Aa Ebbandi Lenanduke Ee Aanandam

Aa Ebbandi Lenanduke Ee Aanandam

ఆ ఇబ్బంది లేనందుకే ఈ ఆనందం

" ఈవేళ చాలా హుషారుగా కనిపిస్తున్నావు...ఏమిటీ విశేషం ? " అని సుందరాన్ని

అడిగాడు కాంతారావు.

" మా ఆవిడ వారం రోజులు పుట్టింటికి వెళ్ళిందిలే..అందుకు " అని మరింత సంతోషంగా

చెప్పాడు సుందరం.

" అయితే పాపం...ఈ వారం రోజులు నీకు వంటకు ఇబ్బందేనన్నమాట " అని కొంచం

జాలిపడుతూ అన్నాడు కాంతారావు.

" ఏడ్చినట్టుంది. అసలు ఆ ఇబ్బంది తప్పినందుకే కదా ఈ ఆనందం " అని హుషారుగా

చెప్పి వెళ్ళిపోయాడు సుందరం.

" ఆ.." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కాంతారావు.