ఆరోగ్యానికి చిన్న చిట్కాలు
 
 


1. వంటింట్లో పొరపాటున వేడి గిన్నెలను ముట్టుకుంటే చాలా మంటగా వుంటుంది. బర్నాల్ వంటివి అందుబాటులో లేకపోతే కొంచెం టూత్ పేస్ట్ రాసి చూడండి. నొప్పి త్వరగా తగ్గిపోతుంది.

2. వేడి వేడి టీ, కాఫీ గబుక్కున తాగితే నాలుక కాలినట్టు అవుతుంది. అప్పుడు ఒక చెంచా పంచదార నోట్లో వేసుకుంటే నొప్పి తగ్గుతుంది.

3. ఏదైనా కుట్టినట్టు మంటగా వుంటే వంట సోడాలో కొంచెం నీళ్ళు పోసి కలిపి ఆ పేస్ట్‌ను చీమ, దోమ కుట్టినచోట రాస్తే ఆ దద్దురు, మంట తగ్గుతాయి.

4. ఆగకుండా ఎక్కిళ్ళు వస్తుంటే ఒక చెంచా  చక్కెర నాలుక మీద వేసుకుని చప్పరిస్తే చాలు. నెమ్మదిగా ఎక్కిళ్ళు పోతాయి.

5. కడుపు బరువుగా వుంటే పుదీనా ‘టీ’ తాగితే రిలాక్స్‌గా వుంటుంది. పుదీనా ఆకులను శుబ్రంగా కడిగి చిన్నచిన్న ముక్కలుగా తరగాలి. తెర్లుతున్న నీటిలో పుదీనా ఆకులను వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత పాలు, పంచదార కలిపితే పుదీనా టీ రెడీ. పాలు లేకుండా తాగితే ఇంకా మంచిది.

 

- రమ