Tamanna Beauty Secret

Tamanna Beauty Secret,Tamanna Bhatia Beauty Secrets, Tamanna Skin Care Tips, Beauty Secrets Tamanna:

తెలుగు సినిమాల్లోనే కాకుండా అన్ని భాషాల సినిమాల్లోను తన హవా చాటుకోవాలని చూస్తున్న తమన్నా బ్యూటీ సీక్రెట్స్ ఏమిటో, అందుకు ఏమి చేయాలో ఆమె మాటల్లోనే వినండి.

* నూనె పదార్థాలను చాలా వరకు దూరంగా ఉంచుతాను. ఎక్కువగా నీళ్లుతాగుతాను.

* రోజూ పొద్దునే యోగా చేయడం అలవాటు. గంటపాటు యోగా చేస్తాను. ఒకవేళ యోగా చేసే మూడ్ లేకపోతే డ్యాన్స్ చేస్తాను. ఆ డ్యాన్స్ కూడా కనీసం రెండు గంటలపాటు ప్రాక్టీస్ చేస్తాను. దానివల్ల వ్యాయామం పూర్తవుతుంది. నా డ్యాన్స్ ఇంప్రూవ్ కూడా అవుతుంది.

* పళ్లరసాలను, కొబ్బరినీళ్లను తాగుతాను.

* ఎక్కువ సేపు నిద్రపోవడమే నా హెల్త్ సీక్రెట్.

* షూటింగ్ నుంచి రాగానే మేకప్ అంతా తుడిచేస్తాను. శనగపిండి, పెరుగు కలిపి వారానికి రెండు సార్లు క్రమం తప్పకుండా ప్యాక్ వేసుకుంటాను.

* చలికాలంలో పింక్ కలర్ ను ఎక్కువగా ఉపయోగిస్తే భాగుంటుంది.

* బేబీ పింక్, లైట్ పింక్, ఇలా గులాబీ రంగులో ఎన్నో రకాల షేడ్స్ లభిస్తాయి. వాటితో ఎన్ని ప్రయోగాలైనా చేయవచ్చు. బేబీ పింక్ రంగులో ఉండే గోళ్ళ రంగు వేసుకుంటాను. ఎంతో అందంగా ఉందని మీరే ఒప్పుకుంటారు.

* నాలాగా తెల్లగా ఉండేవారు పెదవులకు రోజ్ పింక్ లిప్ స్టిక్ వేసుకుని చూడండి

* సెక్సీలిప్స్ కోసం లైట్ పింక్ కలర్ లిప్ గ్లాస్ ఉపయోగిస్తాను.