ట్రెండ్ ను అదరగొడుతున్న అమ్మాయిలు..

 

 

అమ్మాయిలు వాళ్ళు వేసుకునే బట్టల దగ్గర నుండి బ్యాగులు, చెప్పులు, ఇయర్ రింగ్స్ వంటి వాటి వరకు కొత్తగా, స్టైలిష్ గా ఉండేలా చూసుకుంటారు. మరి అలాంటి వాళ్ళు వారి అందానికి మరో ఆకర్షనీయమైన తమలపాకుల్లాంటి గోళ్ళకు మాత్రం ఒకే రంగు పెయింట్ అంటే ఎలా చెప్పండి? అందుకే గోళ్ళకు కూడా ఫ్యాషన్, ట్రెండ్ ఏం తక్కువ కాదని నిరూపిస్తున్నారు నేటి అమ్మాయిలు. మరి వాటిలో ఎన్ని రకలున్నాయో తెలుసుకుందాం....!!

 

ఉపయోగం :

ట్రెండ్ మారుతున్నకొద్ది గోళ్ళ రంగులతో పాటు, వాటి మీద ఉండే డిజైన్స్ కూడా మారుతూ వస్తున్నాయి. అసలే ఒకే రంగు పెయింట్ నెయిల్ పాలిష్ రంగులను వేస్కోవడం, వాటిని తీసేయడానికి మళ్ళీ కష్టపడటం అమ్మాయిలకు చాలా విసుగొచ్చేసింది. దాంతో ఇప్పుడు లేటెస్ట్ గా గోళ్ళపై మెరిసే పూసలు, స్టోన్లు వంటి వాటితో అదరగొడుతున్నారు. ఇలాంటి కొత్త ఫ్యాషన్ వల్ల బ్యూటీషీయన్లకు కూడా అధిక పని, అధిక లాభం వస్తుంది. మరి ఒక్కో డిజైన్ కు 500 నుండి వేల రూపాయల్లో ఉన్నాయంటే మాములు మాటన?

 

అయితే మరి ఇలా ప్రతిసారి బ్యూటీపార్లర్ కు వెళ్లి రోజుకో స్టైల్ మార్చుకోవడం వల్ల డబ్బులు, టైం అన్నీ వేస్ట్. అదే ఇంట్లోనే స్టైలిష్ నెయిల్ పాలిష్ వేసుకుంటే మనీ, టైం రెండు సేవ్ అవుతాయి కదా. అందుకే కొత్తగా మార్కెట్లోకి స్టైలిష్ ఫ్యాషన్ నెయిల్ స్తిక్కర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ రెడిమేడ్ స్టిక్కర్ల వలన వేసుకోవడం, తీసేయడం కూడా చాలా ఈజీ.

 

ఎలా వేసుకోవాలి :

మన గోరుకంటే కాస్త పెద్ద సైజు స్టిక్కర్లను తీసుకోని, గోరు మొదలునుంచి అంటిస్తూ, నెయిల్ స్టిక్కర్ తో వచ్చిన స్టిక్ తో కిందికి నొక్కుతూ లాగాలి. అలా చేస్తూ సైడ్ లో ఉండేది సరిగ్గా వచ్చేలా చేసుకొని, చివరకు గోరు షేప్ వచ్చేలా చేసుకొని మిగిలినది తీసేయాలి. అయితే ఈ స్టిక్కర్లు వేసుకున్న తర్వాత నీటిలో ఎక్కువసేపు ఉంచితే ఆ స్టిక్కర్ ఊడిపోతుంది. కాబట్టి నీటిలో ఎక్కువగా ఉంచకూడదు.

 


రకాలు :

అయితే ఈ నెయిల్ స్టిక్కర్లు కూడా మార్కెట్లో అమ్మాయిలకు నచ్చే విధంగా దొరుకుతున్నాయి. కొంత మంది గోరు మొత్తం కొత్త కొత్త స్టైలిష్ డిజైన్ లతో ఉన్న స్టిక్కర్లు కావాలని అనుకుంటే, మరి కొంత మంది తాము వేసుకున్న నెయిల్ పాలిష్ కు కొత్త డిజైన్ కావాలని కోరుకుంటారు. అందుకే గోరు మొత్తం డిజైన్ లతో కూడిన స్టిక్కర్లతో పాటు, విడిగా చిన్న చిన్న స్టోన్స్, పువ్వులు వంటి ఆకర్షనీయమైన స్టిక్కర్స్ కూడా దొరుకుతున్నాయి. దీని వల్ల అమ్మాయిలు నెయిల్ పాలిష్ తో కూడా అబ్బాయిలను పడగొట్టేస్తున్నారు.