వర్షాకాలం వచ్చేసింది. వర్షంలో బయటకు వెళ్ళాలంటే మాములుగా రెయిన్ కోటు లేదా గొడుగు తీసుకెళ్ళడం మాములే. కానీ మనం వేసుకునే బట్టలే కాస్త అప్పుడప్పుడు ఇబ్బందికి గురిచేస్తాయి. మరి ఈ వర్షాకాలంలో ముఖ్యంగా అమ్మాయిలు ఎలాంటి దుస్తులను ధరించాలి, ఎలాంటివి బాగుంటాయి అనేది తెలుసుకుందాం.


అమ్మాయిలు కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది. సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. స్కిన్ టైట్, లేగ్గింగ్స్ కూడా బాగుంటాయి. అదేవిధంగా చీరలు, చుడిదార్లు వేసుకునే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది. హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి వాడితే బాగుంటాయి. అయితే ఇక్కడ గుర్తున్చోకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే... వర్షాకాలంలో ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ బట్టలను వాడకపోవడం ఉత్తమం.