పేస్ బుక్... అమ్మాయిలు అమ్మో!   మీరు ఫేస్‌బుక్‌కి అతుక్కుపోతున్నారా..? అయితే మిమ్మల్ని.. మీ జీవితాన్ని ఫేస్‌బుక్ కంట్రోల్ చేస్తుందట. అసూయ, డిప్రెషన్‌లాంటి సమస్యలు ఎదురవుతాయి. మరి దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=THUkA8sSvyQ

యూరిన్ ఇన్ ఫెక్షన్ కి కారణాలు.. తీసుకోవల్సిన జాగ్రత్తలు..!  

ఈ చిన్న చిట్కాతో డిప్రెషన్ ని పోగొట్టుకోవచ్చు...   ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమస్యల వల్ల మహిళలు త్వరగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారు డిప్రెషన్‌ నుంచి బయటపడాలంటే ఏం చేయాలో.. ఈ వీడియో చూసి నేర్చుకొండి.  https://www.youtube.com/watch?v=oax1WsQvUrM

కంటి నిండా నిద్ర పట్టాలంటే...?     హాయిగా కంటి నిండా నిద్ర పడితేనే మర్నాడు చక్కగా పనులు చేసుకోగలుగుతాం . లేదంటే చిరాకు , కోపం , అలసట అన్నీ ఒక్కసారే మనపై దాడి చేస్తాయి. ఏదో ఎప్పుడో ఒకసారి అలా నిద్ర కోసం యుద్ధం చేయాల్సి రావటం పర్వాలేదు కాని , తరుచు నిద్ర పట్టటం కష్టం గా మారితే మాత్రం కొంచం జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు డాక్టర్స్. నిద్ర పట్టక పోవటానికి టెన్షన్స్ , సెల్ ఫోన్స్ లాంటివి కొంత వరకు కారణం అని మనమందరం వినే వుంటాం. అయితే మనం తీసుకునే ఆహరం కూడా అందుకు కారణం కావచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు . పిండి పదార్ధాలు , ఖనిజాలు తక్కువగా వుండే ఆహరం తీసుకోవటం , లేదా నిద్ర పోయే ముందు మాంస క్రుత్తులు ఎక్కువగా వుండే స్నాక్స్ తినటం వంటి పొరపాట్లు మనకి  నిద్రని దూరం చేస్తాయిట.   1.పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే పదార్థాల్ని ఆహరంగా తీసుకుంటే అవి " ట్రిప్టోఫాన్ " అనే అమినో ఆమ్లాలను మెదడుకు పంపిస్తాయి. దాంతో నిద్ర ముంచుకు వస్తున్నా భావన కలుగుతుంది అట. కాబట్టి రాత్రి పూట బియ్యం , గోధుమలు , బ్రెడ్ , రాగి , కార్న్ ఫ్లేక్స్ వంటివి మన ఆహరం లో ఉండేలా చూసుకోవాలి.    2. అలాగే కాల్షియం , మెగ్నీష్యం , ఐరన్‌లు మన శరీరంపై మత్తుగా ఉండేలా ప్రభావాన్ని చూబిస్తాయి . కాబట్టి గోరువెచ్చటి పాలు , ఆకుకూరలు , బాదం , జీడిపప్పు , వంటివి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది .    3. ఇక పడుకునే ముందు మాంస క్రుత్తులు అదికంగా వుండే స్నాక్స్ తినకపోవటమే మంచిది .ఎందుకంటే ఇవి మనం తిన్న ఆహరం నుంచి " ట్రిప్టోఫాన్ " మెదడును చేరకుండా అడ్డుకుంటాయి. దాంతో సరిగ్గా నిద్ర పట్టదు.    ఈ సారి నిద్ర పట్టక పోతే ఒకసారి మీ ఆహారపు అలవాట్లని కూడా గమనించి చూసుకోండి . మంచి ఆహరం మంచి నిద్రని , మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ,ఇస్తాయి . మంచి ఆరోగ్యం మనల్ని అన్నిరకాలుగా చురుకుగా ఉంచుతుంది .  -రమ  

కడుపులో కవలలు ఉంటే..?     కడుపులో బిడ్డ పడితే తల్లికి ఎంత సంబరమో. అదే కడుపులో ఇద్దరు బిడ్డలు పడితే? సంతోషంతో పాటు కాస్త టెన్షన్ కూడా మొదలవుతుంది. ఒక బిడ్డ ఉంటేనే ఎంతో కేర్ తీసుకుంటాం. మరి ఇద్దరు బిడ్డలు ఉంటే ఎక్కువ కేర్ తీసుకోవద్దా? తీసుకోవాలి. తప్పకుండా తీసుకోవాలి. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా వచ్చే ప్రెగ్నెన్సీ కంటే కన్సీవ్ అవ్వడం కోసం మందులు వాడేవాళ్లు, ఐవీఎఫ్ చేయించుకున్నవాళ్లు, ముప్ఫై అయిదేళ్లు దాటిన వారికి కవలలు ఎక్కువగా పుడుతుంటారు. మామూలుగా అయితే ఒక బిడ్డ పెరగడానికి అనువుగానే శరీరం ఉంటుంది. కాబట్టి కవలలు ఉన్నారని తేలితే హైరిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తుంటారు వైద్యులు.  ఇద్దరు శిశువులకు రెండు మాయలు, రెండు ఉమ్మనీటి సంచులూ ఉంటే పిల్లలిద్దరూ మామూలుగానే పెరిగి, సుఖప్రసవం అవుతుంది. కానీ ఒకే మాయ ఉంటే మాత్రం కొన్ని కాంప్లికేషన్స్ వస్తుంటాయి. కాబట్టి కడుపులో కవలలు ఉన్నారని తెలిస్తే కాస్త ఎక్కువ కేర్ తీసుకోవం మంచిది. పదకొండు వారాల సమయంలో స్కానింగ్ చేయించుకుంటే కడుపులో శిశువులు ఎలా ఉన్నారు, ఎన్ని మాయలు ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది డాక్టర్స్ చెప్తారు. వాళ్లు చెప్పినట్టు ఫాలో అయితే ఏ సమస్యా ఉండదు. బలమైన ఆహారం తీసుకోవడం, తగినంత వ్యాయామం చేయడం, బరువు పెరగకుండా జాగ్రత్త పడటం వంటి వాటి వల్ల ప్రసవం తేలికగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరు బిడ్డలకు ఎలా జన్మనివ్వాలా అని టెన్షన్ పడటం మానేసి, తగిన కేర్ తీసుకుంటూ తల్లి కాబోయే అనుభూతిని ఆస్వాదించండి. - Sameera

  నాన్ వెజ్ ఎలా తినాలి?     అనారోగ్యానికి అసలు కారణం మాంసాహారం అంటారు కొందరు. నాన్ వెజ్ ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం అంటారు ఇంకొందరు. ఇలాంటివన్నీ విన్న తర్వాత మాంసాహారం మానెయ్యాలా అన్న సందేహం అందర్లోనూ తలెత్తుతోంది. అయితే పూర్తిగా మానెయ్యక్కర్లేదు అంటారు డాక్టర్స్. ఎంత తినాలి, ఎలా తినాలి అన్నది తెలుసుకుంటే నాన్ వెజ్ తో వచ్చే నష్టమేమీ ఉండదట. - మాంసంతో కూరగాయల్ని కలిపి వండటం వల్ల ఫైబర్ యాడ్ అవుతుంది. యాసిడిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది. కూరగాయల్లో ఉండే ఎంజైమ్స్ వల్ల మాంసం త్వరగా అరిగిపోతుంది కూడా. ఒకవేళ కలిపి వండకపోయినా మాంసాహారం తిన్న తర్వాత కూరగాయలతో చేసిన సలాడ్ కొద్దిగానైనా తీసుకునేలా అలవాటు చేయండి. - రెడ్ మీట్ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దానికే ప్రాముఖ్యతనివ్వండి. - మాంసం కొనేటప్పుడు దానిలో కొవ్వు ఎక్కువగా లేకుండా చూసుకోండి. వండేటప్పుడు కూడా నూనె తక్కువ వాడాలి. - వీలైనంత వరకూ ఎల్లో తీసేసి ఎగ్ వైట్ మాత్రమే తినాలి. చిన్న పిల్లలు తప్ప పెద్దవాళ్లు వారానికి రెండుసార్లకు మించి ఎగ్ తినకపోవడమే మేలు.     - చేపలు, కోడిగుడ్లను వేయించడం కంటే ఉడికించి తినడమే మేలు. ఫ్రై చేయడం వల్ల ప్రొటీన్స్ హరించుకుపోతాయి. అరుగుదల కూడా కష్టమవుతుంది. - మాంసం కంటే చేపలు చాలా ఉత్తమం. కొలెస్ట్రాల్ ప్రమాదం ఉండదు. అరుగుదల ఎక్కువ. కాల్షియం కూడా తగినంత అందుతుంది. - మాంసాహారం తిన్న తర్వాత కొంత సేపటివరకూ ఫ్రూట్స్ తినడకపోవడం మంచిది. లేదంటే ఫెర్మెంటేషన్ కారణంగా అజీర్తి, వికారం వంటి సమస్యలొస్తాయి. - థర్మోజెనిక్ ఫుడ్ అవ్వడం వల్ల మాంసాహారం తిన్న తర్వాత వేడి ఎకు్కవగా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి. - యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్లు మాత్రం మాంసం తినకూడదు. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు కూడా మాంసం బదులు చేపలు తినడం మంచిది. అందులో ఉండే మెగ్నీషియం, ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గిస్తాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే నాన్ వెజ్ తిన్నా ఏమీ కాదు. తినడం మానేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నాన్ వెజ్ అంటే భయపడకండి. మీరూ తినండి, మీవాళ్లకీ పెట్టండి. - Sameera  

ఆడవారిలో జ్ఞాపకశక్తి ఎక్కువా?   ఆడ, మగ... ఈ ఇద్దరిలో జ్ఞాపకశక్తి ఎక్కువ అని అడిగితే చెప్పడం కష్టం. ప్రకృతి ఇద్దరికీ సమానంగానే జ్ఞాపకశక్తిని అందించింది. కాకపోతే స్త్రీలకు ఉండే ప్రత్యేక బాధ్యతలని బట్టి, వారిలో జ్ఞాపకశక్తి అధికమేమో అన్న అనుమానం శాస్త్రవేత్తలని నిరంతరం పీడిస్తూనే ఉంది. అది నిజమో కాదో ఓ పరిశోధనతో తేలిపోయింది BRAIN FOG సాధారణంగా స్త్రీలు మెనోపాజ్ దశను దాటే సమయంలో అనేక శారీరిక, మానసిక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. హార్మోనులలో వచ్చే అసమతుల్యత వల్ల ఈ ఇబ్బందులు ఏర్పడతాయని చెబుతుంటారు. జ్ఞాపకశక్తిలో ఇబ్బందులు ఏర్పడటం కూడా ఈ సమస్యలలో ఒకటి. అయోమయం, మతిమరపు, దేని మీదా దృష్టి నిలపలేకపోవడం, ఆలోచనలో స్పష్టత లేకపోవడం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ తరహా పరిస్థితిని ‘Brain Fog’ అని పిలవడం కద్దు. మగవారితో పోలిస్తే స్త్రీలలోని రుతుక్రమం ఆగిపోయే మెనోపాజ్ దశలోనే కాదు, ఆ తరువాత కూడా వారిలో జ్ఞాపకశక్తిలో కొంత క్షీణత ఏర్పడుతుందని ఇప్పటికే తేలింది. పైగా మగవారితో పోలిస్తే స్త్రీలలో డిమెన్షియా అనే మతిమరపు సమస్య అవకాశం ఎక్కువ. నడివయసులోకి అడుగుపెట్టిన ఆడవారికి వ్యతిరేకంగా ఇన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ, మగవారితో పోలిస్తే వారి జ్ఞాపకశక్తి కాస్త ఎక్కువేనని తేల్చారు. The North American Menopause Society అనే సంస్థ నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. నేరం ఈస్ట్రోజన్దే ప్రయోగంలో భాగంగా పరిశోధకులు 45 నుంచి 55 వయసు మధ్య ఉన్న 212 మంది వ్యక్తులను ఎన్నుకొన్నారు. వీరికి రకరకాల పరీక్షలని నిర్వహించి  వీరిలో తాత్కాలిక, దీర్ఘకాలిక జ్ఞాపకశక్తి ఏ తీరున ఉందో గ్రహించే ప్రయత్నం చేశారు. మెనోపాజ్ దశను దాటిన స్త్రీలలో ఈస్ట్రోజన్ హార్మోను తగ్గుదల వారి జ్ఞాపకశక్తి మీద ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఒక విషయాన్ని నేర్చుకోవడానికీ, నేర్చుకున్న విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడానికీ వీరు ఇబ్బంది పడుతున్నట్లు గమనించారు. అయినా కూడా! ఆశ్చర్యకరంగా ఆడవారు ఏ వయసులో ఉన్నా, తన ఈడు మగవారితో పోలిస్తే వారిలో మేధాశక్తి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తేలింది. ఆఖరికి మెనోపాజ్ దాటినా కూడా మగవారికంటే స్త్రీలలోనే ఎక్కువ జ్ఞాపకశక్తి ఉన్నట్లు కనుగొన్నారు. అయితే జ్ఞాపకశక్తి ఎవరిలో అధికం అని తెలుసుకోవడం మాత్రమే తమ లక్ష్యం కాదంటున్నారు పరిశోధకులు. మెనోపాజ్ తర్వాత స్త్రీల జ్ఞాపకశక్తిలో అనుకోని సమస్యలు ఏర్పడే అవకాశం ఉందనీ... తమలో Brain Fogని సూచించే లక్షణాలు కనిపించినప్పుడు వారు తప్పకుండా వైద్యులని సంప్రదించాలనీ చెబుతున్నారు. అలాగే మగవారు కూడా, తమ రోజువారీ జీవితాన్ని అడ్డుకునే స్థాయిలో జ్ఞాపకశక్తిలో మార్పులు వస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల దగ్గరకి వెళ్లాలని సూచిస్తున్నారు. - నిర్జర.    

  UTI – A woman’s nightmare!     Being a woman, the chances of developing urinary tract infection is high, as the women have shorter urethra-the tube that transports urine from bladder to external environment. Since the anus and urethral opening are closely positioned the bacteria from the intestines especially Escherichia coli are likely to escape into the urethra, infecting bladder on its way to kidneys and finally causing bacteraemia. Urinary tract infection surfaces as: a burning sensation while urinating, fever with chills, frequent urge to urinate, pain or pressure over lower abdomen, cloudy or curdy white urine and fatigue. Presence of fever and chills indicates the spread of infection; it has gone systemic from local infection. In certain conditions like pregnancy, diabetes, multiple sclerosis and any condition weakening the immune system the risk of UTI is high! When you discover any of these symptoms head straight to a physician, a urine sample may be taken to confirm the presence of UTI-causing organisms. Treatment includes the use of antibiotics, it is prescribed to complete the full cycle of medication without discontinuation. Along with medical attention, it also requires personal care which includes: Drinking lots of water to flush off the intruders and use of hot packs for the lower abdomen pain. As a part of prevention it is advised to wipe from front to back after using restroom. - Koya Satyasri    

ఇలా జరుగుతోందా... హార్మోన్ టెస్ట్ చేయించాల్సిందే!     పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది మహిళలు ఆ విషయాన్ని గుర్తించరు. సమస్యలు తీవ్రమై, డాక్టర్ దగ్గరకు వెళ్లాక గానీ కళ్లు తెరవరు. అలా కాకుండా ముందే దాన్ని కనిపెడితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అసలు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందని ఎలా కనిపెట్టాలి? సింపుల్... ఈ లక్షణాలు కనిపిస్తే హార్మోన్లు రెడ్ సిగ్నల్ ఇస్తున్నట్టే. - ప్రతి నెలా పీరియడ్స్ ఒకే సమయానికి రావాలి. అలా కాకుండా అటూ ఇటూ అవుతున్నా, అసలు రాకపోతున్నా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్లోన్ల అసమతుల్యత ఏర్పడినట్టే.  దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే పీసీఓడీ సమస్య పరిగెత్తుకు వస్తుంది. - నిద్ర పట్టడం పోవడం కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ కి సూచనే. - మొటిమలు అందానికి సంబంధించిన సమస్య అనుకుంటారు చాలామంది. కానీ హార్మోన్ల అసమతుల్యతకీ మొటిమలకూ సంబంధం ఉందని తెలుసా? మొటిమలు వచ్చి ఎంతకీ తగ్గడం లేదంటే హార్మోన్ల సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ పని చేసి ఆ సమస్య ఏర్పడి ఉండొచ్చు. - హార్మోన్లు సరిగ్గా పని చేయకపోతే మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఆలోచనల్లో గందరగోళం, మతిమరుపు వంటి ఇబ్బందులు వస్తే ఓసారి చెకప్ చేయించుకోవడం మంచిది. - పీరియడ్స్ సమయంలో అంతకు ముందు లేని విధంగా కడుపునొప్పి, వికారం కనిపిస్తుంటే హార్మోన్ల పనితీరులో తేడా వచ్చినట్టే. - ఉన్నట్టుండి బరువు పెరిగిపోవడం, హఠాత్తుగా సన్నబడిపోవడం జరుగుతుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. - డిప్రెషన్, ఊరకూరకే మూడ్ మారిపోవడం వంటివి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అసమతుల్యత వల్ల జరగవచ్చు.  మెదడులో విడుదలయ్యే సెరెటోనిన్, డోపమైన్ లాంటి హార్మోన్లను ఈస్ట్రోజన్ ప్రభావితం చేయడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. - హార్మోనల్ ఇంబాలెన్స్ కారణంగా యోని పొడి బారడం, బ్రెస్ట్ టిష్యూస్ పలచబడటం లేదా మందంగా అవడం వంటివి కూడా జరుగుతాయి. సిస్టులు, గడ్డలు ఏర్పడతాయి.     వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఓసారి డాక్టర్ ని కలవండి. హార్మోన్ టెస్ట్ చేయించుకుని సమస్య ముదరకముందే దాన్నుంచి బైటపడండి.   - Sameera    

  నిద్రకు దూరం కావొద్దు...     కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువయ్యేకొద్దీ నిద్ర దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడుతోన్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తాజాగా ఓ పరిశోధన ద్వారా వెల్లడైంది. పనులన్నీ చక్కబెట్టుకుని ఎప్పటికో మంచం పైకి చేరడం, మళ్లీ ఉదయాన్నే లేచి ఇంట పనులు చేయాలనే ఒత్తిడితో రాత్రిళ్లు ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే నిద్ర లేచిపోవడం వల్ల చాలామంది మహిళలు కంటినిండా నిద్రపోవడం లేదట. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే నిద్రలేమి కారణంగా మరింత సమస్యను ఎదుర్కొంటున్నారట. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు డాక్టర్లు.   రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే అలసటతో పాటు నీరసం కూడా వచ్చేస్తుందట. దేనిపైనా దృష్టి నిలవదట. కండరాలు, నరాలు బలహీన పడతాయట. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట. కోపం పెరగడం, విసుగు ఎక్కువ కావడం జరుగుతుందట. ఇవన్నీ హద్దు దాటితే మానసిక రుగ్మతకి, శారీరక అనారోగ్యానికి దారి తీయడం గ్యారంటీ అంటున్నారు డాక్టర్స్. అంతేకాదు... నిద్ర లేమిని నిర్లక్ష్యం చేస్తే కొన్నాళ్లకు పూర్తిగా నిద్ర పట్టని పరిస్థితి కూడా ఏర్పడొచ్చట.   అందుకే నిద్రను అశ్రద్ధ చేయకండి. వీలైనంత త్వరగా పడక మీదకు చేరండి. బెడ్ రూమ్ ని మీకు నచ్చినట్టుగా అలంకరించుకుంటే మనసుకు హాయిగా ఉండి నిద్ర వస్తుంది. రాత్రిళ్లు టీ, కాఫీ లాంటివి తినొద్దు. మసాలా ఫుడ్ కూడా ముట్టుకోవద్దు. త్వరగా భోంచేసి, పడుకునేటప్పటికి అది అరిగిపోయేలా చూసుకోండి. టీవీ చూస్తూ పడుకోవద్దు. సస్పెన్స్ థ్రిల్లర్లు, హారర్ నవలలు చదవొద్దు. చక్కగా స్నానం చేసి, వేడి వేడి పాలు ఓ గ్లాసుడు తాగి నిద్రకు ఉపక్రమించండి. ఈ మంచి అలవాట్లు కంటి మీదకు కునుకుని ఆహ్వానిస్తాయి. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే ఓసారి డాక్టర్ ని సంప్రదించండి. అంతేకానీ నిద్రకు మాత్రం దూరంగా ఉండకండి. - Sameera  

UTI-A woman’s Nightmare!     Being a woman, the chances of developing urinary tract infection is high, as the women have shorter urethra-the tube that transports urine from bladder to external environment. Since the anus and urethral opening are closely positioned the bacteria from the intestines especially Escherichia coli are likely to escape into the urethra, infecting bladder on its way to kidneys and finally causing bacteraemia. Urinary tract infection surfaces as: a burning sensation while urinating, fever with chills, frequent urge to urinate, pain or pressure over lower abdomen, cloudy or curdy white urine and fatigue. Presence of fever and chills indicates the spread of infection; it has gone systemic from local infection. In certain conditions like pregnancy, diabetes, multiple sclerosis and any condition weakening the immune system the risk of UTI is high! When you discover any of these symptoms head straight to a physician, a urine sample may be taken to confirm the presence of UTI-causing organisms. Treatment includes the use of antibiotics, it is prescribed to complete the full cycle of medication without discontinuation. Along with medical attention, it also requires personal care which includes: Drinking lots of water to flush off the intruders and use of hot packs for the lower abdomen pain. As a part of prevention it is advised to wipe from front to back after using restroom. - Koya Satyasri

  కొబ్బరినూనె కొవ్వును కరిగిస్తుందా?     నువ్వుల నూనె, వేరుశనగ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ అంటూ రకరకాల నూనెలతో వంటలు చేస్తుంటాం. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వెంట పడుతున్నాం. అయితే మనకి ఎప్పట్నుంచో పరిచయం ఉన్న కొబ్బరి నూనెతో వంట చేయాలని మాత్రం అనుకోం. ఎందుకంటే అది మన దృష్టిలో తలకు రాసుకునేది. మన కురుల సిరులను పెంచి పోషించేది. కానీ నిజానికి కొబ్బరి నూనెతో వంట చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? కొబ్బరినూనెలో మాధ్యమిక ట్రైగ్లిజరైడ్ ల్యూరిక్ యాసిడ్ జీవక్రియను ప్రేరేపిస్తుంది. దానివల్ల శరీరంలో కొవ్వు పేరుకోదు. శక్తిగా రూపాంతరం చెందుతుంది. దీనిలో ఉండే లాంగ్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని పలు భాగాల్లో పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. దీనికి ఆకలిని నియంత్రించే శక్తి కూడా ఉంది. దానివల్ల ఉపయోగమేంటో తెలుసు కదా? తక్కువ తిండి... తక్కువ బరువు. అది మాత్రమే కాదు... ఇది ఇన్సులిన్ విడుదల సక్రమంగా జరిగేలా చేస్తుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే లారిక్, కాప్రిలిక్ యాసిడ్ల వంటివి రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. పలు ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. కొబ్బరినూనె హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్దీకరించి, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. ఇదీ కొబ్బరి నూనె కహానీ. కాబట్టి... కేరళవాళ్లు కొబ్బరి నూనెను వంటకాల్లో ఉపయోగిస్తారట అని చెప్పుకోవడం కాకుండా... మీరు కూడా ఇక మీదట ఆ పనే చేయండి. ఆరోగ్యంగా ఉండండి. - Sameera  

డిప్రెషన్- ఒకప్పుడు ఎవరూ వినని మాట. ఇప్పుడో! ఇది ఇంటింటి సమస్య. డిప్రెషన్‌ని తేలికగా తీసుకోకూడదనీ, సైకాలజిస్టుని సంప్రదిస్తే... ఉపయోగం ఉంటుందనీ ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. కానీ ఆడవారిలో ఈ సమస్య ఎక్కువని చెబుతున్నారు పరిశోధకులు. డిప్రెషన్ తీరుతెన్నుల గురించి తెలుసుకునేందుకు కొందరు పరిశోధకులు, ఏకంగా 90 దేశాలలోని 35 లక్షల మందిని పరిశీలించారు. మగవారితో పోలిస్తే, ఆడవారు డిప్రెషన్‌తో బాధపడే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని వీరి పరిశీలనలో తేలింది. 12 ఏళ్ల వయసు నుంచే ఆడవారిలో తీవ్రమైన డిప్రెషన్‌ సమస్యలు కనిపించడం ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా 12 - 13 ఏళ్లు వచ్చేసరికి ఆడ, మగ అన్న తేడాలు మొదలవుతాయి. అందుకనే ఈ దశను టీనేజి దశగా పేర్కొంటాము. ఆ వయసు నుంచి ప్రభావం చూపించే హార్మోనుల వల్లే స్త్రీలలో డిప్రెషన్‌ వచ్చే అవకాశం ఎక్కువ. పైగా టీనేజి ఆడపిల్లల చుట్టూ ఉండే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సమాజం వారిపట్ల చూపే వివక్ష, విధించే నిబంధనలు... ఆడపిల్లల మనసు మీద ప్రభావం చూపుతాయి. వీటన్నింటికి తోడు టీనేజి వయసులోని ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు జరిగే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్యలన్నింటినీ పంటిబిగువున భరిస్తూ, ఆడపిల్లలు డిప్రెషన్‌తో క్రుంగిపోతుంటారు. ఆడపిల్లలు వయసు పెరిగే కొద్దీ శారీరికంగానూ, మానసికంగానూ వారు ఎదుర్కొనే సమస్యలూ పెరుగుతుంటాయి. దాంతో ఏదో ఒక దశలో వారు డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు. ఈ పరిశోధనలో తేలిన మరో విచిత్రం.... మగవారితో సమానంగా పనిచేసే చోట స్త్రీలు మరింత డిప్రెషన్‌కు లోనుకావడం! మగవారితో దీటుగా నిలిచే క్రమంలో, తమలో ఉండే ఆందోళనలను అణచిపెట్టే ప్రయత్నం జరుగుతుందనీ... అదే చివరికి తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు. ఏతావాతా పరిశోధకులు చెప్పేదేమిటంటే- మనసుని తీరని దిగులు వేధిస్తూ, రోజువారీ జీవితం మీద ప్రభావితం చేస్తుంటే... అది డిప్రెషన్‌ లక్షణమై ఉంటుందని భావించాలి. అలాంటి సందర్భంలో వైద్యుని సంప్రదించేందుకు మొహమాటపడకూడదు. అంతేకాదు! తమ ఇంట్లో టీనేజి పిల్లలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే... వారి మానసిక స్థితిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డిప్రెషన్‌ను ఆరంభదశలోనే గుర్తిస్తే కౌన్సిలింగ్‌తోనూ, మందులతోనూ డిప్రెషన్‌ను శుభ్రంగా తగ్గించవచ్చు. లేకపోతే అది మరిన్ని తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. - నిర్జర.

  నైట్ డ్యూటీ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?     రోజులు మారిపోయాయి. మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రిపూట కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధికారత పరంగా ఇది సంతోషకరమే అయినా ఆరోగ్యపరంగా మాత్రం ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఆడవాళ్లు నైట్ డ్యూటీస్ చేయకపోవడమే మంచిది అంటున్నారు. పగలు ఉద్యోగాలు చేసేవారికంటే రాత్రిళ్లు ఉద్యోగాలు చేసే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలడమే దానికి కారణం. మామూలు వెలుతురులో కాకుండా లైట్ల కాంతిలో పని చేస్తే మెదడులో విడుదలయ్యే మెలటోనిన్ విడుదల కాదట. ఈ హార్మోన్... రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపించే ఈస్ట్రోజన్ మోతాదు పెరగకుండా చూసుకుంటుందట. అయితే మెలటోనిన్ మధ్యరాత్రిలో బాగా ఉత్పత్తి అవుతుందట. అది కూడా చీకటిగా ఉన్నప్పుడు. అలాంటి సమయంలో కృత్రిమ వెలుగులో పని చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోతుందట. తద్వారా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందన్నమాట.     అది మాత్రమే కాదు... నైట్ డ్యూటీలు చేసే మహిళలకు పుట్టే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా ఉండటం లేదని విదేశాల్లో జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలిందట. దానితో పాటు పేగుల సమస్యలు, జీర్ణక్రియ దెబ్బ తినడం వంటి మరికొన్ని సమస్యలు కూడా వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ... ఇంతవరకూ జరిపిన పరిశోధనల ఫలితాల దృష్ట్యా మహిళలు రాత్రిపూట ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదటున్నారు నిపుణులు. - Sameera

  థైరాయిడ్ సమస్యను అధిగమించాలంటే...     ఈమధ్య కాలంలో పది మందితో మాట్లాడితో వాళ్లలో ఒకరైనా థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నామని చెప్తున్నారు. అంతగా సమస్య పెరిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. ఇక మహిళలనైతే ఇది వెంటాడి వేటాడుతోంది. ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిల్లోనే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తాజాగా ఓ సర్వేలో తేలింది. అందుకే మహిళలంతా థైరాయిడ్ గురించి వీలైనంత స్పష్టంగా తెలుసుకోవడం చాలా మంచిది. రక్తంలో థైరాక్సిన్ హార్మోన్ శాతం తక్కువగా ఉండటం వల్లే థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య వచ్చిందనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. కాస్త పనికే అలసిపోతుంటారు. ఎంతసేపు పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఉన్నట్టుండి బరువు పెరగడమో లేక తగ్గిపోవడమో మొదలవుతుంది. విసుగు, కోపం ఎక్కువవుతుంటాయి. గుండె దడ, టెన్షన్ పెరుగుతాయి. కొందరిలో రుతుస్రావంలో కూడా మార్పులు కనిపిస్తాయి. రుతుస్రావం అధికంగా అవ్వడం, నెలలో ఒకసారి కంటే ఎక్కువసార్లు రావడం జరగవచ్చు. లేదంటే రావాల్సిన సమయానికి రాకపోవడం, వచ్చినా సరిగ్గా అవ్వకపోవడం జరగవచ్చు. జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. కండరాల నొప్పులు కూడా రావొచ్చు. కొందరిలో గొంతు కూడా మారుతుంది. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. థైరాయిడ్ సమస్య ఏర్పడిందనగానే కంగారు పడిపోవద్దు. ముందు మీకు వచ్చింది ఏ రకమైన థైరాయిడో తెలుసుకోండి. హైపో థైరాయిడిజమ్ అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోవడం వల్ల ఏర్పడుతుంది. హైపర్ థైరాయిడ్ గ్రంథి అయితే చేయాల్సిన దానికన్నా ఎక్కువగా చేయడం వల్ల వస్తుంది. మీకు ఏర్పడింది ఏ రకమైన సమస్యో తెలుసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ ని స్పష్టంగా అడగండి. థైరాయిడ్ కి డాక్టర్ సూచించిన మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం మంచి పరిష్కారం. మాంసకృత్తులు, విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. బి విటమిన్ ఎక్కువగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, రాగి జావ లాంటివి మేలు చేస్తాయి. ఇనుము ఎక్కువగా ఉండే గుడ్లు, ఆకు కూరలు, ఖర్జూరం వంటివి తీసుకోవడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. సోయా గింజలు, పాలకూర, వెల్లుల్లి, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండండి. ఉప్పు విషయంలో అన్నిటికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలి. అలాగే వ్యాయామం కూడా తప్పనిసరి. మందులు వాడుతూ, పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే థైరాయిడ్ సమస్యను చక్కగా అధిగమించవచ్చు. -Sameera

  ఆడవారికి అలెర్జీల శాపం   బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి వరం.... కానీ ఆ వరంతో పాటుగా ఆమె శరీరంలో ఎన్నో శాపాలనూ అనుభవించాల్సి ఉంటుంది. రుతుక్రమంలో సమస్యలు, గర్భధారణలో ఇబ్బందులు, మెనోపాజ్ బాధలూ... ఈ వ్యధలన్నీ ఒక స్త్రీకే అర్ధమవుతాయి. ఈ కష్టాలకి తోడుగా మరో ఇబ్బందిని కూడా కనుగొన్నారు శాస్త్రవేత్తలు.   స్త్రీలో సంతానోత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్ హార్మోను వల్ల ఆమెలో అలెర్జీ సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. పూల నుంచి వచ్చే పుప్పొడి వారిలో త్వరగా అలెర్జీ సమస్యలను కలిగిస్తాయట. కొన్ని రకాల ఆహారపదార్థాలు సరిపడకపోవడం (ఫుడ్ అలెర్జీ), ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులూ త్వరగా తలెత్తుతాయట.   పదేళ్ల వయసు వరకూ మగపిల్లలు త్వరగా అలెర్జీ బారిన పడతారనీ, ఆ తరువాత కాలంలో ఆడవారు ఈ సమస్యను త్వరగా ఎదుర్కొంటారనీ తేల్చారు. వారి శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పులే ఇందుకు కారణమని గమనించారు. ఆడవారిలోని ఈస్ట్రోజన్ హార్మోను వల్ల శరీరంలోని కణజాలం త్వరగా వాపు (inflammation) చెందుతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు ఈ inflammation అవసరమే అయినా, ఒకో సందర్భంలో ఇది అలెర్జీకి దారితీస్తుంది. ఇదే సమయంలో... మగవారిలో ఈస్ట్రోజన్ బదులు టెస్టోస్టెరోన్ అనే హార్మోను ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోను సూక్ష్మజీవులను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అసలే స్త్రీ శరీరంలోని హార్మోనుల అలెర్జీని ప్రేరేపిస్తాయి అనుకుంటే.... వాటికి ఆధునిక చికిత్సలు కూడా తోడవుతున్నాయి. గర్భధారణం కోసమో, మెనోపాజ్ సమస్యల నుంచి తేరుకునేందుకో ఈ మధ్యకాలంలో హార్మోను థెరపీని అనుసరించే స్త్రీల సంఖ్య పెరిగిపోతోంది. ఇక గర్భనిరోధక మాత్రలు కూడా హార్మోనులను ప్రభావితం చేసే విషయం తెలిసిందే! ఇవన్నీ కలిసి స్త్రీలలో అలెర్జీ ప్రమాదాన్ని గట్టు దాటిస్తున్నాయి.   ఈ పరిశోధన కేవలం కొత్త విషయాన్ని కనుగొనేందుకే కాదు... అలెర్జీల బారి నుంచి తప్పించుకునేందుకు కూడా ఉపయోగపడనుంది. ఆస్తమా లేదా అలెర్జీలతో బాధపడే ఆడవారు ఇకమీదట మందులు వాడేటప్పుడు, హార్మోను చికిత్సలు తీసుకునేటప్పుడు... వైద్యునితో తమ సమస్య గురించి చెప్పుకోవాలని సూచిస్తున్నారు. కేవలం ఆస్తమానే కాదు! ఎంతకీ వీడని తలనొప్పులు, చర్మం మీద దద్దుర్లు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా అలెర్జీ కారణంగానే వచ్చే అవకాశం ఉందనీ... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా వైద్యునితో చర్చించాలని చెబుతున్నారు. హార్మోన్లకీ, ఆలెర్జీకీ ఉన్న సంబంధం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మున్ముందు ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. వాటి వల్ల అలెర్జీలని ఎదుర్కొనే చికిత్సలలోనూ, హార్మోను చికిత్సలలోనూ సమూలమైన మార్పులు రావచ్చు. - నిర్జర.    

According to researches done in the recent times, people who run live longer than those who don’t. And this should be that one big reason for you to put on your running shoes and head straight to run for a long and healthy life. There is no question that the fitter you are and the more exercise you do, the longer you live and the better your quality of life. The human body gets most of its vitamin D from sun exposure, but since people spend all of their time indoors, the number of them suffering from vitamin D deficiency is on a steady rise. Taking your run outside can help boost your levels to ward off depression, prevent type 2 diabetes, and strengthen your bones. To run, all you need is a good pair of shoes. It couldn't be simpler. And everyone knows how to run. You may not have perfect form yet, but you already know how to place one foot in front of the other and settle into a comfortable pace. Though it is simple sans any fancy equipment like the ones in the gym, it gives maximum health benefits. Running also gives your ticker a world-class workout. When your legs hit their stride they squeeze blood toward your heart, which in turn forces it to pump the blood right back. The faster you run, the harder your heart works and the stronger it gets. Joggers also have a leg up against heart disease, stroke, and diabetes, and running has been shown to lower blood pressure, raise good cholesterol, and boost immunity to colds and other viruses. Your time on the treadmill can even prevent vision loss, it seems. Stress can actually cause a number of health and mood problems. It can also diminish appetite and sleep quality. When you run, you force your body to exert excess energy and hormones. Running also helps to reduce your chances of developing tension headaches. In fact, there are few things in the world that can better or more rapidly treat depression than exercise such as running. Whether you’re new to the running scene or already a running pro, setting yourself a challenge is a fantastic way to make sure you’re constantly making progress. Most weight-loss and fitness programmes fall on stony ground because clearly defined goals were not put in place. Setting yourself a long-term target of running a half or even full marathon can be the ideal stimulus to keep you on track - Divya

  Signs that you are B12 deficient     Vitamin B12 performs several important functions in the body, deficiency of which can develop a number of heath issues. Vitamin B12 deficiency is defined by low levels of stored B12 in the body that can result in anemia, a lower-than-normal number of red blood cells. Your metabolism wouldn't run smoothly without it. B12 is majorly found in animal products like eggs, meat, shellfish, and dairy. Up to 15% of people don't get enough B12, and they're more likely to be vegetarians. Lets now look at the symptoms of B12 deficiency. Some of the earliest signs of a deficiency include feeling dragged, confused, weak and dizziness. Since they can be attributed to so many other possible triggers, most people don't think to be tested. If these symptoms hit and stick around for weeks, it's best to consult your doctor and rule out other causes say experts. Fatigue is yet another major sign of B12 deficiency. That's because your body relies on the vitamin to make red blood cells, which carry oxygen to your organs. And without enough oxygen in your cells, you'll feel tired no matter how long you sleep.   Mood swings is another major symptom of  lack of B12, as it wreaks havoc on your mood, possibly leading to depression or anxiety. Doctors say it may have something to do with the fact that B12 is involved in the synthesis of brain chemicals, such as serotonin and dopamine, that help regulate mood. Also, B12 plays an important role in white blood cell production, and white blood cells are essential for proper immune system functioning. Not only can a lack of B12 lower your immunity, some immune system disorders can increase your likelihood of becoming deficient. Grave's disease, for example, an autoimmune condition of the thyroid causing hyperthyroidism, is a risk factor for developing pernicious anemia, which in turn leads to B12 deficiency. - Divya