అనుమానం

“ఏమండీ ! ఇవాళ కొత్త సినిమా ఏదయినా రిలీజ్ అయిందా?” అడిగింది అన్నపూర్ణ.

“ఏం అయినట్టు లేదే, అయినా నీకెందుకొచ్చిందా అనుమానం?” అడిగాడు సుందరం.

“ఎప్పుడూ లేనిది మనవాడు పొద్దున్నే లేచి స్నానం చేసి కాలేజీకి వెళుతున్నానని చెప్పి బయల్దేరితే అనుమానం వచ్చింది...” అంది అన్నపూర్ణ.