందికి వంచి తను కూడా వంగి కూర్చున్నాడు.
"ఏమిటి? ఏమైందీ?'' గుసగుసగా అడిగిండ్ హనిత.
"మన బస్ నీ ఒక జీప్ ఫాలో అవుతోంది. ఇప్పుడది మనం కూర్చున్న సీట్ పక్కగా వచ్చింది. అందులో మీ అన్నయ్య ఫ్రెండ్స్, మన కాలేజీ విక్రమ్ గాడు వాళ్ళు వున్నారు. మనని పట్టుకోవడానికే బయలుదేరి వుంటారు''
"ఓహో'' అంది హనిత.
"నీకేమీ భయం వేయడంలేదా?'' అడిగాడు వైభవ్.
"లేదు. నువ్వున్నావుగా నాకెందుకు భయం?'' అతని చేతిని పట్టుకుని సెక్యూర్డ్ గా ఫీలవుతూ చెప్పింది.
"వాళ్ళు మనని చూసారా?'' మళ్ళీ అడిగింది.
"తెలీదు. చూడలేదనుకుంటాను'' చెప్పాడు వైభవ్.
సీట్స్ బాగా ఎత్తుగా వుండడంతో బస్ లో మిగిలినవాళ్ళకు హనిత, వైభవ్ కనిపించడం లేదు. ఒక్క పక్క సీట్ లో వాళ్ళకు తప్ప.
పక్క సీట్ లో కూర్చున్నవాళ్ళు వీళ్ళనే ఆసక్తిగా గమనిస్తున్నారు.
ఇంతలో జీప్ బస్ నీ ఓవర్ టేక్ చేసింది. కొంచెం ముందుకెళ్ళి రోడ్ కి అడ్డంగా ఆగిపోయింది.
బస్ డ్రైవర్ కంగారుపడ్డాడు. గభాల్న సడెన్ బ్రేక్ వేసి బస్ ఆపాడు. తర్వాత "నాకు సడెన్ బ్రేక్ వేయడం కూడా వచ్చేసిందోచ్'' అంటూ ఆనందంగా ఎగరసాగాడు.
జీపులో నుండి దూకుడుగా దిగారు దాదాపు పదిమంది. అంతా 20-25 మధ్య వయస్సువాళ్ళే.
బస్ కేసి రాసాగారు వాళ్ళు. బస్ లో జనం భయభ్రాంతులయ్యారు. గబగబా వంటిమీదున్న నగలు, డబ్బులు తీసి సీట్లను వేళ్ళతో తవ్వి సీట్లలోకి తోసి కూర్చున్నారు.
జీప్ లో వాళ్ళు బస్ నీ సమీపించగానే వైభవ్, హనిత అప్పటివరకూ వాళ్ళు కూర్చున్న సీట్ కిందికి దూరిపోయారు.
ఇదంతా గమనిస్తున్న పక్క సీట్ లో వాళ్ళు వచ్చి వైభవ్, హనితలు దాక్కున్న సీట్ మీద కూర్చుని కాళ్ళతో వాళ్ళు కనిపించకుండా కవర్ చేశారు.
జీప్ లో వాళ్ళు బస్ లోకి ఎక్కారు. వాళ్ళ చేతుల్లో హాకీ స్టిక్స్ వున్నాయి.
ఇదంతా సీట్ కింద దాక్కున్న వైభవ్, హనితలు గమనిస్తూనే వున్నారు. విక్రమ్ ముందు బస్సంతా చెక్ చేశాడు. తర్వాత బస్ లో వాళ్ళను అడిగాడు "ఇంతకుముందేగా ఒకమ్మాయి, అబ్బాయి బస్ లో వున్నారు. అమ్మాయి అబ్బాయిలాగా, అబ్బాయి అమ్మాయిలాగా వుంటారు. వాళ్ళింతలోనే ఎక్కడికి పోయారు?''
"ఏమిటి విక్రమ్ గాడు మానని పట్టుకోవడంలో ఆక్టివ్ పార్టిసిపేషన్ తీసుకుంటున్నాడు?'' గుసగుసలాడింది హనిత వైభావ్ చెవిలో.
"ఓ! వాళ్ళా! సరిగ్గా అయిదు నిముషాల క్రితమే ఎందుకో కిటికీలో నుంచి దార్లో వున్న పొదల్లోకి దూకేశారు'' హనిత పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు చెప్పారు.
"పొదల్లోకి దూకేశారా? చెప్తాను వాళ్ళ సంగతి. నా నుంచి తప్పించుకోలేరు. ఏమనుకుంటున్నారో! హహహ'' వికృతంగా నవ్వాడు విక్రమ్.
పక్కనున్నవాడితో తర్వాత అన్నాడు.
"వైభవ్ గాడిని తుక్కు తుక్కు కింద కొట్టేస్తాను''
"ఇదివరకొకసారి కొట్టావు కదా. ఛావు దెబ్బ తీసాడుగా నిన్నప్పుడు అతను'' పక్కనున్నవాడు అన్నాడు.
"వాది పేరు ధనుంజయ. పెద్ద ఫన్నీ క్యారెక్టర్'' చెప్పింది హనిత వైభవ్ తో.
"ఏంటిబే నువ్వు? మెల్లగా మాట్లాడాల్సినవి పెద్దగా చెప్తావు. మెంటలా నీకు? అప్పుడంటే నాకు వంట్లో బాగాలేదు కాబట్టి వైభవ్ గాడు బతికిపోయాడు' 'పళ్ళు నూరుతూ చెప్పాడు విక్రమ్.
సరిగ్గా అప్పుడే జరిగిందా సంఘటన.