కంటి నిండా నిద్ర పట్టాలంటే...?

 

 

హాయిగా కంటి నిండా నిద్ర పడితేనే మర్నాడు చక్కగా పనులు చేసుకోగలుగుతాం . లేదంటే చిరాకు , కోపం , అలసట అన్నీ ఒక్కసారే మనపై దాడి చేస్తాయి. ఏదో ఎప్పుడో ఒకసారి అలా నిద్ర కోసం యుద్ధం చేయాల్సి రావటం పర్వాలేదు కాని , తరుచు నిద్ర పట్టటం కష్టం గా మారితే మాత్రం కొంచం జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు డాక్టర్స్.


నిద్ర పట్టక పోవటానికి టెన్షన్స్ , సెల్ ఫోన్స్ లాంటివి కొంత వరకు కారణం అని మనమందరం వినే వుంటాం. అయితే మనం తీసుకునే ఆహరం కూడా అందుకు కారణం కావచ్చు అంటున్నారు పోషకాహార నిపుణులు . పిండి పదార్ధాలు , ఖనిజాలు తక్కువగా వుండే ఆహరం తీసుకోవటం , లేదా నిద్ర పోయే ముందు మాంస క్రుత్తులు ఎక్కువగా వుండే స్నాక్స్ తినటం వంటి పొరపాట్లు మనకి  నిద్రని దూరం చేస్తాయిట.

 

1.పిండి పదార్ధాలు ఎక్కువగా వుండే పదార్థాల్ని ఆహరంగా తీసుకుంటే అవి " ట్రిప్టోఫాన్ " అనే అమినో ఆమ్లాలను మెదడుకు పంపిస్తాయి. దాంతో నిద్ర ముంచుకు వస్తున్నా భావన కలుగుతుంది అట. కాబట్టి రాత్రి పూట బియ్యం , గోధుమలు , బ్రెడ్ , రాగి , కార్న్ ఫ్లేక్స్ వంటివి మన ఆహరం లో ఉండేలా చూసుకోవాలి. 

 

2. అలాగే కాల్షియం , మెగ్నీష్యం , ఐరన్‌లు మన శరీరంపై మత్తుగా ఉండేలా ప్రభావాన్ని చూబిస్తాయి . కాబట్టి గోరువెచ్చటి పాలు , ఆకుకూరలు , బాదం , జీడిపప్పు , వంటివి తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది . 

 

3. ఇక పడుకునే ముందు మాంస క్రుత్తులు అదికంగా వుండే స్నాక్స్ తినకపోవటమే మంచిది .ఎందుకంటే ఇవి మనం తిన్న ఆహరం నుంచి " ట్రిప్టోఫాన్ " మెదడును చేరకుండా అడ్డుకుంటాయి. దాంతో సరిగ్గా నిద్ర పట్టదు. 

 

ఈ సారి నిద్ర పట్టక పోతే ఒకసారి మీ ఆహారపు అలవాట్లని కూడా గమనించి చూసుకోండి . మంచి ఆహరం మంచి నిద్రని , మంచి నిద్ర మంచి ఆరోగ్యాన్ని ,ఇస్తాయి . మంచి ఆరోగ్యం మనల్ని అన్నిరకాలుగా చురుకుగా ఉంచుతుంది . 

-రమ