TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Telugu Funny Jokes
Telugu funny jokes is a crazy and hillarious list of jokes and funny jokes written in telugu.
బస్సు వెళ్తోంది. హఠాత్తుగా కనకరావు కేకపెట్టాడు.
"బాబూ.. నా పర్సు పోయింది. దాన్లో పదివేల రూపాయలున్నాయి. నా పర్సు నాకిస్తే
వారికి వంద రూపాయలిస్తాను" ఏడుస్తూ అన్నాడు.
"నాకిస్తే ఐదొందలిస్తాను" మరో వ్యక్తి అరిచాడు.
"నాకిస్తే వెయ్యి" ఇంకో అరిచాడు.
"నాకిస్తే రెండు వేలు..." మరొకతను అరిచాడు.
"నాకిస్తే నాలుగు వేలు..." వేరొకతను అరిచాడు.
"అసలెవ్వరికీ ఇవ్వకుంటే మొత్తం నావేగా" అన్నాడొక ప్రయాణీకుడు నాలుక
కరుచుకుంటూ.
*********
“డాక్టర్ గారూ!మా అబ్బాయి రూపాయి నాణెం మింగేశాడు.నాకు భయంగా వుంది.
వెంటనే వైద్యం చేయండి ప్లీజ్ "బతిమాలింపుగా అన్నాడు మంత్రి.
“ఏం కాదండీ.కోట్లు మింగిన మీరే దుక్కలా వున్నారు.రూపాయి మింగిన
మీవాడికేమవుతుంది " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు డాక్టర్.
*******
“ఏవండీ...షాపింగ్ కి తోడుగా వస్తారా?”అడిగింది భార్య.
అదిరిపడిన భర్త" ఆ ఒక్కటీ అడక్కు "అని ఇంట్లో నుండి పారిపోయాడు.
******
“మన అల్లుడికి జాతీయాభిమానం ఎక్కువోయ్ ?”భార్యతో అన్నాడు భర్త.
“ఎలా చెప్పగలరు ?”అమాయకంగా అడిగింది భార్య.
“ఎలా ఏమిటే పిచ్చిదానా.దసరా,సంక్రాంతులకే కాకుండా ఆగస్టు 15,జనవరి 26లకి
కూడా కొత్త బట్టలు పెట్టించుకుంటాడు కదా?”అని పకపక నవ్వాడు భర్త.
|