చలికాలంలో చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి! చిన్నపిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వారిఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి.  పిల్లలలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాతావరణ మార్పులకు వారి ఆరోగ్యం చాలా తొందరగా ప్రభావితం అవుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కొనసాగుతున్న కారణంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలు మరింత ఎక్కువగా ఉండాలి. చిన్న పిల్లలున్న ప్రతి  ఇంట్లో కొన్ని జాగ్రత్తలుతప్పనిసరిగా తీసుకోవాలని చిన్న పిల్లల వైద్యులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే.. చల్లని వాతావరణం కొనసాగుతున్న కారణంగా చిన్న పిల్లల శరీర ఉష్ణోగ్రతను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలి. దీనివల్ల  పిల్లలలో  సీజనల్ సమస్యలు ఎప్పటికప్పుడు చెక్ చేసినట్టు అవుతుంది. పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు కాబట్టి అప్పుడప్పుడు  వారిని తాకి ఉష్ణోగ్రత చెక్ చేసుకోవాలి. చలికాలంలో పిల్లల శరీర ఉష్ణోగ్రతలు చాలా తొందరగా పెరగడం, అంతే తొందరగా పడిపోవడం జరుగుతుంది. చలిని భరించే క్రమంలో పిల్లలలో వేడి ఎక్కువగా, వేగంగా ఉత్పత్తి కావడం వల్ల పిల్లలో అల్పోష్ణస్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రత స్థితినుండి పిల్లలను కాపాడుకోవాలి అంటే పిల్లలకు వెచ్చని దుస్తులు వేయాలి. అలగే పిల్లల పాదాలు, చేతులు, తలను కూడా వెచ్చగా ఉండేలా కవర్ చేయాలి. ఒట్టి ఒళ్లుతో పిల్లలను అస్సలు ఉంచకూడదు. పిల్లలకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం స్నానం చేయించడం . వారిని శుభ్రంగా ఉంచడం, అందంగా తయారుచేయడం తల్లుల అలవాటు. అయితే చలి దృష్ట్యా పిల్లలకు స్నానం చేయించడం తగ్గించాలి. వీలైనంత వరకు పిల్లలను వెచ్చని నీళ్లలో ముంచిన మెత్తని టవల్ లేదా నూలు బట్టతో ఒళ్లంతా తుడవాలి. చలికాలంలో ఇలా చేస్తే సరిపోతుంది. పిల్లలకు స్నానం చేయిస్తే వారిని చల్లని వాతావరణం లేదా చలి గాలులకు శరీరం తగిలేలా ఉంచకూడదు. ఇంటి కిటికీలు. తలుపులు మూసి ఉన్న గదిలో పిల్లలను ఉంచాలి. లేకపోతే చాలా సులువుగా జలుబు, దగ్గు సమస్యలు వస్తాయి. చలికాలంలో లేత సూర్యకాంతిలో పిల్లలకు ఆవనూనెతో శరీరమంతా బాగా మసాజ్ చేయడం వల్ల పిల్లలలో రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది పిల్లలు చురుగ్గా ఉండేలానూ, రోగనిరోధక శక్తిని పెంచేలానూ చేస్తుంది. పేగా పిల్లలలో కండరాలు బలపడతాయి. బాగా నిద్రపోతారు. పిల్లల శరీరం పొరపాటున కూడా పొడిగా ఉండనివ్వకూడదు. స్నానం చేయించడం లేదా తడిబట్టతో ఒళ్లు తుడిచిన తరువాత  తప్పనిసరిగా పిల్లలకు లోషన్ రాయాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. చలికి చర్మం ఎఫెక్ట్ కాకుండా చేస్తుంది. చిన్న పిల్లలు సీజనల్ వ్యాధులను ఎదుర్కోవడానికి  వారికి లభించే గొప్ప ఆహారం తల్లిపాలు. ఇది పిల్లలకు గొప్ప ఔషదంగా పనిచేస్తుంది. రోగనిరోధక శక్తని పెంచుతుంది. అనారోగ్యం బారిన పడకుండా చేస్తుంది.                                         *నిశ్శబ్ద.

మీ పిల్లలు బాగా ఒత్తిడిగా ఫీలవుతున్నారా?  ఈ పనులు చేయండి! ఒత్తిడి అనేది కేవలం పెద్దవారిలో మాత్రమే కాదు.. పిల్లలలో కూడా ఉంటోంది. నేటికాలంలో పరీక్షలు, ర్యాంకులు, పెద్ద స్కూళ్లలో సీట్లు, ప్రాజెక్ట్ లు, ఇంకా చిన్న వయసులోనే పెద్ద టార్గెట్లు. ట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు.. ఇలా ఒకటనేమిటి చిన్న బుర్రలకు ఉరుకులు పరుగులే సరిపోతున్నాయి. ఇవన్నీ పిల్లల మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. పిల్లలో  ఈ ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి. పిల్లలతో ఏ విషయాన్ని అయినా ఎలాంటి సందేహం లేకుండా మాట్లాడాలి. దీని వల్ల పిల్లలకు కూడా వారి మనసులో ఉన్న విషయాలను స్పష్టంగా చెప్పడం సాధ్యమవుతుంది. పిల్లలలో భయాలు, ఆందోళనలు, మనసులో ఉన్న దిగులు ఇలా అన్నీ పిల్లలు చెప్పగలుగుతారు. కాబట్టి పిల్లలతో ఏదైనా ఓపెన్ గా మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. పెద్దవాళ్లకు ఉన్నట్టుగా పిల్లలు కూడా తమ పనులు చేసుకోవడానికి టైం టేబుల్ ఏర్పాటు చేయాలి. దీన్ని పిల్లల అభిరుచికి తగ్గట్టు వాళ్లతోనే చేయించాలి. భోజనం, హోం వర్క్, ఆడుకునే సమయం, అభిరుచుల కోసం సమయం ఇలా అన్నింటికి సమయం కేటాయించాలి. ఇది పిల్లలకు పనులు సులువుగా సమయానికి పూర్తీ చేసి ఒత్తిడి తగ్గిస్తుంది. పెద్దవాళ్లకు పిల్లలకు అందరికీ ఆరోగ్యకరమైన జీవనశైల్ అవసరం అవుతుంది. పిల్లు తగినంత నిద్ర, సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం వంటివి పాటిస్తుంటే వారిలో భావోద్వేగాలు కూడా నిలకడగా ఉంటాయి. పెద్దలు చాలామంది మానసికంగా నిలకడగా లేకపోతే కోపం చేసుకోవడం, అరవడం, చికాకు ప్రదర్శించడం వంటివి చేస్తుంటారు. అయితే మరికొందరు మాత్రం ఈ మానసిక నిలకడ కోసం రిలాక్సేషన్ టెక్నిక్స్ ఫాలో అవుతారు. లోతైన శ్వాస వ్యాయామాలు, ధ్యానం, గైడెడ్ ఇమేజరీ వంటి మానసికి రిలాక్సేషన్ పద్దతులను పిల్లలతో సాధన చేయించాలి. పిల్లలకు ఆడుకోవడం ఇష్టం. పిల్లలను ఆడుకోవద్దని తిడితే వారు కోప్పడతారు. అయితే వారు ఆడుకుంటూ ఉంటే సరిగ్గా చదవరని తల్లిదండ్రుల భయం. అందుకే పిల్లల ఆటలకు సమయం కేటాయించాలి. పిల్లలలో ఆటల పట్ల ప్రతిభ కనిపించినట్లైతే ఆ ఆటలలో కూడా పిల్లలను ప్రోత్సహించాలి. ఆటలు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపస్తుంది. గెలుపు ఓటమిలను సమానంగా తీసుకునే మెంటాలిటీ అలవాటు అవుతుంది. పిల్లలు మొబైల్ ఫోన్, టీవి, కంప్యూటర్ వంటివి చూడటానికి వారికి ఓ నిర్ణీత సమయాన్ని కేటాయించాలి. దీనివల్ల వారు ఫోన్ కు అడిక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇది వారి కంటి ఆరోగ్యానికి కూడా మంచిది. పిల్లలు చాలావరకు పెద్దలను చూసి తాము కూడా పనులు చేస్తుంటారు. ఈ అనుకరణ వల్ల పిల్లల విషయంలో ఎలాంటి తప్పులు జరగకూడదు అంటే తల్లిదండ్రుల ప్రవర్తన సరిగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లలకు రోల్ మోడల్స్ లా ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే పిల్లలకు తల్లిదండ్రులు ఉన్నారనే భరోసా ఇవ్వాలి. ఇలా ఉంటే పిల్లలు ఒత్తిడి ఫీల్ కారు. ఇంట్లో కూడా పిల్లలకు అనువైన వాతావరణం ఉంచాలి. పిల్లల  భవిష్యత్తు ముఖ్యం కాబట్టి వారి గురించే ఆలోచించాలి. ఏ విషయాన్ని అయినా ఓపికతో పరిష్కరించాలి.          *నిశ్శబ్ద.

పిల్లలలో ఎముకలు బలంగా ఉండాలంటే రోజూ ఇదొక్కటి పెట్టండి చాలు! పెద్దలు ఆరోగ్యంగా ఉండటానికి ఏం తినాలి? ఏం తాగాలి అన్న విషయాలపై అవగాహన కలిగి ఉంటారు. దానికి తగ్గట్టే ఆహార పానీయాలు తీసుకుంటారు. కానీ చిన్నపిల్లలకు తమ దీమ తమకు ఆరోగ్య అవగాహన ఉండదు. తల్లిదండ్రులు పిల్లలకు ఆహారం ఇవ్వడమంటే పెద్ద టాస్క్ లానే ఉంటుంది.  పిల్లలు ఏదీ సరిగ్గా తినరు, తాగరు. ఏమైనా బలవంతంగా పెట్టాలని చూసినా సగం సగం తిని పారిపోతారు. ఇలాంటి పిల్లలకు పోషకాహారం అందకపోతే వారి ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. మరీ ముఖ్యంగా పిల్లలకు సరిపడినంత కాల్షియం, ఐరన్ లభించకపోతే చాలా ఇబ్బందులు, పోషకాహార లోపం ఏర్పడతాయి. వీటిని అధిగమించడానికి పిల్లలకు తెలివిగా ఆహారం ఇవ్వాలి. ఒకే ఒక్క ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లలలో చాలా పోషకాలు భర్తీ అయ్యేలా ప్లాన్ చెయ్యాలి. దీనికి నువ్వుల లడ్డు బెస్ట్ ఛాయిస్. పిల్లలకు రోజులో ఏదో ఒక సమయంలో నువ్వుల లడ్డు ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజాలు ఏంటో తెలుసుకుంటే.. నువ్వులు చిన్నపిల్లలకు, మహిళలకు చాలా ముఖ్యమైన ఆహారం.   ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు కలిగి ఉంటుంది. నువ్వులలో మోనో అన్ శాచ్యురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి పిల్లలలో ఎముకలు, కండరాల పెరుగుదలకు చాలా సహాయపడతాయి.  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల నువ్వులు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. నువ్వుల లడ్డును ప్రతిరోజూ పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వారిలో జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. నువ్వులలో ఉండే మంచి కొవ్వులు మెదడు పనితీరును మెరుగు పరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. నువ్వులలో ఉండే మెగ్నీషియం  నాడీ వ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. పిల్లలు ఒక్క చోట కుదురుగా ఉండరు. వారికి ఆడుకోవడం అంటే ఇష్టం. కానీ కొంతమంది పిల్లలు కొద్దిసేపు ఆడుకోగానే అలసిపోయి నీరసంగా ఫీలవుతారు. ఇలాంటి పిల్లలకు రోజూ నువ్వుల లడ్డు తినిపిస్తే వారిలో శక్తి పెరుగుతుంది. నువ్వులలో ఉండే పోషకాలు పిల్లలకు గొప్ప సామర్థ్యాన్ని ఇస్తాయి. పిల్లలు రోజు మొత్తం చురుగ్గా ఉండేలా చేస్తాయి. పిల్లలో ఎక్కువగా కనిపించేది కాల్షియం లోపం. నువ్వులలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. నువ్వులలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణాశయ ఆరోగ్యాన్ని ప్రేగుల కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్దకం సమస్య అస్సలు దరిచేరదు.   యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల నువ్వులు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మరీ ముఖ్యంగా చలికాలంలో సీజనల్ సమస్యల నుండి పిల్లలను దూరం ఉంచాలంటే నువ్వుల లడ్డు పర్పెక్ట్.                                                   *నిశ్శబ్ద.  

 చిన్నపిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం పెట్టాలో తెలుసా! ఆహారం అందరికీ అవసరమే. మొక్కలు కూడా వాటి ఆహారాన్ని నేలలో ఉన్న ఖనిజాల రూపంలో తీసుకుంటాయి. ఇక జంతువులు, మనుషుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది? అయితే  పెద్దలు తీసుకునే ఆహారానికి పిల్లలు తీసుకునే ఆహారానికి చాలా తేడా ఉంటుంది. పిల్లలు పుట్టినప్పుడు తల్లిపాలు లేదా వైద్యులు సూచించిన పాలే ఆహారం. దాదాపు 6నెలల వరకు పిల్లలకు పాలే ఇవ్వాలి. ఆ తరువాత నుండి పిల్లలకు క్రమంగా ఇతర ఆహారాలు అలవాటు చేస్తుంటారు. అయితే కొంతమంది తల్లులకు తమ పిల్లలకు ఏ వయసులో ఏ ఆహారం ఇవ్వాలో సరిగ్గా తెలియదు. అలాంటి వారికి అవగాహన కల్పించడం కోసం పిల్లల వయసును బట్టి ఇవ్వాల్సిన ఆహారం గురించి చిన్న పిల్లల వైద్యులు, పోషకాహార నిపుణులు చెప్పిన విషయాలు వివరంగా తెలుసుకుంటే.. పిల్లలు పెరిగే కొద్దీ ఆహార క్రమం మారుతుంది. ద్రవాల నుండి మెల్లిగా వారు నమిలి తినే ఘనాహారాల వైపుగా వారి ఆహారపు అలవాట్లు మారుతాయి. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లల ఆహారంలో పిండి పదార్థాలు, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్స్, పాలు, పాల ఉత్పత్తులు మొదలైనవి తప్పనిసరిగా ఉండాలి. అలాగే పిల్లలలో జ్ఞాపకశక్తిని ప్రోత్సహించడానికి బ్రెయిన్ ఫుడ్, పిల్లలకు కావసిన ఆరోగ్యకరమైన కొవ్వులను భర్తీ చేసే ఆహారం, కాల్షియం లోపం ఉండకుండా, విటమిన్లు, ఖనిజాలు అందేలా ఆహారం ఇవ్వాలి. గుడ్లు ఇవ్వాలి.. ఏడాది దాటిన తరువాత పిల్లలకు గుడ్లు ఇవ్వాలి. గుడ్లలో విటమిన్-డి, విటమిన్-బి12, కాల్షియం, ఐరన్, ఒమెగా-3 యాసిడ్లు ఉంటాయి. ఇవి పిల్లలకు శారీరక  బలాన్ని ఇవ్వడంతో పాటు మెదడు ఎదుగుదలకు కూడా సహాయపడుతాయి. చిలగడ దుంపలు.. ఆరు నెలలు దాటిన తరువాత చిన్నపిల్లల ఆహారంలో చిలగడ దుంపలు చేర్చవచ్చు. చిలగడ దుంపలో విటమిన్-ఎ, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. బీటా కెరోటిన్ తయారీకి పొటాషియం చాలా అవసరం.  చిలగడ దుంపను మెత్తగా ఉడికించి పెట్టడం మంచిది. పాలు.. తల్లిపాల తరువాత పిల్లలకు సాధారణ పాలు కూడా ఇస్తుంటారు. అయితే ఏడాది వయసు లోపు పిల్లలకు ఆవు పాలు ఇవ్వడం నిషేదం. ఆవు పాలు తొందరగా జీర్ణం కావు. ఈ కారణంగా ఆవు పాలు ఇవ్వకూడదు. ఇక ఫార్ములా పాలు లేదా గేదె పాలు ఇవ్వవచ్చు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు రోజుకు 200 మి.లీ కంటే ఎక్కువ పాలు ఇవ్వకూడదు. పాలుకూడా విటమిన్-సి, విటమిన్-డి, కాల్షియం వంటివి అందిస్తాయి. కాబట్టి పిల్లలకు పాలు మంచి ఆహారం.                                                                                                         *నిశ్శబ్ద.

పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం పెడుతున్నారా? ఇది చదవాల్సిందే.. పిల్లలను కనడానికి యువతీయువకులు ఎంత సంతోషిస్తారో వారు పెరిగి పెద్దవుతున్నప్పుడు ఒకవైపు సంతోషం ఉన్నా అంతకు మించి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వారికి పాలు తాగించడం పెద్ద కష్టం కాదు. కానీ పిల్లలు పెరిగే కొద్ది అన్నం తినడానికి  చాలా మారాం చేస్తారు. దీనివల్ల పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని భయపడతారు. ఇందుకే పోషకాలను భర్తీ చేయడానికి హెల్త్ డ్రింకులు తాగించడానికి, అన్నం తినిపించడానికి వారిని ఏమారుస్తారు. ఒకప్పుడు కథలు చెబుతూ, భయపెడుతూ అన్నం పెట్టేవారు. కానీ ఇప్పుడు మొబైల్ లో కార్టూన్స్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారు. అసలు పిల్లలకు మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించవచ్చా?  అలా చేస్తే ఏమవుతుంది? నేటికాలంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆహారం పెట్టడానికి ఎన్నుకున్న సులువైన మార్గం మొబైల్ చూపిస్తూ అన్నం తినిపించడం. పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో జరిపిన కొన్ని అధ్యయనాల ప్రకారం రెండు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలలో 90శాతం మంది మొబైల్ లేనిదే ఆహారం తీసుకోవడం లేదు. ఇలా మొబైల్ చూస్తూ ఆహారం తీసుకోవడం అనేది పిల్లలకు ఒక అలవాటుగా మారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పిల్లలు అయినా, పెద్దలు అయినా మొబైల్ చూస్తూ లేదా టీవి చూస్తూ తింటే ఆహారం రుచి ఫీల్ కాలేరు. పిల్లలకు ఆహారం రుచి తెలియడం చాలా ముఖ్యం. మొబైల్ చూస్తూ తినడం వల్ల అది మిస్ అవుతారు. పైగా పరిధికి మించి తినేస్తారు. దీనివల్ల పిల్లలో ఊబకాయం ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. పిల్లలు మొబైల్ చూస్తూ తినడం వల్ల వారిలో జీవక్రియ మందగిస్తుంది. ఫిజికల్ యాక్టివిటీకి పిల్లలు దూరం అవుతార. ఎప్పుడూ మొబైల్ చూడటానికే ఇష్టపడతారు. మొబైల్ చూస్తూ అన్నం తినే పిల్లలు కృత్రిమంగా తయారవుతారు. వారికే తెలియకుండా వారిలో ఒక మానసిక శాడిజం అభివృద్ది చెందుతుంది. అదే ఇతరులను తిట్టడం, కొట్టడం, మొండి చేయడం వంటి పనులలో వ్యక్తం అవుతుంది. తల్లిదండ్రుల మాట అస్సలు వినరు. వారి ప్రవర్తన క్రమశిక్షణ లేని జీవితానికి దారితీస్తుంది. చిన్నతనంలోనే పిల్లలు అంత ఘోరంగా మొబైల్ చూస్తే వారి కళ్లు దెబ్బతింటాయి. చిన్నప్పుడే కళ్లజోడు వాడాల్సి రావడానికి అదొక కారణం.                                                          *నిశ్శబ్ద.  

చదువులో వెనుకబడిన పిల్లల విషయంలో తల్లిదండ్రులు చెయ్యాల్సిన పనులివే! పిల్లలు పుట్టినప్పటి నుండి తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి కలలు కంటారు. తమ పిల్లలు బాగా చదువుకోవాలని, మంచి స్థాయికి చేరాలని అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు తమకు తెలియకుండానే కొన్నితప్పులు చేయడం వల్ల పిల్లలు చదువులో వెనుకబడతారు.  కేవలం పాఠశాలలో ఉపాధ్యాయుల బోధనే కాదు తల్లిదండ్రులు కూడా తగినంత శ్రద్ద తీసుకుంటేనే పిల్లలు చదువులో రాణిస్తారు. లేకపోతే తరగతిలో వెనుకబడి ఉండటం, పరీక్షలలో పేలవమైన మార్కులు. చదువుకోవాలనే ఆసక్తి లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో తెలుసుకని వాటిని పాటిస్తే  పిల్లలు చదువులో మెరుగవుతారు. పిల్లలు పరీక్షలలో ఒక సబ్జెక్ట్ లేదా అన్ని సబ్జెక్ట్ లలో మార్కులు తక్కువ తెచ్చుకుంటున్నా,  వారు చదువు పట్ల  నిరాసక్తిగా ఉన్నా దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు ఇలాంటి పిల్లలను చూసి విసుక్కుంటారు. వేలరూపాయలు పోస్తున్నా చదవడం లేదని వేపుకు తింటూంటారు. అందుకే పిల్లలు తమ సమస్యను తల్లిదండ్రులతో చెప్పలేకపోతారు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూరితంగా మాట్లాడుతూ వారి సమస్య అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం ఆలోచించాలి. పిల్లలు తరగతిలో బోధించే విషయాల మీద శ్రద్ద చూపించకపోతే  తల్లిదండ్రులు పిల్లలో ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నించాలి.  తరగతిలో ఏం చెబుతున్నారు, ఎందుకు అర్థం కావడం లేదు వంటి విషయాలను   తెలుసుకుని వాటికి అనుగుణంగా పిల్లలకు విషయావగాహన పెంచాలి. పిల్లలు చదువులో వెనుకబడటానికి ప్రధాన కారణం వారికి విషయం అర్థం కాకపోవడం. కొందరు పిల్లలు విషయాన్ని రెండు మూడుసార్లు మళ్లీ మళ్లీ రివిజన్ చేస్తే తప్ప పూర్తీగా అర్థం చేసుకోలేరు. ఇంటి దగ్గర పిల్లలతో ఇవన్నీ చేయించే బాధ్యత తల్లిదండ్రులదే. చదువు విషయంలో పిల్లలు బట్టీ పడుతుంటే దాన్ని తల్లిదండ్రులే నివారించాలి. ఇది చాలా చెత్త అలవాటు. ఇంటి దగ్గర పిల్లలన చదివిస్తున్నప్పుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులు గమనించి దాన్ని ఆపు చేయించాలి. విషయాన్ని అర్థమయ్యే విధంగా ఉదాహరణలతో వివరించి చెప్పాలి. దీని వల్ల పిల్లలకు విషయం మీద స్పష్టత వస్తుంది. చాలామంది ఒంటరిగా చదువుతుంటారు. కానీ ఇది మంచిది కాదు. పిల్లలను కలసి చదువుకునే ప్రోత్సహిస్తే వారిలో చాలా స్కిల్స్  డవలప్ అవుతాయి. ముఖ్యంగా నలుగురిలో మాట్లాడటం అనే విషయంలో బిడియం పోతుంది. స్పీకింగ్ స్కిల్స్ పెరుగుతాయి. ఇంటి దగ్గర పిల్లలకు ఓ ప్రణాళిత ఏర్పాటు చేయడం తల్లిదండ్రుల కర్తవ్యం. దీని వల్ల పిల్లలు ఏ సమయానికి ఏది పూర్తీ చెయ్యాలో స్పష్టతతో ఉంటారు. ఆటల నుండి చదువు వరకు అన్ని విషయాలలో సాటిసిపై అవుతారు.                                                       నిశ్శబ్ద.  

ఏడాదిలోపు పిల్లలకు ఈ ఆహారాలు ఇవ్వకూడదు..!! 12 నెలల లోపు శిశువు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ విషయంలో తల్లిదండ్రులు మరింత శ్రద్ధ వహించాలి. ఇది పిల్లల ఎదుగుదల లేదా ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. బాల్యంలో పిల్లలు ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాటిలో ఎక్కువ కేలరీలు ఉండవచ్చు. అయితే ఆ ఆహారాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి. చక్కెర: 24 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు చక్కెర జోడించిన ఆహారాన్ని నివారించాలని శిశువైద్యులు సిఫార్సు చేస్తున్నారు. పిల్లలు చక్కెర రుచిని ఇష్టపడతారు. అదనంగా, ఇది అదనపు కేలరీలను జోడిస్తుంది. ఇది కాలక్రమేణా దంత క్షయానికి దారితీస్తుంది. చాలా మంది తల్లులు తమ బిడ్డ పాలలో శుద్ధి చేసిన చక్కెరను కలుపుతారు. అలాగే పిల్లలు పంచదారతో చేసిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. తేనె: ఆయుర్వేదంలో తనదైన స్థానాన్ని పొందిన తేనె అద్భుతమైన తీపి పదార్థం మాత్రమే కాదు అద్భుత ఔషధం కూడా. ఇందులో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చక్కెరకు తేనె ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా పరిగణిస్తారు. అయితే, శిశువులు అంటే 12 నెలల లోపు పిల్లలు తేనె తినకూడదు. తేనె యొక్క అధిక వినియోగం శుద్ధి చేసిన చక్కెరతో సమానమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. అందువల్ల, 12 నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు తేనె ఇవ్వకూడదు. ఉప్పు: 7 నుంచి 12 నెలల మధ్య పిల్లలకు రోజుకు 0.37 గ్రాముల సోడియం అవసరం. మీరు మీ బిడ్డకు ఎక్కువ ఉప్పు ఇవ్వకూడదు.అవసరమైన దానికంటే ఎక్కువ ఉప్పు ఇచ్చినప్పుడు పిల్లవాడు సోడియంకు గురవుతాడు. ఇది వారి అపరిపక్వ మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి ఉప్పు, చక్కెరను మితంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఆవు పాలు: తల్లులు తమ బిడ్డలకు తమ తల్లి పాలకు బదులుగా ఆవు పాలను ఇస్తారు . దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు.ఆవు పాలు అనేక పోషకాలను అందిస్తుంది. కానీ 12 నెలల లోపు పిల్లలకు ఇది పనికిరాదని చెబుతున్నారు. శిశువు యొక్క ఆరోగ్యకరమైన ఎదుగుదలకు, అభివృద్ధికి అవసరమైన విటమిన్ E, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను ఆవు పాలలో ఉండవు. పిల్లలకి అలెర్జీలు ఉండవచ్చు. ఆవు పాలలో భారీ ప్రోటీన్లు, మినరల్స్ ఉంటాయి. ఇది శిశువు యొక్క ఇంకా అభివృద్ధి చెందుతున్న మూత్రపిండాలపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తుంది. పండ్ల రసాలు: 12 నెలల లోపు పిల్లలకు పండ్ల రసాలు ఇవ్వకూడదని మీకు తెలుసా ? అవును, పండ్ల రసాలు ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఎటువంటి పోషక విలువలను అందించవు. ఎటువంటి పోషకాహార ప్రయోజనం లేకుండా పిల్లల ఆహారంలో చక్కెర ఉంటుంది.  ఇది పిల్లల దంతాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. బదులుగా, తాజా పండ్లను కట్ చేసి తినిపించండి.

పిల్లలలో అరుదైన వ్యాధి.. ఒక్క ఇంజెక్షన్ 17కోట్లు.. ఇంతకూ ఇదేంటంటే.. పిల్లలకు రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో కొన్నింటికి వైద్యం చేయించాలంటే లక్షలాది రూపాయలు ఖర్చవుతుంది. కానీ పిల్లలలో వచ్చే ఒక అరుదైన వ్యాధికి  వేసే ఇంజక్షన్ ధర ఏకంగా 17కోట్లని మీకు తెలుసా? ఈ మధ్యనే ఢిల్లీకి చెందిన ఒక పిల్లాడికి ఈ వ్యాధి రావడంతో ఈ వ్యాధి గురించి చర్చ నడుస్తోంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ పిల్లాడి వైద్యం కోసం ఫండ్స్ సేకరించి మరీ వైద్యానికి సహకారం అందించారు.  సగటు  పౌరుడి ఊహకు కూడా అందని ఇంత మొత్తం డబ్బును ఖర్చు చేయించే  ఈ వ్యాధి ఏంటి? దీనికి అంత డబ్బు ఎందుకు ఖర్చవుతుంది? వీటి గురించి  పూర్తీగా తెలుసుకుంటే.. ఢిల్లీకి చెందిన కనవ్ జాంగ్రా అనే 18నెలల పిల్లాడికి చాలా అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) టైప్ -1 అనే వ్యాధి వచ్చింది. ఇది జన్యుపరమైన వ్యాధి అని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి వచ్చిన వారి శరీరంలో కండరాలు చాలా బలహీనంగా మారిపోతాయి.  శరీరంలో మెదడు, వెన్నెముక, నాడీ కణాలలో లోపాల కారణంగా ఇది వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడం లేదా చనిపోవడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు దీనికి భారతదేశంలో చికిత్సలేదు. ఈ వ్యాధికి మందు అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. అది  కూడా ఒక ఇంజెక్షన్ రూపంలో దీనికి మందు లభ్యమవుతుంది. కానీ ఈ ఇంజక్షన్ ఖరీదు ఏకంగా 17కోట్లు. ఈ ఇంజెక్షన్  పేరు బోల్జెన్స్మా.   ఈ జబ్బు సాధారణంగా పెద్ద పిల్లలోనూ, చిన్నపిల్లలలో కూడా వస్తుంది. కానీ ఎక్కువ శాతం చిన్నపిల్లలకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీకి చెందిన 18నెలల పిల్లాడికి ఈ వ్యాధి సోకిందని తెలియడంతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్  క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బులు సేకరించారు. అయితే ఆయన అంత ప్రయత్నం చేసినా 10కోట్లా  50లక్షలు మాత్రమే పోగయ్యాయి.  కానీ ఈ వ్యాధికి మందు తయారుచేసి అందించే అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ పెద్ద మనసు చాటుకుంది. 17కోట్ల విలువైన మందును కేవలం 10.5కోట్లకే పిల్లాడికి ఇచ్చింది. ఈ వ్యాధి కారణంగా 18నెలల ఈ పిల్లాడు కూర్చోలేడు, నడవలేడు, ఏ పనీ చేయలేడు. పాపం తెలిసీ తెలియని వయసులో తనకేమయ్యిందో అర్థం కాక నరకయాతన అనుభవించాడు. ఆ దేవుడు ఈ పిల్లాడి యాతన చూసి చలించాడో ఏమో కానీ పిల్లాడికి వైద్యం అందేలా చేశాడు. ఇంజెక్షన్ వేసిన తరువాత ఈ పిల్లాడు సాధారణ పిల్లల్లా కూర్చోవడం, నడవడం చేస్తున్నాడు. అన్ని రోజులు పిల్లాడి గురించి తల్లడిల్లిపోయిన ఆ తల్లిదండ్రులు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. తమకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి తన కృతజ్ఞత తెలుపుకున్నారు. పిల్లలలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని, చిన్నతనంలో ఎదురయ్యే కొన్ని సమస్యలను ఆ వయసులోనే పరిష్కరించడం వల్ల పిల్లలకు ప్రమాదం తప్పినట్టు అవుతుందని వైద్యులు కూడా చెబుతున్నారు.                                                            *నిశ్శబ్ద.  

తల్లులూ తస్మాత్ జాగ్రత్త..మీ పిల్లలకు ఈ ఆహారం ఇవ్వకండి! మెదడుశరీరంలోని మిగిలిన భాగాల మాదిరిగానే మనం తినే ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తుంది. సరైన ఆహారం మెదడు పనితీరును మెరుగ్గా ఉంచుతుంది. అందుకే చిన్నతనంలో పిల్లల అధిక పోషకాలున్న ఆహారాన్ని అందించడం చాలా ముఖ్యం. అయితే కొన్ని ఆహారపదార్థాల పిల్లల మెదడుపై ప్రభావం చూపుతాయి. వారి ఎదుగుదలను దెబ్బతీస్తాయి. పిల్లల జ్ఞాపకశక్తిని ఏయే ఆహారాలు దెబ్బతీస్తాయో తెలుసుకుందాం. చిప్స్, పిజ్జా, బర్గర్లు: ప్యాక్ చేసిన చిప్స్,  పిజ్జా, బర్గర్లు, నూడుల్స్ ఇలాంటివి ఆరోగ్యానికి చాలా హానికరమైనవి. ఇవి మూడ్ స్వింగ్స్,  ప్రవర్తనా మార్పులతో పాటు పిల్లల్లో తలనొప్పి, హైపర్ యాక్టివిటీకి సంబంధించిన సమస్యలను పెంచుతాయి. నిత్యం వీటిని ఆహారంలో చేర్చినట్లయితే శ్రద్ధ, అభిజ్ఞా సామర్థ్యాలు క్రమంగా తగ్గుతాయి. కెఫిన్: కెఫీన్ కాఫీలో మాత్రమే ఉండదు. బదులుగా ఇది చాక్లెట్, టీ, కాఫీలలో లభిస్తుంది. నిజానికి, ఇది చాలా ప్రమాదకరమైనది. పిల్లలు రోజుకు 45 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవచ్చు.  అధిక కెఫిన్ ఉన్న పానీయాలు తాగడం వల్ల వణుకు, భయము, నిద్రలేమి, హైపర్యాక్టివిటీ, తలనొప్పి లేదా కడుపు నొప్పులు వస్తాయి. ఇవన్నీ వారి మానసిక అభివృద్ధిని ప్రభావితం చేస్తాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ ఫుడ్స్: ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండే ఆహారం మెదడు ఆరోగ్యం, అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఎక్కువగా వేయించిన ఆహారాలు, ప్యాక్ చేసిన స్నాక్స్, హైడ్రోజనేటెడ్ నూనెలతో ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో కనిపిస్తాయి. ఇటువంటి ఆహారాలు శిశువు మెదడులో వాపును పెంచుతాయి. అదనంగా, ఇది రసాయన సెరోటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. దీని ప్రభావం డిప్రెషన్, మెమరీ లాస్ కు దారితీస్తుంది. స్వీట్లు: పిల్లలు స్వీట్స్ ను ఎక్కువగా ఇష్టపడతారు. కానీ ఈ స్వీట్  పిల్లల మెదడు అభివృద్ధిని దెబ్బతీస్తాయి. స్వీట్లు, ఐస్ క్రీం, కేకులు వంటి బేబీ ఫుడ్స్‌లో స్వీటెయినర్ ఉంటుంది. ఇది  హైపర్యాక్టివిటీకి కారణమవుతుంది. పిల్లల ఆకలిని ప్రభావితం చేస్తుంది. రంగురంగుల ఆహారపదార్థాలు: మార్కెట్లో లభించే రంగురంగుల స్వీట్లు, జిలేబీలు పిల్లలను ఆకర్షిస్తుంటాయి.వీటిలో  కృత్రిమ రంగులు ఉంటాయి. పిల్లలలో శ్రద్ధ లోటు హైపర్యాక్టివిటీ డిజార్డర్, ఆందోళన, హైపర్యాక్టివిటీ, తలనొప్పికి దారితీస్తాయి. తల్లిదండ్రులు ఈ ఆహారపదార్ధాలకు పిల్లలను దూరంగా ఉంచడం మంచిది. వీటికి బదులుగా గుడ్లు, రంగురంగుల కూరగాయలు, చేపలు, ఓట్ మీల్, పాలు, పెరుగు, జున్ను, బీన్స్, చేపలు ఇవన్నీ కూడా పిల్లలు తరచుగా అందిస్తుండాలి. ఈ ఆహార పదార్ధాలు పిల్లల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

డ్రీమ్ ఫీడింగ్..  పిల్లలు రాత్రిళ్ళు నిద్రలేవడమనే సమస్యే ఉండదు.. ఈ సృష్టిలో తల్లికావడం చాలా గొప్ప  విషయం. చెప్పలేనంత అనుభూతి తల్లుల సొంతం.కొత్త తల్లి మనస్సులో శిశువుకు సంబంధించి అనేక ప్రశ్నలు, సందేహాలు ఉంటాయి. బిడ్డకు స్నానం చేయించడం నుంచి తల్లి పాలివ్వడం వరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి గందరగోళాల మధ్య కొత్త తల్లులకు మరొక సవాల్ రాత్రిపూట ఎదురవుతుంది.  రాత్రిపూట శిశువుకుపాలు ఇవ్వడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది.నవజాత శిశువులు తరచుగా రాత్రి సమయంలో మేల్కొంటారు.  ఈ సమయంలో బిడ్డకు  తల్లి  పాలు ఇవ్వడం, బిడ్డ నిద్రలోకి జారుకోవడం,  ఆ తరువాత మరికొద్దిసేపటికే  బిడ్డ మేల్కోవడం జరుగుతుంటుంది. దీనివల్ల తల్లికి నిద్రకరువవుతుంది. కానీ 'డ్రీమ్ ఫీడ్' బిడ్డకు మంచి నిద్రను ఇవ్వడంలో సహాయపడుతుంది.  ఇది మంచి ఎంపిక కూడా. అసలు  డ్రీమ్ ఫీడింగ్ అంటే ఏమిటి?  ఎలా చేయాలి?  ఎప్పుడు చేయాలి?  వీటికి సమాధానం తెలుసుకుంటే ఇవి చంటి బిడ్డలున్న తల్లులకు ఎంతగానో ఉపయోగపడతాయి. డ్రీం ఫీడింగ్ అంటే ఏమిటి? డ్రీం ఫీడింగ్ అంటే నిద్రలో బిడ్డకు పాలివ్వడం. డ్రీం ఫీడ్ సాధారణంగా రాత్రి 10 లేదా 11 గంటలకు నిద్రపోయే ముందు చేయాలి. ఇది రాత్రంతా శిశువు  కడుపు నిండుగా ఉంచుతుంది. బిడ్డ  చాలా కాలం పాటు ప్రశాంతంగా నిద్రించగలడు. డ్రీమ్ ఫీడింగ్ ఎలా చేయాలి? డ్రీం ఫీడింగ్ కోసం ప్రతిరోజూ ఒకే సమయంలో శిశువును నిద్రపోనివ్వాలి. ఇలా అలవాటు చేస్తే ఈ ఫీడింగ్ కూడా చాలా బాగా సక్సెస్ అవుతుంది.  అదే సమయంలో రాత్రి 10 లేదా 11 గంటలకు తల్లి పిల్లవాడిని ఎత్తకుండా, నిద్రలేపకుండా మెల్లగా పక్కన పడుకుని బిడ్డ నోటి దగ్గర తల్లి రొమ్మును సున్నితంగా అందివ్వాలి.  బిడ్డ స్వయంచాలకంగా పాలు తాగడం ప్రారంభిస్తాడు.ఆ సమయంలో బిడ్డను మెల్లిగా ఎత్తుకోవాలి.  ఇలా ఎత్తుకునేటప్పుడు లైట్ ఆన్ చేయవద్దు, తద్వారా అది బిడ్డ నిద్రకు భంగం కలిగించదు.  అంతేకాదు అవసరమనే కారణంతో డైపర్‌ను కూడా మార్చవద్దు. అయితే తల్లులు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ డ్రీమ్ ఫీడ్ లు ఎప్పుడూ మొదటిసారే విజయవంతం కావు. కాబట్టి కొంత సమయం తీసుకోవాలి.   శిశువు అలవాటు పడే వరకు డ్రీమ్ ఫీడ్‌ని మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ ఉండాలి. చాలా సార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో పూర్తిగా పాలు తాగుతారు,  ఉదయం వరకు నిద్రపోతారు.  కానీ కొందరు పిల్లలు డ్రీమ్ ఫీడ్ తర్వాత కూడా చాలా సార్లు రాత్రి మేల్కొంటారు. కొన్నిసార్లు పిల్లలు డ్రీమ్ ఫీడ్ సమయంలో మేల్కొంటారు, తర్వాత చాలా సేపు మెలకువగా ఉంటారు. ఇది సక్సెస్ కావాలంటే సమయం పడుతుంది. తల్లులు నిరాశతో దీన్ని ఆపకుండా రోజూ ప్రయత్నిస్తుంటే ఇది సక్సెస్ అవుతారు. లాభాలేంటంటే.. డ్రీమ్ ఫీడ్ తో బిడ్డ ఎక్కువ సేపు నిద్రపోతాడు. ఇది పిల్లలకు అలవాటైతే   పిల్లలు ఉదయం నేరుగా మేల్కొంటారు. ఇదొక మంచి అలవాటుగా మారుతుంది. డ్రీం ఫీడింగ్ తల్లి,  బిడ్డ బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. కాబట్టి తల్లులు  నిరాశ పడకుండా దీన్ని అలవాటు చేయడం మంచిది.                                                                      *నిశ్శబ్ద.

పిల్లలకు తల్లిదండ్రులు నేర్పవలసిన పాఠాలు! పిల్ల‌ల ఎదుగుదలను చూసి సంతోషించని త‌ల్లిదండ్రులు ఉండ‌రు. అయితే ఈ క్ర‌మంలో తెలియ‌కుండానే వాళ్ల‌కి కొన్ని విష‌యాల‌లో అతిగా స్వేచ్ఛ‌ను ఇస్తుంటారు. మ‌రికొంత‌మంది .. పిల్ల‌ల‌కు అస్స‌లు స్వేచ్ఛ ఇవ్వ‌కుండా ప్ర‌తీ విష‌యంలో త‌ల్లిదండ్రులు చెప్పినట్లే చేయాల‌ని వాళ్ల మీద విప‌రీత‌మైన ఒత్త‌ిడి తెస్తారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పిల్ల‌లు మ‌న మాట లెక్క‌చేయ‌క‌పోవ‌డం లేదా అతి క్ర‌మ‌శిక్ష‌ణ వ‌ల‌న యాక్టివ్‌గా లేక‌పోవ‌డం వంటి దుష్ప్ర‌భ‌వాలు క‌లిగే అవ‌కాశం ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల వ‌ల‌న పిల్ల‌లు కొన్ని సంద‌ర్భాల్లో త‌ల్లిదండ్రుల మాట లెక్క‌చేయ‌డం మానేసి వారికి న‌చ్చిన‌రీతిలో వారు ఉంటారు. అంతేకాకుండా వారికి ఉండే చిన్న చిన్న ఇబ్బందుల‌ను కూడా మ‌న‌తో షేర్ చేసుకోవ‌డం త‌గ్గించి వారికి వారే సొంత నిర్ణ‌యాలు తీసుకొని పెడ‌దారిన ప‌డే అవ‌కాశం కూడా లేక‌పోలేదు. అందుకే పిల్ల‌ల‌ను ఎలా పెంచాలో అనే విష‌యం గురించి తెలుసుకుందాం. 1. చ‌దువులో గాని, ఆట‌ల్లో గాని వారికి కావాల్సిన ప్రేర‌ణ‌ను మ‌నం అందించాలి. త‌ద్వారా వారిలో ఏదైనా సాధించ‌గ‌లం అనే పాజిటివిటీ పెరుగుతుంది. ప్ర‌తీ విష‌యానికి వాళ్ల మీద చిరాకు ప‌డ‌డం కూడా అంత మంచిది కాదు. ఇది వారు చెడు దారి వైపు వెళ్లేందుకు దోహ‌ద‌ప‌డుతుంది. 2. పిల్ల‌ల‌కు చిన్న‌ప్ప‌టి నుండి స‌హాయ‌ప‌డే గుణాన్ని అల‌వాటు చేయాలి. చిన్న‌త‌నం నుండి వారిలో స్వార్ధాన్ని నూరిపోయ‌కూడ‌దు. ఇతరుల అవసరాలకి స్పందించేలా వారిని ప్రోత్స‌హించాలి. అందువ‌ల‌న వారు అంద‌రితో క‌లివిడిగా ఉంటూ స్నేహ‌పూరిత వాతావ‌ర‌ణాన్ని అల‌వాటు చేసుకుంటారు. వారిలో ఏదో సాధించాల‌నే ఆశ‌యంతో పాటు ఇత‌రుల‌కు స‌హాయ‌ప‌డాల‌నే త‌ప‌న కూడా ఉండేలా వారిని ప్రోత్స‌హించాలి. 3. కొన్ని సంద‌ర్భాల్లో తెలియ‌కుండానే పిల్ల‌ల‌పై కోపాన్ని చూపిస్తాం . ఉదాహ‌ర‌ణ‌కు వారు మ‌న క‌ళ్ల ముందే ఏదైనా గోడ ఎక్క‌డం లేదా ప్ర‌మాద‌క‌ర వ‌స్తువుల‌తో ఆడుకోవ‌డం వంటివి చేసిన‌ప్పుడు ప‌ట్ట‌రాని కోపం వ‌స్తుంది. అయితే ఇలాంటి సంద‌ర్భాల‌లో మ‌నం కొంచెం నిగ్ర‌హంగా ఉంటూ వారిని ద‌గ్గ‌ర‌కు తీసుకొని అలా చేయ‌కూడ‌ద‌ని నెమ్మ‌దిగా చెప్పాలి. దాని వ‌ల‌న జ‌రిగే అన‌ర్ధాల‌ను వారికి వివ‌రించాలి. మ‌నం ఎంత ఎక్కువ వారి మీద కోపం పెంచుకుంటే వారు అంత మొండిగా త‌యార‌య్యే ప్ర‌మాదం ఉంది. వారి అల‌వాటును మ‌నం వ్య‌తిరేకించ‌డం వారు స‌హించ‌లేరు. అందుకే ముందుగా వారితో మంచిగా మాట్లాడి వారిని మ‌చ్చిక చేసుకోవాలి. 4. చాలా మంది తల్లితండ్రులు తమ బాగా చదువుకోవాలని అనుకుంటారు . అందువల్ల వారికి ఏ పని చెప్పకుండా ఎప్పుడూ చదువుకోమని చెప్తూ ఉంటారు .. అది చాలా తప్పు అలా చేయడం వల్ల పిల్లలు చాలా వత్తిడికి గురవుతారు . దానివలన లేనిపోని ఆరోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉంది .. పిల్లలకి చదువు విలువ ఏంటో అర్దం అయ్యేలా చెప్పండి .. అలాగే ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేయండి .. 5. అలాగే తల్లులు తమ పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండాలి .. చాలామంది పిల్లలకి స్కూల్ లో జరిగిన ఇంట్లో వాళ్ళకి చెప్పడం అలవాటు . ఇంట్లో వారి మాటలు వినేవారు లేకపోతే వారు బయట స్నేహితులకి ఎక్కువ అలవాటు అయ్యే అవకాశం ఉంది . వారితో ఎక్కువగా మాట్లాడుతుండడం వల్ల వాళ్ళు కూడా ఏ విషయాలు దాచుకోకుండా అన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. అది పిల్లల భవిష్యత్తు కి ఎంతో మేలు చేస్తుంది.  

 బిడ్డలకు తల్లిపాలే అమృతమని ఇందుకే అన్నారు.. సరైన పోషకాహారం  పిల్లల మొత్తం ఆరోగ్యానికి ఎంతో దోహదం చేస్తుంది. నవజాత శిశువుకు శరీరానికి అవసరమైన అన్ని పోషకాల కోసం ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఆ పోషకాలన్నీ తల్లిపాలలో పుష్కలంగా ఉంటాయి. అందుకే బిడ్డకు తల్లిపాలు అమృతసమానమన్నారు పెద్దల నుండి వైద్యుల వరకు. ప్రసవం తర్వాత వచ్చే మొదటి చిక్కటి పసుపు పాలు పిల్లల ఆరోగ్యానికి అమృతంలానే పనిచేస్తాయి. వీటిని ముర్రుపాలు అని అంటారు. ప్రసవించిన తరువాత గంటలోపు పిల్లలకు ముర్రుపాలు పడితే అవి  పిల్లల శారీరక,  మానసిక వికాసానికి దోహదం చేస్తాయి. కేవలం ముర్రుపాలు మాత్రమేకాదు. పిల్లలకు రోజువారీ తల్లిపాలు ఇవ్వడమే శ్రేష్టం.  తగినంత పరిమాణంలో తల్లిపాలు ఉండేలా చూసుకోవడం ప్రసవించిన ప్రతి మహిళకూ  అవసరమని  వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలివ్వడం గురించి పక్కన పెడితే బిడ్డను మోసి కనడంతో తమ అందం చెదిరిపోతుందనే అపోహలో చాలామంది మహిళలున్నారు. కానీ బిడ్డను మోసి కనడంలో ఉన్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ప్రసవం తరువాత కూడా తల్లి పాలివ్వడంలో ఆలోచించే మహిళలు చాలామంది ఉంటున్నారు. అందుకే తల్లిపాలివ్వడం  వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, బిడ్డలకు తల్లిపాలు ఇచ్చేలా  ప్రోత్సహించే   లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి 7 వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటారు. పుట్టిన ఆరు నెలల వరకు నవజాత శిశువుకు రోజూ తల్లిపాలు అందేలా చూడాలని నిపుణులు చెబుతున్నారు. తల్లి పాలలో ఉండే సూక్ష్మపోషకాలు నవజాత శిశువుల మెదడు అభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనలు కూడా వెల్లడించాయి. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలు.. శిశువు ఆరోగ్యంపై తల్లిపాలు వల్ల కలిగే ప్రభావాలను అర్థం చేసుకోవడానికి  కొన్ని  పరిశోధనల్లో ప్రయత్నించారు. బాల్యంలో తల్లి పాలివ్వడం ద్వారా పొందిన సూక్ష్మపోషకాలు వృద్ధాప్యంతో మెదడు సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనల్లో తేలింది. క్రమం తప్పకుండా తల్లిపాలు తాగే పిల్లలు తల్లిపాలు లేని పిల్లల కంటే ఎక్కువ మేధో అభివృద్ధి,  పనితీరును కలిగి ఉంటారు. బ్రెయిన్ డెవలప్‌మెంట్‌లో ప్రయోజనాలు.. పిల్లలకు తల్లిపాలివ్వడం  ప్రారంభించిన మొదటి  నెలలలో మైయో-ఇనోసిటాల్ అనే సూక్ష్మపోషకం తల్లిపాలలో ఉంటుంది.  అభివృద్ధి చెందుతున్న శిశువు మెదడుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది,  ఇది మెదడులోని న్యూరాన్ల మధ్య సినాప్సెస్ లేదా కనెక్షన్‌లను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఫలితంగా, భవిష్యత్తులో నరాల సంబంధిత సమస్యల ప్రమాదాలను తగ్గించడంలో  మెరుగ్గా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఏం చెబుతారంటే.. మొదటి నెలల్లో పిల్లల  మెదడు ముఖ్యంగా ఆహార లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. సూక్ష్మపోషకాలు మెదడుపై ఎలా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయనేది విషయం పట్ల న్యూరో సైంటిస్ట్ లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లిపాలలో ఇంత గొప్ప పోషకాలు ఎలా ఉంటున్నాయనేదాని మీద కూడా వీరు ఏ నిర్ణయాన్నిస్పష్టంగా చెప్పలేకున్నారు. కానీ తల్లిపాలు బిడ్డ మెదడు అభివృద్ధిలో  వివిధ దశలకు కూడా సహాయం చేయడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.   ఏది ఏమైనప్పటికీ 6నెలల లోపు పిల్లలకు తల్లిపాలకు మించిన గొప్పఆహారం దొరకదనేది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రసవించిన స్త్రీకి సహజంగా శరీరంలో ఉత్పత్తి అయ్యే పాలు బిడ్డల ఆరోగ్య భవిష్యత్తుకు వరం.                                                                       *నిశ్శబ్ద.  

చలికాలమని బెంగ ఎందుకు పిల్లల రక్షణ ఇలా సులువు!! చలికాలం అంటే అందరికీ వణుకు పుడుతుంది. ఈ కాలంలో జబ్బుల సమస్యలు కూడా ఎక్కువే. కేవలం చలి మనల్ని వణికిస్తుందనే మాట అటుంచితే చలి వల్ల చర్మం దెబ్బతింటుంది, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి, దానికి అనుబంధంగా వచ్చే సమస్యలు బోలెడు. పెద్దవాళ్లే ఈ సమస్యకు కుదేలైపోతారు. అలాంటిది ఎంతో సున్నితమైన చర్మం, మరెంతో తక్కువ ఇమ్యూనిటీ కలిగిన చిన్న పిల్లల మాటేమిటి?? వారికి స్వేట్టర్లు వేసి రక్షణ ఇవ్వడం నుండి తినడానికి ఇచ్చే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్కటీ సవాల్ విసిరేదిగా ఉంటాయి.  అయితే చలికాలంలో చిన్నపిల్లల సంరక్షణ పెద్ద సమస్య కాదు, కొన్ని జాగ్రత్తలు పాటించాలంతే అంటున్నారు పిల్లల వైద్యులు. పిల్లల కోసం పెద్దలకు కొన్ని చిట్కాలు.. పైన చెప్పుకున్నట్టు పెద్దల కంటే పిల్లల చర్మం సున్నితత్వం ఎక్కువ. కాబట్టి కాస్త చలిగాలి సోకినా చాలా తొందరగా ప్రభావం అవుతుంది. అంతేనా చర్మం పగుళ్లు వచ్చి మంట పుడుతుంది. వాటికి ఏమి చేయాలో తెలియని పసితనం పిల్లలది. చలికి దురద పెడితే బాగా గోకేస్తుంటారు. ఆ తరువాత అది కాస్తా మంట పుట్టి పెద్ద సమస్య అయ్యి కూర్చుంటుంది. అందుకే పిల్లలకు రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ రాయాలి. చర్మం ఏమైనా ఎఫెక్ట్ అయి ఉంటే పిల్లలు రాత్రి సమయంలో నిద్రపోతారు కాబట్టి చర్మం కొలుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. అలాగని ఉదయం రాయకూడదని కాదు. రాత్రి సమయాల్లో మాశ్చరైజర్ ప్రభావవంతంగా పని చేస్తుంది. పిల్లల కోసం ఎంచుకునే మాశ్చరైజర్ క్రీములు ఎప్పుడూ సహజత్వంతో నిండినవై ఉండాలి. ఎక్కువ ఘూఢత ఉన్నవి, కెమికల్స్ ఎక్కువ యూజ్ చేసినవి, కృత్రిమ రంగులతో నిండినవి అసలు ఎంచుకోకూడదు. ఇక పిల్లలకు తరచుగా ఎక్కువ ఎదురయ్యే సమస్య పెదవులు పగలడం, అలాగే పెదవుల మూలల్లో చీలడం. ఇది ఒక్కసారి వచ్చిందంటే తగ్గడం చాలా కష్టమవుతుంది. ఏమైనా తినడానికి పెదవులు తెరచినప్పుడు మూలలు సాగి చీలిన ప్రాంతంలో రక్తస్రావం కావడం జరుగుతుంది. దీనికి చక్కని సొల్యూషన్ పెట్రోలియం జెల్లీ. వైట్ పెట్రోలియం జెల్లీలో ఎలాంటి కెమికల్స్ ఉండవు. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్ ఇవ్వదు. కాబట్టి పెట్రోలియం జెల్లీని గంటకు ఒకమారు రాస్తూ ఉంటే ఒకరోజులోనే ఈ సమస్య తగ్గిపోతుంది. ఇక తరువాత ఈ సమస్య రాకూడదంటే డైలీ రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీ అప్లై చేయాలి. పిల్లలకు సాధారణంగానే చిరాకు తెప్పించే విషయం డైపర్. పెద్దలకు సౌకర్యంగా ఉంటుందని, పిల్లలు బట్టలను పాడు చేయకుండా ఉంటారనే కారణంతో డైపర్లు వాడుతున్నారు ఈ కాలంలో. అయితే వాటిని అపుడపుడు చెక్ చేస్తుండాలి. లేకపోతే డైపర్ల వల్ల పిల్లలకు రాషెస్ వచ్చి చర్మం దెబ్బతింటుంది. అలాగే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. చల్ల నీళ్లు, చల్లని ఆహారం, ఐస్ క్రీమ్స్, కేక్స్ లాంటి ఆహార పదార్థాలు పిల్లలకు పెట్టకూడదు. ఎక్కువ సమయం స్నానం చేయించడం,  స్నానం సమయంలో శరీరాన్ని పదే పదే రుద్దడం చేయకూడదు. అలాగే చలి కాలం కదా అని స్నానానికి మరీ వేడినీళ్లు ఉపయోగించకూడదు. స్నానం తరువాత పొడి గుడ్డతో శుభ్రంగా తుడవాలి, తరువాత మాశ్చరైజర్ రాయాలి. వేసే దుస్తులు వెచ్చదనాన్ని ఇచ్చేలా కాస్త వదులుగా ఉండాలి. చలి అనే నెపంతో బిగుతు దుస్తులు వేయకూడదు. ఉన్ని దుస్తులు వేయడం మంచిది.  పిల్లలకు చర్మ సంబంధ సమస్యలు వచ్చినప్పుడు కొబ్బరి నూనె లాంటి సహజ మార్గాలతో తగ్గకపోతే ఇతర సొంతవైద్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.                                        ◆నిశ్శబ్ద.

 Homemade Fruit Pops for Kids !       The hotter months bring along a variety of fruits and thirst too. Cooling off should not be damaging the health. Instead of using store bought sugary drinks or icecreams, Fruit Pops can be made at home....we dont need bulky Ice Molds....even if we have simple Ice cube trays at home, just blend in some ripe fruit and pour into the molds, pop into the freezer and Wallah...they are ready!! I always have these ready in my freezer, just to keep my child happy. Why should she feel bad that she isn't getting treats, or why should i give her those store bought sugar filled cold calories?! Infact, my homemade icepops are interesting to pop into the mouth for adults too....make a cold fruit salad with a variety of ripe fruits, or just drop a few of these colorful ones into a glass of plain water for the guests on a summer afternoon, or keep the kids busy trying to finish their icepops.... Almost every grocery store is selling BPA free, Silicon icecube trays and Small Muffin trays and Icepop molds. Crayola's products are interesting and safe. Making these fruit pops can be a fun kitchen project for the kids, give them this job and they will love it, both Making and Slurping ! They will learn a new job and also gulp those fruits they usually avoid eating. Let the fun be safe and healthy with these homemade Fruit pops!! - Prathyusha Tallari

పిల్లలు తెలివైనవారిగా ఎదగాలంటే ఇవి ఫాలో అవ్వాలి! చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే చాలా సందడిగా ఉంటుంది. మొదట్లో పిల్లలు చాలా అల్లరి చేస్తారు. ఆ తరువాత పిల్లలు ప్రశ్నల పుట్టలు అవుతారు. వారు ఇంట్లో ఉంటే ప్రతి విషయం గురించి ప్రశ్నిస్తూనే ఉంటారు. అది ఎలా ఉంది?? ఇది ఎలా ఉంది?? అదేంటి?? ఇది ఎందుకు ఇలా ఉంది?? వంటి ప్రశ్నలు పిల్లల నుండి వస్తూనే ఉంటాయి. చాలామంది ఇలా పిల్లలు ప్రశ్నిస్తున్నప్పుడు "పెద్ధయ్యే కొద్ది నీకు అర్థమవుతాయి లే" అని తోసిపుచ్చుతారు. కానీ వారు అడిగిన వెంటనే ఆ ప్రశ్నలను పరిష్కరిస్తే వారి మనసు, వారి ఆలోచన ఎంతో చురుగ్గా మారుతాయి. పిల్లలలో ప్రశ్నించే తత్వాన్ని ఎప్పుడూ అనిచివేయకుడదు. పనులు అప్పగించాలి.. పిల్లలు చేయదగిన చిన్న చిన్న పనులు కొన్ని ఉంటాయి. మొక్కలకు నీరు పోయడం, మార్కెట్ నుండి తెచ్చిన కూరగాయలు బయటకు తీయడం, వండుతున్న పదార్థానికి కావలసిన దినుసులు అందించమనడం. ఈ పనులు చేసేటప్పుడు పిల్లలు తల్లిదండ్రులతోనే ఉండటం వల్ల పిల్లలు ఎక్కడికో వెళ్లి ఏవైనా దెబ్బలు తగిలించుకుంటారేమో అనే భయం కూడా ఉండదు.  కొత్తగా ఉండాలి.. పిల్లలకు చేసిన పని మళ్లీ చేయాలంటే విసుగు వస్తుంది, వారు తొందరగా ఆసక్తిగా కోల్పోతారు. కాబట్టి వాళ్ళ మెదడు పదునెక్కాలంటే వాళ్లకు అప్పగించే పనులు  కొత్తగా ఉండాలి. పాత పని పిల్లలకు  నచ్చితే వాళ్ళే దానివైపు వెళతారు. భాగమవ్వాలి… పిల్లలతో తల్లిదండ్రులు భాగమైనప్పుడు పిల్లలు మరింత చురుగ్గా, ఆసక్తిగా పనులు చేస్తారు. వీలైనవరకు పెద్దలు పిల్లతో కలసి పనులు చేయాలి. ప్రకృతికి దగ్గరగా.. పిల్లలు ఇంట్లోనే ఉంటే వారి మెదడు అంతగా ఎదగదు. ప్రకృతికి దగ్గరగా ఉన్నపుడే వారి మెదడు ఉత్సాహంగా మారుతుంది. చెట్టు, చేమ, కొండలు, నీరు ఇవి మాత్రమే కాకుండా దేవాలయాలు, మ్యూజియం, పురాణ కథలు.. ఇలా ఎన్నో పిల్లల మెదళ్ళలో పాదరసంలా మారుతాయి.  కాబట్టి పిల్లలు చురుగ్గా . వారి ఆలోచనలు ఉన్నతంగా ఉండాలంటే ఇవన్నీ ప్రతి తల్లిదండ్రి గుర్తుంచుకుని ఫాలో కావాలి.                                           *నిశ్శబ్ద.

  సర్దుకుపోవడం నేర్పితే సమస్యలే వుండవు పిల్లలంటే అమ్మకి ఎంతో ప్రేమ. వారికి ఏ బాధా కలగకుండా చూసుకోవాలనుకుంటుంది. వారి ప్రతి కోరికా తీర్చాలనుకుంటుంది. పిల్లలు అడిగిందే తడవుగా వారు కోరినవన్నీ కొనివ్వాలనుకుంటుంది. అయితే ఇలా కోరినవన్నీ పొందటానికి అలవాటు పడ్డ పిల్లలు, కోరినది దొరకనపుడు సర్దుకుపోవటం ఎలాగో నేర్చుకోలేరు. మన చేతుల్లో వున్నంతవరకు వాళ్ళకి అన్నీ అందుబాటులో వుంచుతాం. కానీ జీవితంలో కోరినవన్నీ దొరకాలని లేదు కదా! మరప్పుడు దొరికిన దానితో సర్దుకుపోవటం ఎలాగో పిల్లలకు తెలీక ఇబ్బంది పడతారు. అందుకే గెలుపు, ఓటములు, సర్దుకుపోవటం వంటివన్ని మనమే పిల్లలకి రుచి చూపించాలి. ఇందుకు సంబంధించిన ఓ కథ చెప్పుకుందాం. ఒక ఊరిలో ఓ చిన్న కుటుంబం నివసిస్తోంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలని పోషిస్తూ వుండేవాడు.  సంపాదన తక్కువైనా పిల్లలు ఏది అడిగినా దానిని తీర్చాలని తాపత్రయం పడేవాళ్ళు ఆ దంపతులు.  ఒకసారి సెవెంత్ క్లాసు చదువుతున్నపుడు వాళ్ళ పెద్దకొడుకు రాకెట్ కావాలని అడుగుతాడు. తన ఫ్రెండ్స్‌కి వాళ్ళ మావయ్య అమెరికా నుంచి బొమ్మ రాకెట్ తెచ్చాడని, అలాంటిది తనకీ కావాలని పేచీ పెడతాడు. పిల్లల  కోరికలన్నీ తీర్చాలని వున్నా, ఈ కోరిక తీర్చటం వాళ్ళ స్థోమతకు మించినది. ఎలా మరి? అని మథన పడతారు అ దంపతులు. రాకెట్ కోసం పిల్లాడి పేచీ రోజురోజుకి పెరుగుతుందే కానీ తగ్గటం లేదు. చివరికి పిల్లాడి తల్లి ఓ నిర్ణయానికొస్తుంది. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి బోలెడన్ని రంగు కాగితాలు, జిగురు వంటివి తెచ్చిపెడుతుంది.   పిల్లలురాగానే వాళ్ళముందు రంగు కాగితాలు, కత్తెర, జిగురు పెడుతుంది. ఈ రోజు మనమే మంచి ఆట ఆడబోతున్నాం. ఈ రంగురంగు కాగితాలతో మీకు నచ్చినట్టు స్టార్స్‌ని, మూన్‌ని, సన్‌ని ఇలా అంతరిక్షాన్నంతటినీ మన గోడమీదకి తీసుకురావాలి. మీ గదిలోని గోడ పైన మీ ఇద్దరి క్రియేటివిటీతో అంతరిక్షాన్ని రెడీ చేస్తే ఆ అంతరిక్షం పైకి వాళ్ళే రాకెట్‌ని నేను మీకు ఇస్తాను అంటుంది. ఇక పిల్లలిద్దరూ హుషారుగా పని మొదలుపెడతారు గంటలు గడుస్తాయి. అమ్మా అయిపోయింది అని పిలుస్తారు. గోడ నిండా చుక్కలు, గ్రహాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. రాకెట్ ఏది అని అడుగుతారు పిల్లలు. ఆ తల్లి చిన్నగా నవ్వి మీ గదిలోని ఈ అంతరిక్షoలోకి వెళ్ళటానికి ఇదిగో ఈ కాగితం రాకెట్ సరిపోతుంది చూడండి అంటూ వివిధ సైజుల్లో చేసిన పేపరు రాకెట్లని చూపిస్తుంది. ఇదిగో ఎవరి రాకెట్ ఎక్కడికి వెళుతుందో విసరండి అంటుంది. పిల్లలిద్దరూ    పేపర్ రాకెట్లు విసురుతారు. ఆ ఆట వాళ్ళకి ఎంతో నచ్చుతుంది. మా ఫ్రెండ్ దగ్గరైతే బ్యాటరీలతో కొంతదూరం ఎగిరే రాకెట్ వుంది కానీ మన దగ్గర అంతరిక్షమే వుంది అంటారు. వాళ్ళ ఆనందాన్ని చూసిన తల్లికి అనిపిస్తుంది. పిల్లలు అడిగినవి మన చేతుల్లో లేనపుడు ‘‘లేదు’’ అని చెప్పటం కాదు వాళ్ళని ఎలా మళ్లించాలో తెలిసివుండాలి. ఆ తర్వాత ఆ పిల్లలు ఎప్పుడూ ఏ బొమ్మా కావాలని పేచీ పెట్టలేదు. నచ్చిన బొమ్మ కనిపిస్తే దానిని స్వయంగా ఎలా చేసుకోవచ్చో ఆలోచించేవారు.  అమ్మ సాయంతో రకరకాల బొమ్మలు తయారు చేసుకున్నారు. వారి ఆలోచనలకి పదును పెట్టారు, కొన్న బొమ్మలతో కూడా దొరకనంత తృప్తిని పొందారు. అన్నీ తెలుసుకోలేని వయను పిల్లలది. వారికి నిజమైన ఆనందాన్ని రుచి చూపిస్తే తప్పకుండా వారు ఆ దారిలో నడుస్తారు.  ఈసారి పిల్లలు అడిగినవన్నీ సమకూర్చాలని అనిపిస్తే ఒక్కసారి ఈ కథ గుర్తుచేసుకుంటారు కదూ! -రమ

పిల్లలు ఎత్తు పెరగడం లేదా.. అయితే ఇవి ఫాలో అవ్వండి చాలు! బరువు పెరగలన్నా, తగ్గాలన్నా, ఆహారాన్ని నియంత్రించుకోవలన్నా, రక్తపోటు, చక్కెర స్థాయిలను నియంత్రణలో పెట్టుకోవాలన్నా ప్రతిదానికి ఓ డైట్ ప్లాన్, ఓ సమయ పాలన ఉంటుంది. కానీ ఎత్తు పెరగడమనే విషయంలోకి  వస్తే.. అది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఎత్తు పెరగడం అనేది చిన్నతనం నుండి ఓ దశలోకి వచ్చి ఆగిపోతుంది. ఓ దశాబ్ద కాలాన్ని సరిగ్గా గమనిస్తే పిల్లలు తగినంత ఎత్తు పెరగడం లేదనే వాస్తవం అర్థం అవుతుంది. పిల్లలు పెరగాల్సిన వయసులో  వారు ఎత్తు పెరగడానికి తగిన వాతావరణం, తగిన ఆహారం లభించకపోవడమే పిల్లల్లో ఎదుగుదల లేకపోవడానికి కారణం అవుతుంది. పిల్లల ఎత్తును పెంచడానికి ఉత్తమ మార్గం తెలుసుకుంటే ప్రతి తల్లి తమ పిల్లల విషయంలో దాన్ని చక్కగా ఫాలో అవ్వచ్చు...  సాధారణంగా పిల్లలఎత్తు ప్రధానంగా జన్యువులతో నిర్ణయించబడుతుంది. అయితే, జీవనశైలి సరైన జన్యు సామర్థ్యాన్ని చేరుకోవడంలో చాలా వరకు సహాయం చేస్తుంది. ఆటలు ముఖ్యం.. పిల్లల్ని స్కూళ్ళు, ట్యూషన్లతో ఎప్పుడూ కట్టేసినట్టు ఉంచకండి. రోజులో కొంతసేపు కింది ఆటలు ఆడేలా ప్రోత్సహించాలి. బ్యాడ్మింటన్, టెన్నిస్ వంటి ఆటలు, ఈత, బాస్కెట్‌బాల్ వంటివి పిల్లలు ఎత్తు పెరగడానికి సహాయపడతాయి.  ఆహారంలో తగినంత ప్రోటీన్ చేర్చడం మరీ ముఖ్యం.  సరైన స్థాయిలో కాల్షియం, విటమిన్ డి పిల్లలకు అందించడం మరెంతో ముఖ్యం.  పొడవాటి ఎముకలలోని ఎపిఫైసెస్ (గ్రోత్ ప్లేట్లు) ఫ్యూజన్ కౌమారదశలో వస్తాయి. ఈ గ్రోత్ ప్లేట్లు ఫ్యూజ్ అయిన తర్వాత, నిలువు ఎముక పెరుగుదల ఆగిపోతుంది. అంటే తరువాత ఎత్తు పెరగదు. అబ్బాయిలకు సగటున 16-18 ఏళ్లు, బాలికలకు 14-15 ఏళ్లు సమయం ఎత్తు పెరుగుదలకు చివరి దశ.  ఈ సమయంలో గ్రోత్ హార్మోన్ ఉత్పత్తి మందగించి ఎపిఫైసెస్ ఫ్యూజ్ అవుతుంది. గ్రోత్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడానికి సహజమైన మార్గాలు ఉన్నాయి, ఇవి సరైన ఎత్తుకు చేరుకోవడంలో సహాయపడతాయి. వీటిలో పైన చెప్పుకున్నట్టు  ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి బాగా అందేలా చూసుకోవాలి. ఆటలు ఆడటం  తప్పనిసరి. ముఖ్యంగా బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్ వంటి ఎముకల పొడవును ప్రేరేపించే ఆటలు ఆడించాలి.  పొడవు పెరగాల్సిన దశ దాటిపోయాక ఎన్ని ప్రయోగాలు చేసినా పొడవు ఒరేగడం కుదరదు. ఈ విషయన్ని ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.  ముఖ్యంగా పిల్లలజీవనశైలిలో ఆహారంలో తెలియని మార్పులు చేసే ముందు ప్రతి తల్లి వైద్యులను సంప్రదించిన తరువాతే వాటిని పాటించాలి.                              ◆నిశ్శబ్ద.  

పిల్లలు ఎత్తు పెరగాలన్నా.. దృఢంగా ఉన్నాలన్నా ఈ ఆసనాలు వేస్తే చాలు! వేసవి సెలవులు ప్రారంభమయ్యాక పిల్లలను కంట్రోల్ చెయ్యడం పెద్దలకు కాస్త కష్టమే. మండిపోతున్న ఎండల్లో పిల్లలను బయటకు పంపాలంటే భయం. అలాగై వాళ్ళు ఇంట్లో ఉండాలంటే చాలా చిరాకు పడతారు. ఈ కారణంగా పిల్లలకు టీవీ, మొబైల్, వీడియో గేమ్  వంటివి చేతిలో పెట్టి వారిని  కంట్రోల్ చేస్తుంటారు. దీనికి తోడు ఫుడ్ విషయంలో కూడా బోలెడు రకాలు చేయించుకుని తింటూ, ఆయిల్ ఫుడ్ ఆస్వాదిస్తూ ఉంటారు. ఏ కారణాల వల్ల పిల్లల్లో బద్దకం, బరువు పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం వంటివి జరుగుతాయి. ఇలాంటి పిల్లల్ని తిరిగి స్కూల్స్ ఓపెన్ చేసే సమయానికి ఆక్టివ్ గా చేయడానికి కొన్ని యోగాసనాలు రోజూ ప్రాక్టీస్ చేయించడం మంచిది. దీనివల్ల పిల్లల శరీరం దృఢంగా మరడమే కాదు, చాలా చురుగ్గా ఆలోచనా తీరులో మరింత ముందుంటారు. ఆ ఆసనాలు ఏమిటంటే. తాడాసనం.. పిల్లల ఏకాగ్రతను పెంచడానికి, వారు క్రమం తప్పకుండా తాడాసనం సాధన చేయాలి. తాడాసన సాధనతో పిల్లల శ్వాస సామర్థ్యం పెరుగుతుంది. ఈ ఆసనం చేయడం వల్ల శక్తి స్థాయి పెరుగుతుంది. మానసిక స్థితి బాగానే ఉంటుంది. పిల్లలు ఎత్తు కూడా పెరుగుతారు. వృక్షాసనం.. వేసవి సెలవుల్లో పిల్లలు ఇంటి నుంచి బయటకు రాలేనప్పుడు రోజంతా ఇంట్లోనే కంప్యూటర్, మొబైల్, టీవీ చూస్తూ గడిపేస్తే బాడీ పెయిన్ పోగొట్టుకోవడానికి వృక్షాసనం మంచి ఎంపిక. రోజంతా ఒకే భంగిమలో కూర్చోవడం, పడుకోవడం వల్ల వారి శరీరం నొప్పులు మొదలవుతాయి. ఇది కాకుండా, ఒత్తిడి కూడా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, పిల్లలలో వృక్షాసనాన్ని అభ్యసించే అలవాటును పెంచాలి. వృక్షాసన అభ్యాసం మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. వెన్ను, మెడ నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. ధనురాసనం.. పిల్లల శరీరం దృఢంగా మారడానికి, కండరాల బలం కోసం ధనురాసనాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఈ ఆసనం పిల్లల వెన్ను భాగాన్ని బలపరుస్తుంది. వెన్ను, చేయి నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. శారీరక శ్రమను ఓర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. శరీరం దృఢంగా మారుతుంది.                                         ◆నిశ్శబ్ద.