Home » Beauty » తెల్లదనం మీసొంతం

తెల్లదనం మీసొంతం

తెల్లదనం మీసొంతం

 



పెరుగు , తేనెతో తెల్లదనం :

 



పెరుగులో వుండే ఎంజైమ్స్ చర్మాన్నినిగనిగలాడేలా చేస్తాయి. అలాగే తేనే తేమని అందించటమే కాదు, యాంటి బాక్టీరియల్ ప్రోపర్టీస్ కూడా కలిగి వుంటుంది. ఈ రెండిటిని కలిపి ముఖానికి  మాస్క్ వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.తేనే, పెరుగు సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి 15 నిముషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో  కడిగెయ్యాలి. చర్మం నిగనిగలాడుతూ కొత్తకాంతిని స్వంతంచేసుకుంటుంది.

సెనగపిండి, నిమ్మరసం కలిస్తే తెల్లదనం స్వంతం :

 



శనగపిండి పావుకప్పు, రెండు స్పూన్ల నిమ్మరసం లేదా పాలు తీసుకుని మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. శనగపిండి పడనివాళ్ళు పసుపు  వాడొచ్చు. తయారు చేసుకున్న పేస్ట్ ను పట్టించే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి ఆ తరువాత పేస్ట్ ను పట్టించి పదిహేను నిముషాలు అలాగే ఉంచి తరువాత కడిగెయ్యాలి. ఈ ప్యాక్ తో ఇన్స్టంట్ గ్లో పొందవచ్చు.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం నల్లబడటమనే సమస్య వుండదు.

- రమ

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img