పరిచయం
మనిషి పుట్టిన సందర్భంలో ఉన్నటువంటి జాతకంలో గ్రహ, భావం రాశులకు సంబంధించిన యోగాలు వేరు వేరుగా ఉంటాయి. వీటిలో శుభ యోగాలుంటే వారి జీవితం ఆహ్లోదకరంగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది. సమాజోపయోగంగా ఉంటుంది. గ్రహాలు సరియైన స్థానాల్లో లేని జాతకాల వల్ల జీవనగతిలో వేరు వేరు కోణాల్లో ఇబ్బందులకు అవకాశం ఉంది. ముహూర్తం సంహితలలో ఒక భాగం, దీన్ని మనం నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఆ నిర్ణయంలో శుభ తిథి, వార, నక్షత్ర, యోగా, కరణాదులను, వేరు వేరు యోగాలను గమనించడం ద్వారా శుభశుభాలను నిర్ణయించుకోవచ్చు. శుభమైన యోగాలు తెలుసుకోవడం, లేక అశుభయోగాలు తెలుసుకొని అవి లేని ముహూర్తాన్ని నిర్ణయించడం అనేది ముహూర్త సంబంధమైన అంశంలో అత్యవసర విషయం. ఆ క్రమంగా ఈ పాఠం ప్రత్యేకమైన 21 దోషాలను 'ఏకవింశతి మహా దోషాల"ను తెలియజేస్తుంది.