"సారీ డియర్! రాత్రి లేటుగా రూమ్ కొచ్చాను. పొద్దున్నే నీకోసం డెకరేట్ చేద్దామనుకున్నాగానీ, ఈ లోపలే నువ్ వచ్చేశావ్" అన్నాడు ఫీలయిపోతూ.

 

    "ఈసారికి సారీ అనితా! అయ్ మీన్ చిక్కడపల్లి అనితా!"

 

    అనిత హ్యాపీగా అతని కౌగలించుకుని ముద్దు పెట్టుకుంది.

 

    "ఇది ఫస్ట్ టైమ్- నేను లవ్ చేసినతనిని- అతనింటికొచ్చి కలుసుకోవడం- అందుకే కొంచెం నెర్వస్ గా ఫీలయి నిన్ను అయ్ మీన్- నీ చెంపని బాస్కెట్ బాల్ ఆడాను. అయామ్ సారీ రాకేష్"

 

    సురేష్ ఉలిక్కిపడ్డాడు.

 

    "రాకేషా! రాకేషేంటి? ఇందాక్కూడా రాకేష్ అన్నావ్"

 

    "అంటే నీ పేరు రాకేష్ కాదా?"

 

    "కాదు, సురేష్!"

 

    అతని చెంప చెళ్ళుమంది.

 

    "అమ్మో! మళ్ళీ ఎందుక్కొట్టావ్?"

 

    "నీ పేరు సురేష్ అయితే చాటింగ్ లో నాకు రాకేష్ అని చెప్పినందుకు! ఇలా దొంగ పేర్లతో చాటింగ్ చేసే వాళ్లంటే నాకు మంట"

 

    సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి సెల్ మోగింది.

 

    "హలో!"

 

    "హాయ్ అనితా! ఇంకా రాలేదేంటి? నీ కోసం వెయిట్ చేస్తున్నా డియర్?"

 

    అనిత కన్ ఫ్యూజయింది.

 

    "నా కోసం వెయిట్ చేస్తున్నావా?"

 

    "అవును డియర్! రూమంతా పూలతో డెకరేట్ చేసి మధ్యలో వెల్ కమ్ టు మై డార్లింగ్" అని కూడా ఎన్ గ్రీవ్ చేశా"

 

    "అదేంటి నేను- ఇదే అపార్ట్ మెంట్స్ లో ఉన్నా కదా?"

 

    "వచ్చేశావా? లవ్ లీ! ఎక్కడున్నావిప్పుడు? లిఫ్ట్ లో ఫోర్త్ ప్లోర్ కి రావాలి"

 

    అనిత సురేష్ వేపు చూసింది.

 

    "ఇది ఫోర్త్ ఫ్లోర్ కాదా?" అడిగింది.

 

    "నో నో, థర్డ్ ఫ్లోర్- ఏ ఫ్లోరయితే ఏంటి? మనం కలుసుకోవటం ముఖ్యం కదా" అని ఆమెను ముద్దు పెట్టుకున్నాడు.

 

    అతన్ని అతి కష్టమ్మీద తోసేసింది అనిత.

 

    "అదికాదు. నేను కొంచెం కన్ ఫ్యూజయ్యాను."

 

    "ఏం కన్ ఫ్యూజయ్యావ్?"

 

    "అదే! ఫోర్త్ ఫ్లోర్ అనుకుని థర్డ్ ఫ్లోర్ లో మీ ఇంటికొచ్చా"

 

    "అయిందేదో అయిపోయింది కదా డియర్" అంటూ మళ్లీ కౌగిలించుకున్నాడు సురేష్.

 

    అతని చెంప చెళ్ళుమంది.

 

    "రాస్కెల్! నా లవర్ రాకేష్ నని అబద్ధం చెప్పి నాతో ఎంజాయ్ చేయాలని చూస్తావా?" అనేసి వేగంగా ఫోర్త్ ఫ్లోర్ కి పరుగెత్తింది.

 

    అప్పుడే సురేష్ సెల్ మోగింది మళ్ళీ.

 

    "హలో! కూకట్ పల్లి అనితా! హౌ ఆర్ యూ? ఏంటి శివరామ్ పల్లి అనితవా? హాయ్! వెల్ కమ్! వెల్ కమ్!"


                                                             *  *  *


    బాబూరావ్ ఆ కథ చెప్పటం ముగించేసరికి మాకర్థమయింది.

 

    ఇంక యూత్ మీద ఆధారపడి లాభంలేదు.

 

    మేమే వినాయక చవితి కాలనీలో జరిపే ఏర్పాట్లు చేసుకోవాలి.


                                 *  *  *  *  *