అందరూ మధుకర్ ఫర్మ్ డెసిషన్ కి ఉలిక్కిపడ్డారు.

 

    "అవసరమైతే జైలుకైనా వెళతాను... మహతిని రేప్ చేసినట్లు... అందరికీ తెల్సేటట్టు కూడా చేస్తాను. అందుకు మీ కోపరేషన్ కావాలి..." శాసిస్తున్నట్లుగా ఉంది మధుకర్ కంఠం.

 

    "ఓకే... మేం కోపరేట్ చేస్తాం. ఎక్కడ చేస్తావ్? ఎలా చేస్తావ్? ఆ అమ్మాయి వంటరిగా నీకెలా దొరుకుతుందనుకున్నావ్?" నిధి దయాళ్ అన్నాడు సంబరపడిపోతూ.

 

    "మా ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ లో, మహతిని రేప్ చెయ్యాలి. నేను రేప్ చేసే ప్రయత్నాన్ని మాత్రమే మీరు ఫోటోలో తియ్యాలి."

 

    "ఆ అమ్మాయిని గెస్ట్ హౌస్ కి తీసుకొచ్చే పూచీ నాది..." మూర్తి అన్నాడు.

 

    "మొన్న తెచ్చావ్ గదా. అలాగేనా...?" విసురుగా అన్నాడు మధుకర్.

 

    "ఈసారి డన్..." ఛాలెంజ్ గా అన్నాడు మూర్తి.

 

    "గెస్ట్ హౌస్ లో వూరికి చివర రేప్ ఏమిట్రా... నీ రేప్ హిస్టరీ క్రియేట్ చెయ్యాలంటే, యూనివర్సిటీ ఆడిటోరియంలో రేప్ చెయ్యి... కాలేజీ కాంపస్ లో రేప్ చెయ్యి... నీ పేరు మారుమోగిపోతుంది. టిట్ ఫర్ టాట్... నిన్ను ఫూల్ ని చేసినందుకు అలా చేస్తేనే రివెంజ్ తీసుకున్నట్టు" అన్నాడు సురేష్.

 

    "కాలేజీ కాంపస్ లో, ఆడిటోరియంలో రేప్ చెయ్యడమంటే, డాన్స్ ప్రోగ్రాం ఇవ్వడమనుకున్నావా..." మనం నలుగురమే అక్కడుంటామనుకున్నావా..."జుత్తు పైకి ఎగదోసుకుంటూ అన్నాడు మధుకర్.

 

    అదే సమయంలో బార్లోకి ప్రవేశించాడు విజయ్.

 

    "హాయ్" అనుకుంటూ లోనికొచ్చి, అక్కడున్న గ్లాసుల్లో ఓ గ్లాసుని తీసుకుని గబగబా తాగేసి కిందపెట్టి-

 

    "ఎన్నో రౌండ్ రా?" అని అడిగాడు అందరి ముఖాలవైపు చూస్తూ.

 

    "ఎన్ని రౌండ్ లైనా ఒకటేగానీ, ప్రస్తుతం హాట్ హాట్ గా వుంది మూడ్... డోంట్ డిస్ట్రబ్... ముందో మాట చెప్పెయ్. నీ గర్ల్ ఫ్రెండ్ కిస్సిచ్చిందా లేదా?" అడిగాడు నిధి దయాళ్.

 

    "ఏం కిస్ లో... ఏం గోలో... ఒరేయ్ మధూ! నీకో ఇన్ ఫర్ మేషన్. మహతి ఫాదరూ, మదరూ మహతికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నార్ట... ఏదో పెళ్ళి సంబంధం చూడ్డానికి రేపు వాళ్ళు బొంబాయి వెళ్తున్నార్ట.... మా మేరీ చెప్పింది" చెప్పాడు విజయ్.

 

    "కరెక్టుగా దొరికిందిరా. వయసొచ్చే కాలంలో, ఎక్కాల బుక్కే సెక్స్ బుక్కయినట్టు, ఏం న్యూస్ పట్టుకొచ్చావ్ రా..." పొగిడాడు మూర్తి.

 

    ముందున్న గ్లాసుల్లోంచి ద్రవాన్ని గబగబా తాగేసి- "నీ న్యూస్ నిజమేనా?" అని అడిగాడు.

 

    "హండ్రడ్ పర్సెంట్ నిజంరా. మా గర్ల్ ఫ్రెండ్ మీదొట్టు..." విజయ్ అన్నాడు.

 

    "అలాగైతే స్పాట్ మారింది. మా గెస్ట్ హౌస్ కాదు. మహతి బెడ్ రూమ్... రేపు రాత్రే ముహూర్తం. రేపు రాత్రి సరిగ్గా పదిగంటలకు."

 

    "నీ శోభనానికి మేం కాపలా కాస్తాం. కానీ... మాకేమిస్తావురా?" నిధి దయాళ్ అడిగాడు. అందరూ నిధి వేపు అసహ్యంగా చూసారు.

 

    "రేప్ చేసి నా కక్ష తీర్చుకున్నాక, వాటిని ఫోటోలు తీసి గోడల్నిండా అతికిస్తాను. మహతి వాటిని చూసి, ఉరేసుకుని చచ్చిపోవాలి."

 

    కసిగా కసికసిగా అనుకొన్నాడు మధుకర్.

 

    మరో అరగంటసేపు తర్వాత ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

 

                              *    *    *    *    *

 

    అంత ఇన్ హ్యూమన్ గా తను ప్రవర్తించడం తప్పేమో!

 

    కాదు... తప్పు కాదు.

 

    ఇటీజ్ సెంట్ పర్సంట్ రైట్!

 

    మధుకర్ ని తను గాఢంగా ప్రేమిస్తోంది.

 

    కానీ తండ్రి ఆస్తితో జల్సాలు చేసే మధుకర్ ని కాదు. తండ్రి డబ్బుతో తందనాలాడే మధుకర్ ని కాదు. తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బును, వృధాగా ఖర్చుపెట్టే బాధ్యత లేని మధుకర్ ని కాదు, కానీ మధుకర్ తనకు కావాలి.

 

    కానీ ఈ మధుకర్ కాదు- ఎవరో సంపాదించిన కోట్లకు తను అధిపతినని చెప్పుకొనే మధుకర్ కాదు.

 

    కొత్త మధుకర్- నడిరోడ్డుమీద పైసా జేబులో లేకుండా, కాళ్ళతో నడిచి, సామాన్యుడిలా వెళ్ళే మధుకర్ కావాలి. చెమటతో, తెలివి తేటలతో పైసాని సంపాదించే మధుకర్ కావాలి, పైకెదిగే మధుకర్ కావాలి.

 

    అందుకే-

 

    తను ద్వేషంలోంచి నరుక్కొస్తోంది, ద్వేషాన్ని క్రియేట్ చేస్తోంది.

 

    ఎవరో కవి అన్నట్టు ప్రేమలోంచి ప్రేమ పుట్టదు... పుట్టినా ఆ ప్రేమ నిలవదు. ద్వేషం, పెనుద్వేషం, విషంలాంటి ద్వేషంలోంచి పుట్టే ప్రేమ నిలుస్తుంది.

 

    నిజమైన ప్రేమ ఆలోచన నివ్వాలి- విరహాన్ని కాదు- ఎదిగేలా ఉత్తేజపర్చాలి. నిజమైన ప్రియురాలు ప్రియుడికి, దారి తెలీని ప్రియుడికి ముద్దుల్ని ఒక్కటే కాదు ఇవ్వాల్సింది, లక్ష్యాన్ని కూడా.

 

    నువ్వు యుద్ధానికి వెళ్ళు, శత్రువుల్ని చీల్చి చెండాడు, విజయుడివై తిరిగిరా. నీకోసం, నీకు స్వర్గసుఖాలు అందించడం కోసం హంసతూలికా తల్పం మీద, విరహిణియై వుంటాను... ఆ ప్రాచీనకాలంలో ప్రియుడ్ని యుద్ధానికి పంపే రాజరికపు స్త్రీ ఆదర్శం- అందుకే గొప్పది.

 

    లక్ష్యం ముందు చెప్పింది- విజయం తరువాతే సుఖం.

 

    అదే ఈనాటి స్త్రీకి ఆదర్శం కావాలి.

 

    స్త్రీ తలుచుకుంటే, మగవాడిని తీర్చిదిద్దగలదు. కానీ రాన్రాను స్త్రీలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు. దానికి స్పష్టమైన ఉదాహరణ దేశం నిండా కిక్కిరిసిన జనాభా పెరుగుదల.

 

    ఉద్యోగం లేకపోయినా, ఒక మగవాడిని ఒక స్త్రీ పెళ్లాడుతుంది. వాడికి ఏ లోటూ రాకుండా చూస్తుంది. ఆఫ్ కోర్స్- పెళ్ళి భద్రత కోసం తప్పకపోవచ్చు.

 

    కానీ-

 

    నువ్వు ఏదో ఒక పనిచేసి సంపాదించుకుని వస్తేనే... నీకు ఈ రాత్రి సుఖం అని కండిషన్ విధిస్తే, తగిన పని దొరక్కపోయినా, తన భార్యను పోషించాల్సిన కనీస ధర్మాన్నయినా గుర్తించి కష్టపడతారు. ఆలోచనలేని ఆర్షధర్మాలు పట్టి వెనక్కి లాగుతున్నంత కాలం, భారతదేశంలో ఎన్ని ఇజాలు పుట్టినా స్త్రీ ఉనికి మాత్రం ఎక్కడ వేసిన గొంగళిలా అక్కడే వుంటుంది.

 

    తను మధుకర్ ని ప్రేమిస్తున్నది. అవసరమైతే అతన్ని తనవేపు తిప్పుకోవడం కోసం తనేమైనా చేస్తుంది. కానీ-

 

    మధుకర్ తనని ద్వేషిస్తున్నాడా? ప్రేమిస్తున్నాడా? తను రెచ్చగొట్టే ప్రతిసారి, అతని కళ్ళల్లో ఆ రియాక్షన్ ని తను గమనిస్తోంది.

 

    ఆ రియాక్షన్ అతన్ని ఎటు డ్రైవ్ చేస్తోంది.

 

    దూరంగా-

 

    పరుగెత్తుకొస్తున్న మేరీని చూసి, కారు స్లో చేసింది మహతి.

 

    "ఏంటా పరుగు" కారు డోర్ తీస్తూ అంది మహతి.

 

    "మహీ... మహీ... మరేమో" ఏదో చెప్పబోయింది మేరీ.

 

    "ముందు కూర్చో తల్లి... కేంటిన్లో మాట్లాడుకోవచ్చులే" యాక్సిలేటర్ని నొక్కింది మహతి.

 

    "అదికాదు... మహీ... ఇవాళ... మీ మదరూ, ఫాదరూ... వూరు వెళుతున్నారు కదా. ఏదో పిచ్చాపాటి మాట్లాడుతూ- మా బోయ ఫ్రెండ్ విజయ్ తో అన్నానది. అతనేమో దాన్ని మధుకర్ తో చెప్పినట్లున్నాడు. మధుకర్ నిన్ను ఇవాళ రాత్రి రేప్ చెయ్యడానికి ప్లాన్ వేసాడట."