ఉమెన్స్ డే స్పెషల్ జోక్స్

ఉమెన్స్ డే స్పెషల్ జోక్స్

 


ఆ సామెత ఎక్కడ పుట్టిందంటే

టీచర్: ‘మగవాళ్లందరూ ఒకేలాగా ఉంటారు’ అన్న సామెత ఎలా పుట్టిందో చెప్పగలరా?
విద్యార్థి : ఆ సామెత ఎలా పుట్టిందో తెలియదు కానీ, తప్పకుండా చైనాలోనే పుట్టి ఉంటుంది సార్. ఎందుకంటే వాళ్లంతా చూడ్డానికి ఒకేలా ఉంటారు కదా!

ఒకరు కాదు... వస్తూనే ఉంటారు
ఆడవాళ్లు కళ్లు మూసుకుంటే వాళ్ల కలల రాకుమారుడు కనిపిస్తాడు. కానీ మగవారు కళ్లు మూసుకుంటే.... ఒక ఆల్బమ్ తెరుచుకుంటుంది. అందులో వందలాది మంది, ఒకరి తరువాత ఒకరు కనిపిస్తూ....నే ఉంటారు.

పనికిమాలినవాడు
భర్త: ‘‘ఈ ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికిమాలినవాడినే భర్తగా ఎందుకని ఎంచుకుంటారో!’’
భార్య: ‘‘మీరు నన్ను అందగత్తెగా గుర్తించినందుకు థాంక్స్’’

ఇంక భర్త ఎందుకు?
విలేకరి: మీరు పెళ్లెందుకని చేసుకోలేదు?
నటి : మా ఇంట్లో ఓ కుక్కపిల్ల ఉంది, అది పొద్దున్నే లేచి తెగ హడావుడి చేస్తుంది. ఓ చిలుక ఉంది... అది నిరంతరం నసుగుతూ ఉంటుంది. ఓ పిల్లి ఉంది.... అది రాత్రిళ్లు ఎప్పుడో ఆలస్యంగా ఇంటికి వస్తుంది. ఇక ఈ మూడు పనులూ చేసే మనిషిని ఎందుకని పెళ్లి చేసుకోవాలి?

అన్నిటికంటే గొప్ప కానుక
భర్త:  ఈ మహిళా దినోత్సవానికి నీకు ప్రపంచంలోనే గొప్ప కానుక ఇవ్వాలనుకుంటున్నాను.
భార్య: అరే మీరు ఊరికి వెళ్లిపోతున్నారా! ఈ విషయం చెప్పనేలేదే!