నాన్ వెజ్ ఎలా తినాలి...

 

నాన్ వెజ్ ఎలా తినాలి?

 

 

అనారోగ్యానికి అసలు కారణం మాంసాహారం అంటారు కొందరు. నాన్ వెజ్ ఎంత తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం అంటారు ఇంకొందరు. ఇలాంటివన్నీ విన్న తర్వాత మాంసాహారం మానెయ్యాలా అన్న సందేహం అందర్లోనూ తలెత్తుతోంది. అయితే పూర్తిగా మానెయ్యక్కర్లేదు అంటారు డాక్టర్స్. ఎంత తినాలి, ఎలా తినాలి అన్నది తెలుసుకుంటే నాన్ వెజ్ తో వచ్చే నష్టమేమీ ఉండదట.

- మాంసంతో కూరగాయల్ని కలిపి వండటం వల్ల ఫైబర్ యాడ్ అవుతుంది. యాసిడిక్ ఎఫెక్ట్ తగ్గుతుంది. కూరగాయల్లో ఉండే ఎంజైమ్స్ వల్ల మాంసం త్వరగా అరిగిపోతుంది కూడా. ఒకవేళ కలిపి వండకపోయినా మాంసాహారం తిన్న తర్వాత కూరగాయలతో చేసిన సలాడ్ కొద్దిగానైనా తీసుకునేలా అలవాటు చేయండి.

- రెడ్ మీట్ ఆరోగ్యానికి మంచిది. కాబట్టి దానికే ప్రాముఖ్యతనివ్వండి.

- మాంసం కొనేటప్పుడు దానిలో కొవ్వు ఎక్కువగా లేకుండా చూసుకోండి. వండేటప్పుడు కూడా నూనె తక్కువ వాడాలి.

- వీలైనంత వరకూ ఎల్లో తీసేసి ఎగ్ వైట్ మాత్రమే తినాలి. చిన్న పిల్లలు తప్ప పెద్దవాళ్లు వారానికి రెండుసార్లకు మించి ఎగ్ తినకపోవడమే మేలు.

 

 

- చేపలు, కోడిగుడ్లను వేయించడం కంటే ఉడికించి తినడమే మేలు. ఫ్రై చేయడం వల్ల ప్రొటీన్స్ హరించుకుపోతాయి. అరుగుదల కూడా కష్టమవుతుంది.

- మాంసం కంటే చేపలు చాలా ఉత్తమం. కొలెస్ట్రాల్ ప్రమాదం ఉండదు. అరుగుదల ఎక్కువ. కాల్షియం కూడా తగినంత అందుతుంది.

- మాంసాహారం తిన్న తర్వాత కొంత సేపటివరకూ ఫ్రూట్స్ తినడకపోవడం మంచిది. లేదంటే ఫెర్మెంటేషన్ కారణంగా అజీర్తి, వికారం వంటి సమస్యలొస్తాయి.

- థర్మోజెనిక్ ఫుడ్ అవ్వడం వల్ల మాంసాహారం తిన్న తర్వాత వేడి ఎకు్కవగా ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ నీళ్లు తాగాలి.

- యూరిక్ యాసిడ్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్లు మాత్రం మాంసం తినకూడదు. అలాగే హై బీపీ ఉన్నవాళ్లు కూడా మాంసం బదులు చేపలు తినడం మంచిది. అందులో ఉండే మెగ్నీషియం, ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ రక్తపోటును తగ్గిస్తాయి.

ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే నాన్ వెజ్ తిన్నా ఏమీ కాదు. తినడం మానేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నాన్ వెజ్ అంటే భయపడకండి. మీరూ తినండి, మీవాళ్లకీ పెట్టండి.

- Sameera