బీట్రూట్ తో శరీరానికి సోయగాలు

 

 

అందం కోసం ఏం చేసినా, ఎలా చేసినా ఇంకా తక్కువే అనిపిస్తుంది కదూ. కూరగాయలతో కూడా అందానికి మెరుగులు దిద్దచ్చు. బీట్రూట్ నే తీసుకోండి. చూడటానికి ఎర్రగా ఉండే బీట్రూట్ తిన్నా లేదా వివిధ రకాలుగా ఉపయోగించుకున్నా ఫలితం వెంటనే కనిపిస్తుంది.

బీట్రూట్ లో ఐరన్, ఫోస్ఫరస్, ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేయటమే కాకుండా వయసు పైబడినా ఆ వృధాప్యపు చాయలు మన వైపు రాకుండా చేస్తుంది.
 

 

*  రక్తహీనతతో బాధపడే వాళ్ళు రోజుకో గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల ఆ సమస్య త్వరగా తగ్గుతుందని ఎప్పుడో చెప్పారు డాక్టర్లు.

*  బీట్రూట్ లో వెనిగర్ కలిపి జుత్తుకి పాటిస్తే చుండ్రు సమస్య చాలావరకు తగ్గుముఖం పడుతుందిట. దేనిలో ఉండే సిలికా అనే పదార్ధం వల్ల జుట్టులో ఉండే చుండ్రుకి చెక్ పెడుతుంది.

* కొంతమందికి మెడ వెనక నల్లగా ఉంది ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం బీట్రూట్ రసం కేరట్ రసం సమపాళ్ళలో కలుపుకుని మొహానికి మెడకి రాసుకుని ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే నల్ల మచ్చలు పోతాయట.

 


* బీట్రూట్,ఆరంజ్ జ్యూస్ కలిపి శరీరానికి పట్టించి కాసేపు ఉంచాకా కడిగేసుకుంటే శరీరంపై ఉండే మృతకణాలు సులువుగా పోయి చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.

* కొంతమందికి జుట్టు కాస్త ఎర్రగా ఉంటే ఇష్టం. అలాంటి వారు హేన్నాలో బీట్రూట్ రసం కలిపి జుత్తుకి పట్టించి ఒక గంట సేపు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంకళ్యాణి టే చాలా నాచురల్ గా కనిపించే ఎరుపు రంగు జుట్టు మీ సొంతమవుతుంది.

* బీట్రూట్ ముద్దలో కాస్తంత పంచదార వేసి రెండిటిని కలిపి పెదాలకి రాసుకుని ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే నల్లగా ఉండే పెదాలు ఎరుపు రంగులోకి మారి మీకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.

  ఇలా చెప్పుకుంటూ పొతే బీట్రూట్ తో ఎన్ని లాభాలు ఉన్నాయో లెక్కే లేదు. మరి వీటిలో కొన్నయినా try చేసి చూడండి.

..కళ్యాణి