రోజూ స్కిప్పింగ్ చాలు.. ఆరోగ్యం సూపర్..
రకరకాల వ్యాయామాలపై దృష్టి సారిస్తూ, కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకుంటుంటే., ఇంకొందరు మాత్రం రోజూ ఒకే వ్యాయామాన్ని రోజు అనుసరిస్తూ తమ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటున్నారు. ఇది ఏలా సాధ్యం...
* శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, తాడాట (స్కిప్పింగ్)తో సాధ్యమవుతుందని ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు.
* శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయ్యటంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుందట.
* రోజు స్కిప్పింగ్ చేయ్యటం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతో పాటు పూర్తి స్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటంతో పాటు చర్మంపై ఏర్పడ్డ ముడతలు తొలగిపోతాయి.
* స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయ్యటం వల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. దాంతోపాటు పగుళ్లు ఏర్పడతాయి.
* ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు వేసుకోవటం మంచింది.
* బరువు తగ్గించటంలో స్కిప్పింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
* స్కిప్పింగ్ ప్రారంభించే ముందు ఐదు నిమిషాల పాటు వార్మప్ చేయ్యటం వల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది.