చురుకైన మెదడుకు కావలసిన పోషకాలు Nutritious food for Sharp mind                      మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీర తత్త్వం ఉంటుంది. అందుకే మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. తినే ఆహారానికి సరిపడా వ్యాయామం ఉంటే ఎటువంటి రోగాలు దరికి రాకుండా ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే మెదడు చురుగ్గా పని చేస్తుంది. ఏకకాలంలో అనేక పనులను చేయగల సామర్ధ్యం కలిగింది. ఆధునిక కాలంలో మానవుడు సృష్టించిన కంప్యూటర్ కన్నా మన మెదడు ఎన్నో రెట్లు సామార్తవంత మైనది. దాని పని తీరు కేవలం మనం తినే ఆహారంలోని పోషకాల పై ఆధారపడి ఉంటుంది. అందుకే మనం తినే ఆహారంలో మెదడుకు కావాల్సిన పోషకాలు ఉండేలా ఆహారాన్ని తినాలి. మెదడుకు కావలసిన పోషకాలు పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు కొన్ని...   ఆల్చిప్పలు ఏ వయసులో ఉన్న వారికైనా ఆల్చిప్పలు మంచి పోషకాలు ఉన్న ఆహారం . ఆల్చిప్పల్లో ఉండే ఐరన్, మరియు జింక్ మెదడును చురుగ్గా పని చేయడంలో సహకరిస్తుంది. . తద్వారా కాన్సంట్రేషన్ పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది     ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలు ఆరోగ్యానికి మంచివని మనకు తెలిసిందే. అందునా అధిక బరువుతో బాధపడే వారు వీటిని తినడం ఉత్తమం. మెదడు విషయానికి వస్తే ఈ ఆహారపు ధాన్యాల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యం, ఓట్ మీల్, మరియు బార్లీలో మెదడుకు కావలసిన ఎన్నోపోషకాలు ఉన్నాయి. ఆహారపు ధాన్యాల్లో ఉండే విటమిన్ B6, థయామిన్, రక్తప్రసరణను మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.  టీ టీ తాగడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుందని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. ఫ్రెష్ గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ మెదడుకి చాలా మంచిది. టీలో ఉండే క్యాటెకిన్స్ మెదడును షార్ప్ గా,హెల్దీగా ఉంచడంలో తోడ్పడతాయి. కాబట్టి ప్రతి ఉదయం టీ తాగడం వల్ల రోజంతా హుషారుగా ఉండొచ్చు. గ్రుడ్లు మానవునిలో సహజంగా జరిగే మార్పులు ఉదాహరణకి, వయసులో మార్పు, ముఖ్యంగా వృద్ధాప్యాన్ని తగ్గించే గుణం గుడ్లలో ఉందని ప్రూవ్ అయింది. గుడ్డులో ఉండే విటమిన్ B12, లెసిథిన్ వయసును తగ్గించడంతో పాటు, అల్జేమేర్ అనే డిసీజ్ నుండి కూడా దూరంగా ఉంచుతుంది. మెదడుపై అధిక ప్రభావాన్ని చూపే గుడ్డు మంచి పోషక విలువలున్న ఆహారమే కాదు, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుందన్న మాట.   కూరలు స్పైసీ ఫుడ్ ని ఇష్టపడే వారికి ఇది నిజంగా శుభవార్తే అని చెప్పవచ్చు. కూరలు వండేటప్పుడు వాడే పౌడర్ లలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పసుపులో ఉండే రోగనిరోధక శక్తి, మెదడుకు శక్తినిస్తాయి. అందుకే స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడే వారు సాధారణంగా చలాకీగా ఉంటారు.   బెర్రీస్ బ్లూ బెర్రీస్ జ్ఞాపక శక్తిని పెంపొందించడమే కాక మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. అన్ని రకాల బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్ లలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మెదడుకు కావలసిన అన్ని పోషకాలు వీటిలో పుష్కలంగా ఉన్న ఈ బెర్రీస్ జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో తోడ్పడతాయి. నట్స్ అండ్ సీడ్స్ సాయంత్రం పూట స్నాక్స్ తినే అలవాటు ఉన్నవారు , స్నాక్స్ కి బదులు వేరుశనగ, జీడిపప్పు, బాదంపప్పు , పీకన్స్, వాల్ నట్స్ , సన్ ఫ్లవర్ సీడ్స్ మరియు పంప్ కిన్ ని తినడం అలవాటు చేసుకోవడం మంచిది. వీటిలో ఉండే పోషకాలు ఒమెగా- 6, ఫ్యాటీ ఆసిడ్స్, ఫోలేట్, విటమిన్ e, మరియు B6, థయామిన్ మరియు మెగ్నీషియం మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుంది. పైన సూచించిన ఆహారపదార్థాలు మీ రోజువారి ఆహారంలో భాగమయ్యేలా జాగ్రత్త తీసుకోండి. చురుకుగా, ఆరోగ్యంగా జీవించండి.  

                          ఆరోగ్యమే మనిషి ఎదుగుదలను నిర్దేశిస్తుంది. కెరీర్ లో కానీ, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత విషయంలో గాని ఆరోగ్యంగా ఉండే వారి ఆలోచనా విధానంలోను, అనారోగ్యంగా ఉన్న వారి ఆలోచనా విదానాల్లోను చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి కాన్ఫిడెంట్ గా ఉంటాడు. క్లిష్ట సమయాల్లో కంగారు పడకుండా సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు, ఆరోగ్యంగా ఉన్నవారికి అన్ని సిరులు దక్కినట్టేనని దానర్థం . బాధ్యతల నడుమ ఒత్తిడి వల్లనో , టైం లేకపోవడం వల్లనో, ఒక్కోసారి మనం ఆహారం గురించి అసలు పట్టించుకోం. ఆ చిన్నపాటి నిర్లక్ష్యం మనల్ని ఎన్నో రకాల వ్యాధులకు గురి చేస్తుంది. అందులో మొదటిది...  ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా అనేది చాలా ప్రభావాన్ని చూపుతుంది. ఇది 6 నెలల పిల్లల నుండి వృద్ధుల వరకు కలగవచ్చు.ఈ ఐరన్ డెఫీషియన్సీ ఎనీమియా వల్ల త్వరగా అలసిపోవడం, ఏ పని చేయలేకపోవడం, చీటికి మాటికీ చిరాకు పడటం దానికి తోడు మనిషిలో సత్తువ తగ్గి ఉత్సాహం లేకుండా పోతుంది. ఫలితంగా దేనిపై కాన్సంట్రేట్ చేయలేరు.  అధిక బరువు (ఒబెసిటీ ) ఒబెసిటీ ఇప్పుడు చాలా మందిలో పెద్ద సమస్యగా తయారయింది. ఇది ప్రత్యేకంగా పెద్దల్లోనే కాదు చిన్నపిల్లల్లోను కనిపిస్తుంది, దీనిని మనం ప్రారంభదశలోనే కంట్రోల్ లో ఉంచుకోకపోతే హార్ట్ డిసీజ్, హైపర్ టెన్షన్, మరియు క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది.  దంత క్షయం దంత క్షయానికి దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం ఒక కారణమైతే, కాల్షియం లేకపోవడం కూడా మరో కారణం. దంత క్షయం తో మొదలై అనేక రకాల దంతాలకు సంబంధించిన ఇబ్బందులు కలుగుతాయి.  పొట్టలో ఇబ్బంది మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ తగ్గితే కడుపులోని అవయవాల పై ప్రభావం పడుతుంది. ఫలితంగా మలబద్ధకం, అపెండిసైటిస్, అజీర్తి మరియు శ్వాసకోశవ్యాధులకు దారి తీస్తుంది.  కొలెస్ట్రాల్ ఈ రోజుల్లో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది ఎక్కువగా మనం తీసుకునే మాంసాహారం వల్ల మన శరీరంలో పేరుకుపోయే కొవ్వు కారణంగా వస్తుంది.  హై బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ సాధారణంగా శరీరంలో ఉప్పు శాతం పెరిగిపోయినా, లేదా మనం తీసుకునే ఆహారంలో కాల్షియం శాతం తగ్గినా ఎక్కువగా కనిపిస్తుంది. దీనిని అదుపులో ఉంచుకోకపోతే హైపర్ టెన్షన్ కి దారి తీస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎప్పుడో ఒకసారి ఏవో వ్యాధులకు గురవుతూనే ఉంటాం, చికిత్సలు తీసుకుంటూనే ఉంటాం., కానీ పైన చెప్పిన ఆరోగ్య సమస్యలు మాత్రం కేవలం మనం తీసుకునే ఆహారంలో లోపాల వల్లే కలుగుతాయి. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో అన్ని రకాల పోషకాలు సమపాళ్ళలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.  ఆరోగ్య పరిరక్షణకు మన ఆహారంలో తప్పనిసరిగా ఉండాల్సినవి: : పాల ఉత్పత్తులు : పాలు, చీజ్, పెరుగు, మరియు ఐస్ క్రీమ్స్ మాంసకృత్తులు : మాంసం, చేపలు, గ్రుడ్లు. గ్రేన్స్ : బ్రెడ్, పాస్తా , ధాన్యం. పండ్లు, కూరగాయలు : జ్యూస్ రూపంలోగాని, వండిన లేదా అదే యధావిధిగా గాని.   తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాల్సినవి: : మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో 20% పాల ఉత్పత్తులు తీసుకుని, తక్కిన 80% ఆహారంలో కూరగాయలు , పండ్లు, మాంసకృత్తులు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఫైబర్ కూరగాయల్లోను, పండ్లలోను పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ మూడుపూటలా అన్నం తినాలి. చాలా మంది టైం లేదనో, ఆలస్యంగా లేచామనో, ఏవేవో సాకులతో బ్రేక్ ఫాస్ట్ తినకుండా ఉండిపోతారు. కానీ అలా చేయడం వల్ల ఆలోచనా శక్తి మందగించే ప్రమాదముంది, దానికి తోడు శరీర భాగాలకు సరిపడా శక్తి అందక ఎనీమియాకి దారి తీస్తుంది. అందుకని బ్రేక్ ఫాస్ట్ కంపల్సరిగా తినాలి. మన భోజనంలో కంపల్సరిగా ఏదో రూపంలో, పాలు, కూరగాయలు, పండ్లు ఉండేలా జాగ్రత్తపడాలి. కూరగాయలను, పండ్లను సలాడ్ రూపంలో నైనా సరే కనీసం రెండు సార్లు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో ఈ పద్ధతులను పాటించడం కాస్త కష్టమైన పనే. చిరుతిళ్ళకు అలవాటు పడి సరిగ్గా భోజనం దగ్గరే పేచీ పడతారు. వారికి చిరుతిళ్ళ విషయంలో ఫ్రూట్ సలాడ్ కానీ స్ప్రౌట్స్ కానీ బ్రెడ్, జాం లాంటివి అలవాటు చేయండి. ముఖ్యంగా భోజనానికి రెండు గంటలు ముందుగా ఎటువంటి స్నాక్స్ పెట్టొద్దు. మనం తీసుకునే ఆహారంలో వీలైనంతగా కొవ్వు పదార్థాలు లేకుండా చూసుకోవాలి. . కొవ్వు పదార్థాలను తగ్గించడం అంటే పాల ఉత్పత్తులను, మాంస కృత్తులను కాస్త తక్కువ మోతాదులో తీసుకోవడం. రోజులో రెండు పూటలకు మించి తినకూడదు. మాంసం వండే ముందు స్కిన్ లెస్ ఉండేలా చూసుకోవడం మంచిది, తద్వారా కొవ్వును కాస్త అవాయిడ్ చేసుకోవచ్చు. రెండు పూటలకు మించి పాలను తాగరాదు. అలాగని కొవ్వు పేరుకుపోతుందన్న భయంతో పూర్తిగా మాంసకృత్తులకు,పాల పదార్థాలకు దూరంగా ఉండకూడదు. సరియైన మోతాదులో తీసుకుంటే శ్రేయస్కరం. ఎనీమియా రాకుండా జాగ్రత్తలు శరీరంలో ఐరన్ కొరత ఉన్నప్పుడే ఎనీమియా ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలో తప్పకుండా ఐరన్ ఉండేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలి. దానికన్నా ముందు ఏ ఆహారంలో ఐరన్ పాళ్ళు ఎక్కువగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. రెడ్ మీట్స్, చేపలు, పౌల్ట్రి మంచివి. ఆహారంలో రోజుకి ఒకసారైనా ఇవి తీసుకుంటే శరీరానికి కావలసిన ఐరన్ దొరికినట్టే. అందునా లివర్ ఐరన్ పుష్టిగా ఉన్న ఆహారం. కాకపొతే కొలెస్ట్రాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. శాకాహారులు ఆకుకూరలు విరివిగా తినడం, కందగడ్డ, పీనట్ బటర్, ఎండు ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు ఆహారంలో తప్పకుండా ఉండేలా జాగ్రత్త పడాలి.   వీలైనంత ఉప్పు వాడకాన్ని తగ్గించాలి . సాధారణంగా హైపర్ టెన్షన్ ఉన్న వారు తప్ప తక్కిన వారు ఉప్పును నిర్భయంగా వాడవచ్చు. కానీ అవకాశం ఉన్నప్పుడల్లా కాస్త అవాయిడ్ చేయడం ఆరోగ్యానికి మంచిది. చక్కర మోతాదును తగ్గించడం మంచిది. తీపి తినడం ఆరోగ్యానికి హానికరమేమీ కాదు. కాకపోతే మనలో చాలా మంది తీపి వస్తువులను అస్తమానం తింటూనే ఉంటారు. అది మంచిది కాదు ఎందుకంటే అస్తమానం తీపి పదార్థాలను తినడం వల్ల కొరోనరీ ఆర్టరీ డిసీజ్ లేదా క్యాన్సర్ కి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. వ్యాయామానికి ముందు తీసుకోవాల్సిన ఆహారం వ్యాయామానికి ముందు మాంసాహారం మంచిది కాదు, రెండు మూడు గంటలకు ముందుగా కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. ఈ కార్బోహైడ్రేట్లు బ్రెడ్, నూడుల్స్, ఆలుగడ్డ, మరియు రైస్ లో ఉంటాయి. ఆహారం తీసుకున్న రెండు గంటల తర్వాత వ్యాయామం చేయడం మంచిది. ప్రతి 20 నుండి 30 నిమిషాలకొకసారి నీళ్ళు తాగుతుండటం ఉత్తమం.     

  డైట్ కేర్ ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక వేసుకోవాలి. మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్ గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి. 1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి. 2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది. 3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం. 4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది. 5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి. 6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది. 7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి. 8. ఆహారం ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోవడం కంటే కొంచెం మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిది. 9. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు తగిన వ్యాయామం చేయాలి. 10. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే దాన్ని మించిన ఆరోగ్య రహస్యం ఇంకొకటి లేదు. ఈమాత్రం కనీస సూత్రాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం.

  లెంటిల్ డిష్ రెసిపీస్ -- బెస్ట్ డైట్ లెంటిల్ డిష్ రెసిపీస్ బెస్ట్ డైట్ అని చాలామందికి తెలీదు. నాన్ వెజ్ తినేవాళ్ళు సాధారణంగా ఇతర కూరగాయలు, లెంటిల్ డిష్ రెసిపీస్ (పప్పు ధాన్యాలు) ఇష్టపడరు. పైగా "అబ్బే వాటిల్లో ఏముంటుంది, గడ్డి?" అని చులకన చేసి మాట్లాడతారు. నిజానికి మాంసాహారం కంటే కూరగాయలు, లెంటిల్ డిష్ రెసిపీస్ ఉత్తమం అని చెప్తున్నారు పోషకాహార నిపుణులు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు ఏదైనా కావచ్చు... లెంటిల్ డిష్ రెసిపీస్ ప్రొటీన్లు, ఫైబర్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. కనుక ప్రతిరోజు లెంటిల్స్ ను ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. భోజనంలో రోజూ ఒక కప్పు పప్పు ఉండేట్టు చూసుకోండి. పప్పుల్ని ఉడకబెట్టి, పకోడీలుగా చేసుకుని, కూరగా వండుకుని, లేదా కిచిడీ చేసుకుని తినవచ్చు. లెంటిల్స్ వేయించడం కంటే ఉడకబెట్టి తినడం మంచిది. అలా కూడా కాకుండా నీళ్ళల్లో నానబెట్టి మొలకలు వచ్చాక తింటే ఇంకా ఉత్తమం. అందువల్ల పోషకవిలువలు నశించవు. వీటిల్లో సమృద్ధిగా ఉండే మాంసకృత్తులు, కాల్షియమ్, ఫైబర్ శరీరానికి చక్కగా అందుతాయి. పెసలు, శనగలు లాంటి పప్పు ధాన్యాల మొలకల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. తేలికగా అరుగుతాయి. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన కీరా, కారెట్, టొమాటో ముక్కలు, అరటి ముక్కలు, వేసి, చాట్ మసాలా చల్లండి. కొద్దిగా నిమ్మరసం పిండి చూడండి. ఆహా ఏమి రుచి అనుకోక మానరు. తీపిదనం ఇష్టపడేవారు ఇందులో దానిమ్మ గింజలు, కిస్ మిస్ ముక్కలు, అంజీరా ముక్కలు వేసుకోవచ్చు. ఇది మరింత పుష్టికరం.  

How to Lose Belly Fat Tips However, even a thin layer of loose belly fat can be hard to shift. If you are looking for advice on how to lose stomach fat then following these tips and tricks. * Water Indeed you might think that water is in itself extremely important in our life. However it seems that professionals just can emphasize enough its miraculous effect in flushing out the excessive fat from our organism. The stomach is one of the areas that is more prone to water-retention, therefore it might leave you with the necessary hydration when neglecting the normal water intake. As one of the most important diuretic ingredients it will have the ability to eliminate the excessive fluids as well as toxins from the body. The daily intake should be at least 8 glasses or more, in order to secure the proper functioning of the main body and digestive systems. * Apple Cider Vinegar It might sound funny that a similar common ingredient is able to help us reduce belly fat. However it seems that more and more professionals decipher the miraculous effect of this element in nutrition. Therefore besides the other disorders treated with apple cider include the belly fat loss also in the prominent list. Due to the magical digestive abilities vinegar will be able to both tame our appetite as well as boost our metabolism. Whether you use it in various dishes or create a simple drink of 1 large glass of water and 2 tsp of apple cider vinegar and you drink it on a daily basis for at least a few weeks you'll notice the fabulous effect of this ingredient in your healthy diet. Moreover it is also extremely useful to drink this mixture before every meal in order to facilitate the organism the best digestion.