ఎల్లప్పుడు ముఖం అందంగా ఉండాలంటే

ఎల్లప్పుడు ముఖం అందంగా ఉండాలంటే

 

ఎప్పటికప్పుడు మారిపోయే వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఆడవాళ్ళూ తమ అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో విధాల ప్రయత్నం చేస్తారని అందరికి తెలుసు ! ఆ అందం చూసేవాళ్ళకి ఎలా తెలుస్తుందని ఎవరైనా అడిగితే వెంటనే మనం ముఖం ద్వారా అని టక్కున చెప్పేస్తాం ! మరి ఆ ముఖం ఎల్లప్పుడు ఏ కాలమైన అందంగా ఉండాలన్నా, నలుగురిలో అందంగా కనబడలన్నా మనం ఎప్పటికప్పుడు కొన్ని చిట్కాలు ఉపయోగించడం మంచిది కదా ! అందుకే అందమైనా ముఖం కోసం కొన్ని చిట్కాలు.

 

* నీళ్ళు ఎక్కువగా తాగుతుండాలి. అలా నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల ముఖం

ఎప్పటికప్పుడు తాజాగా మెరుస్తూ మచ్చలు రాకుండా ఉంటాయి.

 

* నిమ్మకాయ రసాన్ని ముఖానికి రాసుకొని ఇరవై నిమిషాల తరువాత బాగా

రుద్ది కడుక్కోవాలి. అలా చేయడం వల్ల ఎప్పటికప్పుడు ముఖం తాజాగా శుభ్రంగా

ఉంటుంది.

 

* పావుకప్పు పాలలో రెండు చెంచాల నిమ్మరసం కలిపి ప్రతిరోజూ ముఖానికి

రాసుకోవాలి.

 

* ఒక ఐదు బాదం పప్పులు రాత్రిపూట బాగా నానబెట్టి ఉదయాన్నే వాటిని పేస్టులా

చేసుకొని ముఖానికి రాసుకుంటే ముఖం తాజాగా శుభ్రంగా అందంగా ఉంటుంది.

 

* టమాటా పేస్ట్ ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తరువాత చల్లని

నీటితో కడుక్కోవాలి.అలా చేయడం వల్ల మీ ముఖం ప్రకాశవంతంగా మెరుస్తూ

ఉంటుంది.