ఉద్దేశ్యం
ముహుర్తాల నిర్ణయంలో ఏకవింశతి మహాదోషాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వివాహాది కార్యక్రమాలను నిర్వర్తించేటప్పుడు ఈ మహా దోషాలను దృష్టిలో పెట్టుకోవలసి వుంటుంది. కొన్ని ముహూర్తాలు సాధారణంగా అనుకూలంగా కనిపించినా కొన్ని ప్రత్యేక దోషాలుండే అవకాశం ఉంది. అందువల్ల ఈ 21 దోషాలను, వాటి పరిహారాధులను గమనిస్తూ ముహూర్తం నిర్ణయించడం ద్వారా ఫలితాలలో ఉత్తమత్వం ఉంటుంది. ఆ 21 దోషాలను అధ్యయనం చేయడానికి ఈ పాఠం ఉద్దేశించబడింది.