1. ప్రతి రోజూ నిద్రపోయే ముందు కాళ్లను శుభ్రం చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకోవాలి. పగుళ్లపై కొబ్బరి నూనెతో మృదువుగా మర్దనా చేసి, మందంగా ఉండే సాక్సులు ధరించాలి.

2. ఉదయాన్నే పాత బ్రష్ తో పాదాలను రుద్ది, గొరువెచ్చటి నీటితో కడిగేసుకోవాలి. కొన్ని రోజులు ఇలా క్రమం తప్పకుండా చేస్తే పాదాలు మృదువుగా తయారవుతాయి.

3. గోరువెచ్చని కప్పు పాలల్లో పాదాలు ఉంచాలి. ఇది పాదాలకు సహజసిద్ధమైన మాయిశ్చ రైజర్ ను ఇవ్వడమే కాకుండా పాదాలను మృదువుగా ఉంచడానికి దోహదం చేస్తుంది .

4. అరటిపండును ముద్దగా చేసుకొని పగుళ్లపై రాసి పది నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో శుభ్రపరుచుకుంటే మడమలు మెత్తబడతాయి.

5. కప్పు వెనిగర్ లో కొద్దిగా సబ్బు కలిపి ఈ మిశ్రమంలో పాదాలను ఓ పది నిమిషాల పాటు ఉంచాలి.

6. గిన్నె నీటిలో కొద్దిగా సోడా ఉప్పు వేసి ఓ అరగంట పాటు పాదాలు ఉంచాలి. ఇలా చేయడం వలన పాదాలు మృదువుగా ఉంటాయి.

7. గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం వేసి అందులో పాదాలను ఉంచాలి. పది నిమిషాల తరువాత మామూలు నీటితో శుభ్రపరుచుకుంటే పగుళ్ల వల్ల ఉండే నొప్పి తగ్గుతుంది.

8. ప్రతి రోజూ సాయంత్రం రోజ్ వాటర్ ను కాళ్ల పగుళ్ల పై రాసి మృదువుగా మర్దనా చేసినా ఫలితం ఉంటుంది.

9. ఉదయం ఆవనూనెతో కాళ్లను మర్దనా చేసుకుంటే పగుళ్లు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి.

10. కాళ్లు కోమలంగా, అందంగా ఉండాలంటే వీటితో పాటు పోషకాహారం తప్పనిసరి. క్యాల్షియం, ఐరన్, జింక్, ఒమెగా వంటివి సమృద్ధిగా లభించే ఆహరం తీసుకోవడం మంచిది.