నీకెంత? నాకెంత?

 

 

అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రాంగణంలో ఒక చోట కంచెను మరమ్మత్తు చేయడానికి టెండర్లను ఆహ్వానించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చివరికి ముగ్గురిని ఎంపిక చేశారు. ఒకరు బంగ్లాదేశ్, మరొకరు చైనా, మూడో వ్యక్తి భారతదేశానికి చెందిన వాడు.

ముగ్గురూ వైట్‌హౌస్ అధికార ప్రతినిథితో కలిసి కంచెను పరీక్షించడానికి వెళ్ళారు. బంగ్లాదేశీయుడు బ్యాగ్ లోఉన్న టేప్ తీసుకుని స్థలాన్ని, కొలిచి కొన్ని లెక్కలు వేసి చివరికి 900 డాలర్లు ఖర్చవుతుందని తేల్చాడు. 400 డాలర్లు సామగ్రికి, 400 డాలర్లు  పనివాళ్ళకు, 100 డాలర్లు  అతనికి లాభం.

తరువాత చైనీయుడి వంతు వచ్చింది. అతను కూడా ఏవో కొన్ని లెక్కలు వేసి 700 డాలర్లు లెక్క తేల్చాడు. 300డాలర్లు సామాగ్రికి, 300 పనివాళ్ళకు, 100 డాలర్లు లాభం.

చివరగా భారతీయుడి వంతు వచ్చింది. కొలతలు వేసే కార్యక్రమాలేమీ పెట్టుకోకుండా అధికార ప్రతినిథిని దగ్గరగా పిలిచి చెవిలో “2700 డాలర్లవుతుంది” అన్నాడు.

“నువ్వు వాళ్ళలాగా కనీసం కొలత కూడా వేయలేదు. అంత పెద్ద సంఖ్య ఎలా చెప్పావు?”

“1000 డాలర్లు నీకు , 1000 డాలర్లు నాకు, ఆ చైనా వాణ్ణి మనం పనిలో పెట్టుకుందాం. ఏమంటావ్?”

“Done”.