ఇలా చేస్తే రెండుగంటల్లో మీ జుట్టు నల్లబడిపోతుంది   తెల్ల జుట్టు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఉన్న సమస్యే! Genetic factorsతో పాటు, పొల్యూషన్‌, ఒత్తిడి, పోషకాహార లోపం... ఇలా ఏదో ఒక కారణంతో మనకి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తోంది. ఓసారి తెల్ల జుట్టు వచ్చాక దానికి రంగు వేయడం కోసం రకరకాల హెయిర్‌ డైస్‌ ఉపయోగిస్తుంటాం. ఈ హెయిర్ డైస్‌లో PPD, అమోనియా, peroxide లాంటి నానారకాల కెమికల్స్ ఉంటాయి. ఇవి చాలారకాల side effectsకి దారి తీస్తుంటాయి. అలాగని జుట్టుని వదిలేద్దామా అంటే నలుగురిలో తిరగాలంటే కష్టంగా ఉంటుంది. మరి నేచురల్‌గా తెల్లజుట్టుని నల్లగా మార్చుకునే చిట్కా ఉందా అంటే లేకేం! తెల్లని జుట్టుని నల్లగా మార్చేయడంతో పాటు... జుట్టు మృదువుగా, ఆరోగ్యంగా మార్చేసే ఉపాయం ఒకటి ఉంది. దీనికోసం మనకి మూడంటే మూడు వస్తువులు ఉంటే చాలు. అవి కూడా మనకి తేలికగా అందుబాటులో ఉండేవే! ఒకటి- హెన్నా పొడి. దీని కోసం ఏ పొడి పడితే ఆ పొడిని తీసుకోకండి. మార్కెట్లో దొరికే చాలా హెన్నా పొడులలో కూడా ఇప్పుడు PPDలాంటి కెమికల్స్‌ని కలుపుతున్నారు. అందుకని స్వచ్ఛమైన గోరింటాకు పొడినే తీసుకోండి. ఇక రెండోంది- ఆమ్లా అంటే ఉసిరి పొడి. ఇది ఏ ఆయుర్వేదం షాపులో అయినా దొరుకుతుంది. ఇక మూడోది- రెండు టీస్పూన్ల నల్లటి టీపొడి. ఈ మూడింటినీ ఉపయోగించి నేచురల్ హెయిర్‌ డై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం! ముందుగా టీపొడిని ఓ చిన్న గ్లాసుడు నీటిలో మరిగించండి. మంచి డికాషన్‌ తయారయ్యేదాకా ఇలా మరిగించండి. టీ డికాషన్‌ సహజసిద్ధమైన నల్లటి రంగుని ఇస్తుంది. పైగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ జుట్టుని ఆరోగ్యంగా, మృదువుగా ఉంచుతాయి. ఈ డికాషన్‌ చల్లారిన తర్వాత ఒక గిన్నెలో నాలుగు చెంచాల హెన్నా పొడినీ, రెండు చెంచాల ఆమ్లా పౌడర్‌నీ తీసుకోండి. హెన్నా మన జుట్టు రంగుని కాస్త ఎరుపు రంగులోకి మారుస్తుంది. కానీ ఆమ్లా పౌడర్‌కి జుట్టుని నల్లగా మార్చే గుణం ఉంది. అందుకనే హెన్నాకి ఆమ్లా పౌడర్‌ని తప్పకుండా కలపాలి. ఇలా కలిపిన పొడిలో కొంచెం కొంచెంగా డికాషన్‌ కలపాలి. జుట్టుకి పట్టించేందుకు వీలుగా, ఒక పేస్టులా తయారయ్యేవరకు ఈ డికాషన్‌ని కలపాలి. ఈ పేస్టుని మీ జుట్టు మొత్తం కుదుళ్ల వరకూ పట్టించండి. ఇలా రెండు గంటలపాటు ఉంచిన తర్వాత తలస్నానం చేయండి. అంతే! తెల్లటి మీ జుట్టు కాస్తా నల్లగా మారిపోవడం చూస్తారు. కనీసం నెల రోజుల వరకైనా మీ జుట్టు ఇదే రంగులో కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=C_D5BNH77-w    

    పరువాల పాదాల కోసం       మనలో చాలా మంది అందం విషయంలో ముఖానికిచ్చే ప్రాధాన్యత పాదాలకి ఇవ్వరు. దాని పర్యవసానమే జీవం కోల్పోయిన పాదాలు వాటి వల్ల వచ్చే పగుళ్ళు. మొహం ఎంత అందంగా ఉన్నా పగుళ్లతో నిండిన పాదాలు చూసుకుంటుంటే మనకే బాధగా ఉంటుంది కదా. అందుకే వాటి మీద కూడా శ్రద్ధ  చూపించి పాడాలని కూడా మెరిసేలా చేద్దాం. సాదారణంగా రోజు కాళ్ళని బాగా కడిగి కొద్దిగా నూనే రాసుకుని పడుకునే వారి పాదాలు ఎంతో మృదువుగా కనిపిస్తాయి. ఇలానే ఇంకొన్ని చిట్కా వైధ్యాలతో బ్యూటీ పార్లర్ కి వెళ్ళాల్సిన పని లేకుండానే పాడాలని సంరక్షించుకుందాం.   *  రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్ళలో తీసుకొని దానిలో దూది ముంచి దానిని పాదాలకు రాసి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి కడిగెయ్యాలి. ఇలా రెండు రోజులకి ఒకసారి నెల రోజులు చేస్తే చాలు పాదాలు మృదువుగా మారిపోతాయి. *  బొప్పాయి గుజ్జులో నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి మర్దనా చేస్తే మడమలకున్న మురికి పోతుంది. క్రమంగా ఇలా చేస్తే మురికి తొలగడమే కాకుండా పగుళ్ళు కూడా దరి చేరవు. *  గోరువెచ్చని  నీటిలో  తేనే వేసి ఆ నీటిలో పాదాలని 20-30 నిమిషాలు ఉంచి తర్వాత కడిగినా మంచి నిగారింపు వస్తుంది. *  రాత్రి పడుకునే ముందు కాళ్ళు శుభ్రంగా కడిగి ఇంట్లో ఉండే వేసలైన్ ని పాదాలకి పట్టించి పడుకోవాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే మీ పాదాలలో వచ్చిన తేడాని మీరే గమనించవచ్చు. *  పాదాలు మృదువుగా తయారవ్వాలంటే నాలుగు చెంచాల ఓట్ మీల్ పొడి, మూడు చెంచాల ఆలివ్ నూనె కలిపి మర్దనా చేసి, అరగంట తరువాత చల్లని నీటితో కడగాలి. దీంతో మృతకణాలు(డెడ్ సెల్స్) కూడా తొలగిపోతాయి. *  అరటిపండుని  గుజ్జులా చేసి దానిని పాదాలకి పట్టించి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి గోరువెచ్చని నీటితో కడిగినా మెరిసే పాదాలు మీవి అవుతాయి. * నువ్వుల నూనెను గోరు వెచ్చగా వేడి చేసి రాత్రి పడుకునే ముందు రాసుకుంటే పాదాలు మృదువుగా తయారవుతాయి. *  ఆలివ్ ఆయిల్ లో దూది ముంచి ఆ దూదిని గుండ్రటి ఆకారంలో తిప్పుతూ పాదాలని ఒక పది నిమిషాలు మసాజ్ చేసి సాక్స్ వేసుకుని ఒక అరగంట ఉంచి తర్వాత వేడి నీతితో కడిగినా  చాలు పదాలు మెరిసిపోతాయి. చూసారా పాదాల సంరక్షణకి ఇంట్లోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చో. మరి మొదలుపెడదామా ఏదో ఒక చిట్కాని.                                                                                                                                                                                                                       ....కళ్యాణి

  లేత గులాబీరంగు పెదవుల కోసం   లేత గులాబీ రంగులో తళతళలాడే పెదవులు... మగువల ముఖారవిందానికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే ముఖంపై తీసుకున్న శ్రద్ధ చాలాసార్లు పెదవుల విషయంలో తీసుకోరు చాలామంది. దానివల్ల ఎండిపోవడం, చిట్లిపోవడం, నల్లబడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వేసవిలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే లిప్స్ విషయంలో కొంచెం దృష్టి పెట్టాల్సిందే. అధరాల అందాన్ని కాపాడుకోడానికి ఏం చేయాలంటే...   వేసవిలో బాడీ త్వరగా డీ హైడ్రేట్ అయిపోయి చర్మం వడలిపోతుంది. ఆ మార్పు పెదవుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వీలైనంత ఎక్కువ నీటిని తాగితే చర్మంలో తేమ పెరుగుతుంది. పెదవులను అస్తమానం తాకడం, చిట్లిపోతే కనుక చర్మాన్ని పట్టి లాగడం, గరకుగా ఉండే బట్టతో తుడవడం లాంటివి చేయకూడదు. లిప్ స్టిక్ వేసుకునే అలవాటు ఉంటే... బయటి నుంచి రాగానే లిప్ స్టిక్ ను వెంటనే కడిగేసుకుని లిప్ బామ్ రాయండి. ఇంట్లో కూడా లిప్ స్టిక్ రాసుకోవడం వంటివి అస్సలు చేయకండి. చాలామంది ఒళ్లంతా రాసుకున్న క్రీమ్ నే పెదవులకూ రాసేసుకుంటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. పెదవుల మీది చర్మం చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. అందుకే దానికోసం తయారైన క్రీమ్ ను కానీ బామ్ ను కానీ రాసుకోవాలి.    ఇదంతా పెదవులు పాడవకుండా ఉండటం కోసం. అయితే మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఆల్రెడీ మీ పెదవులకు డ్యామేజ్ జరిగితే కనుక ఈ చిట్కాలు పాటించి చూడండి. * పెదవుల్ని తరచుగా చక్కెరతో రుద్దుతూ ఉండండి. దానివల్ల మృతకణాలు తొలగిపోయి పెదవులు సాఫ్ట్ గా అవుతాయి. * లిప్స్ కి అప్పుడప్పుడూ నిమ్మరసం రాస్తూ ఉంటే... పగుళ్లు, పొడిదనం తగ్గడంతో పాటు నలుపు కూడా పోతుంది. రోజ్ వాటర్ లో కొద్దిగా తేనె కలిపి రాసుకున్నా కూడా పెదవుల నలుపు పోయి అక్కడి చర్మం కాంతివంతమవుతుంది. * బీట్ రూట్ ను బాగా గ్రైండ్ చేసి రసం తీయండి. దీన్ని రోజూ రాత్రిపూట పడుకునే ముందు పెదవులకు రాసుకుని, ఉదయం లేచాక కడిగేసుకోండి. ఓ వారం రోజులు ఇలా చేస్తే మీ పెదవులు ఆరోగ్యంగా కనిపించడమే కాదు, మంచి రంగులో కూడా ఉంటాయి. * ఆలివ్ ఆయిల్ కూడా చర్మపు పొడిదనాన్ని పోగొట్టి తేమను పెంచుతుంది. అందుకే ఆలివ్ ఆయిల్ రాస్తే పెదవులు తేమగా ఉండటమే కాక ఎండ వల్ల ఏర్పడిన నలుపు తగ్గుతుంది.  * తరచుగా దానిమ్మరసం రాసుకుంటే లిప్స్ డ్రై అవకుండా ఉంటాయి. పైగా చక్కని గులాబీరంగును పులుముకుంటాయి. ఆ తర్వాత లిప్ స్టిక్ తో పనే ఉండదు. * పాలు, పాల క్రీమ్, మీగడ వంటివి కూడా పెదవులకు మేలు చేస్తాయి. వీటిని కూడా రాత్రిళ్లు రాసుకుంటూ ఉంటే మంచిది.   మీ పెదవులను కాపాడుకోవడానికి ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. మీ వీలును బట్టి మీకు నచ్చిన చిట్కాలు ఫాలో అవ్వండి. మీ అధరాల అందాలను మరింత పెంచుకోండి.    - Sameera

Worried About Messy Hair & Bad Skin – Try These Oils!   Most of us think that, using oil for hair and skin makes skin dull and oily. But the truth is that, using appropriate oil in optimal quantity makes the skin glow and hair stronger.   Whether you are looking to eliminate the patches in the skin or simply moisturize the skin or just want the hair to be strong and healthy given below are some wonder oils just for you.   Sesame Oil : Sesame Oil promotes hair growth and repairs skin. It acts as a natural SPF to make your skin shine. Sesame Oil is an excellent moisturizer that heals problems related to dry skin. Believe it or not it has powerful anti-aging nutrients.   Almond Oil : Almond Oil is full of Vitamin E. It contains omega 3 fatty acids which when absorbed in skin acts as a natural moisturizer. Further, the vitamin B 7 in Almond Oil is extremely useful to strengthen the hair.   Olive Oil : Applying Olive Oil regularly helps fight aging and makes you look youthful and keeps your skin glowing. Regular use of Olive Oil stimulates the hair growth naturally.   Coconut Oil : Coconut Oil is full of Vitamin E & fatty acids which acts a sort of barrier to the skin, keeping moisture locked in. It is naturally antibacterial and antifungal, helping to protect skin and hair from the pollution around.   Mustard Oil : Loaded with Vitamin E, Mustard Oil helps in fighting skin rashes and improves complexion. Applying Mustard Oil regularly reduces fine lines and wrinkles.   So next time when you plan to spend on beauty products – think about these wonder oils which relatively cost less and give more benefits. - Priya Ganapathi  

  మీ అందానికి ఈ ఐదు ఫ్రూట్స్ బాడీగార్డ్స్!     ఫ్రూట్స్ అనగానే వాటిని ఆరోగ్యాన్ని పెండే ఆహారంగానే చూస్తాం. కానీ అవి అందాన్ని పెంచే బ్యూటీషియన్స్ అని మీకు తెలుసా? ముఖ్యంగా ఓ అయిదు ఫ్రూట్స్ మనం అందానికి చేసే  మేలు అంతా ఇంతా కాదు. వాటిని శరీరంలోకి పంపినా, శరీరంపై పూసుకున్నా కూడా మంచిదే.   - అరటిపండ్లలో ఉండే ఉండే ఫైబర్, మినరల్స్, మెగ్నీసియం, పొటాసియం వంటివి కూడా ఎంతో మేలు చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, ఇ లు యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పని చేస్తాయి. అందుకే దీన్ని వీలైనంత తీసుకోవాలి. తేనెతో కలిపి అప్పుడప్పుడూ ప్యాక్ కూడా వేసుకుంటే మంచిది.  - కమలాఫలాల్లో ఉండే విటమిన్ సి స్కిన్ టెక్స్చర్ ను ఇంప్రూవ్ చేస్తుంది. చర్మంపై ఉండే గాయాల్ని, మచ్చల్ని పోగొడుతుంది. కాబట్టి వీటిని తరచూ తినాలి. వీటి తొక్కలు కూడా ఎంతో మంచివి. వీటిని ఎండబెట్టి, పొడి చేసి, నీటిలో కలుపుకుని స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది.  - రోజుకో యాపిల్ తింటే డాక్టర్ కి దూరంగా ఉండొచ్చు అంటారు. డాక్టర్ కే కాదు... బ్యూటీషియన్ కి కూడా దూరంగా ఉండొచ్చు. ఎందుకంటే అది మన అందాన్ని అంత బాగా కాపాడుతుంది మరి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కణాల్ని, టిష్యూస్ ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. మలినాలను తొలగిస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తినాలి. యాపిల్ జ్యూస్ ని తేనెలో కలిపి ముఖానికి రాసుకుని, ఆరిన తర్వాత కడిగేసుకుంటే తేమ పెరిగి ముఖం కళకళలాడుతుంది. పొడి చర్మం కలవారికి ఇది చాలా మంచిది. - బొప్పాయిలో పపెయిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. దీని గుజ్జులో తేనె కానీ పెరుగు కానీ కలిపి రుద్దుకున్నా కూడా చర్మం ఎంతో కాంతివంతమవుతుంది.  - ఇక నిమ్మ గురించి చెప్పేదేముంది? ఇందులో ఉండే విటమిన్ సి చేసే మేలు అంతా ఇంతా కాదు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. మలినాలను తొలగిస్తుంది. చర్మాన్ని, జుత్తుని కాపాడుతుంది. అందుకే దీన్ని వీలైనంత ఎక్కువ తీసుకోవాలి. దీని రసం రాస్తే మొటిమలు, మచ్చలు, ర్యాషెస్ ఏవైనా తగ్గిపోతాయి. తలకి రాస్తే చుండ్రు పోతుంది. జుత్తు బలంగా అయ్యి మెరుస్తూ ఉంటుంది.      చూశారుగా... ఈ అయిదు ఫ్రూట్సే అందానికి బాడీగార్డ్స్. అందుకే వీటిని ఎప్పుడూ మీతోనే ఉంచుకోండి మరి! -Sameera  

ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలంటే   ఆడవాళ్ళ అందాలల్లో బాగా ఆకట్టుకునేవి కళ్ళు మాత్రమే ! ఆ కళ్ళతో ఒక చూపు చూస్తే చాలు మగవాళ్ళు మనస్సు పారేసుకుంటారని చెప్పడంలో ఏ మాత్రం అబద్దం లేని నిజం. అప్పుడప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో కొన్ని కొన్ని సీన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. కొన్నికొన్ని చోట్లా " నీ కళ్ళు చాలా బాగున్నాయి " అనే డైలాగ్స్ కాని మాటలు కాని అక్కడక్కడ వినబడుతూ ఉంటాయి. మరి అంతగా ఆకర్షించే కళ్ళు మీ సొంతం కావాలంటే తేలిగ్గా ఇబ్బంది లేకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.   * ప్రతిరోజూ సరిపోయేంతగా నిద్రపోవాలి. అలా నిద్రపోవడం వల్ల మీ కళ్ళు తాజాగా కనబడుతుంటాయి. * పాలమీగడతో కళ్ళ చుట్టూ మసాజ్ చేసుకుంటే, కళ్ళ చుట్టూ ఉండే మడతలు పోయి మరింత ఆకర్షణగా కనబడుతుతాయి. * కీరదోసకయలను తినడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాదు, ఆ కీరదోసకాయలను చక్రల్లాగా కోసుకొని కళ్ళ మీద పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల కళ్ళు తాజాగా మెరుస్తుంటాయి. * కళ్ళు చాలా సున్నితమైనవి కాబట్టి బజారున దొరికే ఏ క్రీమ్ పడితే ఆ క్రీం రాసేయకూడదు.అలా చెయడం వల్ల కళ్ళుకి ఇన్ పెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. * ప్రతిరోజూ ఉప్పు నీటితో కళ్ళను కడుక్కోవాలి. అలా ఉప్పు నీటితో కడగడం వల్ల కళ్ళు మెరుస్తాయి. సో అమ్మాయిలు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎప్పటికప్పుడు పాటిస్తే ఆకర్షించే కళ్ళు మీ సొంతమయినట్టే !  

  బ్యూటీ కోసం బనానా ట్రీట్‌ మెంట్!     అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అయితే అందుకు ఏం చేయాలో మాత్రం అందరికీ తెలియదు. బ్యూటీ పార్లర్లు, కాస్మొటిక్ ట్రీట్మెంట్లు అవసరమేమో అనుకుంటారు. అక్కర్లేదండీ. ఒక్క అరటిపండు చాలు... మిమ్మల్ని అందంగా చేయడానికి. అదెలా అంటారా? ఇలా చేసి చూడండి.   - అరటిపండులో కాస్త తేనె కలిపి మెత్తగా చేసుకోండి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించండి. ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోండి. ఎంత గ్లో వస్తుందో చూడండి.   - అరటిపండు గుజ్జులో పాలు కలిపి, ఆ గుజ్జుతో ముఖాన్ని బాగా రుద్ది కడగాలి. నిర్జీవంగా మారిన ముఖానికి జీవం వస్తుంది.   - అరటిపండు, ఓట్స్ కలిపి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కడిగేసి చూడండి... కొత్త మెరుపు వస్తుంది.   - వేసవికాలంలో చర్మం కమిలిపోయి కాంతిని కోల్పోతుంది కదా. అలాంటప్పుడు అరటిపండు గుజ్జులో పెరుగు కలిపి ముఖానికి రాసుకోండి. ఓ పదిహేను నిమిషాలుంచి కడిగేసుకోండి. మళ్లీ ఫ్రెష్ గా అయిపోతుంది.     - కాస్త తెల్లబడాలి అనుకునేవాళ్లు అరటిపండులో చందనపు పొడి కలిపి పూసుకుని, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. వారానికి ఒకట్రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది.   - అరటిపండు, పాలు, తేనె కలిపి మెత్తగా చేసేయండి. దీనిలో కాస్త రోజ్ వాటర్ కూడా కలపండి. దీనితో ముఖం, మెడ, కాళ్లు, చేతులు రుద్ది కడిగేసుకోండి. వేసవిలో వారానికోసారి ఇలా చేస్తే... ఎండ మీ చర్మానికి ఏ చేటూ చేయలేదు.   - డ్రై స్కిన్ ఉన్నవాళ్లు అరటిపండు గుజ్జులో బాదం నూనె కలిపి ముఖానికి తరచూ ప్యాక్ వేసుకుంటూ ఉంటే తేమ పెరిగి చర్మం తళుకులీనుతుంది.   అరటి ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా ఎంత మేలు చేస్తుందో చూశారు కదా! అందుకే మీ అవసరాన్ని బట్టి ఈ చిట్కాలను క్రమం తప్పకుండా ఫాలో అవ్వండి. అందంగా ఆనందంగా ఉండండి. - Sameera  

  ఇవి కూడా ఫేస్ ప్యాక్లే!   ఫేస్ ప్యాక్ అనగానే ముల్తానీ మట్టి, పెరుగు, తేనె, పసుపు... ఇలాంటి పదార్థాలే గుర్తుకువస్తాయి. కానీ మన చర్మాన్ని కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా పదార్థాలనే ఫేస్ ప్యాక్ కోసం ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. కాదేదీ ఫేస్ ప్యాక్కు అనర్హం అనేది వారి మాట!   టమాటా ఫేస్ ప్యాక్ :- వంటకాలకి రుచి తేవాలన్నా, ఒంటికి పోషకాలు లభించాలన్నా టమాటాను మించింది లేదు. అలాంటి టమాటాని మొహానికి పట్టిస్తే అందానికి కూడా తిరుగుండదంటున్నారు. ఇందులో ఉండే A విటమిన్ చర్మానికి కాంతిని ఇస్తుంది. ఇక పులుపుదనంతో కూడిన C విటమిన్ మొటిమల వంటి సమస్యలు దూరమవుతాయి. టామాటాల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.     పుదీనా ఫేస్ ప్యాక్ :- టూత్పేస్టు దగ్గర నుంచి టీ పౌడరు వరకూ వీలైనన్ని పదార్థాలలో పుదీనాని వాడతాం. పుదీనా కలిగించే తాజాదనం, సువాసన అలాంటిది మరి! టామాటాలో ఉన్నట్టే పుదీనాలో కూడా A,C విటమిన్లు పుష్కలంగా కనిపిస్తాయి. వీటికి తోడు పుదీనాలో ఉండే మెగ్నీషియం చర్మం పైపొరలో జరిగే రక్తప్రసరణను పెరుగుతుంది, జిడ్డుదనాన్ని తగ్గుతుంది. ఇక పుదీనా ఫేస్ ప్యాక్తో చర్మం తాజాగా మారిపోతుందని వేరే చెప్పాలా!     బంగాళదుంప ఫేస్ ప్యాక్ :- ఎండవేడికి చర్మం కమిలిపోయినా, మచ్చలు పడినా, నల్లబడుతున్నా... బంగాళదుంప ముక్కలు పెట్టుకుంటే ఫలితం దక్కుతుందని చెబుతారు. అలాంటిది బంగాళదుంపతో ఏకంగా ఫేస్ ప్యాక్ చేసుకుంటే ఇక చెప్పేదేముంది. బంగాళదుంపలకి కాస్తంత పెరుగుని జోడించి మొహానికి పట్టించారంటే.... యవ్వనం మళ్లీ తిరిగి వచ్చేస్తుంది.  బంగాళదుంపలో ఉండే A,B,C విటమిన్లు; ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజాలు చర్మానికి మేలు చేసి తీరతాయి.     క్యారెట ఫేస్ ప్యాక్ :- క్యారెట్ తింటే చర్మానికి ఎంత మేలో తరచూ వింటూనే ఉంటాం. క్యారెట్ని చర్మానికి పట్టించినా కూడా అందులోని బీటాకెరోటీన్ చర్మాన్ని కాంతివంతంగా మార్చివేస్తుంది. చర్మంలో ఉన్న జిడ్డుని తొలగించేందుకు, వెడల్పుగా ఉండే స్వేద రంథ్రాలు కనిపించకుడా చేసేందుకు, చర్మం మృదువుగా మారేందుకు, తెల్లగా కనిపించేందుకు... క్యారెట్ ఫేస్ ప్యాక్ ఉపయోగించి చూడమని చెబుతున్నారు. ఇవే కాదు! అవకాడో, ఓట్మీల్, గోధుమపిండి, వాల్నట్, అరటిపండు... అబ్బో! ఇలా చాలా పదార్థాలతో ఫేస్ ప్యాక్ చేసుకోవచ్చు. మన అవసరం, వీలుని బట్టి వీటికి తెనె, అలోవెరా, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం, చందనం, పెరుగు లాంటి పదార్థాలను జోడించి ఇంట్లోనే అద్భుతమైన ఫేస్ప్యాక్లు తయారుచేసుకోవచ్చు. - నిర్జర.  

ఎల్లప్పుడు ముఖం అందంగా ఉండాలంటే     ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆడవాళ్ళూ తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తారని అందరికి తెలుసు ! ఆ అందం చూసేవాళ్ళకి ఎలా తెలుస్తుందని ఎవరైనా అడిగితే వెంటనే మనం ముఖం ద్వారా అని టక్కున చెప్పేస్తాం ! మరి ఆ ముఖం ఎల్లప్పుడు ఏ కాలమైన అందంగా ఉండాలన్నా, నలుగురిలో అందంగా కనబడలన్నా మనం ఎప్పటికప్పుడు కొన్ని చిట్కాలు ఉపయోగించడం మంచిది కదా ! అందుకే అందమైనా ముఖం కోసం కొన్ని చిట్కాలు. * నీళ్ళు ఎక్కువగా తాగుతుండాలి. అలా నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ముఖం ఎప్పటికప్పుడు తాజాగా మెరుస్తూ మచ్చలు రాకుండా ఉంటాయి. * నిమ్మకాయ రసాన్ని ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత బాగా రుద్ది కడుక్కోవాలి. అలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు ముఖం తాజాగా శుభ్రంగా ఉంటుంది. * పావుకప్పు పాలలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి ప్రతిరోజూ ముఖానికి రాసుకోవాలి. * ఒక ఐదు బాదం పప్పులు రాత్రిపూట బాగా నానబెట్టి ఉదయాన్నే వాటిని పేస్టులా చేసుకొని ముఖానికి రాసుకుంటే ముఖం తాజాగా శుభ్రంగా అందంగా ఉంటుంది. * టమాటా పేస్ట్ ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.అలా చేయడం వల్ల మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటుంది.

  గోళ్ళు కావు గోల్డ్ తునకలు     నైల్ పాలిష్ ను ఇష్టపడని స్త్రీలు చాలా తక్కువ. నైల్ పాలిష్ కోసం ప్రతి నెలా వందలాది రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళున్నారు. కొందరు వారానికోసారి గోళ్ళకు రంగు వేసుకుంటే, మరికొందరు రోజూ వేసుకుంటారు. ఏదో ఒక రంగు కాకుండా తమ దుస్తులకు మాచ్ అయ్యే రంగు వేసుకోవడం ఫాషన్. ఒకప్పుడు సినిమావాళ్ళు, సెలెబ్రిటీలు మాత్రమే ఫాషన్ విషయంలో శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇప్పుడలా కాదు. అందరికీ అందం మీద శ్రద్ధాసక్తులు పెరిగాయి. చెప్పులు మొదలు హెయిర్ బాండ్ వరకూ ఫాషన్ ట్రెండ్స్ ను పాటిస్తున్నారు. నఖశిఖపర్యంతం అందంగా, ఫాషనబుల్ గా ఉండాలని తపిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. చక్కగా, స్టైలిష్ గా నైల్ పాలిష్ వేసుకుని, అవి గోళ్ళు కావు గోల్డ్ తునకలు అనిపించేలా చేస్తున్నారు. * మరి గోళ్ళ రంగు విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. - ముందు గోళ్ళలో ఏమాత్రం మురికి చేరకుండా చూసుకోవాలి - నైల్ కటర్ సాయంతో గోళ్ళకు చక్కటి ఆకృతిని ఇవ్వాలి - నైల్ పాలిష్ లో అసంఖ్యాకమైన రంగులు దొరుకుతాయి - అయితే వాటిల్లో మనకు నప్పే షేడ్స్ ను ఎన్నుకోవాలి - ఉన్న రంగును మార్చి మరో రంగును వేసుకోదలచినప్పుడు నైల్ పాలిష్ రిమూవర్ తో తుడిపి కొత్తది వేయాలి. లేకుంటే షేడ్ మారిపోతుంది - మంచి క్వాలిటీ నైల్ పాలిష్ వాడాలి. లేకుంటే గోళ్ళు పాడవుతాయి. ఎక్కువరోజులు ఉంటుంది కూడా - ఒక కోటింగ్ ఆరిన తర్వాత మాత్రమే మరో కోటింగ్ వేయాలి - నైల్ పాలిష్ ను రెఫ్రిజిరేటర్లో భద్రపరచినట్లయితే ఎండిపోకుండా నిలువ ఉంటుంది.  

బ్యూటీపార్లర్లలో ఈ నియమాలు పాటించండి     కాలం మారిపోయింది..ఇప్పుడు 60+లో ఉన్నవాళ్లు కూడా టీనేజ్‌లో ఉన్నవారిలా కనపించాలని చూస్తున్నారు. ఆడ లేదు మగా లేదు అందరికి అందంపై విపరీతమైన ఆరాధన పెరిగిపోయింది. అందుకోసం ఖర్చుకు కూడా వెనుకాడటం లేదు. అందుకే బ్యూటీ పార్లర్లకు ఫుల్ డిమాండ్. అయితే బ్యూటీపార్లర్‌లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉంటాయని చెబుతున్నారు నిపుణులు... * బ్యూటీపార్లర్‌కు వెళ్లినప్పుడు వారు అమ్మే ఓల్డ్ హెన్నాకొని వాడటం అంత మంచిది కాదట * మొటిమలు తొలగించడానికి ఫేషియల్‌ విధానం అంతగా మంచిది కాదు..ఫేషియల్    చేయించుకునేటప్పుడు తప్పనిసరిగా తలకి బట్ట కట్టించుకోవాలి. అక్కడికి వెళ్లేముందు పర్సనల్     దువ్వెన వెంట తీసుకెళ్లడం మంచిది. * బ్యూటీపార్లర్లలో ఎప్పుడు లిప్‌స్టిక్ కానీ, కళ్ళకాటుకను వేయించుకోరాదు.. * తరచూ బ్లీచింగ్ చేయించుకోకూడదు..కనీసం ప్రతీ బ్లీచింగ్‌కు మూడు నెలల వ్యవధి ఉండాలి. * ఫేషియల్ చేయించుకొనేటప్పుడు ఫ్రూట్స్‌తో చేయించుకోవడం మంచిది. * పెడిక్యూర్, మానిక్యూర్ లు చేసే పరికరాలు ఇన్ ఫెక్షన్ కలిగించే అవకాశం వుంది. కనుక ఆయా పరికరాల్ని ఉపయోగించిన ప్రతిసారి   స్ట్రెరైల్ చేశారో లేదో బ్యూటీషియన్స్‌ని అడగటం మరిచిపోవద్దు  

మన హెయిర్ కి షాంపూ ఎలా చేసుకోవాలి?   మన హెయిర్ కి షాంపూ ఎలా చేసుకోవాలి? అంతకన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే... మనది హెల్తీ హెయిరా, సెన్సోడైజ్ హెయిరా, నార్మల్ హెయిరా... అని. ఎందుకంటే, మన స్కిన్ ఎలాగో హెయిర్ లో కూడా చాలా రకాలు ఉంటాయి. హెయిర్ బ్రేక్ అవకుండా ఆరోగ్యంగా ఉండడానికి, షాంపూ ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=p27DftCZlSM    

చర్మ సౌందర్యానికి టమోటతో ఫేస్ ప్యాక్   కొన్ని కూరగాయలు అందానికి మెరుగుపరుచుకోవడానికి బాగా ఉపయోగపడతాయి. అందులో టోమాటో ఒకటి.. మన చర్మ సౌందర్యానికి టోమాటో చాలా బాగా ఉపయోగపడుతుంది. నేచ్యురల్ స్కిన్ కోసం టోమాటో ఫేస్ ప్యాక్ ఎలా చేసుకోవాలలో ఇప్పుడు ఈ వీడియో చూసి నేర్చుకుందా...  https://www.youtube.com/watch?v=fDJmoPKkNuY  

లిప్‌స్టిక్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు   లిప్‌‌స్టిక్ వేసుకోవడం చాలా మంది అమ్మాయిలకి సరదా..? నలుగురిలో ఎట్రాక్షన్‌గా కనిపించాలన్నా.. పెదాలను మరింత అందంగా తీర్చిదిద్దాలన్నా.. అమ్మాయిల ఫస్ట్ ఛాయిస్ లిప్‌స్టిక్కే. అందుకే మార్కెట్లోకి వచ్చిన ప్రతి కొత్త రకం లిప్‌స్టిక్‌ని వాడేస్తుంటారు. అయితే లిప్‌స్టిక్‌ని ఎలాపడితే అలా వేసుకోకూడదు అంటున్నారు నిపుణులు. ఆ సమయంలో కొన్ని చిట్కాలను పాటించాలట.. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=nVWHuo5UNAQ  

  సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్     ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవి తాకిడి నుండి తప్పించుకోవడం ఎలా, శరీరాన్ని కాపాడుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్న. ఎండలో తిరక్కుండా ఎంత జాగ్రత్తగా ఉన్నా, సెగలు కక్కుతున్న సూర్యుని తాపం మనమీద ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పడుతూనే ఉంటుంది. ఇక వృత్తి ఉద్యోగాల రీత్యా కొందరికి బయట తిరగక తప్పదు. వీరి సంగతి చెప్పనవసరం లేదు. మరీ దుర్భరంగా ఉంటుంది. ఒక్కో సీజన్లో ఒక్కో సమస్య ఉండనే ఉంటుంది. చలికాలంలో చర్మం పొడివారుతుంది. వాజిలిన్లు, కోల్డ్ క్రీములూ, మాయిశ్చరైజర్లు రాస్తున్నా చర్మం పగులుతూనే ఉంటుంది. ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు వేసవిలో నీటి శాతం తగ్గిపోయి, శరీరంలో కాంతి నశిస్తుంది. ముఖంలో గ్లో తగ్గుతుంది. నీటి శాతం తగ్గడం వల్ల చర్మం ముడతలు పడుతుంది. ముఖంలో రింకిల్స్ అందవిహీనంగా ఉంటాయి. ఉన్న వయసు కంటే ఎక్కువ వయసు కనిపిస్తుంది. ఈ ఎండల నుండి బయట పడే మార్గం లేదా, మనల్ని మనం రక్షించుకునే అవకాశం లేదా అంటే, తప్పకుండా ఉంది. ఈ వేసవి కాలంలో పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలు తెలుసుకుందాం. సమ్మర్ బ్యూటీ కేర్ టిప్స్ తో ముఖ సౌందర్యం ఏమాత్రం పాడవకుండా చూసుకుందాం. శరీరానికి ఆహారం ఎంత అవసరమో నీరు కూడా అంటే అవసరం. నీళ్ళు ఎక్కువ పరిమాణంలో తాగేవారికి సర్వసాధారణంగా ఏ జబ్బులూ రావు. ఇది అతిశయోక్తి కాదు. వాటర్ థెరపీని మించినది మరొకటి లేదు. రోజుకు 16 గ్లాసుల నీళ్ళు తాగమని డాక్టర్లు పదేపదే చెప్తున్నారు. పుష్కలంగా నీరు తాగితే అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చు. ఇక వేసవిలో అయితే, శరీరంలో ఉన్న నీరు ఇంకిపోతుంది కనుక, మరింత పరిమాణంలో నీరు సేవించాలి. రోజుకు కనీసం ఐదు లీటర్ల నీరు తాగాలి. నీరు ఎక్కువగా తాగడంవల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖ వర్చస్సు పెరుగుతుంది. డీ-హైడ్రేషన్ లాంటి సమస్యలు తలెత్తవు. . చాలామంది వేసవి తాపాన్ని భరించలేక ఐస్ క్రీములు, కూల్ డ్రింకులతో సేదతీరుతుంటారు. శీతల పానీయాలు, ఐస్ క్రీములు దాహార్తిని తీర్చేమాట నిజం. కొంతసేపు సేద తీరినట్లూ ఉంటుంది. కానీ అది చాలా తాత్కాలికం. పైగా ఈ కూల్ డ్రింకులు ఒబేసిటీ లాంటి అనేక అదనపు సమస్యలకు కారణమౌతాయి. కనుక కూల్ డ్రింకులు, ఐస్ క్రీములకు దూరంగా ఉండాలి. . కొబ్బరి నీళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి, విటమిన్ సి, ప్రోటీన్లు ఉంటాయి. వేసవిలో వీలైనంత ఎక్కువగా కొబ్బరినీళ్ళు తాగుతూ ఉండాలి. బొబ్బరి నీళ్ళు తాగడంవల్ల ముఖంలో చక్కటి ప్రకాశం వస్తుంది. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో సేవిస్తూ ఉండాలి. ముఖ్యంగా వేసవిలో తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. నిలవ ఉంచిన ఫ్రూట్స్ కాకుండా ఎప్పటికప్పుడు తాజా పండ్లను తీసుకోవాలి. పండ్లను రసం తీసుకుని తాగడం కంటే ముక్కలు కోసుకుని తినడం మంచిది. పండ్ల నుండి జ్యూస్ తీయడం వల్ల అందులో ఉండే ఫైబర్ చాలావరకూ ఫిల్టరయి పోతుంది. ఫైబర్ జీర్ణ ప్రక్రియలో ఎంతగానో ఉపయోపడుతుంది. తాజా పండ్లను సేవించడం వల్ల ముఖంలో కాంతి వస్తుంది. కీరా దోసకాయలు వేసవిలో విరివిగా దొరుకుతాయి. చెక్కు తీసిన కీరా దోసకాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గుతుంది. ముఖానికి వన్నె వస్తుంది. కీరా దోసకాయలను సన్నగా చెక్కల్లా తరిగి, ముఖంమీద ఉంచి పడుకోవాలి. ఆ ముక్కల నీటిని ముఖం పీల్చుకున్న తర్వాత వాటిని తీసి పడేసి, చల్లటి నీతితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖానికి మరింత శోభ వస్తుంది. టొమేటో గుజ్జు, బొప్పాయి గుజ్జు మొదలైన వాటితో ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. ఒక అరగంట పాటు అలా ఉంచుకుని, ఎండిన తర్వాత చల్లటి నీటితో కడుక్కోవాలి. ఈ ఫేస్ ప్యాక్ లు ముఖంలో ముడతలు రాకుండా చేస్తాయి. తాజాదనాన్ని, అందాన్ని ఇస్తాయి. ఆకుకూరలు ఆరోగ్యానికి అన్నివిధాలా మంచిది. వేసవిలో ఆకుకూరలు మరీ మంచిది. వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడం వల్ల ముఖంలో ముడతలు రావు. ముఖం తేటగా అనిపిస్తుంది. అదీ సంగతి. వేసవివల్ల వచ్చే సమస్యలను ఇలాంటి ఆరోగ్య జాగ్రత్తలను పాటించడం ద్వారా తరిమికొట్టవచ్చు.  

  సమ్మర్ లో మహిళలు తీస్కోవాల్సిన జాగ్రత్తలు     సమ్మర్ హీట్ మోతెక్కిస్తోంది. బయటికి వెళ్లాలంటేనే భయం వేసేంతగా వాతావరణం మారిపోయింది. ఎక్కువగా బయట తిరిగే మహిళల చర్మం ఈ సమ్మర్ ఎఫెక్ట్ కు నల్లగా మారిపోవడం, మేని ఛాయ తగ్గిపోవడం లాంటి సమస్యలు ఎదురౌతుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నపు ఎండ చర్మానికి తీవ్రమైన హాని కలుగజేస్తుంది. మహిళల మృదువైన చర్మంలో ఉండే సాగే గుణాన్ని, సమ్మర్ హీట్ ధ్వంసం చేస్తుంది. అందుకే మరీ అవసరమైతే తప్ప, మహిళలు బయటికి వెళ్లకుండా ఉండటమే శ్రేయస్కరం. ఒక వేళ తప్పనిసరైతే మాత్రం, స్కార్ఫ్, గ్లోవ్స్ తో పాటు, సాక్స్ కూడా వేసుకోవడం తప్పనిసరి. ఉదయం ఏడింటి వరకూ వచ్చే ఎండ చాలా మంచిది. ఇది చర్మానికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. శరీరంలో హార్మోన్ల ఉత్పత్తితో పాటు, డి విటమిన్, కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కానీ ఆ తర్వాతి నుంచి మాత్రం భానుడి భగభగలు మొదలవుతాయి. అందుకే సమ్మర్ లో బయటికి వెళ్లేప్పుడు మాయిశ్చరైజర్ కంపల్సరీ. రెండు మూడు గంటలకోసారి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. పెదాలు పొడిబారిపోయి, పగిలిపోకుండా లిప్ బాప్ వాడుతుండాలి.   సన్ స్క్రీన్ రాసుకున్నంత మాత్రాన ఎండలో తిరగచ్చు అనుకుంటే పొరబాటే. ఎట్టి పరిస్థితుల్లోనూ వెంట గొడుగో లేక స్కార్ఫ్ తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఒక వేళ ఎండ వేడికి చర్మంపై రాష్ లు గానీ దురదలు గానీ వస్తుంటే, కలబందతో తయారైన జెల్ వాడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. కుటుంబ ఆరోగ్యచరిత్రలో చర్మకాన్సర్ ఉన్నవాళ్లు వీలైనంత వరకూ ఎండలో తిరగడాన్ని నివారించాలి. సమ్మర్ అంతా బి, సి, ఇ, విటమిన్లు, కెరోటిన్‌, సెలీనియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభించే ఆహారాన్నే ఎంచుకోవాలి. ద్రాక్ష, చెర్రీ, బెర్రీలు, ఆపిల్‌, గ్రీన్‌టీ, ఉల్లిపాయ, బొప్పాయి, నిమ్మజాతిపండ్లు లాంటి ఫ్లేవనాయిడ్ల ఆధారిత ఆహారానికి ఎక్కువగా ప్రాధాన్యమివ్వాలి. వీటివల్ల శరీరంలో తేమ శాతం పెరుగి అలసట దూరమవుతుంది.

  ఎండల్లో హాయిహాయిగా   ఎండాకాలం వచ్చిందంటే చాలు అమ్మాయిలు చర్మసౌందర్యం పట్ల మరింత శ్రద్ధ చూపించటం మొదలుపెడతారు. మిగిలిన కాలాల్లో కాంతులీనుతూ ఉండే చర్మం ఎండాకాలం వచ్చేసరికి మొహం పోడిబారిపోయినట్టు, జీవం లేనట్టు తయారవుతుంది. అలాంటప్పుడు రోజులో ఒక్క 10 నిమిషాలు ఈ సమస్య కోసం టైం కేటాయిస్తే చాలు,  కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండచ్చు.   * ఎండలలో బయట తిరిగి ఇంటికి రాగానే ముందుగా మొహాన్ని శుభ్రం చేసుకోవటం మంచిది. సబ్బులతో పనిలేకుండా ఇంట్లోనే క్లెన్శింగ్ మిక్స్ ను తయారుచేసుకోవచ్చు. కాస్త  బాదంపప్పు ,ఓట్స్, పాలు, రోస్ వాటర్ కలిపి మొహానికి పట్టించి  కాసేపు ఉంచుకుని కడిగేసుకుంటే చాలు. * కీరదోస కూడా మొహం మీద మురికి పోవటానికి చాల బాగా పనిచేస్తుంది. కీరా  పేస్టు లో కొద్దిగా పాలు కలిపి మొహానికి రాసుకుంటే మొహం మీదుండే మురికి మొత్తం పోతుంది.   *  ఎండలో వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అందరూ వాడతారు, అయితే అలా వాడేటప్పుడు దానిలో SPF అంటే sun protection factor కనీసం 15 ఉండేలా చూసుకోవాలి. ఇది మన చర్మాన్ని 15 శాతం ఎక్కువ కాపాడుతుంది. ఏమి అప్లయ్ చేయని చర్మం ఎండ బారిన పడటానికి 20 నిముషాలు పడుతుంది అదే సన్ స్క్రీన్ వాడితే 300 నిమిషాలు ఎండ మన మీద దాని ప్రభావాన్ని చూపించలేదు. * ఎక్కువగా  ఎండల్లో తిరగాల్సిన పని ఉన్నవాళ్ళు మొహం మీద జిడ్డు మొతాన్ని తొలగించుకోవటానికి స్ట్రాబెర్రీ లేదా బొప్పాయి పండు గుజ్జును మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత కడిగేసుకుంటే  కనిపిస్తుంది.   *   ఎండాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మొహానికి ఫేషియల్ చేయించుకోవటం కూడా చాలా అవసరం.  ఇంట్లోనే ఈజీగా ఫేషియల్ చేసుకోవాలంటే అలొవెరా జెల్ లో ఆరెంజ్ జ్యూస్ కలిపి మొహానికి పట్టించి 20 నిమిషాల తరువాత కదిగేసుకోవచ్చు. * అరటి పండు, తేనే కలిపి మెత్తగా పేస్టులా చేసి మొహానికి పట్టించి అరగంట తరువాత కడిగేసుకున్నా చాలు మొహంలో మంచి నిగారింపు వస్తుంది.          ఇవన్ని ఎలా ఉన్నా ఎండల్లో కూడా హాయిహాయిగా ఉండాలంటే టీ, కాఫీలకి దూరంగా ఉంటూ కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, బార్లీ, చోడుపిండి అంటే రాగి జావ, తాజా ఆకుకూరలు-కూరగాయలు, చక్కని ఫ్రూట్ జ్యూస్ లు తగిన విధంగా తీసుకుంటే చాలు ఎండ మన దగ్గరకి రావటానికి కూడా భయపడుతుంది. ..కళ్యాణి

హోలీ రోజు చర్మాని కాపాడుకోవడానికి ఇలా చేయాలి...   హోలీ పండుగ ఆనందంతో ఆనందంతో పాటు కొన్ని ఇబ్బందులను కూడా తీసుకొస్తుంది.. దానికి కారణం ఆ రోజు మనం చల్లుకునే రంగుల్లోని కొన్ని రసాయనాలు. ఈ మధ్య కాలంలో హోలీలోని రంగుల్లో హానికరమైన రసాయనాలను కలుపుతున్నారు. ఇలాంటివి మన శరీరంపై మీద పడితే అనేక చర్మసంబంధమైన సమస్యలు వస్తాయి కాబట్టి. ఇలాంటి సమస్యలు లేకుండా హోలీ రోజు చర్మాన్ని కాపాడుకోవాలంటే ఇలా చేయండి.  https://www.youtube.com/watch?v=aBZidu9lHFU