అరటితో అందం



అరటిపండు కాస్త మెత్తగా అయితే పిల్లలు తినటానికి ఇష్టపడరు . అప్పుడు ఆ పండిన అరటిపండుతో అందానికి మెరుగులు దిద్దుకోవటం ఎలాగో చూద్దాం.


1. అరటిపండుని మెత్తటి గుజ్జుగా చేసుకుని ఓ చెమ్చా చిక్కటి పాలు, ఓ చెమ్చా  ఓట్మీల్ పొడిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగితే చర్మం తాజాగా కనిపిస్తుంది.

2. అలాగే అరటి గుజ్జులో ఓ చెమ్చా శనగపిండి, ఓ చెమ్చా పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు. పది నిమిషాల తర్వాత కడిగేస్తే, మృత కణాలు పోయి ముఖం తాజాగా వుంటుంది.

3. అరటిగుజ్జులో  నిమ్మరసం, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖానికున్న మురికి సులువుగా వదులుతుంది.

4. అరటిగుజ్జుతో మోచేతులు, మెడ వంటి చోట రుద్దితే కూడా మంచి ఫలితం వుంటుంది.
 
అరటిపండులో వుండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు, అందులోని విటమిన్ - ఎ, పొటాషియం వంటివి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి అయినా అరటిపండుని చర్మ సౌందర్యానికి వాడటం మంచిది.

-రమ