How to Make Your Child Like School

స్కూలుకు వెళ్ళడం అనేది పిల్లల జీవితంలో ఒక ప్రధానమైన ఘట్టం. పిల్లలు బడికి వెళ్లడం

మంచి భవిష్యత్ కు పునాది. ఇంట్లోని వారందరినీ వదిలి స్కూల్ అనే కొత్త

వాతావరణంలోకి, కొత్త ముఖాల మధ్యకు వెళ్లడం కొందరి పిల్లలని

భయపెడుతుంది.స్కూల్ వాతావరణంలో కొందరు పిల్లలు ఉత్సాహంగా ఉల్లాసంగా

కలిసిపోతే మరికొందరు పిల్లలు అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది.

స్కూలు మొదలైన తొలిరోజుల్లో పిల్లలలో అలసట కనిపించడం సాధారణంగా మనం

చూస్తూ ఉంటాం. దీని తాలుకూ లక్షణాలుగా చిరాకు, కోపం, ఊరికే ఏడవడం వంటివి

కనిపిస్తాయి మనకు పిల్లలలో.మరికొందరు పిల్లలు అయితే రాత్రుళ్ళు

కలవరిస్తుంటారు.ఇవన్నీ తాత్కాలికమే.స్కూలుకు వెళ్లడం అలవాటు పడ్డాక ఈ లక్షణాలు

అన్ని వాటికి అవే తగ్గు ముఖం పడతాయి.

* పిల్లలకు ముందుగా స్కూలు పట్ల వారికి ఉన్న భయాన్ని పోగొట్టాలి.

* స్కూలు నుంచి రాగానే పిల్లలు చెప్పే కబుర్లు విని వాటిలో ఏవి అవసరమో వాటికి

సంబంధించిన సలహాలు,సూచనలు ఇవ్వాలి. ప్రేమగా బుజ్జగించాలి.

* కొందరు పిల్లలు కొత్తగా ఎదురుకున్న అనుభవాలని ఎడతెరిపి లేకుండా చెబుతుంటారు.

వాటిని మనం విసుక్కోకుండా వినాలి.

* స్కూలుకి వెళ్లడం ప్రారంభించిన పిల్లలకు అవసరమైన ప్రోత్సాహం, మద్దతులను ఇంట్లోని

పెద్దలేగాక, స్కూలులోని సిబ్బంది కూడా అందించాలి.

* స్కూలుకు వెళ్లనని మారాం చేసే పిల్లల్ని తిట్టి, కొట్టి భయపెట్టకూడదు.

* పిల్లలకు ఎలా చెప్పితే అర్థం అవుతుందో అర్థం చేసుకుని వారికి అర్థం అయ్యేటట్టుగా

నచ్చచెప్పాలి.