"బార్ లో వుంటాను. ఏం గొడవ కాకుండా మేనేజ్ చెయ్యి. నువ్వు చేస్తావులే.    మరీ ఎదురుతిరిగితే చూద్దాం" ముందు కడుగేసాడు మూర్తి.

 

                           *    *    *    *    *

 

    సరిగ్గా ఏడున్నరయింది.

 

    కౌంటర్ లో 202 రూమ్ కీస్ తీసుకుని, టకటకా మెట్లెక్కి రూం తలుపు తీసి లోనికెళ్ళింది ఆ అమ్మాయి.

 

    అది డీలక్స్ రూం. చాలా పోష గా వుంది.

 

    స్విచ్ వెయ్యగానే నైట్ బల్బు వెలిగింది.

 

    అద్దంలో తన రూపాన్ని చూసుకుని, హేండ్ బాగ్ లోంచి లిప్ స్టిక్ తీసుకుని పెదాలకు సుతారంగా అద్దుకుని మధుకర్ ని తలచుకుంది ఆ అమ్మాయి.

 

                           *    *    *    *    *

 

    సరిగ్గా ఏడూ యాభై అయిదు నిముషాలయింది.

 

    త్రిలోక్ బార్ అండ్ రెస్టారెంట్ లోంచి బయటకొచ్చిన మూర్తి, హోటల్ గేటు కారిడార్లోకి వచ్చిన రెండు నిముషాలకు...

 

    బ్లూ కలర్ మారుతీ కారొచ్చి, పార్కింగ్ ప్లేస్ లో ఆగింది.

 

    అందులోంచి దిగిన మధుకర్ శోభనపు పెళ్ళికొడుకులా తయారయ్యాడు.

 

    "వచ్చిందా" దిగగానే మొట్టమొదటి ప్రశ్న అదే.

 

    "కీస్ తీసుకుని రూమ్ కెళ్ళిందని కౌంటర్ లోని వ్యక్తి చెప్పాడు" హుషారుగా చెప్పాడు మూర్తి ఒక్కసారి.

 

    మధుకర్ నరాల్లోకి స్వీట్ నెస్ థర్మామీటర్ లోని పాదరసంలా ఎగజిమ్మింది.

 

    "యూ స్టే హియర్. ఎక్కడికీ వెళ్ళకు" లిఫ్ట్ వేపు అడుగేసాడు మధుకర్.

 

    "ఆగవయ్యా మగడా! జరిగే ఆ శుభకార్యం ఎలాగూ జరుగుతుంది కానీ... ఒక పెగ్గేసుకొని వెళ్ళు... పర్ ఫెక్టు రేప్ కి ఆన్ ది రాక్స్ అవసరమన్నారు...ఎల్డర్స్..."

 

    "అయితే పద..." ఇద్దరూ బార్ లోకి నడిచారు.

 

    జానీవాకర్ రెండు పెగ్గుల రా... అయిదు నిముషాల్లో బయటికొచ్చారు.

 

    "ఓకె... ఆల్ ది బెస్ట్..."

 

    వడివడిగా లిఫ్ట్ వేపెళ్లాడు మధుకర్. లిఫ్ట్ డోర్ మూసుకోవడంతో మూర్తి మళ్ళీ బార్ లోకి అడుగుపెట్టాడు.

 

    సెకండ్ ఫ్లోర్ లో దిగి, అటూ ఇటూ చూస్తూ రూం నెం. 202 దగ్గర ఆగాడు.

 

    ఆ రూమ్ ని గత రెండేళ్లుగా మెయిన్ టైన్ చేస్తున్నాడు మధుకర్. అనఫీషియల్ జల్సాలు, సర్దాలు అన్నీ అక్కడే.

 

    కానీ ఇవ్వాళ...

 

    ఆ రూం దగ్గర నిలబడిన మధుకర్ మధుకర్ వంట్లో ఏదో తెలీని వేడి... నరాల్లో పెరుగుతున్న టెంపరేచర్...

 

    తలకెక్కిన నిషా... రూపుదిద్దుకున్న కసి...

 

    వారగా వున్న డోరు తీసుకుని లోపలకు అడుగుపెట్టి లాక్ చేసి డ్రాయింగ్ రూమ్ దాటి బెడ్ రూమ్ లో కెళ్ళాడు.

 

    నైట్ బల్బ్ బ్లూ కలర్ లో గదంతా సెక్స్ వాసనలు విరజిమ్ముతున్నట్టుగా వుంది మధుకర్ కి.

 

    బెడ్ వైపు చూసాడు.

 

    కుర్తా పైజమాలో మహతి.

 

    "ఇలా మనం కలుసుకోవడం... బాగుంది కదూ" దగ్గరగా నడుస్తూ అన్నాడు మధుకర్. ట్యూబ్ లైట్ ఆన్ చెయ్యడానికి స్విచ్ మీద చెయ్యి వేసాడు. వద్దన్నట్లు అతని చేతిమీద మహతి చెయ్యి!

 

    మహతి చెయ్యి ఎంత మెత్తగా వుంది...! ఆ చేతిని అలా దగ్గరగా తనవైపు లాక్కుని, జుత్తుమీద చెయ్యివేసి, ఆమె పెదాల్ని తనవైపు తిప్పుకుంటున్నాడు మధుకర్.

 

    ఆమె శిరోజాల్లోంచి వస్తున్న జాస్మిన్ హెయిర్ పెర్ ఫ్యూమ్ మత్తువాసన... మధుకర్ హైఓల్డేజ్ వయస్సు విద్యుత్ ప్రవాహం పెదవుల్ని ముద్దు పెట్టుకోబోయి, ఏమాత్రం ప్రతిఘటన లేనందుకు ఆశ్చర్యపోతూ...

 

    ముఖాన్ని పూర్తిగా తిప్పాడు.

 

    ఆమె సుధారాణి! మహతి కాదు.

 

    మధుకర్ నరాల్లో అంతవరకూ ఎగజిమ్మిన కోరిక చప్పున అదృశ్యమైపోయింది.

 

    తలకెక్కిన నిషాలో పెనుకోపపు శక్తినంతా కూడదీసుకొని చాచి కొట్టాడు మధుకర్. ఆ దెబ్బకు సుధారాణి పెద్ద కేకవేస్తూ బెడ్ మీద పడిపోయింది.

 

                                                     *    *    *    *    *

 

    గబగబా బార్లోకి వస్తున్న మధుకర్ ని చూసి లేచాడు మూర్తి. దగ్గరకొచ్చిన మధుకర్. ఏదో అడగబోతున్నంతలో మూర్తి దవడ వాచిపోయింది.

 

    హైకిక్ లో కోలాహలంగా వున్న బార్ ఒక్కసారిగా దవడ దెబ్బకు సైలెంట్ గా అయిపోయింది.

 

    వాట్ హేపెండ్... వాట్ హేపెండ్... ఏం జరిగింది... యహ్ క్యాహై.... జీ... ఏ క్యాహైజీ.... డ్రింకు గురూ... ఎక్కువయినట్టుంది.

 

    రకరకాల వ్యాఖ్యానాలు...

 

    మూర్తికేం అర్థంకాలేదు. మధ్యాహ్యం నుంచి తాగుతున్న నిషా దిగిపోయింది.

 

    "ఏం జరిగింది మధూ?" తేరుకుంటూ అడిగాడు మూర్తి.

 

    "వెళ్ళి చూడు..." అంతే మరేం మాట్లాడలేదు. చరచరా అక్కడ నుంచి బయటకొచ్చేసి కారెక్కి అసహనంతో దాన్ని ముందుకి దూకించాడు. అన్ బేరబుల్ థింగ్. మూర్తిగాడు చీట్ చేసాడు.

 

    సుధారాణిని, మూర్తిని షూట్ చేసేయ్యాల్సింది. తప్పు పని చేసాడు తను.

 

    ఆ రాత్రి ఇంటి కెళ్ళలేదు మధుకర్. కమలాపురి కాలనీలో వున్న గెస్ట్ హౌస్ కెళ్లిపోయాడు.

 

    అక్కడ మళ్ళీ బాటిల్ ఓపెన్ చేసాడు.

 

    పెగ్గు పెగ్గుకీ మహతిమీద పెరుగుతున్న కసి మూలంగా ఆమెను ఎంత సాడిస్టిక్ గా అవమానించాలో ఆలోచిస్తున్నాడు మధుకర్.

 

                             *    *    *    *    *

 

    ఛీ- నా పరువంతా పోయింది. మహతికి ఫోన్ చేసానన్నది అబద్ధం కదూ?" కోపంగా ప్రశ్నించాడు మూర్తి. తలూపింది సుధారాణి.

 

    "ఎందుకలా చేసావ్?" ఆ ప్రశ్నకు వెంటనే బదులివ్వలేదు సుధ.

 

    "నిన్నే-" మూర్తి రెట్టించాడు.

 

    "మహతి ఇవ్వాళ కాకపొతే, రేపయినా మధుకర్ కి దొరుకుతుంది. కానీ... ఇలాంటి అవకాశం నాకు దొరకదు. ఐ లైక్ మధు. ఐ లవ్... మధు. దిసీజ్ నాట్ ఛీటింగ్... ప్లీజ్ అండర్ స్టాండ్ మీ మూర్తి ప్లీజ్" మెల్లగా చెప్పింది సుధారాణి.

 

    మూర్తిలో అంతవరకూ వున్న కోపం కొంత తగ్గింది.

 

    "నా స్థాయిలో వున్న అమ్మాయికి, నా స్థాయివాడు దొరుకుతాడు. నా స్థాయి వాడి దగ్గర పడుకోవడం, నాకేమిటి లాభం? నా స్టేటస్ పెరగాలంటే మధుకర్ లాంటివాళ్ళు కావాలని కోరుకోవడంలో తప్పులేదు కదూ?"

 

 

    అవును తప్పులేదు.

 

    డబ్బుకోసం, హోదాకోసం తను మధుకర్ లాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు. ఈ రెండు కలిసిన కోరికవల్ల సుధారాణి మధుకర్ తో గడపాలనుకుంది.