నైట్ మాస్కులతో మీ అందానికి మార్కులు!

 

 

పగలంతా పనిలో మునిగిపోతాం. ఎండలో తిరిగి అలసిపోతాం. ఇంటికొచ్చి తినేసి నిద్రపోతాం. గ్లామర్ తగ్గిపోతుందని గమనిస్తాం. స్కిన్ పాడైపోతోందని ఫీలవుతుంటాం. కానీ కేర్ తీసుకుందామంటే టైమ్ దొరకదే. ప్యాక్ వేసుకోవాలి, ఆరేవరకూ వెయిట్ చేయాలి, కడుక్కోవాలి... అంత టైమ్ ఎక్కడిది అంటారా? అలాంటప్పుడు ఈ నైట్ ప్యాకులు వేసేసుకోండి. టైమూ వేస్టవదు. అందమూ ఎక్కడికీ పోదు.

 

* మూడు చెంచాల తేనెలో ఓ చెంచాడు నిమ్మరసం కలిసి రాత్రి పడుకోబోయేముంది ముఖానికి రాసుకోండి. ఉదయం లేచాక ముఖం కడుక్కోంది. ఇది కమిలిన చర్మాన్ని మళ్లీ కాంతిమంతంగా చేస్తుంది.


* చర్మం మరీ పొడిబారిపోయి విసిగిస్తోంటే... గంధపుపొడిలో కాసిన్ని పాలు, కొద్దిగా శనగపిండి కలిపి పడుకునే ముందు ప్యాక్ వేసుకోండి. ఉదయం లేచి గోరు వెచ్చని నీటితో కడుక్కోండి. మీ ముఖం ఎలా నిగనిగలాడుతుందో చూడండి.


* ఓట్స్ ను పొడి చేసి, పాలతో కానీ పెరుగుతో కానీ కలిపి పేస్ట్ లా చేయండి. దీనితో పడుకునే ముందు ప్యాక్ వేసుకుని పడుకోండి. ఉదయం లేచాక చల్లని నీటితో కడిగేయండి. వారం రోజులు ఇలా చేస్తే చాలు... పోయిందనుకున్న గ్లామర్ మళ్లీ వచ్చి ముఖంలో చేరుతుంది.


* తీరిగ్గా ఉన్నప్పుడు గులాబీ రేకుల్ని ఎండబెట్టి, పొడి చేసి ఓ డబ్బాలో దాచుకోండి. ఈ పౌడర్లో పాలు కలిపి అప్పుడప్పడూ పడుకునే ముందు ప్యాక్ వేసుకుంటే చర్మం డల్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది.


* పాల మీగడలో పసుపు, శనగపిండి కలిపి వేసే నైట్ ప్యాక్ కూడా చాలా మంచి ఫలితాన్నిస్తుంది.

- Sameera