గులాబీ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా ?     * ఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి, వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు. * ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా ఉంటుంది. * గులాబీ రెక్కలు 1 భాగం, పంచదార 2 భాగాలు తీసుకొని తగినన్ని కలిపి పానకం మాదిరిగా మారేంతవరకూ మరిగించి దింపి చల్లారనిచ్చి కొద్దిగా ఏలకులు, పచ్చకర్పూరం కలిపి ఒకటి రెండు కుంకుమ పువ్వు కేసరాలను కూడా చేర్చి నిల్వచేసుకోవాలి. దీనిని 1-2 టీస్పూన్ల మోతాదులో చన్నీళ్లకు కలిపి తీసుకుంటూ ఉంటే మూత్రంలో మంట, శరీరంలో వేడి వంటి పిత్తసంబంధ సమస్యలు తగ్గుతాయి. * ఒక కప్పు గులాబీ నీళ్లకు ఒక టీ స్పూన్ సోపు గింజలు, అర టీస్పూన్ ధనియాలు, 10 ఎండు ద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే గుండె దడ, ఆందోళన వంటివి తగ్గుతాయి. * గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. నీళ్లకు వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. * రెండు టేబులు స్పూన్ల గులాబీ పూల రేకులను ఒక గ్లాసు నీళ్లకు కలిపి కషాయం తయారుచేసి తీసుకుంటే ఆందోళన, నర్వస్‌నెస్ వంటివి తగ్గుతాయి. * రోజ్‌వాటర్‌ని, ఉల్లిపాయల రసాన్ని ఒక్కోటి ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పరిశుభ్రమైన దూది ప్యాడ్‌ని తడిపి మూసిన కనురెప్పలమీద పరుచుకుంటే కంటి మంటలు, ఎరుపుదనం, దురద వంటివి తగ్గుతాయి. * ఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లకువేసి మరిగించి తీసుకుంటే తల తిరగటం, తలనొప్పి వంటివి తగ్గుతాయి. * రోజ్‌వాటర్‌ని, వెనిగార్‌ని సమాన నిష్పత్తిలో చల్లని నీళ్లకు కలిపి, నూలు గుడ్డను తడిపి మడతలుపెట్టి నుదుటి మీద పరిస్తే శరీరం చల్లబడి జ్వరం తగ్గుతుంది. * రోజ్‌వాటర్‌కి తోక మిరియాల పొడి, శొంఠి పొడిని ఒక్కో టీ స్పూన్ చొప్పున కలిపి పేస్టుమాదిరిగా చేసి తల నొప్పిమీద ప్రయోగిస్తే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. * ఎండిన గులాబీ రెక్కలను పొడిచేసి తేనెకు కలిపి కొద్దికొద్దిగా చప్పరిస్తుంటే గొంతు నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. * రోజ్‌వాటర్‌కి కుంకుమ పువ్వు, బాదం పలుకులను కలిపి మెత్తగా నూరి ముఖంమీద ఫేస్ ప్యాక్ మాదిరిగా ప్రయోగిస్తే ముఖ చర్మం కుసుమ కోమలంగా తయారవుతుంది. మంగు మచ్చలు, మొటిమలు వంటివి తగ్గుతాయి. * గులాబీలు వేసి నానబెట్టిన నీళ్లను సున్నపు తేటకు కలిపి, కమలాపండ్ల రసానికి చేర్చి తీసుకుంటే ఎసిడిటీవల్ల వచ్చే ఛాతినొప్పి, వికారం, అజీర్ణం, ఆమ్లపిత్తం వంటి సమస్యలు తగ్గుతాయి. * గులాబీ పూలరెక్కలు, అక్కలకర్ర పొడి వీటిని మూడేసి గ్రాముల చొప్పున కలిపి కొద్దికొద్దిగా నాలుక మీద వేసుకొని చప్పరిస్తుంటే నాలుక మీద ఉండే రుచి గ్రాహకాలు (టేస్ట్‌బడ్స్) చైతన్యవంతమవుతాయి. దీంతో ఆహార పదార్థాల రుచి తెలుస్తుంది.  

Irregular Periods లో రకాలు...   If period occurs somewhere between 21 days to 35 days, then the menstrual cycle is said to be extremely regular. Then when are periods said to be irregular & when should one consult a Doctor Dr. Manjula Anagani explains? To know the same in detail watch the video... https://www.youtube.com/watch?v=qcYcNyRjbBI  

గర్భాశయంలో గడ్డలు ఆరోగ్య సమస్యలు...   Not all the Fibroids are Cancerous but around 40 - 50% women who are in the reproductive age generally have some Fibroids. There are certain symptoms which when occur need treatment says the Doctor. To know more watch the video. https://www.youtube.com/watch?v=vTI70HgHUT8      

    ఆడవారి గుండెపోటు తీరే వేరు   గుండెపోటు అనగానే మనకు గుండెను చేత్తో పట్టుకుని విలవిల్లాడిపోయే దృశ్యాలే కనిపిస్తాయి. కానీ అన్ని సందర్భాలలోనూ గుండెపోటుని సూచించే లక్షణం ఇదే అన్న అపోహలో ఉండవద్దు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే గుండెపోటు మరింత భిన్నమైన సూచనలను అందిస్తాయని హెచ్చరిస్తున్నారు.   ఆడవారికే ప్రాణాంతకం: రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్ల వలనే స్త్రీలలో మరణాలు ఎక్కువని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీల మరణాలకు గుండెజబ్బులే ముఖ్య కారణం అని WHO సైతం తేల్చిచెబుతోంది. పైగా మగవారితో పోలిస్తే ఆడవారు గుండెపోటు వచ్చాక కోలుకునే అవకాశం తక్కువని కూడా కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. గుండెపోటు వచ్చిన వెంటనే చికిత్సని తీసుకోకపోవడం దీనిని ముఖ్య కారణంగా భావిస్తున్నారు.   వైద్యునికి కూడా తోచనిది: మగవారిలో గుండెపోటుకి సంబంధించిన సూచనలు అందరికీ తెలిసినవే! ఎడమ చేయిలాగడం లేదా మొద్దుబారిపోవడం, గుండె దగ్గర విపరీతమైన నొప్పి, ఊపిరి అందకపోవడం... వంటి లక్షణాలు కనిపించిన వెంటనే మగవారు జాగ్రత్తపడిపోతుంటారు. కానీ స్త్రీల విషయంలో ఇలా కాదు! పై లక్షణాలే కాకుండా వెన్ను నొప్పి, వికారం, దవడ లాగడం, కళ్లు తిరగడం, నీరసించిపోవడం, కడుపులో నొప్పి రావడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది ఏదో పని ఒత్తిడి వలన తాత్కాలికంగా ఏర్పడిన సమస్యగా భావిస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందనో, కాస్త మర్దనా చేస్తే తీరిపోతుందనో అశ్రద్ధ చేస్తుంటారు. ఒకోసారి సాధారణ వైద్యులు కూడా ఈ లక్షణాలు గుండెపోటుకి చిహ్నమమని గుర్తించలేకపోతుంటారట. ఫలితం! అత్యవసర వైద్యం అందాల్సిన సమయం కాస్తా దాటిపోతుంది. అందుకనే గుండెపోటు మగవారికంటే ఆడవారినే ఎక్కువగా కబళిస్తోంది.   అశ్రద్ధ కూడదు: 40 ఏళ్ల వయసు దాటినవారు, రక్తపోటుతో బాధపడేవారు, వంశపారంపర్యంగా గుండెజబ్బులు ఉన్నవారు, అధిక కొలెస్టరాల్ వంటి సమస్యలు ఉన్నవారు... ఎలాంటి సూచననీ అశ్రద్ధ చేయడం మంచిది కాదు. శరీరంలో ఏదన్నా భరించలేని నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం. అసలు అలాంటి పరిస్థితి రాకుండా నివారించేందుకే ప్రయత్నించమంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం ఒక అరగంటపాటైనా వ్యాయామం చేయమనీ, రక్తపోటు వంటి సమస్యలకు అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోమనీ సూచిస్తున్నారు. అన్నింటికీ మించి ఒత్తిడిని కనుక అదుపులో ఉంచుకోగలిగితే గుండెపోటుని కూడా అదుపులో ఉంచుకొన్నట్లే అంటున్నారు.   - నిర్జర.

  ఔషధాల ఆకుకూర -పాలకూర     కూరగాయల్లో ప్రతి ఒక్కదానిలో కొన్ని ప్రత్యేక పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో పోషకాల శాతం అధికం. పాలకూర గురించి చెప్పాలంటే ప్రత్యేక విశేషమే. ఇందులో ఆరోగ్యపరంగా, ఔషధపరంగా ఎన్నో సుగుణాలున్నాయి.   * గర్భిణీలకు: పాలకూరలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. గర్భవతులు, శిశువులకు పాలిచ్చే తల్లులకు ఇది మంచి పోషకాహారం. ఫోలిక్‌యాసిడ్ లోపం కారణంగా గర్భవతుల్లో కనిపించే మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వ్యాధిని పాలకూరతో దూరంగా ఉంచవచ్చు. ఫోలిక్‌యాసిడ్ గర్భంలో శిశువు ఎదుగుదలకు సహకరిస్తుంది. అందుకని గర్భిణులు ఆహారంలో ప్రతిరోజూ పాలకూరను తీసుకోవడం వల్ల శిశువు జనన లోపాలను అరికట్టవచ్చు. అంటే గర్భస్రావం, రక్తస్రావం, అలసట, శ్వాస సరిగా ఆడకపోవడం, బరువుతగ్గడం, డయేరియా తదితర సమస్యలకు పాలకూర మంచి పరిష్కారం.   * మలబద్దకం: పాలకూర రసం జీర్ణకోశంలో ఉన్న చెడును శుభ్రపరుస్తుంది. అంతేకాదు పేగులను ఉత్తేజపరుస్తుంది.   * శ్వాసకోశవ్యాధులు: తాజా పాలకూర ఆకులకు రెండు చెంచాల మెంతులు, చిటికెడు అమ్మోనియం క్లోరైడ్, తేనె కలిపి జ్యూస్‌లా చేసుకోవాలి. బ్రాంకైటిస్, టీబీ, ఆస్త్మా, పొడిదగ్గు మొదలైన వాటికి ఇది ఒక చక్కని నివారణగా పనిచేస్తుంది. 30ఎమ్ఎల్ మందును రోజుకి మూడుసార్లు చొప్పున తీసుకోవచ్చు.   * ఎనీమియా: పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. రక్తాన్ని మంచిగా వృద్ధిచేసి ఎనీమియా బారిన పడకుండా పాలకూర సర్వదా సంరక్షిస్తుంది. పాలకూరలో మిగతా అన్నింటికంటే ఎ-విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య పెరుగుదలకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా కళ్లను కాపాడుతుంది. రాత్రిపూట కనిపించే రేచీకటి సమస్య రాకుండా కాపాడడానికి పాలకూర ఒక మంచి పరిష్కారం.   * దంత సమస్యలు: పాలకూర రసం పంటిచిగుళ్లను దృఢ తరం చేస్తుంది. పంటి చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే ప్రతిరోజూ పాలకూర- క్యారెట్ జ్యూస్‌ని కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.   * మూత్రాశయ సమస్యలు: పాలకూర రసానికి కొబ్బరినీళ్లు కలుపుకుని రోజుకి రెండుసార్లు తాగడం వల్ల మూత్రం ధారాళంగా వస్తుంది. ఇంకా ఏముంది! పాలకూరలో క్యాల్షియం, ఆల్కాలిన్ ఎలిమెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణజాలాన్ని శుభ్రంగా ఉంచడంలోనూ రక్తంలో ఉన్న ఆల్కాలిన్‌ను నిలబెట్టడంలోనూ తోడ్పడతాయి. జీర్ణాశయంలో యాసిడ్లు ఎక్కువగా ఉత్పత్తి అవడానికి కారణమయ్యే ఎన్నో రకాల వ్యాధులను అడ్డుకునే శక్తి పాలకూరలో ఉంది.  

  ఆరోగ్యమైన కన్నుల కోసం....     1. మీరు మంచి దృష్టి మరియు రీడింగ్ లో ఎలాంటి సమస్య అయినా కనీసం సంవత్సరంనకు ఒకసారి చెకప్ కు వెళ్ళండి. వివిధ కంటి సంబంధిత రోగాలను గుర్తించడం మరియు సరైన చికిత్స కు చాలా మంచి మార్గంగా ఉంటుంది. 2. నిరంతరం మీ కళ్ళు రెప్పలు మూసి తెరవటం వల్ల మీ కళ్ళను తాజాగా ఉంచటానికి మరియు కంటి అలసట నివారించేందుకు చాలా సులభమైన మార్గంగా ఉంటుంది. సాదారణంగా కంప్యూటర్ యూజర్లు కళ్ళు రెప్పలు మూసి తెరవటం చాలా తక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వారు తమ కళ్ళును ప్రతి మూడు నాలుగు సెకన్లు ఒకసారి మూసి తెరుస్తూ వ్యాయామం చేయాలి. 3. మేము దగ్గరగా ఉన్నవస్తువుల వద్ద ఎక్కువ సమయం గడిపిన తరువాత దూరపు వస్తువులను చూడటం ఒక అలవాటుగా పాటించాలి. వాకింగ్ లేదా కూర్చొని ఉండగా మీ చుట్టూ దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ప్రయత్నించండి. 4. మీ కారు లేదా మీ కార్యాలయం నుండి ఎయిర్ కండిషన్డ్ గాలి మీ కళ్ళలో తేమ లేకుండా చేస్తుంది. ఎల్లప్పుడూ మీ A/C ప్యానెల్ ను క్రిందికి లేదా మీ ముఖం నుండి దూరంగా ఉండేలా చూసుకోవాలి. ఎయిర్ కండీషనర్ గాలి తీవ్రమైన పొడి,అంధత్వం లేదా ఇతర కంటి రుగ్మతలకు కారణం కావచ్చు. 5. దుమ్ము, దూలి వంటి వాటితో మీ కళ్ళు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి దుమ్ము, ధూలి, రసాయనాలతో పని చేసేవారు,క్రాకర్లు పగిలిపోవటం వల్ల,ఈత సమయంలోను,ఆటలు ఆడుకొనేటప్పుడు తప్పనిసరిగా రక్షణకు కళ్ళద్దాలు ధరించాలి. 6. మీ కళ్ళు ఒత్తిడిగా ఉన్నాయని భావిస్తే వాష్ రూంకి వెళ్లి పూర్తిగా మీ కళ్ళును కడగాలి. దీనిని రోజువారీ పనిగా అలవాటు చేసుకోండి. నీటితో మీ కళ్ళు కడగటం వల్ల అధిక ఒత్తిడి నుండి మీ కళ్ళు ఉపశమనం పొందటానికి మరియు వాటిని తాజాగా ఉంచటానికి సహాయం చేస్తుంది. 7. పడుకొనే ముందు మీ కంటి మేకప్ ను తొలగించుకోవాలి. రాత్రి మీరు కంటి మేకప్ తీయకపోతే ఇరిటేషన్ రావచ్చు. అంతేకాక ఆ మేకప్ కన్ను లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. 8. నిద్ర లేకపోవడం వలన మీరు అలసట,తలనొప్పి మరియు మీ చూపు మసకగా ఉండేలా చేస్తుంది. అందువల్ల నిద్ర బాగా ఉంటె మంచి చూపుకు మరియు కంటి కండరాల విశ్రాంతికి సహాయం చేస్తుంది. 9. గుడ్లు తినడం వల్ల గుడ్డులో ఉండే పోషక పదార్థాలు చురుకైన చూపుకు,వయస్సు సంబంధిత కంటి వ్యాధులను తగ్గిస్తున్నది. 10. మీ ఆహారంలో కనీసం వారంలో రెండు సార్లు చేపలు ఉండేలా చూసుకోండి. చేపలలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉండుట వల్ల డ్రై-ఐ సిండ్రోం నివారించేందుకు ఉపయోగపడుతుంది. 11. నీరు మీ అన్ని సమస్యలకు ఉత్తమమైన నివారణ మార్గంగా చెప్పవచ్చు. తరచుగా మసకగా ఉన్న దృష్టి నిర్జలీకరణ వలన కావచ్చు. అందువల్ల క్రమమైన విరామాల్లో నీటిని త్రాగుతూ ఉండాలి. 12. మీ ఆహారంలో పాలకూర ఎక్కువగా ఉండేలా చూసుకోండి. పాలకూర అనేక కంటి సంబంధిత సమస్యలను నిరోధించడానికి సహాయపడుతుంది.

ఒకరోజుకి మనకు ఎన్ని కాలరీల శక్తీ కావాలో తెలుసుకుందాం!   ఒకరోజుకి మనకు ఎన్ని కాలరీల శక్తీ కావాలో ఎవరికైన తెలుసా ! ఎన్ని కాలరీల శక్తి ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామో ఎవరికైన తెలుసా ? అనే రెండు ప్రశ్నలకి సమాధానాలు చాలామందికి తెలియకపోవచ్చు కదా ! అందుకే ఈ రోజు మనకు ఒకరోజుకి ఎన్ని కాలరీల శక్తి కావాలో తెలుసుకుందాం !   * పసిపిల్లకి 110 నుండి 120 వరకు కాలరీల శక్తి కావాలి. * వయసు మగపిల్లలకి 3100 నుండి 3200 వరకు కాలరీల శక్తి కావలి. * వయసు ఆడపిల్లలకి 2500 నుండి 2600 వరకు కాలరీల శక్తి కావాలి. * కార్మికులకు, గర్భిణి స్త్రీలకి 3000 నుండి 3100 వరకు కాలరీల శక్తి కావలి. * లావుగా ఉండే వాళ్లకి, పనిలేని వాళ్లకి 2000 నుండి 2500 వరకు కాలరీల శక్తి కావాలి. * వేడి వాతావరణం 10% కాలరీల శక్తి కావాలి. * చల్లని వాతావరణం 3% కాలరీల శక్తి కావలి.   మనం చేసే పనులను బట్టి, మనకొచ్చే వయస్సును బట్టి, మన చుట్టూ ఉండే వాతావరణాన్ని బట్టి మగవాళ్ళకి, ఆడవాళ్ళకి, చిన్నపిల్లలకి, అందరికి నిర్ణయించిన కాలరీలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా !

ఆడవాళ్లు ఎక్కువగా ఉద్యోగం చేస్తే..?     మారుతున్న సమాజంలో స్పష్టంగా కనిపించే అంశం... ఆడవారు కూడా ఉద్యోగసోపానంలో ఉన్నత శిఖరాలను అందుకోవడం! మరి తమను తాము నిరూపించుకునే క్రమంలో వారు ఛేదిస్తున్న లక్ష్యాలతో పాటుగా వెంటాడుతున్న అనారోగ్యాలు కూడా ఉన్నాయంటున్నారు పరిశోధకులు. ఆదివారం మినహా రోజుకి పదేసిగంటలపాటు ఉద్యోగం చేస్తూ ఉంటే... ఎవరికైనా చిన్నాచితకా ఆరోగ్య సమస్యలు రావడం సహజం. అలాంటివారు అజీర్ణం, ఊబకాయం... లాంటి అనారోగ్యాలను గమనించుకోక తప్పదు. ఈ విషయాన్ని శాస్త్రీయంగా రుజువు చేసేందుకు అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీకి చెందిన ‘అలార్డ్‌’ అనే పరిశోధకుడు పూనుకున్నాడు. తన పరిశోధన కోసం దాదాపు 7,500 ఉద్యోగులను మూడు దశాబ్దాల పాటుగా గమనించాడు. వీళ్లలో గుండెజబ్బులు, కీళ్లనొప్పులు, ఉబ్బసం, రక్తపోటు, డిప్రెషన్‌ లాంటి సమస్యలు ఏర్పడటానికీ... పనిగంటలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందా అని పరిశీలించాడు. అలార్డ్‌ పరిశోధనల్లో... పనిగంటలకీ, పైన పేర్కొన్న వ్యాధులకీ కొంత సంబంధం ఉందని తేలింది. అయితే విచిత్రంగా ఆడవారిలో ఈ సంబంధం మరింత స్పష్టంగా కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతోందన్న దాని మీద అలార్డ్‌ దగ్గర స్పష్టమైన సమాధానం లేకపోయింది. ‘బహుశా ఉద్యోగిగా, గృహిణిగా, తల్లిగా... ఇన్ని బాధ్యతలను ఒక్కసారిగా సమర్థవంతంగా మోయాలనుకునే ప్రయత్నంలో వారి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటోందేమో’ అని ఊహిస్తున్నారు అలార్డ్‌. అయితే డా॥ గోల్డ్‌బర్గ్‌ అనే వైద్యరాలు మాత్రం అధికపనిగంటల వల్ల ఆడవారు అనారోగ్యం పాలవ్వడానికి స్పష్టమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. పని ఒత్తిడిలో పడిపోయి ఆడవారు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోరనీ. స్త్రీలకు అవసరమైన మేమోగ్రాం వంటి పరీక్షలు చేయించుకునేందుకు కూడా అశ్రద్ధ చూపిస్తూ ఉంటారనీ గోల్డ్‌బర్గ్‌ విశ్లేషిస్తున్నారు. అంతేకాదు! ఉద్యోగం చేసే ఆడవారు ఆకలిని తీర్చుకునేందుకు ఏదో ఒక చిరుతిండితో సరిపెట్టేసుకుంటారనీ అంటున్నారు. మరి అధిక పనిగంటలు ఉన్నాయి కదా అని ఆడవారు ఉద్యోగాలలో వెనుకంజ వేయాలా? అంటే అదేమీ అవసరం లేదంటున్నారు నిపుణులు. ఉద్యోగ బాధ్యతలలో ఏది అవసరం, ఏది అనవసరం అని బేరీజు వేసుకుని అనవసరమైన బాధ్యతలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. రోజులో కాస్త సమయాన్నైనా తమకోసం వెచ్చించుకోవాలని సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేయడమో, పుస్తకాలు చదవడమో, టీవీతో కాలక్షేపం చేయడమో, ధ్యానంలో ఉండటమో... ఇలా ఉద్యోగపరమైన ఆలోచనల నుంచి కాసేపు మనసుకి విశ్రాంతిని కలిగించమంటున్నారు. - నిర్జర  

Yoga For Computer Users     Yoga For Computer Users: Watch Dr C.V.Rao of Kapila Maharshi Yoga Kendram show us various exercises for people who are on the Computer for long hours. A must watch for all those ladies who are in the field of IT and who use the computer regularly. He shows simple Yoga exercises which can be done at your workplace without any discomfort or need for space. He shows various breathing exercises along with Yogaasanas for keeping the body fit , alert and free from any symptoms related to excessive use of the Mouse and watching the Computer for long.  

Yoga for a Healthy Menstrual Cycle Yoga for a pain-free Menstrual Cycle: Watch Rajeswari Vaddiparthi  show us Yogic postures for pain free periods.These asanas also help in regulating your period cycles and ease cramps.    

  హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే....     ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్దతులు పాటిస్తే మంచిది. మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే  చాలు, ఎలాంటి సమస్య ఉండదు. రక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో  కాస్తంత జాగ్రత్త పాటింఛి దానిని పెంచుకోవటం  మంచిది  కదా. ఒంట్లో ఐరన్ శాతం తక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ తగ్గుముఖం పడితే అలాంటివాళ్ళు ఎక్కువగా పాలకూర, మెంతికూర, పెసరపప్పు, రాజ్మా, బీన్స్ మొదలయినవి తినాలి. నువ్వులు,బార్లి, బాదం పప్పు  తినటం కూడా మంచిది. మాంసాహారులు ఎర్ర మాంసం, చేపలు తింటే మంచిది.   అదేగనక ఒంట్లో విటమిన్ సి తక్కువగా ఉండి దానివల్ల హిమోగ్లోబిన్ శాతం తగ్గుతున్నట్లయితే అలాంటి వాళ్ళు జామకాయలు, బొప్పాయి, కివి పండు, కమలాపండు, ద్రాక్ష తీసుకోవాలి. అదే కూరగాయల్లో అయితే కాప్సికమ్, క్యాబేజ్, టమాటా  ఇలాంటివి ఎక్కువగా తినాలి. బాదం పప్పు రక్తాన్ని పెంచటంలో ఎక్కువ దోహదపడుతుంది. రక్తహీనత ఉన్నవాళ్లు రోజుకి 10 లేక 12 బాదం పప్పులు నానబెట్టుకుని తినాలి. బీట్రూట్ రక్తహీనతకు తిరుగులేని మందు. ఉదయం పూట ఒక గ్లాస్ పచ్చి బీట్రూట్ జ్యూస్ , 20 రోజుల పాటు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే బ్రౌన్ బ్రెడ్, పాస్తా, కార్న్ ఫ్లాక్స్ కూడా రక్తాన్ని వృద్ధి చేస్తాయి. మనం తీసుకునే ఆహారంలో ఇవన్ని ఉండేటట్లు చూసుకుంటే చాలు హిమోగ్లోబిన్ పెరగటానికి టాబ్లెట్స్ మీద ఆధారపడాల్సిన పని ఉండదు.   ..కళ్యాణి

పసుపుతో చేసిన మందులతో కేన్సర్ మాయం     భారతీయ స్త్రీలకు పసుపు అంటే ఎంత ఇష్టమో తెలియంది కాదు. ఇంట్లో పసుపు నిండుకుంటే, వారికి రోజంతా లోటుగానే తోస్తుంది. కూరలో కాస్త రుచి కావాలన్నా, మొహం కాంతిగా ఉండాలన్నా, చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా.... ఆఖరికి కొత్త బట్టలు వేసుకోవాలన్నా చిటికెడు పసుపు లేనిదే పని జరగదు. పసుపులో ఉండే ఔషధగుణాల వల్లే మన సంప్రదాయంలో దానికి అంత ప్రాముఖ్యత అంటారు. పసుపుకి ఉండే ఔషధి గుణాల గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. ఓ నాలుగు గ్రాముల పసుపు నోట్లో పడితే జీర్ణాశయం దగ్గర నుంచి గుండె వరకు మన ఒంట్లో అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయని చెబుతారు. కేన్సర్ని నిరోధించడంలోనూ పసుపు ప్రభావం గురించి ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే కేన్సర్కు మందుగా పసుపుని ఉపయోగించడం ఎలాగా? అన్నది ఇప్పటిదాకా ఓ సమస్యగానే ఉంది. ఇప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కనుగొన్నారన్న శుభవార్త వినిపిస్తోంది. పసుపు ఆ రంగులో ఉండేందుకు, అది ఒక ఔషధంగా ఉపయోగపడేందుకు... అందులో ఉండే సర్కుమిన్ అనే రసాయనమే కారణం! అయితే ఈ సర్కుమిన్ను నేరుగా కేన్సర్ కణాల మీద ప్రయోగించడం సాధ్యం కాదు. సర్కుమిన్కు కరిగే గుణం తక్కువ, స్థిరత్వమూ తక్కువే! దాంతో నానోపార్టికల్స్ అనే ప్రక్రియ ద్వరా దీనిని కేన్సర్కు మందుగా వాడే ప్రయత్నం చేశారు. ఇందుకోసం Cerium oxide అనే సూక్ష్మకణాలకు (nano particles) సర్కుమిన్ను జోడించారు. దీనికి dextran అనే ఒక తరహా గ్లూకోజ్ను పైపూతగా పూశారు. ఇక మందు సిద్ధమైపోయింది! పరిశోధకులు రూపొందించిన ఈ మందుని Neuroblastoma అనే ఒక అరుదైన కేన్సర్ మీద ప్రయోగించి చూశారు. ఎక్కువగా పసిపిల్లలని కబళించే ఈ తరహా కేన్సర్ని చాలా ప్రాణాంతకంగా భావిస్తూ ఉంటారు. నాడీవ్యవస్థని ప్రభావితం చేసే ఈ కేన్సర్ మన అడ్రినల్ గ్రంథులలో మొదలై శరీరం అంతటా వ్యాపిస్తుంది. ఈ కేన్సర్ కణాలు సంప్రదాయవైద్యానికి ఓ పట్టాన లొంగవని చెబుతారు. చికిత్స తర్వాత కేన్సర్ తగ్గినట్లు కనిపించినా మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఎక్కువే. అదృష్టవశాత్తూ వ్యాధి నయమైనా కూడా ఇతరత్రా దుష్ప్రభావాలు చాలానే ఉంటాయి. ఇలాంటి సంక్లిష్టమైన Neuroblastoma కేన్సర్ మీదకు పసుపుతో చేసిన నానోపార్టికల్స్ను ప్రయోగించి చూశారు. ఫలితం ఊహించినదే! పసుపుతో చేసిన ఈ మందులు కేన్సర్ కణాలను నిర్వీర్యం చేసిపారేశాయి. ఈ క్రమంలో అవి శరీరంలోని ఇతరత్రా ఆరోగ్యకరమైన కణాలను ఎటువంటి హానీ తలపెట్టలేదు. కేన్సర్ వల్ల మృత్యువాత పడే పిల్లలలో 15 శాతం మంది ఈ Neuroblastomaతోనే చనిపోతున్నారట. కాబట్టి ఈ సరికొత్త ప్రయోగంతో అలాంటి మరణాలను నిస్సందేహంగా ఆపవచ్చని ఆశిస్తున్నారు. ఇదే తరహా చికిత్సను ఇతరత్రా కేన్సర్లకి కూడా ప్రయోగించే రోజులూ వస్తాయి. అదే కనుక జరిగితే... ఇక మానవాళి కేన్సర్ నుంచి విముక్తి చెందినట్లే! - నిర్జర.    

Power Foods for the Brain Powerful foods for powerful brain. here some power foods for the brain increase your mental ability and improve your memory and boost your brainpower. Almonds : Those tiny little nuts are rich in antioxidants and also contain omega-3 fatty acids. Eating a few almonds everyday can be absolutely worth it   Fish: If you are a non-vegetarian and love eating fish, you have some good news. Salmon, tuna and other fatty fish are considered to be rich in protein, calcium Eating fish aids the development of the brain.   Eggs: Just as fish, eggs are a great source of omega-3 fatty acids which facilitate the brain cell development process. Including this high-in-protein, low fat and Vitamin E rich food in your daily diet will prove to be an excellent decision.   Salad: Green leafy vegetables like lettuce, spinach and others like carrot, broccoli, and cabbage are an apt choice of food for your brain. These fibre-rich foods are rich in antioxidants like Vitamin C and E that protect the brain.  

మందులే కదా అని మింగేయకండి!            పెయిన్ కిల్లర్... ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వేసుకోవాల్సి వస్తుంది. అయితే పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలామంది చేసే తప్పు... మళ్లీ మళ్లీ వేసేసుకోవడం. ఒక ట్యాబ్లెట్ వేస్తే నొప్పి తగ్గింది కదా అని ఎప్పుడు నొప్పి వచ్చినా అదే ట్యాబ్లెట్ వేసేసుకుంటూ ఉంటారు. అది ఎంత ప్రమాదమో ఊహించరు. నిజానికి ఈ మందులు వెంటనే ఉపశమనాన్ని ఇస్తాయి. కానీ మోతాదు మించితే చెప్పలేనని సమస్యలు తెచ్చిపెడతాయి.       పొట్టలోని లోపలి పొరలు, రక్తనాళాల్ని దెబ్బ తీస్తాయి. మూత్రపిండాల్లోని నాళాలు కూడా దెబ్బ తింటాయి. కొందరిలో అయితే హై బీపీ వస్తుంది. గుండె పనితీరుపై ఒత్తిడి పెరిగి గుండె జబ్బులు వచ్చే ప్రమాదమూ ఉంది. అలాగే రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే ప్లేట్ లెట్స్ దెబ్బ తింటాయి. ఇది ఒక్కోసారి తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది. ఇవి మాత్రమే కాక.. నిద్ర పట్టకపోవడం, పీడకలలు రావడం, నోరు ఎండిపోయి అస్తమానం దాహం వేయడం, మలబద్దకం, కళ్లు తిరగడం, వికారం, వాంతులు, ఊరకే అలసిపోవడం వంటి రకరకాల సమస్యలు మొదలవుతాయి. ఇవి మందుల వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ అని తెలియక చాలామంది హైరానా పడిపోతుంటారు.        కాబట్టి పెయిన్ కిల్లర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ ని అడక్కుండా ఎలాంటి పెయిన్ కిల్లర్ వాడకండి. డాక్టర్ కనుక వాడమని ఏదైనా మందు రాస్తే ఎంత మోతాదు వాడాలి, ఎప్పుడెప్పుడు వాడాలి వంటి వివరాలు తప్పకుండా అడిగి తెలుసుకోండి. మందులు కొనేటప్పుడు ఎక్స్ పయిరీ డేట్ తప్పకుండా చూసుకోండి. షీట్ మీద సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమైనా రాశాడేమో బాగా చదవండి.         పరగడుపున పెయిన్ కిల్లర్ ఎప్పుడూ వేసుకోవద్దు. అలాగే వేసుకున్న తర్వాత వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. మందు వేసుకున్న తర్వాత ఏదైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే డాక్టర్ కి తప్పకుండా చెప్పాలి. ఒకవేళ అది మీకు పడదు అనుకుంటే వెంటనే మారుస్తారు. అలాగే పడని ఆ మందు పేరును ఎక్కడైనా రాసి పెట్టుకోండి. ఎప్పుడైనా ఏ డాక్టరైనా పొరపాటున ఆ మందు రాస్తే మళ్లీ వాడేయకుండా జాగ్రత్త పడొచ్చు. అలాగే కోర్సు వాడటం పూర్తయినా సమస్య తీరకపోతే మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లండి తప్ప మీ అంతట మీరే కోర్సును కంటిన్యూ చేసేయొద్దు.        ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే పెయిన కిల్లర్ తో ఏ సమస్యా ఉండదు. కానీ నిర్లక్ష్యం చేశారో... ప్రాణాలో పోసే మాత్రలే ప్రాణాల మీదికి తీసుకొస్తాయి గుర్తుంచుకోండి.  -Sameera  

ఆ లక్షణాల్ని నిర్లక్ష్యం చేయొద్దు!     మన శరీరం, మన అలవాట్లు, మన దైనందిన చర్యల్లో మార్పులు వస్తున్నా గమనించుకోలేనంత బిజీ జీవితాలు మనవి. ముఖ్యంగా వర్కింగ్ ఉమన్. ఓపక్క ఇంటిని చక్కదిద్దుకుంటూ, మరోపక్క ఉద్యోగాల కోసం పరుగులు తీసే క్రమంలో తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దాంతో కొన్ని ప్రమాదకర వ్యాధుల బారిన పడుతున్నారు. వాటిలో మూత్రాశయ క్యాన్సర్ ఒకటి. మూత్రం, మూత్ర విసర్జనాక్రమంలో వచ్చే మార్పులను గమనించుకోకపోవడం వల్ల మూత్రాశయ క్యాన్సర్ ని ముందుగా గుర్తించలేకపోతున్నారు. తద్వారా ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. మీరు ఆ తప్పు చేయకండి. ఈ లక్షణాలు కనుక కనిపిస్తే తప్పకుండా డాక్టర్ ని సంప్రదించండి. - మూత్రం ఎరుపురంగులోకి మారిందా? అయితే పరీక్ష చేయించుకోవాల్సిందే. మూత్రంలో రక్తం పోతూ ఉన్నప్పుడే అలా రంగు మారవచ్చు. - మాటిమాటికీ మూత్రం వస్తున్నట్టు అనిపిస్తుంది. వెళ్తే చుక్కలు చుక్కలుగా చిన్న మొత్తంలో వచ్చి ఆగిపోతుంది. - మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉంటుంది. చురుక్కు చురుక్కుమనడంతో మొదలై నరాలు మెలిపెడుతున్నంత నొప్పి కలుగుతుంది. - తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. - అరికాళ్లు, మడమల దగ్గర వాపు వస్తూ ఉంటుంది. అలా అని ప్రతి వాపూ క్యాన్సర్ లక్షణం కాదు. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల నీరు చేరవచ్చు. అయితే వాపు వచ్చి ఓ పట్టాన తగ్గకపోతే మాత్రం ఆలోచించాల్సిందే. - కటి ప్రాంతంలో ఎముకలు, నరాలు నొప్పిగా అనిపిస్తాయి. - బరువు వేగంగా తగ్గిపోవడం కూడా సంభవిస్తుంది. అయితే ప్రతి ఒక్కరిలో ఇవన్నీ కనిపించకపోవచ్చు. ఏ ఒక్క లక్షణం కనిపించినా నిర్లక్ష్యం కూడదు. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. నిజంగా వ్యాధి ఉంటే కనుక దాన్ని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్సకు వీలుంటుంది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది. - Sameera      

థైరాయిడ్‌ ఆడవాళ్లకే ఎందుకు వస్తుంది?   ఈమధ్య ఏ ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకున్నా వచ్చే ప్రశ్నలలో ఒకటి- ‘మీకు థైరాయిడ్ ఉందా?’ అంతేకాదు త్వరగా ప్రెగ్నెంట్ కాకపోయినా, బాగా నీరసంగా ఉన్నా, ఒక్కసారిగా ఒళ్లు చేసినా, జుట్టు రాలిపోతున్నా... ఆఖరికి చిరుకుగా ఉన్నా డాక్టర్లు థైరాయిడ్ టెస్ట్‌ చేయించుకోమనే సూచిస్తున్నారు. ఇంతకీ థైరాయిడ్‌ సమస్య ఆడవాళ్లలోనే ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంది.   థైరాయిడ్ సమస్య ఆటోఇమ్యూన్‌ వ్యాధి వల్ల వస్తుంది. మన శరీరమే, కొన్ని అవయవాల మీద దాడి చేసి వాటిని పాడు చేయడాన్ని ఆటోఇమ్యూన్ వ్యాధి అంటారు. ఆడవాళ్లకి నెలసరి వచ్చిన ప్రతిసారీ వాళ్ల శరీరంలోని హార్మోనులలో విపరీతమైన మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్‌ గ్రంధిని దెబ్బతీస్తుంది. దానివల్ల థైరాయిడ్‌ చాలా తక్కువగా పనిచేయడమో (హైపో థైరాయిడ్‌) లేదా ఎక్కువగా పనిచేయడమో (హైపర్‌ థైరాయిడ్‌) జరుగుతుంది.   ప్రెగ్నెన్సీ సమయంలోను, పిల్లలు పుట్టిన తర్వాత కూడా అకస్మాత్తుగా థైరాయిడ్‌ సమస్య రావడానికి కారణం కూడా హార్మోన్‌ ఇంబాలెన్సే! అందుకనే ఆడవాళ్లు ఎప్పటికప్పుడు ఇతర పరీక్షలతో పాటు తప్పకుండా థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. లేకపోతే పిల్లలు పుట్టకపోవడం, పుట్టినా ఆరోగ్యంగా లేకపోవడం లాంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. -Nirjara

    Things Women should never do in the Gym!     Women are obsessed about staying in shape But very few make it a point to regularly work out. And the ones who do workout, tend to do certain mistakes which reduces the effectiveness of the workout on the body. So here are some tips and tricks to make your workout sessions more effective. The key is, just do these while you are working out at the Gym!   Never make your mouth work more than your body:  True that girls love to bond and talk about every single topic under the sun, but not always is it the right time to do so. Not at least while you are at the gym. Gym time is not a time to socialise.Its perfectly alright to exchange pleasantries with the people you know at the gym when you enter, standing around or even worse is sitting on machines or benches but not using them and chatting non stop about how your day went, how your weekend was or talking about your favourite tv soaps is a complete no no. Gym is not a place for this.   Do not focus on having a Gym buddy, Focus on yourself:  It is true to an extent that you feel more pumped up while you are with your buddies while you are working out, but It's another thing entirely to follow your boyfriend/husband/ girl friends around the whole time you're at the gym, never leaving their side and not actually training yourself while they're trying to do work. By this you are wasting your own time by just following them around and not actually training yourself.   Don't give your appearance in the gym more importance:  Ladies, gym isn't a place to show off. And your appearance while working out would not matter much as everyone around is coming there just to train focusing on themselves. Its time to stop walking to the mirror in between every single set to check and make sure everything's still intact. No one really cares what you're doing! All that matters is you and your fitness.   Do no follow your peer's gym routine, your body is unique:  Every person's body is unique and the same gym routine would not be effective for everyone. So if you see someone doing an exercise you think looks interesting and want to attempt it yourself, its nice to have the motivation and desire to try something new to improve your training, but don't just copy that. Ask your trainer what to do and what not to. Don't be afraid to ask your trainer or an experienced person at the gym as exactly how you should be performing the exercise, what weight you should start at, etc. It's only to your benefit to start off doing things right from the beginning with right training.   Cardio machine is not the only thing at Gym,Don’t spend hours on one it: Yes, cardio is central to fat loss, but if you spend more than 50 per cent of your workout time on it, then you might just not be doing the right thing. To really improve your shape, weight training is important as well. Your body will drain its glycogen stores doing weights, so if you do 20 minutes of cardio afterwards your body will switch to burning fat. And that is how it should be done.   ..Divya

  చిన్న పొరపాటుతో మూడు తరాలకు ఆస్తమా     కాలుష్యం. ఎటు వెళ్లినా ఎక్కడ చూసినా కాలుష్యం. ఆ కాలుష్యంతోనే మనం ఎలాగొలా నెట్టుకొచ్చేస్తున్నాం. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది మననే కాదు... రాబోయే తరాలను కూడా బాధించేందుకు సిద్ధంగా ఉంది. నమ్మలేకపోతున్నారా! American Physiological Society వెల్లడించిన ఈ పరిశోధన గురించి ఓసారి వినండి. అప్పుడు మీరే కాలుష్యానికి ఆమడదూరంలో ఉండేందుకు ప్రయత్నిస్తారు. తల్లికాబోయే ఆడవాళ్లు ఆ తొమ్మిది నెలలూ దుమ్మూధూళికి దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ మాటలో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నారు కొందరు శాస్త్రవేత్తలు. ఇందుకోసం మనుషుల మీద పరిశోదన చేయడం అంత సాధ్యం కాదు కాబట్టి కొన్ని ఎలుకలని కాలుష్యం ఉన్న గాలిలో ఉంచారు. మన నగరాల్లో తరచూ కనిపించే డీజిల్ తదితర కాలుష్య కారకాల మధ్య వాటిని నిలిపారు. ఈ కాలుష్య కారకాలు కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది. ఆ బిడ్డ DNAను అవి మార్చివేయడం గమనించారు. ముఖ్యంగా మనలోని రోగనిరోధక శక్తికి తోడ్పడే dendritic అనే కణాలను అవి తీవ్రంగా ప్రభావితం చేశాయట. చిన్నవయసులో ఉండగానే కొందరు ఆస్తమాతో బాధపడటానికి ఈ మార్పులే కారణం అవుతాయని తేలింది. ఏదో ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా మూడు తరాల మీద ఈ ప్రభావం కనిపించిందట. ఇలా ఒకసారి DNAలో వచ్చిన మార్పులు మరిన్ని తరాలను పీడించడాన్ని epigenetic transgenerational inheritance అంటారట. ఈ పదాలన్నీ మనకి అర్థం కాకపోయినా, జరిగిన పరిశోదన ఎలుకల మీదే అయినా... కాలుష్యానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయకపోతే, అది కొన్ని తరాల వరకూ పీడిస్తుందని తేలిపోయింది. మరీ ముఖ్యంగా తల్లికాబోయే ఆ కొద్ది రోజులలో అయినా కాస్త జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికా అందుతోంది. - నిర్జర.