Home » Dwadasha Rasulu Karakatwalu » వృషభ రాశి
వృషభ రాశి

సరిరాశి, భూతత్త్వము మరియు స్థిరరాశి. ఈ రాశివారు ఆనందం, వాత్సల్యం, స్థిరము, దృఢత్వము కలవారు. ఏ పనైనను నిదానంగా ఆలోచించి పూర్తిచేస్తారు. ప్రణాళిక లేకుండా ఏ పని ప్రారంభించరు. అచంచలమైన నిశ్చయత్వం, స్థిరత్వం ఈ రాశి వారియందు కనబడును. వీరికి స్థిరమైన అభిప్రాయాలు, విశ్వాసాలు, సంబంధ బాంధవ్యాలు ఉండును. దయ, దానగుణం, కలవారు. వీరి ఇంటియందు అన్ని వస్తువులు అమర్చినట్లుండును. అట్లే వీరు చేసే పనులు చక్కగా, పొందికగా ఉండును. వీరు ఎవరినీ అంత సులభంగా నమ్మరు. ఎవరిమీదనైనను అపనమ్మకం వచ్చిననూ లేదా ఎవరినైననూ చెడుగా ఊహించినచో జీవితాంతం వారిని అట్లే ఊహించి వారికి దూరంగా ఉంచెదరు. తమకు నచ్చిన వ్యక్తుల అపరాధము క్షమించగలరు. నచ్చని వ్యక్తులను మంచి వారైననూ క్షమించలేరు. వీరి అభిప్రాయములను మార్చుటకు ఎవరికీ సాధ్యం కాదు.

 

వీరు సామాన్యంగా మంచి వస్త్రములు ధరించుట, చక్కని ఆహారము స్వీకరించుట, అందమైన వస్తువులను సేకరించుట, కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించుట, చిత్రలేఖనము, కవిత్వము, సంగీత ప్రియత్వమునందు కాలం వెచ్చించుట, (ఖర్చు) చేయుదురు. స్వార్ధము ఎక్కువ. పదిమందిలో ఉన్ననూ తమ పనులు ముందు చేసుకొని ఆ తరువాతనే మిగిలిన వారిని గురించి, మిగిలిన విషయంల గురించి ఆలోచించెదరు. తాము, తమ కుటుంబ సభ్యులవిషయముల తర్వాతనే మిగిలిన వారి గురించి ఆలోచించెదరు. వీరు ఓర్పుతో కష్టపడి పని చేయుదురు. అలసట ఎరుగరు. పనులు చేయునప్పుడు సహనము కలిగి ఉందురు. వీరి సహనమును ఎవరైననూ పరీక్షించినచో వారియెడల తీవ్రంగా ప్రవర్తిస్తారు. వీరికి కోపము తెప్పించుట ఎంత కష్టమో, వచ్చిన తరువాత తగ్గించుట అంతే కష్టము. వీరి దృఢమైన నిర్ణయములు, మొండి పట్టుదలగా మారవచ్చును. దాని వలన జీవితమునందు చాలా నష్టపోవుదురు. కావున మొండి పట్టుదలలో, దృఢనిర్ణయాలలో, పట్టువిడుపులున్న మంచిది తమ పట్టుదలవలన తమకు ఎటువంటి నష్టము వచ్చిననూ, తట్టుకొని నిలబడగలరు. అతి కోపముగాని, అధికసంతోషముగాని వీరి ముఖమునందు కనబడదు. ప్రేమ కలాపములలో చిక్కుకొన్నచో ఎదుటివారి చేతిలో వీరు కీలుబొమ్మగా మారవలసి వచ్చును.

 

పొగిడిన వారిని వీరు దూరముగా ఉంచెదరు. పొగడ్తలు నచ్చవు కాని, కీర్తి ప్రతిష్టలకోసం ప్రాకులాడెదరు. దీనివలన వీరిని మోసము చేయువారు. వీరి ముందు సత్ ప్రవర్తనతో మెలుగుతూ, వీరి కీర్తిప్రతిష్టలను పదిమందికి చాటిచెప్పినచో మంచివారిగా నమ్మెదరు. వీరి తప్పును వీరు ఒప్పుకొనరు. వీరు చేసిన తప్పును మాత్రం మరియొక విధంగా కప్పిపుచ్చుకొండూరు, శారీరక శ్ర్రమ, శ్రమతో కూడిన ఆటలు వీరికి ఇష్టము. ఎంతటి ఘనవిజయమునై ననూ వీరికి సహజంగా రావలసినట్లుగానే అనిపించును. వీరు ఎంతటి పనినైననూ నెమ్మదిగా ఒకే చోట స్థిరముగా ఉండి చేయుదురు. ఎవరైనను వీరు చేయుచున్న పనిని గమనించుచున్నచో, గొప్పకోసం మరింత ఎక్కువగా చేస్తారు. వీరు స్త్రీ సాంగత్యమునకుగాని, కామమునకుగాని లోబడినచో వీరు యందుండు కళాత్మక విషయములన్నియూ దెబ్బతినును. కొందరు ఈ కోరికల వలన చాలా నష్టపోవుదురు. కారణమేమనగా, వీరు మనస్సునందు వచ్చిన నిర్ణయమును దృఢముగా తీసుకొని పాటించెదరు. వాటియందు మార్పు ఉండదు. కావున ఈ విషయమునందు జాగ్రత్త వహించవలెను. అట్లే ఈర్ష్య, అసూయ, క్రూరత్వం అనునవి కూడా వీరిలో చోటుచేసుకొనును. దీనివలనవివాహానంతరం జీవితా భాగస్వామిని అనుమానించి, హింసించు స్వభావము రాగల సూచన కలదు. ఇవే వీరి మార్గమునకు అవరోధములు కాగలవు.

 

సాంఘిక కార్యక్రమములలో వీరు బాగుగా రాణింతురు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల చిత్రపటములు సేకరించుట, మధుర పదార్ధములను తయారు చేయుట యందు వీరికి ఆసక్తి, అభిరుచి ఉండును. నాటక రంగములయందు, లలిత కళలయందు ప్రావీణ్యముండును. న్యాయవాదవృత్తి,  అధ్యాపకవృత్తి, నాటకరంగం, నగర నిర్మాణం, వ్యవసాయం, నీటి వనరులు మొదలుగు శాఖలలో రాణింతురు. ఆర్ధిక విషయమున వీరు అదృష్టవంతులు. వివాహం, దత్తత, స్నేహం మున్నగు వాటి వలన గాని, ఇంటియందుండు వృద్ధులవలన గాని ధనము సంక్రమించును. విలాసమనులకై వీరు ఎక్కువ ఖర్చు పెట్టుదురు. స్పెక్యులేషన్ లో వీరు నష్టపోవు సూచన గలదు.

 

వీరు ఆరోగ్యం బాగుండుట కొరకు ముందునుండి జాగరూకత వహించవలెను. చక్కని శరీర నిర్మాణం, మంచి ప్రాణశక్తి కలిగి ఉందురు. ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమైనప్పుడు నిద్రాహారాలయందు శ్రద్ధ చూపక పోవుటచే ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశమున్నది. వీరికి సామాన్యంగా ఊపిరితిత్తులకు, శ్వాసకోశములకు సంబంధించిన దీర్ఘవ్యాధులు వచ్చు అవకాశం కలదు. జాగ్రత్త వహించవలెను.

 

 


TeluguOne For Your Business
About TeluguOne
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.