ఇండియన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారిలో హేమంత్ త్రివేది ఒకరు. ఈయన ఫ్యాషన్ స్టైలిస్ట్, ఫ్యాషన్ షో కొరియోగ్రాఫర్, ప్రొఫెసర్. ఆస్ట్రేలియా, న్యూయార్క్ లాంటి దేశాల్లో తమ చదువు పూర్తి చేసిన హేమంత్ త్రివేది తన కరియర్ కి మాత్రం ఇండియానే ఎంచుకున్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా S.N.D.T. యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా తమ విలువైన సేవలందిస్తున్న హేమంత్ త్రివేది దానితో పాటు ప్రముఖ శీతల్ గ్రూప్ లో డిజైన్ డైరెక్టర్ గా చేస్తున్నారు.

హేమంత్ డిజైన్స్ ఆయన కెరియర్ కే కాదు , అప్పుడప్పుడే మాడలింగ్ రంగంలో పుంజుకుంటున్న ఎందరో మాడల్స్ కి ఎసెట్ అయ్యాయి. 1995, 1998, 2000 లో వరసగా మిస్ వరల్డ్ గా ఎన్నికైన ఐశ్వర్యా రాయ్ , డయానా హేడెన్, ప్రియాంక చోప్రా లే దానికి ఉదాహరణ. ప్రపంచ ప్రఖ్యాతి గడిస్తూ ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కే తలమానికంగా ఉన్న ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ నిజంగా ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. త్రివేది డిజైన్ ప్రదర్శనలు ఇండియాలోనే కాదు, U.K, U.S, చైనా, ఈజిప్ట్, మారిషస్, శ్రీలంక, U.A.E. దాదాపు సౌత్ ఈస్ట్ దేశాల్లో తన కీర్తిని చాటుకున్నాడు .