గర్భసంచి కిందకి జారడం అంటే ఏమిటి? అది ఎలా జరుగుతుంది..?  

గర్భం దాల్చిన తర్వాత మహిళలు వ్యాయామం చేయవచ్చా?   గర్భం దాల్చిన తర్వాత మహిళలు వ్యాయామం చేయవచ్చా? చేయొచ్చు అనే అంటున్నారు గైనకాలజిస్టులు. అయితే, ఎలాంటి వ్యాయామాలు చేస్తే ఆరోగ్యానికి మంచిది మరియు సురక్షితం. ఎందుకంటే, కొన్ని వ్యాయామాల వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితి వస్తుంది. వాకింగ్, స్విమ్మింగ్ మాత్రం అన్నిటి కన్నా బెస్ట్ ఎక్సర్ సైజులు అంటున్నారు డాక్టర్లు. మరి, ఇంకా ఎలాంటి వ్యాయామాలు చేస్తే మంచిది, మరియు అసలు ఈ వ్యాయామల్ల వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=ciyynLG_zec  

పిల్లల మనసుని మార్చే రంగులు రంగుల ప్రభావం మన మనసుపై పడుతుందంటే నమ్మసక్యంగా లేదు కదూ, కాని ఇది అక్షరాల నిజమని చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మనం పిల్లల గదికి వేసే రంగుల ప్రభావం వారి మీద చాలా ఉంటుందిట. ముభావంగా ఉండే పిల్లల్లో హుషారుని నింపాలన్నా, హైపెరాక్టివ్ పిల్లల్ని కుదురుగా కూర్చోబెట్టాలన్నా ప్రత్యేకమైన రంగులు ఉపయోగిస్తే చాలట. వారి ప్రవర్తనా విధానంలో మెల్లిగా మార్పులు చేసుకుంటాయట. ఇది వింటే కాస్త కొత్తగా అనిపిస్తున్నా దీనికి సంబంధించి పిల్లలపై చేసిన పరిశోధనలు మంచి ఫలితాలని ఇచ్చాయని నొక్కి చెప్తున్నారు శాస్త్రజ్ఞులు. మరి మీ పిల్లల మనస్తత్వానికి ఎలాంటి రంగు ఎక్కువగా వాడాలో ఎంచుకోండి. ఇంటిలో వాళ్ళ రూమ్ కి వేసే కలర్, వాళ్ళ స్కూల్ బాగ్ కలర్, వాళ్ళు వేసుకునే బట్టల కలర్ ఇలాంటి వాటికి ఏ సమయంలో ఎలాంటివి ఎంచుకోవాలో ఒక నిర్ణయానికి రావచ్చు.     *  రెడ్ కలర్ - ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకుండా నలుగురిలో కలవటానికి ఇబ్బంది పడే పిల్లల రూం కి ఎరుపు రంగు వేస్తె వాళ్ళల్లో హుషారు పెరుగుతుందిట. ఎందుకంటే ఎరుపు మనిషి మెదడులో రక్త ప్రసరణ త్వరగా జరిగేలా చేస్తుందిట. అదే హైపెరాక్టివ్ పిల్లల రూంలో ఎరుపు రంగు వేస్తే  గనక  ఇక వాళ్ళని ఆపటం ఎవరితరము కాదు. వాళ్ళ హుషారు రెండింతలు పెరిగి చదువు మీద ధ్యాస తగ్గి ప్రవర్తనలో విపరీతధోరణులు చోటుచేసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్త సుమా.      * ఆరంజ్ కలర్ -  పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచగల శక్తి ఈ నారింజ రంగుకి ఉందట. ఎవరి మీదా ఆధారపడకుండా వాళ్ళు స్వతంత్రంగా  ఆలోచించటానికి దోహదపడుతుందట. అన్నివిషయాలలో పిల్లలు  మీ మీద ఆధారపడుతుంటే మీరు ఈ రంగుని ఎంచుకోవచ్చు.    *  గ్రీన్ కలర్ - పిల్లల్లో కాన్సంట్రేషన్ పెరగాటికి ఈ రంగు బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. వారిలో చదువుపట్ల ఆసక్తిని కూడా పెంపొందిస్తుందిట. వాళ్ళల్లో ఉన్న యంగ్జైటి తగ్గి వాళ్ళని ఎప్పుడూ  కూల్ గా ఉంచుతుంది కూడా.      *  బ్లూ కలర్ - ఎరుపు రంగుకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఈ నీలం రంగు. అది మెదడులోని రక్త ప్రసరణని రెట్టింపు చేసి గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తే ఈ నీలం రంగు పిల్లల మెదడు చాలా ప్రశాంతంగా ఉండేలా చేస్తుందిట. నిద్రకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నా అవి కూడా దూరమయ్యి హాయిగా నిద్ర పడుతుందిట కూడా. హైపేరాక్టివ్నెస్ ఎక్కువగా ఉండే పిల్లల కోసం ఎక్కువగా ఈ రంగుని ఎంచుకున్నట్లయితే వారిలో దూకుడు స్వభావం తగ్గుతుందని చెప్తున్నారు.    *  ఎల్లో కలర్ - పిల్లల్లో ఏకాగ్రత పెరగటానికి పసుపు రంగు ఉపయోగపడుతుందిట. వారు స్థిరంగా కూర్చుని చదవాలన్నా లేడిన ఏదైనా పని కుదురుగా చేయాలన్నా ఈ రంగుని ఎంచుకోవచ్చు అని సలహా ఇస్తున్నారు నిపుణులు.   ఇలా రంగులు మనిషి పైన వాటి ప్రభావాన్ని చూపిస్తాయని ఎన్నో అధ్యయనాలు రుజువు చేసాయి. రంగుల పట్ల కాస్తంత అవగాహన ఉంటే చాలు మన పిల్లల మనసుని మనం సునాయాసంగా మార్చుకుని హ్యాపీ గా ఉండచ్చు. కేవలం గదికి వేసే రంగులే కాదు వారి కోసం వాడే ప్రతి వస్తువుని సరిపడే రంగులలో మనం ఎంచుకున్నట్లయితే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడరు మనని ఇబ్బంది పెట్టరు.  - కళ్యాణి

పిల్లల్లో అధిక బరువుకి కారణాలు ఇవే...   పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగొలిపేలా ఉంటారు. అయితే, ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులని బట్టి చూస్తే పిల్లలు సరయిన షేప్ లో ఉంటేనే ఆరోగ్యకరం. చైల్డ్ ఒబేసిటీ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అయితే, సరయిన డైట్ తీసుకుంటే పిల్లల్ని అధిక బరువు నుండి రక్షించొచ్చు అంటున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్ గారు. ఆ వివరాల కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=tf7pjCFvCVA​

Pre Body Mass Index of the Pregnant Women..  

తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా..!   తల్లి ప్రేమతో పిల్లల్లో తెలివితేటలు పెరుగుతాయా..? అంటే అవుననే అంటున్నారు పరిశోధకులు. తల్లి ప్రేమ ఎక్కువగా చూపే పిల్లలు చాలా చురుకుగా ఉంటారని...వారిలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉంటాయని పరిశోధకులు తెలుపుతున్నారు. మరి అసలు సంగతేంటో తెలుసుకోవాలంటే ఈవీడియో చూడాల్సిందే.  https://www.youtube.com/watch?v=WfhzCrqKQ3Q

అధిక బరువు పిల్లల ఆహరం..  తెలుసుకోవలసిన నిజాలు...   సాధారణంగా చిన్న పిల్లల్లో తినే అలవాట్లు ఒక్కొక్కరికి ఒక్కోరకంగా ఉంటాయి. పిల్లలు తక్కువ తినకపోయినా సమస్యలే.. ఎక్కువ తిన్నా సమస్యలే. ముఖ్యంగా కొంతమంది పిల్లలు ఏది పడితే అది తినడం వల్ల ఓబెసిటీకి గురవుతుంటారు. మరి అలాంటి అనారోగ్య సమస్యలకు గురికాకుండా ఉండాలంటే కొన్ని ఆహార పద్దతులు పాటించక తప్పదు. అలాంటి వారికోసమే డాక్టర్ జానిక శ్రీనాథ్ డైట్ ప్లాన్ చెబుతున్నారు. ఈ వీడియో చూసి అదేంటో మీరు కూడా తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=6xcpYkxWxto

పిల్లలుకి చిన్నప్పుడే అన్ని రుచులు అలవాటు చేయాలి..   కొంతమంది పిల్లలు కొన్ని రుచులకు మాత్రమే అలవాటు పడతారు. అది వారి తప్పు కాదు. మనం చిన్పప్పటినుండే వారికి అన్నిరుచులు అలవాటు చేయకపోవడం. మరి వారికి అన్ని రుచులు ఎలా అలవాటు చేయాలి.. వారి ఆహారపు అలవాట్లు ఎలా పెంపొందించాలి అనే విషయాలు డాక్టర్ జానకి శ్రీనాథ్ ఈ వీడియో ద్వారా మనకి వివరిస్తున్నారు. ఈ వీడియో అవెంటో తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=cx-odGFMB9I  

పిల్లలు సరిగ్గా తినటం లేదా ? ఇదిగో చిట్కాలు   మీ పిల్లలు సరిగ్గా తినడం లేదా. అయితే అలాంటి తల్లులకు డాక్టర్ జానకి శ్రీనాథ్ కొన్ని చిట్కాలు చెబుతున్నారు. ఈ వీడియో చూసి ఆ చిట్కాలు మీరు కూడా పాటించండి...  https://www.youtube.com/watch?v=5d7oJ_nr5fU

మీ పిల్లలు ఫిట్ గా వుండాలంటే ఈ ఆహరం ఇవ్వండి..   చిన్న పిల్లలు ఎదుగుతున్నప్పుడు సరిగ్గా తినడానికి అంతలా ఇంట్రస్ట్ చూపించరు కొంతమంది. చిన్న వయసులో జాగ్రత్తలు తీసుకోకపోతే దాని ప్రభావం వారికి తరువాత చూపిస్తుంది. అందుకే చిన్నప్పటినుండే మంచి ఆహారం అలవాటు చేయాలి వారికి. మంచి డైట్ అలవాటు చేయాలి వారికి. మరి ఈ డైట్ ఎలా ప్లాన్ చేయాలి అనే విషయాలు చక్కగా వివరిస్తున్నారు డాక్టర్ జానకి శ్రీనాథ్. మరి ఈ వీడియో చూసి మీ పిల్లలకు మంచి డైట్ ప్లాన్ చేసుకోండి..   https://www.youtube.com/watch?v=UrKZ4Qdhg6c  

మీ పిల్లలు తక్కువ బరువున్నారా..? అయితే ఈవీడియో చూసి ఏం చేయాలో తెలుసుకోండి...    

జంక్ ఫుడ్ పిల్లల ఆరోగ్యం పై చూపించే ప్రభావం!   జంక్ ఫుడ్‌ సంస్కృతి దేశంలో శరవేగంగా పెరిగిపోతుంది. పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అందరూ జంక్ ఫుడ్ కు బానిసలైపోతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఈ జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు. మరి ఈ జంక్ ఫుడ్ పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది... ఈ జంక్ ఫుడ్ వల్ల వచ్చే సమస్యలు ఏంటో చెబుతున్నారు డాక్టర్ జానకి సుజాత. మరి ఈ వీడియో చూసి అవెంటో తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=XbtVchDNYy0

Type 1 Diabetes ఉన్న పిల్లలు ఎలాంటి ఆహారం తోసుకోవాలి..   టైప్-1 డయాబెటీస్‌తో బాధపడుతున్న పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటే.. మామూలు పిల్లలు లాగా మంచి పర్సనాలిటీ, హైట్ పొందగలుగుతారో డాక్టర్ జానకీ శ్రీనాథ్ గారి మాటల్లో తెలుసుకుందాం. https://www.youtube.com/watch?v=XIVaKjmDCxQ  

Back Pain and Ligament Pain During Pregnancy.. ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా మహిళలు డాక్టర్లు రెస్ట్ తీసుకోమన్నారు కదా అని ఎలాంటి పని చేయకుండా అలాగే ఉంటారు. కానీ అలాగే ఉన్నా లేనిపోని సమస్యలు వచ్చిపడతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లోనే కొన్ని వ్యాయామాలు చేసుకోవచ్చు. ఏయే వ్యాయామాలు చేస్తే మంచిది... వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో డాక్టర్ వినత పులి ఈ వీడియో ద్వారా చెబుతున్నారు. మీరు కూడా ఆ వ్యాయామాలు ఏంటో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=ciyynLG_zec

గర్భిణీ స్త్రీలు గ్రహణంలో ఏం చేయాలి?   ఈ నెల 31న చంద్రగ్రహణం ఉన్న విషయం అందరికీ తెలిసిందే! ఇంట్లో ఎవరన్నా కడుపుతో ఉంటే... వాళ్లు ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణం సమయంలో అసలు బాత్రూంకి కూడా వెళ్లకూడదని చెప్పే మాటలో నిజం ఎంత తెలుసుకుందామా! గ్రహణ సమయంలో, అల్ట్రావైలెట్‌ రేస్‌ ఎక్కువగా ఉంటాయన్నది మన పూర్వీకుల నమ్మకం. అందుకని ఈ సమయంలో వీలైనంత వరకూ ఇంటిపట్టునే ఉండాలని అంటారు. ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఆహారపదార్థాలు, నీరు మీద చెడు ప్రభావం చూపుతాయట. అందుకనే ఆహారపదార్థాలు, నీరు ఉంచిన పాత్రలు, పూజాగదుల మీద దర్భలు ఉంచమని చెబుతారు. ఇక గర్భిణీస్త్రీలు గ్రహణం సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలన్నది పెద్దల మాట. వారి కడుపులో పెరిగే లేత పిండం మీద ఆ గ్రహణకిరణాల ప్రభావం ఉంటుందేమో అని వారి భయం. ఈ భయంతోనే వారు గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకూడదని చెబుతారు. ఇప్పుడంటే ఎటాచ్డ్ బాత్రూంలు వచ్చేశాయి కానీ... పూర్వం బాత్రూంలన్నీ ఇంటి బయటే ఉండేవి. కాలకృత్యాలు తీర్చుకోవాలంటే ఇంటి నుంచి బయటకి రావాల్సిన పరిస్థితి. గ్రహణం సమయంలో ఇలా కూడా బయటకి రావడం ప్రమాదం అని భావించి, ఆ సమయంలో బాత్రూంకి కూడా వెళ్లొద్దని చెప్పేవారు. మారిన కాలంలో ఆ ఆచారాన్ని బలవంతంగా పాటించాల్సిన అవసరం లేదు. ఇక గర్భిణీ స్త్రీలు గ్రహణం సమయంలో కాయగూరలు తరగకూడదన్నది మరో ఆచారం. కడుపుతో ఉన్నవారు, ఏం చూసినా, ఏం చేసినా... వారి మనసు మీద బలమైన ముద్ర పడుతుంది. ఆ ప్రభావం బిడ్డ మీద కూడా ఉంటుంది. గ్రహణంలాంటి సయయంలో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండవచ్చు. ఎందుకంటే జాతకరీత్యా చంద్రుడికి మనసుని ప్రభావం చేసే శక్తి ఉంటుంది. అందుకనే వారిని- పదునైన వస్తువులతో తరగడం, కోయడంలాంటి పనులకు దూరంగా ఉండమని చెబుతారు. గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలని నిద్రపొమ్మని చెప్పడం వెనక కూడా బలమైన కారణం కనిపిస్తుంది. గ్రహణం సమయంలో వీలైనంతవరకూ బయటకి వెళ్లకూడదన్నది కదా ఆచారం. ఇలా ఇంటిపట్టునే ఉంటే ఏం తోచదు కాబట్టి, భగవంతుని నామస్మరణ చేసుకోమని చెబుతారు. కడుపుతో ఉన్నవారికి అంత ఓపిక కూడా ఉండదు కాబట్టి, వాళ్లని ప్రశాంతంగా పడుకోమని సూచిస్తుంటారు.  https://www.youtube.com/watch?v=XEgiU_XxEtE

Scanning For Pregnant..   ప్రగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలు ప్రతినెల స్కానింగ్ లు తీసుకుంటూనే ఉంటారు. బిడ్డ ఎదుగల ఎలా ఉంది.. ఇంకా ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో స్కానింగ్ లు తీయించుకుంటారు. అయితే ప్రగ్నెన్సీ సమయంలో ఎలాంటి స్కానింగ్ లు చేయించుకోవాలి... ఎలాంటి స్కానింగ్ లు తీయించుకుంటే ఇబ్బందులు తలెత్తవు.. వంటి జాగ్రత్తలు చెబుతున్నారు డాక్టర్ వినతా పులి. ఈ వీడియో చూసి మీరు కూడా ఆ జాగ్రత్తలు తెలుకోండి... https://www.youtube.com/watch?v=TF179Sb81LI

పరీక్ష సమయంలో వచ్చే భయమును అధిగమించడానికి ఎలా..   పరీక్షలు దగ్గరపడుతున్న కొద్ది కొంతమందికి ఒకటే భయం, కంగారు మొదలవుతాయి. కొంతమంది బాగా చదివే వాళ్లున్నా.. వారిలో తెలియకుండానే భయం అనేది ఆవహిస్తుంది. అలాంటి వారు...తమలో ఉన్న భయాన్ని పొగొట్టుకొని..పరీక్షల్లో మంచి ఫలితాలు తెచ్చుకోవాలంటే ఈ వీడియో చూడండి... భయాన్ని పొగొట్టుకోండి..  https://www.youtube.com/watch?v=8eoMXVkmMFg  

పరీక్షల సమయంలో ఏకాగ్రత శక్తిని పెంచడంఎలా..!  ఎగ్జామ్స్ టైం సమయంలో కొంత మంది ఎంత కాన్సన్ ట్రేషన్ చేసినా కానీ... చదువు మీద మనసు లగ్నం కాదు. దాని ఫలితం పరీక్షల్లో కనిపిస్తుంది. అలాంటి సమస్యతో బాధపడుతున్న వారు ఈ వీడి చూసి.. ఎలా కాన్సన్ ట్రేషన్ గా ఉండాలి..  కాన్సన్ ట్రేషన్  పవర్ ను ఎలా పెంచుకోవాలో తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=njpETipNGuU