Chinni Chinni Dosa

(" రోజా " చిత్రంలోని "చిన్ని చిన్ని ఆశ " అనే పాటకు పేరడిగా )

*******************

చిన్ని చిన్న దోశ

*******************

చిన్ని చిన్న దోశ

సన్నగా పోశా

ఉల్లిపాయ కోశా

అందులో వేశా

పైన వెన్నరాశా

తినమని కూశా

రావేలా ఈశా ఓ వేంకటేశా...

|| చిన్ని చిన్న దోశ ||

కూరతో బాటు చెట్ని ఉండాలి

సాంబారు తోటి కలిపికొట్టాలి.

తినడానికంతా క్యూలు కట్టాలి

తిన్నవారంతా జేలు కొట్టాలి

స్వాదిష్ట సామ్రాట్ బిరుదనివ్వాలి

|| చిన్ని చిన్న దోశ ||