బొప్పాయితో ఆరోగ్య సమస్యలు దూరం

బొప్పాయితో ఆరోగ్య సమస్యలు దూరం

 


 

బొప్పాయిని కారుచౌక, పోషక సమృద్ధి ఫలం అంటారు. ఎందుకంటే యాపిల్, జామ, సీతాఫలం, అరటి తదితర పండ్లు కంటే బొప్పాయిలో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ A కూడా అదే మోతాదులో లభిస్తుంది. ఇక పచ్చి బొప్పాయి నుంచి విటమిన్ C, మరికొన్ని ఖనిజ లవణాలు లభిస్తాయి. ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఈ బొప్పాయి మంచి ఔషధంగా పనిచేస్తుందట. పిల్లలలో కడుపు నొప్పి, నులిపురుగుల సమస్య కనిపిస్తే తరుచు బొప్పాయిని ఇస్తుంటే నులి పురుగులు పోతాయట. అదే విధంగా ఆకలి కూడా పెరుగుతుంది అంటున్నారు నిపుణలు. అలాగే రోజు బొప్పాయి పండు ముక్కలను తేనెతో కలిపి తింటే గుండె, కాలేయం, మెదడు, నరాలకు రక్త ప్రసరణ సవ్యంగా సాగుతుందట. ఇక మధుమేహం ఉన్నవారు రోజు రెండు బొప్పాయి పండు ముక్కల్ని తింటే చాలు విటమిన్స్ లోపం రాదట. ఇలా ఎన్నో విధాలుగా మనకి మేలు చేసే బొప్పాయిని పచ్చిగాను, పండుగాను కూడా మన ఆహారంలో తరుచు చేర్చుకోవటం అవసరం అని సూచిస్తున్నారు నిపుణులు.