అందానికి చిట్కాలు

  1. మీరు బయటికి వెళ్ళేటప్పుడు బ్రషర్ నే వాడండి, లిప్ స్టిక్, కోహిల్ పెన్సిల్ తో కనుబొమ్మలను సరిదిద్దుకోండి.

  2. మస్కారాని వాడితే మీ కనుబొమ్మలు, మీ కనురెప్పలు కూడా దట్టంగా కనిపిస్తాయి.

  3. బ్రషర్స్ తో కంటి షాడో ను లిప స్టిక్ ను సరిదిద్దుకోవచ్చు.

  4. కంటి రెప్పలకు బంగారు రంగు గాని , వెండి రంగులు గాని పూత పూయడం, కొంత స్పెషల్ ఫంక్షన్స్ అయితే గాని బాగుండదు. మీరు గోల్డ్, సిల్వర్ కూడా మేకప్ మెటీరియల్స్ తో పాటు వాడవచ్చు. మీ ముఖంలో బంగారు ఛాయ గాని, రజిత ఛాయ గాని కనిపించి మరింత అందంగా కనిపిస్తారు. కనుక మీరు అందంగా కనిపించాలంటే మీకు వయస్సుతో పనేలేదు. ఏ వయస్సు వారైనా సరే కాస్త శ్రద్ధ తీసుకుంటే శ్రమ అనుకోకపోతే అందంగా, ఆకర్షణీయంగా , ఆహ్లాదకరంగా, ఆహ్లాదకరంగా అందరికీ ఆమోదయోగ్యంగా కనిపించి ఆనందపరచవచ్చు, ఆహ్లాదపరచవచ్చు.

మేకప్ కళలోని కొన్ని కిటుకులు...మోడరన్ మేకప్ చాలా అభివృద్ధి చెందింది. స్త్రీలు తమ అందాన్ని ఎన్నో విధాలుగా మలుచుకుంటున్నారు. సహజంగా సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకునే విధంగా మేకప్ ను అభివృద్ధి పరిచారు. స్త్రీ యొక్క ముఖకవళికలను ఎన్నో రీతులలో మార్పులు చేయగలుగుతున్నారు. అసలు ఫేస్ మేకప్ పై అద్భుతమయిన ప్రయోగాలు చేసి పర్సనాలిటీనే పూర్తిగా మార్చి వేస్తున్నారు.

ఈ నాడు మేకప్ కళ ఎంత ఎదిగిపోయిందంటే ఆధునిక యుగ రీతులకనుగుణంగా కాలాన్ని బట్టి, వయస్సును బట్టి, వెళ్ళే అకేషన్ ని బట్టి అంతే వివాహానికి ఓ రకంగా , బర్త్ డే పార్టీకి మరో రకంగా , పిక్నిక్ కి మరో విధంగా, సాధారణ పార్టీలకో విధంగా, ఫంక్షన్ ను బట్టి తగిన మేకప్ చేసుకుంటున్నారు. దానికనువైన దుస్తులను ధరిస్తున్నారు. ఆభరణాలు కూడా తదనుగుణంగానే ధరిస్తున్నారు. మేకప్ లేకుండా ఈ ఆధునిక యుగంలో ఏ స్త్రీ బయటకు రావడం లేదు. ఫంక్షన్స్ కి మాత్రమే కాదు మామూలుగా మార్కెట్టుకు కూరగాయలు, సరుకుల నిమిత్తం వెళ్ళినా స్త్రీలు మేకప్, మ్యాచింగ్ డ్రెస్ లేనిదే బయటికి అడుగు పెట్టరు. స్త్రీని చూస్తే కేశాలంకరణ నుంచి, పాదరక్షల వరకు, తిలకం, దుస్తులు, ఆభరణాలు అన్నీ ఒకే రంగులో మ్యాచ్ అవుతూ ఉండి తీరాల్సిందే.

ఇప్పుడు మేకప్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ప్రాబ్లం కూడా కాదు. అనేక షేడ్స్ లో మ్యాచ్ ఫ్యాక్టర్స్ విదేశాలనుండి దిగుమతి అయ్యాయి. వాటి ప్రభావం అపూర్వం, మనలోని లోపాలెన్నో అత్యద్భుతంగా కప్పి పుచ్చగలుగుతున్నారు.. జబ్బు చేసి ముఖం మీద మచ్చలయినా, లేదా గుంటలు అయినా అతి సులువుగా మూసేయగలుగుతున్నారు. ముఖాన్ని మేకప్ తో పూర్తిగా మార్చి వేయాలనే పూర్వపు ఆలోచనైతే నేడు ముఖాన్ని సహజంగానే ఉంచుతూ చాలా సహజ సిద్ధంగా ఉండే లైట్ రంగుని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు.

పూర్వం మేకప్ డ్రైగా ఉండేది. ఇప్పటి మేకప్ లో మాయిశ్చరైజర్ వాడుతున్నారు. అందుకే మేకప్ ఎంతో ముచ్చటగా, సున్నితంగా, తెజోవంతంగా ఉంటుంది. మేకప్ లో ఉన్నప్పుడు మనలోంచి చాలా వరకు చెమట రూపంలో మనలోని తేమతనం ఇంకి పోతూ ఉంటుంది. దానిని అరికట్టి సమ శీతోష్ణతను నెలకొల్పడానికి మాయిశ్చరైజర్ ను ఇప్పుడు విరివిగా వాడుతున్నారు. మేకప్ కు ముందుగా మన శరీరం కొంత తేమతనం కలిగి ఉండాలి. అందుకోసం మనం మాయిశ్చర్ కలిగిన రసాయనిక పదార్థాలు వాడటం మంచిది. చర్మం మెత్తగా ఉంటే మేకప్ బాగా అతుకుతుంది. చర్మం బిరుసుగా ఉంటే అతకదు. చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుంది.

మాయిశ్చరైజర్ లు ఇప్పుడు అనేక విధాలుగా మార్కెట్టులో విడుదలవుతున్నాయి. ఎమెల్షన్సు గాను, ద్రావకాలగాను వస్తున్నాయి. మాయిశ్చరైజర్ ను పల్చగా ముఖానికి మెడకి పట్టించాలి. దానిపైన ఫౌండేషన్ మేకప్ చేయాలి. ఫౌండేషన్ కు ఉపయోగించే రంగును అన్వేషించడంలో కొంత టెక్నిక్ అవసరం. అది ఉపయోగించే రంగు పైన కూడా ఆధారపడి ఉంటుంది. ఫౌండేషన్ పూర్తి చేశాక దానిపై కాంతిని కొంత వరకు సరఫరా చేయగల పౌడర్ ( Transcent powder) ను జల్లాలి. అప్పుడు గాని ఫౌండేషన్ బాగా సెట్ అవదు.