Rating:             Avg Rating:       804 Ratings (Avg 3.05)

Aanagar Colony 7

ఆహా నగర్ కాలనీ

సూరేపల్లి విజయ

7 వ భాగం

"సార్..అసలుకన్నా కొసరే ముద్దని ముందు ఆ సేన్షేషన్ న్యూస్ స్టోరికి టైటిల్ చెబుతా."

"చెప్పు."

"అలాగే."

"భుజం తట్టి కీపిటప్ మై డియర్ యంగ్ బాయ్ అనాలి."

"అలాగలాగే."

"నీలాంటి డైనమిక్ యంగ్ సెన్షేషనల్ రైటర్ జర్నలిస్టు మన పత్రికకు ఓఎస్సెట్ అని మెచ్చేసుకోవాలి."

"సా...కే...త్" క్యాబిన్ దద్దరిల్లే అరుపు అరిచాడు ఎడిటర్.

"జడుసుకున్నాను సార్" ఎందుకు అంతలా అరిచారు" అమాయకంగా అడిగాడు సాకేత్.

కోపంగా జుట్టు పీక్కున్నాడు ఎడిటర్.

"సార్...నేనేమైనా మిమ్మల్ని విసిగించానా?" అడిగాడు సాకేత్.

ఆయాసంతో రొప్పుతూ "లేదు నాకే మెంటలెక్కి ఇలా ప్రవర్తిసున్నాను.

" సారీ సర్...నాకీ విషయం తెలియక, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. మరి డాక్టర్ కి చూపించలేకపోయారా?"

"సా...కే...త్"

"టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి తన నుదురు మీద కొట్టకోబోయి, అతి కష్టమ్మీద ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అప్పుడు అర్థమైంది సాకేత్ కు ఇదంతా తన సస్పెన్స్ వుంచిన ప్రభావమని.

"ఒకే సార్....అసలు విషయానికి వస్తాను" అంటూ ఆగి, తన జేబులో ఉన్న ఫోటో తీసి.... "చిత్రాంగి కౌగిలిలో ఉన్న ఈ చిన్న వాడెవరు? అన్న కాప్షన్ ఎలా ఉంది. సార్...ఫస్ట్ వీక్ ఈ ఫోటోని రెండు ముక్కలు చేసి, విదివిద్గా వేద్దాం.

రెండో వారం ఫోటో ఒక్క దగ్గరికి చేర్చి వేద్దాం ఆ తర్వాత చిత్రాంగి స్టోరి వేద్దాం" అన్నాడు. వెంటనే తన మొహానికి పట్టిన చెమట తుడుచుకున్నాడు ఎడిటర్.

"నిన్నరాత్రి నువ్వు చిత్రాంగి ఇంటికి వచ్చావా?" అడిగాడు.

"అవును" అని అనుమానంగా ఎడిటర్ వైపు చూసి" అదేంటి సార్. చిత్రాంగి ఇంటికి వచ్చావా? అని అడుగుతున్నారు. మీరు గాని అక్కడున్నారా?"

"సాకాత్ చేతిలో ఉన్న ఫోటో లాల్లిని చూసాడు ఎడిటర్. మరోసారి మొహానికి పట్టిన చెమట తుడుచుకొని సాకేత్ వైపు తిరిగి "ఈ ఫోటో ఎలా తీసావయ్యా?" ఆశ్చర్యం కోపమూ మిశితమయ్యాయ గొంతులో.

"అదెలా తీసానంటే..." అని చెప్పబోయాడు సాకేత్.

"చాల్చాలు గానీ, ఇంకెప్పుడూ నాకు చెప్పకుండా, ఇలాంటి పనులు చేయకు, అన్నాడు.

"సాకేత్ నీకేం అన్యాయం చేసానయ్యా దీనంగా మొహం పెట్టి అన్నాడు ఎడిటర్. ఈలోగా ఫోన్ వచ్చింది.

"కాస్త ఆ ఫోన్ చూడవయ్యా" అన్నాడు.

ఫోన్ ఎత్తాడు సాకేత్.

"హలో ఎవరూ మీరా మేడమ్. ఎడిటర్ గారున్నారు. చెప్పండి. మేడమ్ ఎలా ఉన్నారు? మొన్న కొన్న పట్టుచీర బావుందా? ఏంటీ మీ మేగజైన్ లో మేము రాసిన "వంకాయ కూర" చదివి, అలా చేసి, చేసిన ఆ కూర తిని వాంతులయ్యాయా?"

తలపట్టుకున్నాడు ఎడిటర్. సాకేత్ తో చనువు ఎక్కువ ఎడిటర్ భార్యకు పొరపాటున ఫోన్ లో ఇద్దరు కలుసుకుంటే ఇలాంటి కబుర్లే చెప్పుకుంటారు.

"ఏమండి నిన్న రాత్రి సార్ ఇంటికి రాలేదా? ఎలా వస్తారు....చిత్రాంగి..." అంటూండగానే వెంటనే ఎడిటర్ కంగారుగా లేచి రిసివర్ లాక్కున్నాడు.

"సారీ మేడమ్...ఎడిటర్ గారు కంగారుపడి రిసివర్ లాక్కుంటున్నారు."

"అదేం లేదు డియర్...అదే...చిత్రాంగి అని లేడి ఓరియంటెడ్ మేగజైన్ ప్లాన్ చేస్తున్నాను. రాత్రంతా ఆ పని మీదే ఉన్నాను. కదయ్యా సాకేత్ అన్నాడు. సాకేత్ వైపు బతిమలాడుతున్నట్లుగా చూస్తూ. సాకేత్ కు అర్దమైంది.

"ఈవారం నుంచి ఆర్టికల్ కు అయిదొంతలు, కథకు ఆరొందలు ఇవ్వాలి. మరి" బుంగమూతి పెట్టి అన్నాడు సాకేత్ లోగొంతుకలో..... "అలాగేనయ్యా!" ఓ అయిదు నిమిషాల తర్వాత మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ తన సీటులో రిలాక్సయ్యాడు ఎడిటర్.

"బాగా అలిసిపోయినట్టున్నారు సార్...బాయ్ ని పిలిచి హార్లిక్స్ తెప్పించేదా?" కూల్ గా అడిగాడు సాకేత్.

సాకేత్ ని తినేసేలా చూసి... "నువ్వు బయటకు వెళ్ళిపోతే చాలు" అన్నాడు.

"మరి...నేను సంపాదించిన సేన్షేషన్ ఫోటోగ్రాఫ్. "ఇంకోసారి ఇలాంటి ప్రయోగాలు నాకు చెప్పకుండా చెయొద్దు" అంటూ వార్నింగిచ్చాడు ఎడిటర్.

"పోనీ...మీకు చెప్పి చెయొచ్చా?" కోపంగా చూసాడు ఎడిటర్.

''మీరు కోపంగా ఉన్నట్టున్నారు" అని అక్కడనుంచి జారుకున్నాడు సాకేత్.