ఈ చిట్కాలతో అందమైన జుట్టు మీ సోంతం

 

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి మార్కెట్ లో లభించే చాలా రకాల ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు. అక్కడ రింగు రింగుల జుట్టు కోసం, నేరుగా ఉండే జుట్టు కోసం, ఉత్తమమైన కేశాల కోసం, జిడ్డుగా ఉండే కేశాల కోసం, మాములుగా ఉండే జుట్టు కోసం అని చాలా రకాల ఉత్పత్తులలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల ఉత్పత్తులలో ఏది మన కేశాలకు సరిగా పని చేస్తుంది? అనే అనుమానం కలుగవచ్చు అవునా!.


మీ కేశాలు ఆరోగ్యవంతంగా ఉండటానికి, రోజు మంచి ఆహార ప్రణాలికలను పాటించటం తప్పనిసరి. మార్కెట్'లో కేశాల ఆరోగ్యం కోసం చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, అందులో మీ జుట్టుకి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవటం చాలా కష్టమే. మార్కెట్'లో లభించే ఉత్పత్తులన్ని మంచివో, చెడ్డవో లేదా జుట్టు ఎదోర్కొనే సమస్యలకు అక్కడ ఉన్న ఏ ఉత్పత్తి సరిగా పని చేస్తుందో ముందు తెలుసుకోవాలి. కావున మీ కేశాలు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారితంగా మంచి ఉత్పత్తిని ఎంచుకోండి. కేశాల ఆరోగ్యం మరియు వాటి పరిస్థితులను బట్టి రసానిక లేదా మూలికలతో తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకోండి.


కేశాలకు వాడే నూనెలు

కేశాలకు వాడే నూనెలు, కండిషనర్'లు, షాంపూలు అన్ని ఒత్తిడిలను తగ్గించటానికి వివిధ రకాల సంస్థలు వాటికి తగిట్టుగా ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. కేశాల కోసం వాడే నూనెలు సాధారణంగా సహజమైన కొబ్బరి, ఆమ్లా లేదా ఆవాలతో తయారు చేసిన వాటిని వాడటం మంచిది. కానీ ముందుగా మీ కేశాలకు కావలసిన పోషకాలను అందించే వాటిని మాత్రమె ఎంచుకోటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ వెంట్రుకలు రాలిపోతే మాత్రం ఆవాలతో చేసిన నూనె మంచిది, అంతేకాకుండా ఆమ్లాలతో చేసిన నూనెలు కేశాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు గోరు వెచ్చని కొబ్బరి నూనె మీ కేశాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇలా చాలా రకాల నూనెల ఉత్పత్తులు మార్కెట్'లో అందుబాటులో ఉన్నాయి.


షాంపూ

మార్కెట్'లో చాలా రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో రసాయనిక, వైద్యపరమైన మరియు ఔషద గుణాలను కలిగి ఉన్న చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. షాంపూలు కూడా కేశాల పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, కేశాల రకాలను బట్టి ఎంచుకోండి. ఉదాహరణకు- పొడి కేశాలకు, రంగు రంగుల జుట్టు కోసం మరియు ప్రమాదానికి గురయిన కేశాల కోసం వివిధ రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, చూండ్రును త్రోలగించటానికి, జుట్టు రాలిపోవటాన్ని నివారించటానికి లేదా పొడి కేశాలకు కూడా పుష్కలమైన షాంపొ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా వీటన్నిటిని చూసి ఏది వాడలో, ఏది కొనాలో తెలియక సతమతం అవుతుంటారు. మీ కేశాల పరిస్థుతులు, అవసరం అయ్యే రకం మరియు వెంట్రుకల ఆరోగ్యానికి, పెరుగుదలకు, దృడత్వానికి అవసరం అయ్యేది మీకు తెలిసే ఉంటుంది. కావున మీ కేశాలకు సరిపోయే రకాన్ని, ఇష్టమైన సంస్థ యొక్క ఉత్పత్తులను కొని వాడండి.


కండిషనర్'లు

జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, కావలసినంత తేమను అందించటానికి కండిషనర్'లు తప్పని సరి అవసరం. ఇక్కడ కూడా మీరు రసాయనిక లేదా మూలికల ఉత్పత్తులను ఎంచుకోవలసి వస్తుంది. మీరు ఎంచుకునే కండిషనర్'లలో హెన్న ఉండే ఉత్పత్తులను ఎంచుకోటానికి ప్రయత్నించండి, కారణం హెన్న ఒక సహజసిద్ద కండిషనర్'గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఆ తరువాత, మన జుట్టు కాలుష్యానికి, దుమ్ము మరియు సూర్యకాంతికి బహిర్గతం అవుతున్నాయి. ఇవి కేశాలను ప్రమాదానికి, అనారోగ్యానికి గురి చేస్తుంటాయి. మన కేశాలకు కావలసిన తేమ, వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం మన భాద్యత. మీరు వాడే కండిషనర్'లు ఈ విధులను నిర్వహిస్తాయి. మన కేశాలకు సహజసిద్ద కండిషనర్'లను వాడాలి అనుకున్నపుడు హెన్న లేదా గుడ్డు'లను రోజు వాడటం మంచిది. ఇవి జుట్టుకు చాలా మంచివి సహజ సిద్దంగా కేశాలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. కానీ, కండిషనర్'లను వాడిన ప్రతిసారి షాంపూలను వాడటం మాత్రం మర్చిపోకండి.

వీటిని వాడటానికి ముందుగా ఎంచుకున్న ఉత్పత్తులను గమనించటం మంచిది, కారణం కొన్ని రకాల ఉత్పత్తులలో గాడతలు ఎక్కువగా ఉన్న రసాయనాలు, కేశాలను ప్రమాదానికి గురి చేసే మూలకాలను లేదా రసాయనాలను కలిగి ఉంటాయి కావున మీ కేశాలకు అనుకూలంగా ఉండే ఉత్పత్తులను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న రకం మీ కేశాల ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలి అంతేకానీ అనారోగ్యానికి గురి చేసేదిగా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఉత్పత్తులను వాడినపుడు అసాధారణ లక్షణాలు, చిరాకులు లేదా వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే ఆ ఉత్పత్తులను వాడకాన్ని వెంటనే మానేయటం చాలా మంచిది.