బోసినవ్వులే బలం     * పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడిగా ఉంటుంది. పిల్లల అల్లరి సరే దానితో సమానంగా పెద్దలు  పిల్లలతో అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహపరచటమే కాదు వారి శారీరక, మానసిక అరోగ్యానికి ఎంతో అవసరమట కూడా. లల్లాయి పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటు, ఇటు ఊపి చూడండి. వెంటనే అ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పక పకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుందట. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిది అంటున్నారు, ఫ్లోరిడా అట్లాంటిక్ యూనివర్సిటీ పరిశోధకులు. * పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని తారంగం తారంగం అంటూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం, వంటి వన్నీ పిల్లలకి కేవలం ఆటలగా సరదాగా అనిపిస్తాయి. కానీ, నిజానికి  బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వాళ్ళ ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటివల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని గుర్తించారు కూడా. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో" సెన్సరీ వ్యవస్థ" చక్కగా బలపడుతోందని, దీనివల్ల నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే న్యూరాల్ నెట్వర్క్స్ మెరుగై, మెదడు మరింత చురుగ్గా అభివృద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు. * పసిపిల్లల్ని అడించేటప్పుడు అల్లి బిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కృతుల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద " ఫ్లోరిడా అట్లాంటిక్ యునివర్సిటీ " పరిశోధకులు ఇటీవల విస్తృతంగా పరిశోధనలు చేసారు, అ పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కులుగుతోందని తేలింది. * చిట్టి పొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపిస్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివృద్ధి చెందటం గమనించారు. భాషాపరిజ్ఞానం, జ్ఞాపక శక్తీ వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్ చురుకుగా తయారై మెదడు మరింత చురుకుగా వృద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు. మనం ఏదైనా అనుభూతి పొందుతున్నామంటే, దాని వెనుక ఏకకాలంలో రకరకాల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయని అర్ధం. ఎదుగుదలలో భాగంగా పిల్లలకు ఈ భిన్నత్వం అలవాటు అయ్యేందుకు మన అటా- పాటా బాగా ఉపకరిస్తాయి అంటున్నారు ఈ పరిశోధన చేసిన " లుకోవిట్జ్". * పిల్లల్ని ఒకచోట ఉంచి, రకరకాల బొమ్మల్ని చూపిస్తూ అడించిన దాని కన్నా, పిల్లల్ని ఒక బొమ్మగా ఆడించి , ఊపుతూ కదపటం, వారు కిలకిల నవ్వేలా చేయటం వంటివి తప్పకుండా వారి మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధాయక సంబంధాలు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట. కాబట్టి తారంగం , తారంగం వంటి అటపాటలతో, లాలి పాటలతో లయబద్ధంగా పిల్లల్ని ఊపుతూ అడించటం ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు. -రమ

  తల్లితండ్రులు తమ పిల్లలకు ఈ ప్రపంచంలో జీవించేందుకు ఎన్నో జీవిత పాఠాలు బోధిస్తారు. ఈ పాఠాలు వారు తమ వ్యక్తిగత అనుభవాలతో పొందుతారు. మీరు కనుక మీ పిల్లలకు కొన్ని అటువంటి జీవిత పాఠాలు బోధించాలని తలిస్తే అది మీ పిల్లల చిన్నతనంలోనే చెప్పండి. పిల్లలు చాలా విషయాల్ని పెద్దల్ని అనుకరిస్తూ తెలుసుకొంటారు. అందుచేత తల్లితండ్రులు వాళ్లకి ఆదర్శప్రాయంగా ఉండి వారికి కొన్ని అలవాట్లు నేర్పించాలి. అవేమిటో చూద్దాం... 1. ప్రతీరోజూ నిద్రలేచిన తరువాత, రాత్రి పడుకోబోయే ముందు పళ్లను శుభ్రంగా తోముకోవడం నేర్పించాలి. పిల్లలకు ఊహ తెలిసినప్పటి నుండి వారికి ఆహారపు అలవాట్లను క్రమేపీ అభివృద్ధి చేయాలి. 2. పాలు తాగేటప్పుడూ, ఏదైనా తినేటప్పుడూ ఏవో ఆంక్షలు పెట్టి వారిని నివారించకూడదు. 3. అతిధుల ముందు ఎట్లా ప్రవర్తించాలో పిల్లలకు నేర్పాలి. 4. భోజనం చేసేటప్పుడు నేలమీద కాని, టేబుల్‌పైనగాని ఎట్లా జాగ్రత్తగా కూర్చోవాలో పిల్లలకు నేర్పాలి. 5. స్వీట్స్‌, ఐస్‌క్రీములూ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కాని అవి వారి ఆరోగ్యానికి మంచివి కావు. పిల్లలు తీపిపదార్థాల్ని ఎంత తక్కువ తింటే అంతమంచిది. తల్లులే ఇంట్లో జంతికలు లాంటివి తయారుచేస్తే వాళ్లకు ఇష్టంగానూ ఉంటుంది. ఆరోగ్యంగానూ ఉంటుంది. వారు పప్పును, ఆకుకూరలను ఎక్కువగా తినేటట్లు చేయాలి. 6 పిల్లలకు చిరుతిళ్లు ఎక్కువ ఇష్టం అని మీరు కొని తేవద్దు. వాళ్లు కూడా కొనుక్కోకుండా చూడాలి. తింటే వ్యాధులొస్తాయని, అవి తినడం వల్ల ఎదుర్కొనే ప్రమాదాలేమిటో నచ్చచెప్పాలి. 7. ఏ సీజన్‌లో దొరికే పళ్లు ఆ సీజన్‌లో తినడం ఆరోగ్యదాయకం. పండ్లు ఎక్కువగా తినే అలవాటు చేయండి. 8 . పిల్లలు ఆహారాన్ని మెత్తగా నమిలితినాలి. పాలను కూడా నెమ్మదిగానే తాగాలి. 9. పిల్లలు ఒక్కొక్కసారి చాలా అల్లరి చేస్తారు. పెద్దలకు చిరాకు కలిగినా, వారిని తిట్టి కొట్టకూడదు. కారణమేదో తెలిసికొని వారిని మెల్లగానే మందలించాలి. 10. పిల్లల్ని క్రమశిక్షణలో పెడ్తున్నామనుకొని కొందరు తరచు పిల్లలపై కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. దానివల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.తల్లిదండ్రులు పిల్లల్ని ప్రతీ చిన్న విషయానికీ దండించకూడదు. అలాంటి పిల్లలు అమాయకులుగా తయారౌతారు. 11. ఒకే ఇంటిలో ఇద్దరు లేక ముగ్గురు పిల్లలున్నప్పుడు వారి మధ్య తగాదాలు రావడం సహజం. తల్లిదండ్రులు వాళ్లని బుజ్జగిస్తూ, వారితో విడివిడిగా కొంచెంసేపు గడుపుతూ ఉండాలి. వారి మధ్య స్నేహభావం పెరిగేలా చూడాలి. 12. పిల్లలు పెంపుడు జంతువులను తాకకుండా ఉండేటట్లు దూరంగా ఉంచండి. 13. ఆ స్విచ్‌ వేయి, ఈ స్విచ్‌ని కట్టేయి అని మీ పిల్లలకు పనులను పురమాయించకండి. కరెంట్‌ వస్తువుల దగ్గరకు వాళ్లను అసలు పోనీయకండి. 14. నాణాలను, చిన్నచిన్న వస్తువుల్నీ చిన్నపిల్లలకు అందుబాటులో ఉంచకండి. వాళ్లు వాటిని మింగే ప్రమాదముంది. 15. పిల్లల్ని సరైన సమయానికి స్కూలుకు పంపి, స్కూలు అయిన వెంటనే ఇంటికి తిరిగి వచ్చేటట్లు చూడాలి. రోడ్‌పై నడిచేటప్పుడు ఫుట్‌పాత్‌పైనే నడవాలనీ, అక్కడ పరుగులు పెట్టకూడదని పిల్లలకు చెప్పాలి. 16. యూనిఫామ్‌ను, బూట్లు, టై ధరించడాన్ని పిల్లలు ఎవరికివారే చేసుకొనేటట్లు చూడాలి. అందువల్ల తల్లిదండ్రులకి కొంత శ్రమ తగ్గుతుంది. వారికి కూడా తమ పనులు తాము చేసుకోగలమన్న ఆత్మవిశ్వాసం వస్తుంది.

పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరగాలంటే ...?   మీ పిల్లలు ఆత్మ విశ్వాసంతో పెరగాలంటే ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. మీరు గట్టిగా పట్టుకున్న వారి వేలిని వదిలేయండి చాలు. ఈ మాటలు అన్నది ఎవరో తెలుసా, 12 సంవత్సరాలు సుదీర్ఘంగా తల్లిదండ్రులు, పిల్లలపై అధ్యయనం చేసిన ఒక యూనివర్సిటీ బృంద సభ్యులు. ఇంతకీ వీరి అధ్యయనం ఏం చెబుతుందో తెలియాలంటే ఈ వీడియో చూడండి...  

ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే మన శరీరానికి లాభాలుంటాయి..?  

చిన్నపిల్లలకి బ్రేక్ ఫాస్ట్ గా ఇలాంటి ఆహారం ఇవ్వాలి...   Why is breakfast so important for kids? Constant glucose supply is very important for the proper functioning of Brain & if proper, nutritious breakfast is not given to kids – Brain functioning will not be proper says Dr. Srilatha. To know what can be included in kids breakfast, watch the video... https://www.youtube.com/watch?v=tVBgNDOA6n8  

  పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే...?     వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేమో గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్ల, భయం వల్ల పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి పిల్లల కోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటే చూద్దామా....!   * పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి. * పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. * పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది. * నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవడం ఎంతో మంచిది. * అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్‌, ఆంథోసియానిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. * ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్‌, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. * తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలి.  

థాయ్ పిల్లలు మనకు ఏం నేర్పిస్తున్నారో తెలుసా...?     పన్నెండు మంది పిల్లలు మరియు కోచ్ సురక్షితంగా బయట పడ్డారు అని వినగానే అందరం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. వారిని రక్షించిన వారికి జేజేలు పలికాము. సోషల్ మీడియా లో మన హర్షాతిరేకాలని ప్రకటించాము.మన దేశం లో అయితే అసలు ఆ పిల్లలని మనం రక్షించలేక పోయేవాళ్ళం అని కూడా  పోస్ట్ లు పెట్టేసాము .  ప్రభుత్వం కి అంత సమర్ధత లేదు అని నిర్దారించి తీర్పు ఇచ్చాం కరెక్టే కాని , మనం పెంచే పిల్లలులో ఆ పిల్లలలో ఉన్నంత మానసిక స్థైర్యం , శారీరక సామర్ధ్యం ఉందా ? అని ఎవరికీ వాళ్ళం ఒక్కసారి ప్రశ్నించు కున్నామా ?     ప్రతికూల పరిస్తితులులో కూడా ఎక్కడా బెదరకుండా , రేపటికి ప్రాణాలతో ఉంటామో లేదో , అసలు ఇక్కడ నుంచి బయట పడతామో లేదో అన్న స్థితిలో కూడా నిబ్బరంగా వుండటం అంటే మాటలా ? ఇన్ని రోజులలో ఇన్ని వార్తలు చూసాము కదా , ఎక్కడైనా పిల్లలు ఏడుస్తున్నారు అని కాని , భయ పడిపోయి వున్నారని కాని చదివామా ? ఎంత వాళ్ళ వయసు ? పట్టుమని పదిహేను ఏళ్ళు లేవు . ఎక్కడ నుంచి వచ్చింది వాళ్ళకంత ధైర్యం ? ఏ ట్రైనింగ్ తీసుకున్నారని మృత్యువు అంచుల దాకా వెళ్లి , దానిని ఓడించి రాగలిగారు ?     మన ప్రభుత్వం ఎంత చేతనైనదో వాక్యానించే ముందు , అసలు మనం ఎంత అద్బుతమైన పేరెంటింగ్ చేస్తున్నామో చూసుకుంటే రేపటి రోజున పరీక్ష బాగా రాయలేదని అమ్మా నాన్నలకి ఎదురుపడటానికి కూడా దైర్యం లేక పరీక్ష హాలు మీద నుంచి దూకి ప్రాణాలు వదిలేసే అమ్మాయి కోసం ఇంకో సారి వినాల్సిన అవసరం రాదు . చిన్న తరగతులు నుంచి పెద్ద తరగతులు వరకు ఎక్కడ పరీక్ష తప్పినా చావే పరిష్కారం . ఉద్యోగం నుంచి ప్రేమ దాకా ఎక్కడ ఓడిపోయినా చావే పరిష్కారం . ఇది కదా ఇప్పుడు మనం చూస్తోంది మన సమాజం లో ? ఇలా కదా మనం పెంచుతోంది ఈ తరాన్ని ? ఇదే కదా మన వాస్తవం?     ఒక్కసారి ఆలోచించండి . ఎక్కడ వుంది పొరపాటు ?  అందరికి తెలిసిన రహస్యం అది.   అయినా నిర్లక్ష్యం . మనం మారం . మానసిక నిపుణులు మొత్తుకుంటున్నారు . పిల్లల ఎదుగుదల అంటే చదువు, మార్కులు , పెద్ద ఉద్యోగం , జీతం మాత్రమె కాదు ...జీవితాన్ని జీవించటం నేర్చుకోవటం అని . ఆ జీవించటం తెలిస్తే చాలు . అందులోనే ఓటమిని ఎదుర్కోవటం , ప్రతికూల పరిస్తుతులలో కూడా నమ్మకం తో వుండటం , మృత్యువు ఎదురైనా చిరునవ్వుతో రాను పొమ్మని చెప్పగలిగే దైర్యం అన్నీ, అన్నీ వుంటాయి . ఇవి కదా మనం పిల్లలకి నేర్పించాల్సింది . ఇవి మాత్రమె కదా పసి వారిని ఆనందం గా , ఆహ్లాదం గా , దైర్యం గా రేపటిని ఎదుర్కునేలా చేసేది . తెలిసీ మనం ఎందుకు తప్పు చేస్తున్నాము .? తెలిసీ మనం మన పసివారిని ఎందుకు నిర్వీర్యుల్ని , నిరాశా వాదులని చేస్తున్నాము ?     ఒక్కసారి మనం మన పిల్లలకి థాయ్ పిల్లల కథని చెబుదాము . ఆ సాహసాన్ని , ఆ దైర్యాన్ని చూసి నేర్చుకోమని చెబుదాము . అంత దైర్య వంతులుగా మన పిల్లలు కూడా మారేలా చేద్దాము .అంతే కాదు  మానసిక స్థైర్యం తో పాటు ఆ పిల్లల శారీరక ద్రుడత్వం ని కూడా ప్రపంచం కొనియాడుతోంది . అది గమనించుదాము. కేవలం పుస్తకాలే కాకుండా పిల్లల ప్రపంచం ఇంకా చాలా ఉంటుందని గ్రహిద్దాము . ఆటలు వాళ్ళని మానసికం గా , శారీరకం గా ఎంతో  దృడం గా వుంచుతాయని ఒప్పుకున్దాము. రేపటి రోజున మన పిల్లలు అలాంటి గుహలో ఇరుక్కోక పోవచ్చు ., కాని జీవితం అనే గుహ కూడా చాలా సార్లు సమస్యలతో బయటకి వచ్చే దారులని మూసేస్తుంది . ఊపిరి అందకుండా చేస్తుంది . రక్షించటానికి ఎవరు ముందుకి రాకపోవచ్చు ., తప్పించుకునే దారి కనిపించక పోవచ్చు .అయినా కూడా ఎక్కడా అదరక, బెదరక దైర్యంగా జీవిత పద్మవ్యూహాన్ని చేదించి విజేతలుగా నిలవాలంటే మనం మారక తప్పదు. ఆలోచించండి. - రమ

అనుబంధంతో అల్లుకోండి   పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే వేదం. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్ లోకి వచ్చాకా, ఎదురుతిర గటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి. వాటితో పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.. దాంతో పేచీలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.. నిజానికి అమ్మలందరికి ఈ చిట్కా తెలిసే వుంటుంది. కాని పని కుదరదనో, ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అలా కాకుండా... అది చాలా ముఖ్యమైనది అని గుర్తించి పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి... అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. మరి వారు సూచిస్తున్న ఆ సూత్రాలు ఏంటో చెప్పనా ... పిల్లలతో సమయం గడపటం :- ఈ మాట చెప్పగానే... రోజు చేసేది అదే కదా అంటారని తెలుసు...కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు.. హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా, ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి, అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో... అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్ లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి.  ఇక వీలైతే కాకుండా, వీలు చేసుకుని మరీ పిల్లలతో ఆడిపాడాలి. ఆటలు పిల్లలతోనా? అనద్దు.. క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్ లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి చేసి చూడండి.. పిల్లలు ఎలా అమ్మా, అమ్మా అంటూ చుట్టూ తిరుగుతారో చూడండి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అప్పుడప్పుడు కోప్పడుతూ, అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. కాదు బంగారం నీతోనే నేనూ.. నీలా ఆడిపాడి అల్లరి చేస్తాను.. అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు... పసివాళ్ళుగా మారిపోయి గారాబాలు పోతారు. ఎంతయినా, ఎన్ని వున్నా వాళ్ళకి కావాల్సింది అమ్మే. ఆ అమ్మ పెద్దయ్యారు అంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటుంటే, అమ్మ కావాలి అని బయటకి చెప్పటం ఎలాగో తెలియక మొండికేస్తుంటారు. అది పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు పిల్లలతో ఎలా ఎలా ఆడిపాడారో అలా చేయటమే. -రమ

  పిల్లలు ఎత్తు పెరగడం కోసం.. పేరెంట్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...  

ఏకాగ్రత మెరుగుపరచడం ఎలా?  

సమ్మర్ ని స్పెషల్ గా మారుద్దాం   1) ఈ శెలవులు పిల్లలకి మంచి జ్ఞాపకంగా మిగిలి పోవటానికి, ఆ జ్ఞాపకాలు వచ్చే సంవత్సరమంత వాళ్ళని ఆనందంగా ఉంచేలా చేయటానికి ఏమేం చేయెచ్చో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ రోజు పిల్లలతో తప్పకుండా చేయించి తీరాల్సిన మరో చిన్న పని గురించి చెప్పుకుందాం. కథలు పుస్తకాలూ చదివించి ఉంటారు కదా . అ కధలలోని ముఖ్యమైన విషయం లేదా పిల్లల్ని ఆకర్షించిన అంశం గురించి ఒక పుస్తకంలో రాయమనాలి. పెద్దగా అక్కర్లేదు ఒకటి రెండు లైన్లు అయినా చాలు. అలాగే అవే పాత్రలతో మరో కధ అల్లి రాయమనాలి. మొదట్లో పిల్లలు నాకు రాదంటూ తప్పించుకుంటారు. కాని మనమే కొన్ని సుచనలూ చేస్తూ, సహాయం చేస్తే వాళ్ళు రాయచ్చు. కనీసం కొత్త అలోచన చేస్తారు. 2) పిల్లలు చదివితే సరే కాని, లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చదివి వినిపించి తీరాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవే జీవిత చరిత్రలు. పెద్ద పెద్ద గ్రంధాలు అక్కర్లేదు. పిల్లల కోసం వారికి అర్ధమయ్యేరీతిలో ఇప్పుడు చాలా పుస్తకాలు వస్తున్నాయి. మహాత్ముల జీవిత చరిత్రలు చదివాక అందులో వాళ్ళని ఆకర్షించిన విషయాలను ఓ పుస్తకంలో రాయమనలి.  మొత్తం చదివాక ఏ అంశం వాళ్ళని ప్రభావితం చేసిందో చూడాలి. దీనివల్ల పిల్లల గ్రాహణశక్తిని అంచనా వేయచ్చు. వాళ్ళు వ్యక్తిత్వంలోని మార్పలును ఇట్టే పసిగట్టచ్చు. మరో విషయం ఏంటంటే ఓ విషయం గురించి చదవటం, దానిని అర్ధం చేసుకోవటం, తిరిగి రాసి పెట్టుకోవటం ఇవన్ని కూడా అ విషయం పిల్లలు మనసుల్లో ముద్రించుకునేలా చేస్తాయి. గాంధీ గారి సత్యం పలకటం అన్న విషయం కావచ్చు, శివాజీ ధైర్యసాహసాలు కావచ్చు. రాజారామోహన్ సంఘసేవ కావచ్చు. చిన్నతనంలోనే పిల్లల మనస్సులో ముద్రించుకుంటే ఆ విషయాలని ప్రత్యేకంగా మనం మళ్ళి నేర్పించక్కర్లలేదు. అవి వారి వ్యక్తిత్వంలో భాగంగా మారి పోతాయి. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 3) పిల్లలు చిన్న చిన్న బొమ్మలు వేయిటం, వస్తువులు తయారు చేయటం వంటివి చేస్తారు, అవి గొప్పగా ఉన్నాయా లేవా అని కాదు. అవి పిల్లల్లోని సృజనాత్మకతకి అద్దం పడతాయి. అలా వాళ్ళు వేసిన బొమ్మలు, తయారుచేసిన బొమ్మలు, వస్తువులు లాంటివి అన్నింటిని కలిపి ఓ చిన్న ఎగ్జిబిషన్ లా ఏర్పాటు చేసి .హాలులో ప్రదర్శనకు పెట్టి, అపార్టుమెంటు వాళ్ళని, ఫ్రెండ్స్ ని పిలిస్తే అందరిలో తన ప్రతిభకి లభించే గుర్తింపు, పిల్లల్ని ఉత్సాహ పరుస్తుంది. అ ఉత్సాహం మరిన్ని విషయాలలో తను మనసుపెట్టి కష్టపడేలా చేస్తుంది. పిల్లల్లో కుదురు, ఏకాగ్రత, చేసే పని పట్ల ఇష్టం లాంటివి చెబితే వచ్చేవి కాదు. వాళ్ళ ప్రవర్తనలో ఓ భాగంగా అవి మారిపోవాలి. అందకు పైన చెప్పుకున్న విషయాల వంటివి సహాయపడతాయి. 4 పిల్లల్లో ఉహాశక్తికి పదును పెట్టే యాక్టివిటీస్ వారిని చురుకుగా ఉంచుతాయి. ఓ విషయాన్ని వినగానే గ్రహించి, తిరిగి దానికి ఓ రుపం ఇవ్వగలిగితే అది వారిలోని భాషానైపుణ్యాన్ని, భావవ్యక్తీకరణ నైపుణ్యానికి పదునుపెట్టినట్టే. ఉదాహరణకి ఆవు, పులి కథని పిల్లలకి చెప్పి అందులో ఆవు, పులి ,దూడ పాత్రలతో పిల్లలని ఓ చిన్న నాటికలా వేయమంటే .. వాళ్ళంతట వాళ్ళే సంభాషణలని ఉహించుకుని చెబుతారు. ఇది పిల్లలకి సరదాగా ఉంటుంది. నిజానికి అది వారిలోని ఉహాశక్తి పదునుపెట్టటమే. ఇలాగే వీర శివాజీ పాత్ర, సుభాష్ చంద్రబోస్ పాత్ర వంటివి కూడా చేయించవచ్చు. వారి గురించి చెప్పి చరిత్రలోని ఓ సంఘటనని పిల్లలకి వివరించి, ఆ సమయంలో ఆ వ్యక్తుల స్పందన ఎలా ఉంటుందో చెప్పమనాలి. ఏకపాత్రాభినయం అంటారు కదా. అదే ఇలా చేయటం వాల్ల పిల్లల్లోబిడియం కూడా పోతుంది. 5) ఇవన్నీ కూడా పిల్లలని ఉత్సాహంగా ఉంచేవే. ఆడుతూ, పాడుతూ పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే చిన్న ప్రయత్నాలు. ఇంకా ఇటువంటివి ఎన్నో ఉండవచ్చు. ఆలోచిస్తే పిల్లల్ని కదిలిస్తే బోల్డన్ని అంశాలు కనిపిస్తాయి. కావాల్సిందల్లా అమ్మకి కాస్త తీరిక, ఓపిక అంతే ఏమంటారు. -రమ

సీమంతం ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు..  

పిల్లలు కావాలనుకున్నప్పుడు భార్యా భర్తల ఆరోగ్యంకోసం ఇవి తినాలి..

కాలుష్యంతో కడుపులోని బిడ్డకి హాని..  

మొదటి నుంచి అమ్మాయిలు ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రతలు..  

కడుపుతో ఉండగా ప్రయాణాలు చేయవచ్చా..?  

తొమ్మిది నెలలు ఏమి తినవచ్చు..? ఏమి తినకూడదు..?

స్కానింగ్ ఎప్పుడు చేస్తారు..?